వాడుకరి:Pavan (CIS-A2K)/నా పని/భండాగారం

డిసెంబర్ 2015

మార్చు
  • నవంబర్ నెల ఆఖరు నుంచి డిసెంబర్ నెల తొలినాళ్ళ వరకూ బెంగుళూరులో సీఐఎస్-ఎ2కె కార్యాలయంలో ప్రోగ్రామ్ అసోసియేట్ ఓరియంటేషన్ కార్యక్రమంలో పాల్గొన్నాను. ప్రోగ్రాం అసోసియేట్ గా నిర్వహించాల్సిన బాధ్యతలపై అవగాహన, కొన్నిటిపై శిక్షణ వంటివి సాగాయి.
  • నవంబర్ నెలాఖరులో ఐఆర్సీ నిర్వహించి కార్యక్రమంలో భాగంగా పలు అంశాలు సముదాయ సభ్యులతో చర్చించాము.
  • డిసెంబర్ 13న డా.వై.ఎస్.రాజశేఖరరెడ్డి ఆర్కియాలజీ మ్యూజియంలో గ్లామ్ కార్యక్రమం సహ-నిర్వహణ. తెలుగు వికీపీడియా దినోత్సవం సందర్భంగా మన తెవికీ-మన చరిత్ర పేరిట ఫోటోవాక్ కార్యక్రమం నిర్వహించడంలో కృషిచేశాము. పూర్తి నివేదిక కొరకు ఇక్కడ చూడండి.
    • కార్యక్రమ ఫలితంగా తెలుగు గ్రామాలు, సంస్కృతి, భారతీయ చరిత్ర వంటి అంశాలకు చెందిన 140 ఫోటోలు వికీపీడియా కామన్స్ లోకి చేరాయి.
    • పత్రికా మాధ్యమాల్లోనూ, సామాజిక మాధ్యమంలోనూ తెలుగు వికీపీడియా ప్రచారం జరిగింది. ఫలితంగా ప్రధాన దినపత్రికల్లో కార్యక్రమానికి ముందు, తర్వాత విస్తృతమైన వార్తా కథనాలు వెలువడ్డాయి.
    • పత్రికా, సామాజిక మాధ్యమాల కథనాలకు స్పందించి ఇద్దరు ఔత్సాహికులు కార్యక్రమంలో పాల్గొని వికీపీడియాలో ఖాతా తెరిచారు.
  • నెలవారీ సమావేశంలో తెలుగు-ఆంగ్ల వికీపీడియన్ల సమ్మేళనం నిర్వహణకు సహకారం. కార్యక్రమం కొరకు ఆంగ్ల వికీపీడియా నుంచి, తెలుగు వికీపీడియా నుంచి నిర్వాహకులతో పలుమార్లు సంప్రదింపులు జరిపి, పత్రికల కవరేజి వంటి బాధ్యతలు స్వీకరించి పనిచేశాము. కార్యక్రమంలో భాగంగా వికీపీడియా అనువాద ఉపకరణం గురించి అవగాహన కల్పించే సెషన్ నిర్వహణ, ఆపైన ఎడిటథాన్ నిర్వహణ.
    • సమావేశం ద్వారా దాదాపుగా 7 కొత్త సభ్యులు తెవికీలో చేరారు.
    • సమావేశం ద్వారా తెవికీలో కృషి ప్రారంభించిన వినయ్, వంటివారు తెవికీలో చురుగ్గా పాల్గొంటూ పలు వ్యాసాలు రాశారు.
    • హైదరాబాద్ సముదాయ సభ్యులకు, కొత్తవారికి కూడా వికీపీడియా అనువాద ఉపకరణంపై అవగాహన ఏర్పడింది.
  • సముదాయ సభ్యులు రాజశేఖర్ గారితో కలసి తెలంగాణా రాష్ట్ర డిజిటల్ మీడియా డైరెక్టర్ కొణతం దిలీప్ తో సమావేశం.
    • తెలంగాణా ప్రభుత్వంతో కలసి పనిచేసే అంశం ప్రస్తుతం తెవికీ రచ్చబండలో చర్చలో ఉంది.
  • పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఆచార్యులు మృణాళిని గారితోనూ, వర్శిటీ రిజిస్ట్రార్ గారితోనూ సమావేశాలు.
    • ప్రతిపాదనలు సముదాయానికి సమర్పించగా అంగీకారం పొందాయి. వర్శిటీకి సమర్పించి, వారి పరిశీలన అనంతరం ముందుకువెళ్తాయి.
  • దాదాపుగా 20మందికి పైగా అత్యంత చురుకైన వికీపీడియన్లను, అంతే సంఖ్యలో కొత్త వికీపీడియన్లను తెవికీలోనూ, వ్యక్తిగతంగానూ, కార్యక్రమాల్లో భాగంగానూ కలసి సముదాయం అవసరాలు, ఆకాంక్షలు అంచనా వేశాము.
    • భవిష్యత్తు ప్రణాళికలు రూపొందించేందుకు, సముదాయంతో కలసి కార్యక్రమాలు రూపకల్పన చేసేందుకు ఉపకరించాయి.
    • ఆంధ్ర లొయోలా కళాశాలలో డిజిటల్ రీసోర్సు సెంటర్ ఏర్పాటు విషయమై సముదాయం అభిప్రాయం తెలుసుకునేందుకు ఉపకరించింది.
    • కొందరు వాడుకరులతో చర్చల ఫలితంగా చక్కని కొత్త వ్యాసాలు రూపొందాయి.

