విషయ ప్రాముఖ్యత (వ్యక్తులు) మార్చు

@వాడుకరి:TRachana Media గారూ, వికీపీడియాలో ఆయా అంశాలకు వ్యాసాలు రాయడానికి విషయ ప్రాముఖ్యత ఉండాలనేది ప్రధాన నియమం. వ్యక్తుల వ్యాసాలు రాయడానికి కూడా విషయ ప్రాముఖ్యత నియమం ఉంది. వ్యక్తుల విషయంలో వారి జీవితచరిత్ర వ్యాసం రాయాలంటే వారు వికీపీడియాలో రాసేందుకు "అర్హత కలిగి ఉండాలి" లేదా "గమనించదగ్గ స్థాయిలో ఉండాలి" అంటే "విశిష్టత ఉండాలి" లేదా వారు "ముఖ్యమైన, ఆసక్తికరమైన లేదా ప్రత్యేకంగా పరిశీలించాల్సినంత అసాధారణమైన" వారై ఉండాలి. వ్యక్తుల వ్యాసాలకు సంబంధించిన విషయ ప్రాముఖ్యత కోసం వికీపీడియా:విషయ ప్రాముఖ్యత (వ్యక్తులు) అనే పేజీని పరిశీలించగలరు.

వికీపీడియాలో రచనకు సంబంధించి ఈ క్రింది నిబంధనలు, సూచనలు:

సమాచారాన్ని మీ స్వంత వాక్యాల్లో తిరగ రాయాలి. సమాచారం తీసుకున్న సదరు వెబ్ సైటును మూలంగా ఇక్కడ ఉదహరించాలి (నేను ఈ పాఠ్యాన్ని ఫలానా సైటు నుండి తీసుకున్నాను అని చెప్పాలన్నమాట). అయితే ఏ సైటు బడితే ఆ సైటును మూలంగా తీసుకోరాదు. వ్యక్తుల స్వంత వెబ్‌సైట్లు, సామాజిక మధ్యమాలు (ట్విట్టరు, బ్లాగులు, ఫేసుబుక్కు వంటి చోట్లు) మూలంగా పనికిరావు. ఈనాడు, సాక్షి, నమస్తే తెలంగాణ వంటి సైట్లు మూలంగా పనికొస్తాయి.ధన్యవాదాలు.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 18:13, 4 నవంబరు 2023 (UTC)Reply