వాడుకరి:Pavan santhosh.s/ప్రయోగశాల/2015లో తెవికీ
2015లో తెవికీలో ఏం అభివృద్ధి చేయాలి, ఎలా చేయాలి, ఎందుకు చేయాలి, ఎవరు చేయాలి అన్న విషయంలో చిన్న చిన్న గ్రూపులుగా ఏర్పాటైన వికీ సముదాయ గ్రూపులో జరిగిన చర్చల సారాంశం.
- సి.బి.రావు: వ్యక్తిగతంగా పరిచయం, స్నేహం ఉన్న ప్రముఖ రచయితల ఫోటోలు, ఆటోగ్రాఫులు సేకరించి వాటిని వికీకామన్స్ లో చేర్చి, వారి గురించి మొలక స్థాయి దాటే వ్యాసాన్ని సృష్టించి వీటిని అందులోకి చేర్చడం. తనకు విమాన ప్రయాణంలో తగిలిన ప్రముఖల ఫోటోలు తాను కూడా చేరుస్తానని విష్ణు, తనకు తెలిసిన కవుల ఫోటోలు తాను తీసి పెడతానని ప్రణయ్ రాజ్ తెలిపారు. ఫోటోలతో పాటుగా వారి గురించి కొద్ది సమాచారాన్ని ఆడియో రూపంలో రికార్డు చేసిపెట్టాల్సిందిగా పేర్కొన్నారు.
- వాడుకరి:Valluri harika: గ్రామవ్యాసాల్లో సమాచారాన్ని అభివృద్ధి చేయదలుచుకున్నాను. గుంటూరు అన్నమయ్య గ్రంథాలయంలో గుంటూరు జిల్లా గురించి సమగ్రంగా ఓ పుస్తకం ఉంది. దానిని కోట్ చేసి రాస్తాను. అన్నమయ్య గ్రంథాలయంలోని పుస్తకాల నుంచి సిబిరావు గారు పెట్టే ఫోటోల తాలూకు రచయితల గురించిన వివరాలు ఇస్తాను.
- యువరాణి: బి.జెడ్.సి. చదువుతున్నాను. నా పాఠ్యాంశాల్లో అర్థమైనవాటి గురించి వికీలో వెతికి ఒకవేళ లేకుంటే వాటిని తయారుచేస్తాను. ఫల్గుణ్ సహకరిస్తానన్నారు.
- వాడుకరి:Kasyap: తెలుగు వికీపీడియాలో వ్రాయడం ద్వారా నైపుణ్యాలు పెంచుకునేందుకు వీలు వివరిస్తూ యూనివర్శిటీ విద్యార్థులకు అవుట్ రీచ్ ప్రోగ్రామ్స్ నిర్వహించడం, పుస్తకాల పండుగల్లో స్టాల్స్ నిర్వహించడం. ప్రణయ్ రాజ్, సిఐఎస్‌లు ముందుకువచ్చారు.
- గౌస్ మొహియుద్దీన్: మా ప్రాంతానికి సంబంధించి వికీపీడియాలో ఏముందో ముందు చూసి. ఆపైన నేనేం రాయాలో నిర్ధారించుకునే ప్రయత్నం చేస్తాను.
- ఎం.దివ్య: వంటల గురించి పేజీలను అభివృద్ధి చేయదలుచుకున్నాను. శాకాహారం గురించి రాస్తాను. భోజనాలకు సంబంధించిన వ్యాసాలను అభివృద్ధి చేస్తాను.
- వాడుకరి:T.sujatha: ఆంగ్ల వికీపీడియా నుంచి మొఘల్ సామ్రాజ్యానికి సంబంధించిన వ్యాసాలను 12 అనువదిస్తాను. నాయక్, వెంకటేష్ సహకరిస్తానన్నారు. గత సంవత్సరం వందలాది వ్యాసాలు తయారుచేసే జిల్లాల ప్రాజెక్టు చేపట్టినందువల్ల కొంత ఒత్తిడికి గురయ్యానన్నారు. అందుకే ఈ ఏడాది కేవలం 12 వ్యాసాలనే సమగ్రంగా తయారుచేసే లక్ష్యం పెట్టుకున్నానన్నారు.
- వాడుకరి:Pavan santhosh.s: వికీపీడియాలో తెలుగు సినిమా వ్యాసాలు, వికీసోర్సులో కాపీరైట్లు లేని సినిమా పాటల పుస్తకాలు, వికీకోట్ లో సినిమాల నుంచి వ్యాఖ్యలు. కొన్ని లెజెండరీ మూవీస్ 25, 30, 50 ఏళ్ళు పూర్తైన సందర్భంగా పలు పత్రికల్లోని సినిమా పేజీల్లో వ్యాసాలు వస్తాయి. ప్రముఖ దినపత్రికల ఆదివారం మేగజైన్ల నుంచి సినిమాల నిర్మాణం గురించి, పాటల రచన గురించి వ్యాసాలు వస్తూంటాయి. విభిన్నమైన, విలువైన చలన చిత్రాల గురించి నవతరంగం.కాంలో వ్యాసాలున్నాయి. కొత్త సినిమాల గురించి ఎలానూ వివిధ సోర్సులు ఇప్పటికే వున్నాయి. వాటన్నిటి ద్వారా ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకువెళ్తాను. అనంతరం అన్నం మస్తాన్ వలీ, వల్లూరి హారిక, నాగేశ్వరరావు, వాడుకరి:సుల్తాన్ ఖాదర్, సూర్యకిరణ్, ప్రణయ్ రాజ్ సహకరిస్తామని ముందుకువచ్చారు. సినిమాల గురించిన రూపవాణిని తాను అందజేస్తానని విష్ణుగారు వివరించారు.