జనవరి 2016

మార్చు
  • వికీపీడియా విద్యాకార్యక్రమంలో భాగంగా లొయోలా కళాశాలలో 3రోజుల కార్యశాల.
    • దాదాపు 40మంది విద్యార్థి వికీపీడియన్లు కార్యక్రమంలో పాల్గొన్నారు, వారిలో 20మంది వరకూ కొత్తగా వికీపీడియాలో ఖాతా తెరిచినవారు.
    • తెవికీ గురించి విద్యార్థి వికీపీడియన్లకు అవగాహన కల్పించాము. కొన్ని వ్యాసాలు రాయడం, అభివృద్ధి చేయడం చేశారు.
    • ప్రధానంగా వికీపీడియన్ల సూచనల మేరకు విద్యార్థి వికీపీడియన్లను తెవికీ గురించి మంచి అవగాహన వచ్చేవరకూ ప్రయోగశాలలో రాయమనీ, ఎప్పుడూ యాంత్రికానువాదాల జోలికి పోవద్దని, మొదలైన ప్రాథమిక జాగ్రత్తలు బోధించాము.
  • ఆంధ్ర లొయోలా కళాశాలలో వికీపీడియన్లు-విద్యార్థి వికీపీడియన్లు వినియోగించుకునేందుకు వీలుగా డిజిటల్ రీసోర్సు సెంటర్ ఏర్పాటు
    • కంప్యూటర్లు, అంతర్జాల సదుపాయంతో ఆంధ్ర లొయోలా కళాశాల సంయుక్త సహకారంతో సీఐఎస్-ఎ2కె వారు డిజిటల్ రీసోర్సు సెంటర్ ఏర్పాటు చేశారు.
    • వికీపీడియా సముదాయం నుంచి సూచనలు స్వీకరించి రీసోర్సు సెంటర్ ఏర్పాటు.
    • విద్యార్థి వికీపీడియన్లు, స్థానికులైన వికీపీడియన్, తెలుగు భాషావేత్తలు, నిపుణులు, సీఐఎస్-ఎ2కె, ఆంధ్ర లొయోలా కళాశాల సంస్థల ప్రతినిధుల నడుమ సెంటర్ ప్రారంభం.
  • గ్రంథాలయాధికారులకు వికీ అకాడమీ సహ-నిర్వహణ, కార్యక్రమంలో ప్రెజంటేషన్ ఇవ్వడం జరిగింది.
    • గ్రంథాలయాలు-వికీపీడియా కలసి ఎటువంటి కార్యక్రమాలు చేయవచ్చన్న అంశంపై అవగాహన కల్పించాము.
    • 11మంది గ్రంథపాలకులు, గ్రంథాలయ విద్యబోధకులు తెలుగు వికీపీడియాలో ఖాతా తెరిచి దిద్దుబాట్లు చేయడం నేర్చారు.
    • దాదాపు 6 వ్యాసాలు సృష్టించడం, అభివృద్ది చేయడం చేశారు. 2 దస్త్రాలు వికీలో చేరాయి.
  • విజయవాడలో ఆంధ్ర లొయోలా కళాశాల, తెలుగు జాతి ఫౌండేషన్, గుంటూరులో అన్నమయ్య గ్రంథాలయం సంస్థ ప్రతినిధులతో సమావేశాలు.
    • నెలకొన్న సంస్థాగత భాగస్వామ్యాల గురించి, భవిష్యత్ సంయుక్త కార్యాచరణ గురించి చర్చ.
  • ఆంధ్ర లొయోలా కళాశాల విద్యార్థి వికీపీడియన్ల గురించి పరస్పర అవగాహన కోసం మరో చిరు సమావేశం.
    • తెవికీలో చురుకుగా పనిచేయగల విద్యార్థి వికీపీడియన్లను గుర్తించి వారికి ఆసక్తిగల పుస్తకాలను సోర్సులగా అందజేత, శిక్షణ.
    • రాజీవ్ గాంధీ హత్య వంటి మంచి వ్యాసాల అభివృద్ధి.
    • స్వచ్ఛందంగా విద్యార్థి వికీపీడియన్ నెలవారీ సమావేశంలో కూడా పాల్గొన్నారు.
  • విజయవాడ వికీపీడియన్ల సమావేశం సహ-నిర్వహణ
    • ఆంధ్ర లొయోలా కళాశాలలో ఏర్పరిచిన డిజిటల్ రీసోర్స్ సెంటర్లో స్థానిక వికీపీడియన్ల సమావేశం ఏర్పాటు.
    • ఈ తరహా కార్యక్రమం (నెలవారీ సమావేశం తరహా) హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాల ఆవల విజయవాడలో జరగడం బహుశా మొదటిసారే.
    • హైదరాబాద్ నెలవారీ సమావేశం జరిగే సమయానికే నిర్వహించి రెండు సమావేశాలను టెలిఫోన్లో అనుసంధానించాం.

