నమస్కారం,

చదివే వారందరికీ ఇది ఒక ఆటో బయోగ్రఫీ అని తలుస్తారని మనవి.

పుట్టింది / పెరిగింది ; అంతా విజయవాడ
ప్రస్తుతం నివసిస్తుంది: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజధాని, హైదరాబాదు.
ఇంతకు ముందు దర్శించిన స్థలాలు : స్వదేశంలో (భారతావని లో) బెంగళూరు, చెన్నై, నైవేలి, దేశ రాజధాని న్యూఢిల్లీ, ముంబయి వంటి మహా నగరాలు. అలాగే పరదేశాలైన దుబాయి మరియూ అమెరికా లలో కొంత కాలం (వృత్తి పరంగా) పని నిమిత్తం విచ్చేయ వలసి వచ్చింది.
తల్లి తండ్రులు: రత్న మాణిక్యాంబ మరియు సుబ్బారావు గార్లు
కుటుంబ వివరాలు : నాకన్నా ముందు మా అన్నయ్య. ఆయనకు ఇద్దరు కూతుళ్ళు.
జీవిత భాగస్వామి : స్వాతి
చదువుకున్నది : B.Sc., (Computers) అలాగే MCA యొక్క నాలుగు ఐదు సెమిస్టర్ల పరిక్ష వ్రాయ వలసి ఉంది.
ఆఖరి ఉద్యోగం : ValueLabs LLP అనే సంస్థలో Sr. Project Manager గా ఉద్యోగ భాద్యతలు

నన్ను సంప్రదించ వలనన్న లెదా నాగురించిన ఎటువంటి సమాచారం కోసమైనా varthy@gmail.com నందు సంప్రదించ వచ్చు. లేదా ఇక్కడ మార్పు చెయ్యవచ్చు

మా తల్లిగారికి పెళ్ళికాక ముందు వారి ఇంటి పేరు భీమరాజు. మా మాతృమూర్తి తల్లిగారు, అంటే మా అమ్మమ్మ గారి పేరు భీమరాజు కమలమ్మ. వీరు భీమరాజు చిన్న పట్టాభి రామయ్య గారి దర్మప్తత్ని. భీమరాజు కమలమ్మ గారు సుందరాకాండ పారాయణం ద్వారా సుపరిచితులు. వీరికి ఐదుగురు సంతానం.
భీమరాజు హరగోపాల్ రావు గారు, మా పెద్దమామయ్య గారు మొదటివారు. భీమరాజు దుర్గా ప్రసాద్ రావు గారు రెండవవారు. భీమరాజు ఆది శేషగిరి రావు మూడవ సంతానం. భీమరాజు సత్య భీమ పూర్ణచంద్రరావు గారు మగపిల్లలలో ఆఖరి సంతానం వీరందరికీ ఆఖరున మలి సంతానంగా మా తల్లిగారు, భీమరాజు రత్న మాణిక్యాంబగారు జన్మించారు.
తొందరలో మరిన్ని వివరాలు ..
ఇట్లు,
భవదీయుడు,
దామరాజు శ్రీ కమల్ చక్రవర్తి