ఈ జగతి మనదే మార్చు

ఆశయమే నీకుంటే ఆయుధమే నీవుకదా,

ఆచరణే నీకుంటే అలుపన్నది రాదుకదా.

సంకల్పమే నీకుంటే ఎదురన్నది లేదుకదా,

సంఘర్షణ లేకుంటే సంతోషమే నీదికదా.



అంతరాలే దూరమయ్యే ఆప్యాయత తోడుంటే,

చిరు నవ్వు చిందిస్తే అంతస్తే పోదుకదా.

పాలనవ్వుల పాపాయికి పగలన్నవే లేవుకదా,

ఆ కాలమే తిరిగొస్తే పంతాలే వుండవుగా


మతమన్నది మనకెందుకు మానవతే లేకుంటే,

మనసులతో మేలిగేటి మనుగడనే పొందాలిగా.

దిక్కులన్ని పిక్కటిల్లే సమభావం మనకుంటే,

విష కోరలు చిదిమేసే అవకాశమే మనదేకదా


దైన్య ప్రవృత్తి చెండాడే బలమన్నది వెంటుంటే,

హిమగాలుల చల్లదనం నిలువెల్లా తాకునుగా.

నలుదిక్కుల అలుముకున్న చీకటినే గమనిస్తే,

వేనుతిరగని ధైర్యంతో చరమగీతం పాడాలిగా