ఫిబ్రవరి 2016

మార్చు
  • ఆంధ్ర లొయోలా కళాశాలలో వికీపీడియా డిజిటైజేషన్ స్ప్రింట్.
    • కార్యక్రమంలో దాదాపు 24మంది విద్యార్థి వికీపీడియన్లు పాల్గొన్నారు.
    • పాల్గొన్న వారిలో 14మంది కొత్తగా వికీపీడియాలో ఖాతా తెరిచారు.
    • 750 పేజీలకు పైగా వికీసోర్సులో డిజిటైజ్ అయ్యాయి.
    • విద్యార్థి వికీపీడియన్లు ఓసీఆర్(ఆప్టికల్ క్యారెక్టర్ రికగ్నైజేషన్) అనే సాంకేతిక ఉపకరణంపై, పాఠ్యీకరణకు సంబంధించిన పలు అంశాలపై అవగాహన పొందారు.
  • పూదోట జోజయ్య రచించిన పుస్తకాలు సీసీ-బై-ఎస్.ఎ.లో విడుదల, వికీసోర్సులో చేర్పు.
    • ఆంధ్ర లొయోలా కళాశాలకు చెందిన పూదోట జోజయ్య రచించిన గ్రంథాల జాబితా స్వీకరించాం.
    • సముదాయంతో సంప్రదించిన పిమ్మట ప్రాధాన్యత క్రమం నిర్ధారించుకున్నాం.
    • గ్రంథాలు ఆ ప్రాధాన్యత క్రమంలో వికీసోర్సులో చేర్పు, డిజిటైజేషన్ స్ప్రింట్లో భాగంగా పాఠ్యీకరణ.
  • తెలుగు వికీపీడియా సముదాయంతో సంప్రదింపులు జరిపగా వచ్చిన అవగాహనతో రానున్న నెలల ప్రణాళిక చిత్తుప్రతి తయారీ.
    • సముదాయం చేపట్టిన కార్యక్రమాలు, తెవికీ అవసరాల గురించి పలు చర్చలు, నెలవారీ సమావేశాల్లోనూ, ఇతర సంప్రదింపుల్లోనూ వ్యక్తమైన అభిప్రాయాలు వంటివి ఆధారం చేసుకుని రూపకల్పన.
    • అలా రూపకల్పన చేసిన కార్యప్రణాళిక చిత్తుప్రతిని చర్చించి, సముదాయ సభ్యులు సూచన, స్పందనల కోసం వికీపీడియా రచ్చబండలో ప్రకటించాము.
  • భవిష్యత్ కార్యక్రమాల కొరకు పలు సంస్థలకు చెందిన నండూరి రమేష్, యశస్వి సతీష్ కుమార్, శ్రీరామోజు హరగోపాల్ వంటివారితో సంప్రదింపులు.
    • ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వ్యక్తులతో తెలుగు వికీపీడియా అకాడమీ నిర్వహించేందుకు నెలవారీ సమావేశానికి ఆహ్వానించి వికలాంగ మహాసంఘటన్ అధ్యక్షుడు నండూరి రమేష్ గారితో చర్చలు, మౌలికంగా అంగీకారం.
    • కవుల దినోత్సవం సందర్భంగా కవిసంగమం కవులు తెవికీలో చేరి కృషిచేసేలా వికీ అకాడమీ నిర్వహించేందుకు యశస్వి సతీష్ కుమార్ గారు, ఆయన ద్వారా యాకూబ్ గారు తదితరులతో సంప్రదింపు. కార్యక్రమం జరుగనుంది.
    • కొత్త తెలంగాణా చరిత్ర ఫేస్బుక్ గ్రూప్ నిర్వాహకులు, చరిత్రకారులు శ్రీరామోజు హరగోపాల్ గారు, ఇతర చరిత్రకారులు కెక్యూబ్ కవి, కట్టా శ్రీనివాస్ గార్లతో సంప్రదింపులు, చర్చ. తెలంగాణా చరిత్ర అభిరుచి, ఆసక్తి కలవారికి ఓ వికీ అకాడమీ నిర్వహణపై మౌలిక అవగాహన.
  • ఇఫ్లూలో వికీపీడియా కార్యశాల.
    • ఇఫ్లూలో వికీపీడియా కార్యశాలకు సహకారం.
    • బహుభాషల పరిశోధక విద్యార్థులతో చేసిన కార్యక్రమంలో 2 తెలుగు పరిశోధక విద్యార్థులు తెలుగు వికీపీడియాలో కృషిచేయడం ప్రారంభించారు.
    • 3-4 వ్యాసాలు తెవికీలో అభివృద్ధి చెందాయి.

