శ్రీ శ్రీ శ్రీ సంతోషం మాతా ఆలయం జీ. కోడూరు గ్రామం లోని సుమారు. 16 సంవత్సరాల(సరిగ్గా తెలియదు)ముందు. బ్యాంకు లో మేనేజర్ గా శ్రీ రాచకొండ వేంకట గంగాధర శర్మ గారు వచ్చారు. ఆయన తన సతీమణి అయిన శ్రీ సావిత్రి గారితో బ్యాంకు పై అంతస్తు లోనే కాపురం ఉండేవారు. వీరు బ్రాహ్మణ కులానికి చెందినవారు. ఓక నాడు సావిత్రి అమ్మగారు నిద్రలో ఉండగా శ్రీ సంతోషం మాత కలలో ఊయల ఊగుతూ. అమ్మా నేను మీ ఊరి ప్రజల కోసం వచ్చాను నాకు గుడి కట్టి నన్ను మెక్కిన వారికి సహాయం చేస్తాను. అని చెపిందట. ఈ విషయం ఉదయం శర్మగారికి చెప్పింది. ఉదయం శర్మగారు జ్ఞానం లో ఉండగా ఆయనకు దూరంగా ఉన్న కొండపై ఓక పాప తెల్లని వస్త్రంతో గాలిలో ఎగురుకుంటూ కనిపించిందట వెంటనే శర్మ గారు గ్రామ మునసబు అయిన కల్యాణం గారిని కలిసి విషయం చెప్పగా. ఆయన వెంటనే అలాగే చేద్దాం మా గ్రామ ప్రజల సాయం మీకు ఎల్లప్పుడు ఉంటుంది. అని మాట ఇచ్చారు. మరుసటి రోజు శ్రీ శర్మ గారు సావిత్రి కల్యాణం గారు మిగతా గ్రామస్తులు అంతాకలసి గ్రామం మొత్తం కలయతిరిగారు అప్పుడు సావిత్రి గారు శర్మగారి తో “ఏమండీ మీకు జ్ఞానం లో ఉండగా కలలో వచ్చిన ప్రదేశం సరైందని నా ఉద్దేశం అని చెప్పగా, అక్కడికి వెళ్ళిరి. ఆ ప్రదేశాన్ని పరిశీలిచగా అదంతా గ్రామం కన్నా ఎత్తైన కొండ అక్కడ గ్రామ ప్రజలు చెత్త,చెదారం,పెంట,గేదెల అస్తిపంజరాలు కనిపంచాయి. అప్పుడు శర్మ గారు ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ గుడి కట్టడానికి ఎలా అవుతుంది అన్నారు. అప్పడు కళ్యాణం గారు అదంతా మాకు వదిలేయండి మీరు చెప్తే శుభ్రం చేసేస్తాం అన్నారు. అప్పుడు సావిత్రి అమ్మగారు అవునండి ఈ కొండ గ్రామ ప్రారంభంలో ఉంది కనుక గ్రామస్తులు గ్రామం నుంచి వెళ్ళేటప్పడు వచ్చేటప్పుడు కొండ దాటుకోని వెళ్ళాలి.

బయట లింకులు

మార్చు

[1]

  1. https://www.goodnightjournal.com/2017/10/12/%e0%b0%b6%e0%b1%8d%e0%b0%b0%e0%b1%80-%e0%b0%b6%e0%b1%8d%e0%b0%b0%e0%b1%80-%e0%b0%b6%e0%b1%8d%e0%b0%b0%e0%b1%80-%e0%b0%b8%e0%b0%82%e0%b0%a4%e0%b1%8b%e0%b0%b7%e0%b0%82-%e0%b0%ae%e0%b0%be%e0%b0%a4-3/