ఏ జన్మ పుణ్యమో, ఏ దేవుని వరమో

పుట్టినాము గరికపూవులై

మొలకెత్తినాము రంగురంగుల ఆశలై....

వికసించినాము లేత చిలుకలై

పచ్చని పచ్చికపై విచ్చిన నవ్వుల పువ్వులం

అరవిచ్చిన అందాలను మాలోన దాచుకుని,

చిరుజల్లుల తాకిడికి చుక్కలై మెరిసి

చూచువారి కనులకింపుగా విరిసిన పూవులం.....

దేవుని పాదాల చెంత చేరకున్నా,

మగువల సిగయందు ముడవకున్నా,

మమ్ము మాత్రం శపించొద్దు

పక్కన పడిఉన్నమము వెక్కిరించి

మీ పాదాలతో మము తొక్కవద్దు.

ఓ మారు మీ చేతులను తాకి చూడ

మాలో దాగిన సుతిమెత్తని మనసు

మీ చూపుని దోచక మానదు

మదిమదినీ కదిలించే హరివిల్లుల జీవనం

ఏమని వర్ణిచం, ఏమని ప్రార్ధించం?

మా ఈ చిన్ని జీవిత కాలాన చిరుగాలి తాకిడిలో

ఊయలలూగాలని చిరు ఆశ..

పదికాలాలు ఇంద్రధనుసులై విరిసి

మేలుజాతి విరులవలె మెరవాలని ఆశ..

ఏజన్మ పుణ్యమో ఏ దేవుని వరమో .........

పూచినాము గరిక పూవులై...

ఎవరో ఒకరి అడుగుల తాకిడి నలుగుతున్నాం

పూచీ పూయగానే రాలుతున్నాం...

మావేదన మీలోన నిర్లక్ష్యం చేయొద్దు

మాలోనూ జీవముంది తుంచేయద్దు

మీ నవ్వులు మేముగా పూస్తున్నాము

గరిక పూల చైత్రాలుగ చూస్తున్నాము