సెప్టెంబరు 2017

మార్చు
  • వీవీఐటీ కార్యశాలకు హాజరై నిర్వహణలో పాలుపంచుకోవడం
    • జరిగింది, ఫాలో-అప్ కార్యక్రమం చేపట్టాల్సివుంది
  • హైదరాబాద్ మీటింగ్స్ ఏర్పాటు, పాల్గొనడం: అసఫ్ బార్టోవ్, వికీమీడియా ఫౌండేషన్ - దిలీప్ కొణతం, తెలంగాణ ప్రభుత్వం
    • జరిగింది
  • తెలంగాణ ప్రభుత్వంతో ఫోటోల పునర్విడుదల ప్రాజెక్టు ప్రారంభం
  • వికీడేటా కార్యశాల, హైదరాబాద్ సమన్వం - ఇతర అనుబంధ కార్యకలాపాలు
    • జరిగింది
  • గుంటూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో స్వేచ్ఛా నకలు హక్కుల్లోకి పుస్తకాలు విడుదల చేసేందుకు సిద్ధమైన రచయితలను వికీసోర్సులో ప్రాథమిక శిక్షణ ఇవ్వడం
  • సాహిత్యాంశాలపై చర్చిస్తున్న వాట్సాప్ గ్రూపులో ఆసక్తి కలిగిన ఇతర సభ్యులకు కూడా వ్యక్తిగత శిక్షణ నిర్వహించడం
    • పొన్నపల్లి శ్రీరామారావు ఆసక్తి చూపుతున్నారు. శిక్షణ జరుగుతుంది.
  • ఇంపాక్ట్ రిపోర్ట్ డ్రాఫ్ట్ పూర్తిచేయడం
    • జరిగింది
  • తెలుగు వెలుగు పత్రిక వారితో మాట్లాడినదాని ప్రకారం తొలి నెల వ్యాసం పంపడం
    • పంపించాను. పై నెలకు పరిశీలిస్తామని తెలిపారు.
  • సాంఘిక మాధ్యమాల్లో తెలుగు వికీపీడియా అన్న విషయంపై చర్చ ప్రారంభించడం
    • చర్చ జరిగింది, ముగింపు-నిర్ణయం కూడా జరిగింది. అమలు చేయాలి.
  • స్వేచ్ఛా నకలు హక్కుల్లోకి పునర్విడుదల చెందిన పుస్తకాల డిజిటైజేషన్ పనులు వికీసోర్సులో సమన్వయం చేయడం
  • చెన్నైలో వికీ కిట్టీ పార్టీ నిర్వహణ (ఇంకా పూర్తి నిర్ణయం కాలేదు)
  • తెలంగాణ సాంస్కృతిక డిపార్ట్ మెంటుతో తెలంగాణ తేజోమూర్తులు క్యూఆర్ కోడ్ ప్రాజెక్టు చేయడం
    • చర్చించాము. ప్రస్తుతం గ్యాలరీ నవీకరణలో ఉన్నందున పూర్తికాగానే క్యూఆర్ కోడ్ చేర్చవచ్చని తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టరు మామిడి హరికృష్ణ తెలిపారు. తెలంగాణ తేజోమూర్తుల చిత్రపటాలను సీసీ-బై-ఎస్‌ఎలో విడుదల చేయడానికి సానుకూలంగా స్పందించారు.

అక్టోబరు 2017

మార్చు
  • ఆంధ్ర లొయోలా కళాశాలతోనూ, మనసు ఫౌండేషన్ తోనూ భాగస్వామ్యానికి సంబంధించి కార్యకలాపాలు చర్చించి నిర్ణయించడం.
    • జరిగింది
  • చదువరి గారి భాగస్వామ్యంతో గ్రామ వ్యాసాల ప్రాజెక్టును ముందుకు తీసుకువెళ్ళడం. ఇతర వాడుకరులతోనూ సమన్వయం చేయడం.
    • జరుగుతోంది, కొనసాగుతుంది
  • తెలంగాణ ప్రభుత్వ ఐటీ డిపార్ట్ మెంటుతో ఎంవోయూ, గ్రాంట్ అగ్రిమెంట్ పూర్తిచేయడం.
    • జరిగింది
  • సామాజిక మాధ్యమాల్లో తెవికీ ఉనికికి సంబంధించిన మార్గదర్శకాలు, వ్యూహాల పేజీ రూపొందించి, జరిగిన చర్చకు అనుగుణంగా అమలు విషయమై పనిచేయడం.
    • చర్చ, నిర్ణయం జరిగాయి, అమలు జరగాలి
  • కశ్యప్ గారికి సహకరించి, నెలవారీ సమావేశాల బాధ్యతలు ఆయనకు అప్పగించడం.
    • జరగలేదు
  • వ్యక్తిగత శిక్షణల్లో తయారుఅయిన కొత్త వికీపీడియన్లను ఫాలో-అప్ చేయడం.
    • జరిగింది (ముఖ్యంగా #100Wikicommonsdays బాగా ఫలితం ఇచ్చింది)

