వికీపీడియా:సమావేశం/తెలుగు వికీపీడియా దినోత్సవం 2015 - తెవికీలోకి చారిత్రిక ఛాయాచిత్రాలు/నివేదిక

మన తెవికీ మన చరిత్ర ఫోటో వాక్ ప్రచార ప్రతిక

ఏం జరిగింది

మార్చు

ఆదివారం తెలుగు భాషా వికీపీడియన్లు నగరంలోని పబ్లిక్ గార్డెన్సులోని డాక్టర్ వై.ఎస్. రాజశేఖరరెడ్డి రాష్ట్ర ఆర్కియాలజీ మ్యూజియంలో విశిష్టమైన ఫోటో వాక్ కార్యక్రమాన్ని నిర్వహించారు. వికీపీడియా పరంగా హైదరాబాద్ నగరంలోనే ఈ కార్యక్రమం జరగడం ఇది తొలిసారి. ప్రస్తుతం సచేతనంగా కృషిచేస్తున్న 45మందితో సహా 900కి పైగా స్వచ్ఛంద రచయితలు (తెవికీ భాషలో వాడుకరులు) కృషితో రూపుదిద్దుకున్న 62,500 వ్యాసాల తెలుగు స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వం - తెలుగు వికీపీడియా. ప్రస్తుత విశిష్టమైన ఫోటో వాక్ కార్యక్రమం తెలుగు వికీపీడియా దినోత్సవం సందర్భంగా నిర్వహించింది. ఈ కార్యక్రమాన్ని తెవికీ క్రియాశీల వాడుకరి (తెవికీపీడియన్ లేదా తెవికీ రచయిత), నాటకరంగ పరిశోధక విద్యార్థి ప్రణయ్ రాజ్ వంగరి నిర్వాహకునిగా వ్యవహరించారు. కార్యక్రమంలో వికీపీడియన్లు భాస్కరనాయుడు, ప్రవీణ్ ఇళ్ళ, సి.బి. రావు, గుళ్ళపల్లి నాగేశ్వరరావు, కోడిహళ్ళి మురళీమోహన్ తదితరులు పాల్గొనగా ఖైర్ అక్కి, అమర్ చంద్ కొత్తగా వికీపీడియన్లు అయ్యారు. గైడెడ్ టూర్ (పర్యటన)లో మ్యూజియంలో ప్రదర్శించిన కళాఖండాలు, చారిత్రిక వస్తువులు ఫోటోలు తీశారు. తర్వాత వికీపీడియన్లు గోల్డెన్ థ్రెషోల్డ్ వద్ద సమావేశమై వికీమీడియా కామన్స్ లో చేర్చి తద్వారా వికీపీడియాలోని వ్యాసాలను సుసంపన్నం చేశారు. ఈ కార్యక్రమం గురించి ప్రణయ్ రాజ్ మాట్లాడుతూ “కార్యక్రమం వల్ల తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ కు చెందిన పలు గ్రామాల చరిత్ర, హైదరాబాద్ సంస్కృతి, వంటి అనేకమైన వ్యాసాలను అభివృద్ధి చేసే ఫోటోలు తెవికీలో చేరాయని” పేర్కొన్నారు. బహుళ సంస్కృతుల సమాహారమైన, అత్యంత ముఖ్యమైన హైదరాబాద్ నగరంలో వివిధ ప్రదేశాల గురించి అంతర్జాలంలో దొరుకుతున్న సమాచారం ఇప్పటికీ తక్కువే ఉందని తెలిపారు. తనలాంటి పలువురు అంతర్జాలంలో తెలుగులో రాసేందుకు, సమాచారం అభివృద్ధి చేసేందుకు ఎవరైనా స్వేచ్ఛగా వినియోగించుకుని, రాయదగ్గ తెలుగు వికీపీడియాను ప్లాట్ ఫాంగా ఎంచుకుని https://te.wikipedia.org వద్ద రాస్తున్నామని పేర్కొన్నారు. హైదరాబాద్ కు సంబంధించి దొరుకుతున్న 89వేల ఛాయాచిత్రాల్లో 89 మాత్రమే మంచి నాణ్యత కలిగి అందరికీ అందుబాటులో ఉన్నాయని, ఆ స్థితిని మార్చేందుకే ఈ కార్యక్రమం నిర్వహించామని తెలిపారు. వికీపీడియా వ్యాసాలు విజ్ఞాన సర్వస్వ తరహావి కావడంతో విద్యార్థులకు, పరిశోధకులకు, ఔత్సాహికులకు, ఇతర పాఠకులకు ఉపకరించే ఎంతో వాస్తవ సమాచారం అందులో దొరుకుతోందని" ప్రణయ్ తెలిపారు. కార్యక్రమ నిర్వహణకు పవన్ సంతోష్ సహకరించారు.


హాజరైన వారు

మార్చు

ఫోటోవాక్ కి హాజరైనవారు

మార్చు
  1. ప్రణయ్ రాజ్
  2. భాస్కరనాయుడు
  3. సి.బి.రావు
  4. ప్రవీణ్ ఇళ్ళ
  5. ఖైర్ అక్కి
  6. స్వరలాసిక
  7. అమర్ చంద్
  8. పవన్ సంతోష్

సమావేశానికి మాత్రమే హాజరైనవారు

మార్చు
  1. గుళ్ళపల్లి నాగేశ్వరరావు


ఫలితాలు

మార్చు
  • కార్యక్రమంలో తీసిన వందలాది విలువైన చారిత్రిక వస్తువుల ఫోటోలు వికీకామన్స్ లోకి చేరాయి. ఈ వర్గంలో చూడండి.
  • ఈనాడు, ఆంధ్రజ్యోతి, నమస్తే తెలంగాణ వంటి పలు పత్రికలలో, టీవీ9 ఛానల్ లో కార్యక్రమం గురించి సవివరమైన వార్త కథనాలు వెలువడ్డాయి.
  • ఈనాడు ముందుగా వేసిన ప్రత్యేక కథనానికి, ఫేస్ బుక్లో తయారుచేసిన ఈవెంట్ పేజీకి స్పందనగా ఇద్దరు కొత్తవారు పాల్గొని వికీపీడియాలో సభ్యులయ్యారు.
  • వికీపీడియా కామన్స్ గురించి, మ్యూజియంలో తీసిన ఫోటోలు గ్రామ వ్యాసాలకు ఎలా ఉపయోగపడతాయి అన్న విషయాన్ని గురించి, కాపీహక్కుల గురించి వికీపీడియన్లు అభిప్రాయాలు పంచుకున్నారు.
  • వికీపీడియా వెనుక జరిగే కృషి గురించి కొత్త వాడుకరి అడిగిన పలు ప్రశ్నలకు పవన్ సంతోష్, తదితరులు సమాధానమిచ్చారు.


చిత్రమాలిక

మార్చు