Govardhan999
ఆంధ్ర ప్రదేశ్ మండలాలు వర్గం
మార్చువర్గం:ఆంధ్రప్రదేశ్ మండలాలు పేరుతో ఒక వర్గం ఈసరికే ఉంది. మీరు కొద్ది తేడాతో "ఆంధ్ర ప్రదేశ్ మండలాలు" అనే వర్గాన్ని సృష్టిస్తున్నారు. ఒకసారి సృష్టిస్తే దాన్ని వేరే వాడుకరి తొలగించారు. మీరు మళ్ళీ సృష్టించారు. దాన్ని నేను మళ్ళీ తొలగిస్తున్నాను. ఎందుకంటే అది అవసరం లేదు కాబట్టి. తిరిగి సృష్టించకండి. వర్గం:ఆంధ్రప్రదేశ్ మండలాలు వర్గాన్ని చూడండి.
పోతే, వర్గంలో చేర్చాల్సిన వ్యాసం పేజీలను నేరుగా వర్గం పేజీలో రాయకూడదు. ఆయా వ్యాసం పేజీలకు అడుగున వర్గాలను చేర్చే వసతి ఉంటుంది గమనించండి. అక్కడ + ను నొక్కి సముచిత వర్గాలను ఆ పేజీకి చేర్చవచ్చు. మీరు పేరు రాయడం మొదలు పెట్టగానే ఈ సరికే ఉనికిలో ఉన్న వర్గాల పేర్లు మీకు చూపిస్తూంటుంది. ఉనికిలో లేకపోతే చూపించదు. వర్గం పేరు పూర్తిగా రాసేసాక, ఈ సరికే ఉనికిలో ఉన్న వర్గాలు నీలం రంగు లోను, ఉనికిలో లేనివి ఎర్ర రంగులోనూ కనిపిస్తాయి. మనకు కావాల్సిన వర్గాలు చాలావరకూ సృష్టించేసారు. కాబట్టి ఇప్పుడు మీరు చేర్చదలచిన వర్గం ఎర్ర రంగులో కనిపిస్తున్నదంటే దానర్థం బహుశా కొద్ది తేడాలతో వేరే పేరుతో ఉండి ఉండవచ్చు, గమనించండి. తొందరపడి కొత్త వర్గాన్ని సృష్టించకండి. సిమిలరుగా ఉన్న వ్యాసం పేజీలలో ఏ వర్గాలున్నాయో చూడండి, ఈ పేజీకి సముచితమైన వర్గాలేవో తెలుస్తుంది. __చదువరి (చర్చ • రచనలు) 11:06, 16 ఆగస్టు 2019 (UTC)