నవంబరు 2017

మార్చు
  • తెలుగు గ్రామ వ్యాసాల ప్రాజెక్టు సమన్వయం చేయడం
  • కన్నడ రాజ్యోత్సవ ఎడిటథాన్, తదితరాలు తెలుగు వికీపీడియాలో ప్రాచుర్యం తీసుకురావడం
  • ఆంధ్ర లొయోలా కళాశాలలో తెలుగు వికీపీడియా గురించి విద్యార్థులకు ప్రాథమికాంశాలు తెలిపి, అక్కౌంట్లు సృష్టింపజేసే కార్యక్రమం నిర్వహించడం.
  • తెలంగాణ ప్రభుత్వ డిజిటల్ మీడియా విభాగం వారితో మీటింగ్‌లో పాల్గొని, కార్యప్రణాళిక నిర్ణయించుకోవడం.
  • కశ్యప్ గారికి సహకరించి, నెలవారీ సమావేశాల బాధ్యతలు ఆయనకు అప్పగించడం.

జనవరి 2018

మార్చు
  • విజయవాడ పుస్తక సంబరాల్లో వికీపీడియా స్టాల్ కార్యకలాపాల పర్యవేక్షణ
    • జరిగింది, నివేదించాల్సివుంది
  • చదువరి గారితో పాటు తెలుగు గ్రామ వ్యాసాలలో జనగణన సమాచారం చేర్చే ప్రాజెక్టు సమన్వయం చేయడం
    • సాగుతోంది
  • మరింత మెరుగైన యాంత్రికానువాద సహకార సాఫ్ట్ వేర్ చేర్చే ప్రయత్నంపై పైలట్ ప్రాజెక్టు ప్రారంభించడం, అందుకు భాషావేత్తలు, తెలుగు వికీపీడియన్లతో కలిసి పనిచేయడం
    • ఎ2కె తరఫు నుంచి ప్రతిపాదన పంపాము, ప్రతిస్పందన కోసం వేచిచూస్తున్నాం, ఫాలో-అప్ చేస్తున్నాం.
  • ఆంధ్ర లొయోలా కళాశాలలో జరగాల్సిన కార్యకలాపాల గురించి చర్చించడం, భవిష్యత్ కార్యక్రమాలు రూపకల్పన చేయడం
    • జరిగింది
  • ఆంధ్ర లొయోలా కళాశాలలో వికీడేటా కార్యశాల నిర్వహించడం
    • జరిగింది, కార్యక్రమానికి ఫాలో-అప్ నిర్వహించేందుకు ఎ2కె ప్రయత్నాలు జరుగుతున్నాయి.
  • అన్నమయ్య గ్రంథాలయంలో తెవికీ స్కానర్ గురించి, భావి కార్యకలాపాల గురించి చర్చించడం - అన్నమయ్య గ్రంథాలయ పుస్తకాల జాబితాను వికీ మార్కప్ కోడ్ లోకి మలిచి, తెలుగు వికీపీడియా పేజీల్లో ప్రచురించడం.
    • అన్నమయ్య గ్రంథాలయ పుస్తకాల జాబితా పనులు పూర్తయ్యాయి, స్కానర్ గురించిన చర్చ కొనసాగాల్సివుంది.
  • ట్రైన్-ద-ట్రైనర్ 2018లో పాల్గొని నిర్వహణకు పనిచేయడం
    • జరిగింది.
  • తెలుగు ఫోకస్ లాంగ్వేజ్ ఏరియాపై జరిగిన ప్రగతిని నివేదించడం
    • జరిగింది, తెవికీ సభ్యుల సూచనలకు ప్రచురించాం. తెలుగీకరణ పూర్తికావాల్సివుంది.

ఫిబ్రవరి 2018

మార్చు
  • తెలంగాణ ప్రభుత్వ భాగస్వామ్యం గురించి - తద్వారా విడుదలయ్యే ఫోటోల గురించి - సమన్వయం చేయడం
  • ఆంధ్ర లొయోలా కళాశాల వికీడేటా కార్యశాల ఫాలో-అప్ చర్చించి, కార్యక్రమాల నిర్వహణ, సమన్వయం చేయడం
  • తెలుగు వికీపీడియాకు సంబంధించి స్క్రీన్ రికార్డింగ్ వీడియో రీసోర్సులు, వికీపీడియా మార్గదర్శకాలు, పాలసీలు తెలిపేలా వీడియో రీసోర్సుల తయారీ
  • తెలుగు వికీపీడియాకు ప్రత్యేకించి కాలమ్ ఇవ్వనున్న ఇ-మేగజైన్ కొరకు వ్యాసాలు రాసి పంపడం
  • వికీసోర్సులో అన్నమయ్య పదసాహిత్యం ప్రాజెక్టు పూర్తిచేయడం

ఏప్రిల్ 2018

మార్చు
  • కొత్త భాగస్వామ్య అవకాశాలకు ప్రయత్నం
    • స్వాధ్యాయ పరిశోధన సంస్థ, గ్రంథాలయం వారిని భాగస్వామ్య అవకాశాలు పరిశీలించేందుకు సంప్రదించడం
      • జరిగింది. గ్రంథాలయం ప్రస్తుతం డిజిటలీకరణలో తొలిదశలో ఉన్నది. ఒకరికొకరు ఎలా తోడ్పడవచ్చన్నది పరిశీలిస్తున్నాం.
    • సుపథ పత్రిక వారి 20 వసంతాల వేడుకకు హాజరై వారి పత్రిక, సనాతన సుపథ ప్రచురణలకు సంబంధించి భాగస్వామ్యం అవకాశాలు చర్చించడం.
      • జరగలేదు.
    • సాక్షి, ఆంధ్రజ్యోతి, నమస్తే తెలంగాణ మొదలు కొత్తగా నెలకొల్పుతున్న ప్రతిష్టాత్మక పత్రిక సహా పలు పత్రికల సంపాదక వర్గంతో వికీపీడియా గురించి ప్రత్యేక కథనాలకు వీలు కల్పించే అంశంపై సంప్రదించడం, చర్చించడం.
      • సంప్రదిస్తున్నాం. మేలో ఒక రూపానికి వస్తుంది.
  • జరుగుతున్న కార్యకలాపాలకు కొనసాగింపు
    • విశాఖపట్టణం, హైదరాబాదుల్లో మహిళావరణం కార్యక్రమాల ఫాలో-అప్ కార్యకలాపాలు
      • జరగాల్సివుంది
    • సంచిక ఇ-పత్రికలో వరుస కథనాల కోసం ముడిసరుకు అన్వేషించి, రాసేందుకు తగిన వికీపీడియన్లను ప్రోత్సహించి, కొంతమేరకు సంపాదకత్వ సమన్వయం చేయడం
      • పుస్తకం.నెట్‌లో తెవికీపీడియన్లు తేలికగా కొనసాగించదగ్గ ఒక శీర్షిక ప్రారంభించాం.
    • తెలుగు వెలుగు, బాలభారతం పత్రికల్లో ఎటువంటి కథనాలో రాయవచ్చో తెలుగు వికీపీడియన్లకు సూచనలు ఇవ్వడం, ఆ అంశాన్ని సమన్వయం చేయడం
      • జరగాల్సివుంది.
  • ప్రస్తుత భాగస్వామ్యాలలో కార్యకలాపాలు
    • తెలంగాణ ప్రభుత్వ భాగస్వామ్యానికి సంబంధించి ఫోటోల విడుదలకు కామన్సులో ఏర్పాట్లు సమన్వయం చేయడం
      • చేస్తున్నాం.
    • అమ్మనుడి పత్రిక స్వేచ్ఛా నకలు హక్కులలో విడుదల విషయమై తేలికైన కొత్త మార్గాల అన్వేషణకు చర్చ
      • జరిగింది. ప్రచురితమయ్యే ప్రతీ కొత్త సంచికలోనూ పత్రిక స్వేచ్ఛా నకలు హక్కుల్లో విడుదలై ఉందని రచయితలు గమనించాలని సూచనలు ఏర్పాటుచేయాలని చర్చ నిర్ణయించింది.
  • ప్రణాళికలోని కార్యకలాపాలకు కార్యరూపం
    • తెలుగు వికీపీడియా శిక్షణాభివృద్ధి కార్యక్రమాలు (మినీ టీటీటీ, ఎండబ్ల్యుటీ) గురించి చర్చ ప్రారంభం, తేదీలు, వివరాలు ఖరారు
      • ఇంకా జరగాల్సివుంది.
    • సినిమా వ్యాసాల అభివృద్ధికి ప్రత్యేక కృషి, ప్రధానంగా వనరుల అందజేత ద్వారా అభివృద్ధి
      • జాబితాలు రూపొందించాం. వనరుల అందజేత జరగాలి.
    • గూగుల్ అనువాద వ్యాసాల అభివృద్ధికి - ప్రధానంగా ప్రాధాన్యతా క్రమంలో ముందున్నవాటి అభివృద్ధికి - అవకాశాల అన్వేషణ
      • ప్రాజెక్టు టైగర్ స్థానికాంశాల జాబితాలో చేర్చాం.
    • నెలవారీ సమావేశాల నిర్వహణకు సహకారం, నైపుణ్యాభివృద్ధి. విశాఖపట్టణంలో కొత్త నెలవారీ సమావేశం ఏర్పాటుకు ప్రయత్నం.
      • జరగలేదు. మేలో జరగనుంది, సహకారం అందిస్తున్నాం.
  • ఎ2కె జట్టులో భాగంగా నా ఇతర కృషి
    • ప్రసార, సామాజిక మాధ్యమాలపై వ్యూహాత్మక కృషిపై జాతీయ స్థాయి కాన్ఫరెన్సు ప్రతిపాదనలు, చర్చ ప్రారంభం
      • జరగాల్సివుంది.
    • ఎ2కె ప్రతిపాదిత కార్యప్రణాళిక ప్రధానాంశాలు బహుభాషల వికీపీడియాల్లోకి అనువదించి, ప్రచురించే కృషి సమన్వయం
      • జరుగుతోంది.
  • సముదాయం ప్రతిపాదించిన అంశాలు
    • ఇప్పటికే పూర్తైన పుస్తకాన్ని కాపీహక్కుల విడుదల కోసం డాక్టర్ సమరాన్ని, స్వేచ్ఛానకలుహక్కుల స్పష్టత కోసం డాక్టర్ గుమ్మా సాంబశివరావుని సంప్రదించడం
      • జరగాల్సివుంది.
    • కాశీయాత్రచరిత్ర పుస్తకం పూర్తిచేయడంలో సహకరించడం
      • జరగాల్సివుంది.
  • పుచ్చలపల్లి సుందరయ్య, తాపీ ధర్మారావు, కోవెల సుప్రసన్నాచార్య వంటి తెలుగు సాహితీ ప్రముఖుల రచనలు స్వేచ్ఛానకలు హక్కుల్లోకి తెచ్చేందుకు సంప్రదింపులు
    • జరగాల్సివుంది
  • తెలుగు వికీపీడియా రీడింగ్ లిస్టు ద్వారా తెలుగు వికీపీడియాను మదింపు చేసే ప్రయత్నాల కొనసాగింపు.
    • జరగాల్సివుంది
  • స్వాధ్యాయ పరిశోధన గ్రంథాలయం వారి భాగస్వామ్యం ప్రారంభించడం
    • జరగలేదు
  • విశాఖపట్టణం, హైదరాబాదుల్లో మహిళావరణం కార్యక్రమాల ఫాలో-అప్ కార్యకలాపాలు
    • అంతర్జాలంలో జరుగుతున్నాయి.
  • తెలంగాణ ప్రభుత్వ భాగస్వామ్యానికి సంబంధించి ఫోటోల విడుదలకు కామన్సులో ఏర్పాట్లు సమన్వయం చేయడం
    • జరిగింది.
  • తెలుగు వికీపీడియా శిక్షణాభివృద్ధి కార్యక్రమాలు నిర్వహణ
    • జరగలేదు.
  • సినిమా వ్యాసాల అభివృద్ధికి కృషి
    • జరగలేదు
  • నెలవారీ సమావేశాల నిర్వహణకు సహకారం, ప్రాజెక్టు టైగర్ ఎడిటథాన్ నిర్వహణ
    • జరిగింది. నెలవారీ సమావేశం జరగలేదు.
  • ప్రసార, సామాజిక మాధ్యమాలపై వ్యూహాత్మక కృషిపై జాతీయ స్థాయి కాన్ఫరెన్సు ప్రతిపాదనలు, చర్చ ప్రారంభం
    • జరగలేదు.
  • ఇప్పటికే పూర్తైన పుస్తకాన్ని కాపీహక్కుల విడుదల కోసం డాక్టర్ సమరాన్ని, స్వేచ్ఛానకలుహక్కుల స్పష్టత కోసం డాక్టర్ గుమ్మా సాంబశివరావుని సంప్రదించడం
    • గుమ్మా సాంబశివరావు గారితో సంప్రదించాం, సమరం గారి విషయంలో సంప్రదింపులు జరగాలి.
  • కాశీయాత్రచరిత్ర పుస్తకం పూర్తిచేయడంలో సహకరించడం
    • జరగాల్సివుంది.

జూన్ 2018

మార్చు
  • గుంటూరు #1Lib1Ref కార్యక్రమంలో నిర్వాహకుడు వాడుకరి:KCVelagaకు సహాయంగా రీసోర్సు పర్సన్‌గా పాల్గొనడం.
    • జరిగింది
  • తెలుగు వికీపీడియన్లకు నాణ్యతాభివృద్ధి సమావేశ నిర్వహణ
    • జరిగింది
  • ప్రాజెక్టు టైగర్ మిగిలిన కార్యకలాపాల సమన్వయం (జడ్జిమెంట్, బహుమతుల ప్రకటన, వగైరా)
    • జరిగింది.
  • సిద్ధిపేట గ్రంథపాలకుడు దుర్గాప్రసాద్‌ను, భీమవరం విద్యార్థి అమర్‌ను అవుట్‌రీచ్ కార్యకలాపాల ప్రణాళిక కోసం కలవడం
    • జరగలేదు.
  • ఇందుజ్ఞానవేదిక వారి భాగస్వామ్య ముక్తాయింపుగా ఓ శిక్షణా కార్యక్రమం నిర్వహణ.
    • జరిగింది, వివరాలకు ఇక్కడ పరిశీలించండి.
  • స్వేచ్ఛ, సుందరయ్య విజ్ఞాన కేంద్రంల సహకారంతో పుచ్చలపల్లి సుందరయ్య పుస్తకాల పునర్విడుదల, యశస్వి సతీష్ పుస్తకం పునర్విడుదల.
    • జరగలేదు
  • తెలుగు గ్రామాల వ్యాసాల ప్రాజెక్టులో పాల్గొనేవారితో ఒక సమావేశం.
    • జరిగింది, భాస్కరనాయుడు గారు హాజరుకావడం సాధ్యం కాలేదు.
  • అర్జున హైదరాబాదు రాక సందర్భంగా చదువరి, అర్జున, పవన్, రాజశేఖర్‌లతో సమావేశ సమన్వయం, సమావేశ ఫలితాల ఆచరణకు సహకారం.
    • జరిగింది.

జూలై 2018

మార్చు
  • వికీపీడియన్లకు మెరుగైన, నాణ్యమైన మూలాలను అందుబాటులోకి తీసుకురావడం విషయంలో మిసిమి పత్రిక సంపాదక సభ్యులతో భాగస్వామ్య చర్చ.
  • సామల రమేష్ బాబును కలిసి, అమ్మనుడి పత్రికలు ఎప్పటికప్పుడు వికీసోర్సులోకి తీసుకురావడంపై మాట్లాడడం. (గత నెలల్లో పత్రిక 4వ పేజీలో స్వేచ్ఛా నకలు హక్కుల గురించి వివరణ ఇచ్చి పత్రిక సీసీ లైసెన్సు విడుదల గురించి సమస్యలు పరిష్కరించే యత్నం జరిగింది)
    • జరిగింది, జూలై ప్రతిని వికీమీడియన్ రాజశేఖర్ గారికి అందించగా కామన్స్‌లో ఎక్కించి, వికీసోర్సులోకి తెచ్చారు.
  • మొబైల్ ఎడిటింగ్ స్థితిగతులు, ప్రస్తుత సమస్యలు, అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యల గురించి పలు భారతీయ భాషల మొబైల్ ఎడిటర్లతో మాట్లాడడం.
    • మొదలైంది. ఇద్దరు (హిందీ, పంజాబీ) వికీపీడియన్లను ఇంటర్వ్యూ చేయడం, తెలుగు వికీసోర్సులోకి మొబైల్ ద్వారా ఎడిట్ చేసేవారిని ఒకరిని చేర్చడం వంటి పనులతో అవగాహన చేసుకోవడం ప్రారంభమైంది.
  • గ్రామాల వ్యాసాల రెండవ దశ ప్రారంభిస్తూ సదరు వ్యాసాల్లో చేర్చదగ్గ చరిత్ర, గ్రామ నామ వివరణ వంటి అంశాలకు సంబంధించిన మూలాలు వికీపీడియన్లకు అందుబాటులోకి తీసుకురావడం.
  • పుచ్చలపల్లి సుందరయ్య పుస్తకాలు సుందరయ్య విజ్ఞాన కేంద్రం, స్వేచ్ఛ సంస్థల సంయుక్త భాగస్వామ్యంతోనూ, యశస్వి సతీష్ కుమార్‌కు సహకరించి ఆయన లేటెస్టు పుస్తకమూ వికీసోర్సులోకి తీసుకురావడం.
    • జరగలేదు.
  • సిద్ధిపేటకు చెందిన గ్రంథపాలకుడు దుర్గాప్రసాద్‌ను, భీమవరం విద్యార్థి అమర్‌ను అవుట్‌రీచ్ కార్యక్రమాల ప్రణాళిక వేయడానికి కలవడం.
    • జరగలేదు.
  • సారస్వత జ్యోత్స్న కార్యక్రమానికి హాజరై, వారిలో ఆసక్తి కలవారిని వికీసోర్సు వాలంటీర్లను చేయడం.
    • జరగింది. కార్యక్రమంలో వాడుకరి:Y V S N Murthy, వాడుకరి:Avadhanam viswanatha sarma గార్లను వికీసోర్సు వాలంటీర్లను చేయడం జరిగింది, వీరిలో అవధానం విశ్వనాథశర్మ ప్రఖ్యాత రచయితలైన తన తండ్రి చంద్రశేఖర శర్మ గారి గ్రంథాలు సీసీ-బై-ఎస్.ఎ.4.0లో పునర్విడుదల చేసి తామే డిజిటైజ్ చేస్తున్నారు.