వామికా గబ్బి (ఆంగ్లం: Wamiqa Gabbi) (జననం 1993 సెప్టెంబరు 29) ఒక భారతీయ నటి. ఆమె పంజాబీ, హిందీ, మలయాళం, తమిళం, తెలుగు చిత్రాలలో నటించింది. హిందీ చిత్రం జబ్ వి మెట్ (2007)లో ఆమె చిన్న పాత్రతో తెరపైకి అడుగుపెట్టింది. కానీ యో యో హనీ సింగ్, అమ్రీందర్ గిల్‌లతో కలిసి తు మేరా 22 మెయిన్ తేరా 22 (2013) చిత్రంతో మంచి గుర్తింపు వచ్చింది. పైగా ఆమెకు ఈ చిత్రంలో నటనకు పిటిసి పంజాబీ ఫిల్మ్ అవార్డ్స్‌లో ఉత్తమ సహాయ నటి విభాగంలో నామినేషన్ దక్కింది. ఆ తర్వాత ఆమె ఇష్క్ బ్రాందీ (2014), నిక్కా జైల్దార్ 2 (2017), పరహునా (2018), దిల్ దియాన్ గల్లాన్ (2019), నిక్కా జైల్దార్ 3 (2019) వంటి అనేక పంజాబీ చిత్రాలలో నటించింది.

వామికా గబ్బి
జననం (1993-09-29) 1993 సెప్టెంబరు 29 (వయసు 30)
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు2007 – ఇప్పటి వరకు

వ్యక్తిగత జీవితం మార్చు

వామికా గబ్బి 1993 సెప్టెంబరు 29న చండీగఢ్‌లోని పంజాబీ కుటుంబంలో జన్మించింది.[1][2][3] ఆమె తండ్రి గోవర్ధన్ గబ్బి హిందీ, పంజాబీ భాషలలో కవి, రచయిత. అతని కలం పేరు గబ్బి.[4][5] ఆమె తల్లి రాజ్‌కుమారి టీచర్‌.

కెరీర్ మార్చు

ఆమె కథక్ నృత్యకారిణి. యో యో హనీ సింగ్, అమ్రీందర్ గిల్, తు మేరా 22 మై తేరా 22 పంజాబీ సినిమాతో ఆమెకు పెద్ద బ్రేక్ వచ్చింది. ఆమె మరో రెండు పంజాబీ చిత్రాలైన ఇష్క్ బ్రాందీ, ఇష్క్ హాజీర్ హైలో నటుడు దిల్జిత్ దోసాంజ్‌కి సహనటిగా నటించింది. తను తనీషాగా మొదటి మహిళా ప్రధాన పాత్రను రాజ్ పురోహిత్ దర్శకత్వం వహించిన హిందీ ఎరోటిక్ డ్రామా థ్రిల్లర్ చిత్రం సిక్స్‌టీన్ (2013)లో పోషించింది. తెలుగులో భలే మంచి రోజు అనే సినిమాలో కథానాయికగా నటించింది. వామికా గబ్బి తమిళ చిత్రం మలై నేరతు మయక్కం (2016)లో కథానాయికగా నటించింది.[6] ఆమె మలయాళ చిత్రం గోధాలో టోవినో థామస్‌తో కలిసి కథానాయికగా నటించింది.[7] 2017 మార్చిలో అశ్విన్ శరవణన్ దర్శకత్వం వహించిన కొత్త తమిళ చిత్రం ఇరవకాలమ్‌పై వామికా గబ్బి సంతకం చేసింది. ఇందులో శివాడ, ఎస్. జె. సూర్య సహ నటులు.[8] పృథ్వీరాజ్ సుకుమారన్, మమతా మోహన్‌దాస్ కూడా నటించిన 9 (2019 సినిమా)లో వామికా గబ్బి ప్రధాన పాత్ర పోషించింది.[9]

నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారమవుతున్న వెబ్ సిరీస్‌ మాయి లో వామికా గబ్బి కనబరచిన నటనకు ‘లాంగ్వేజ్‌ క్వీన్‌ ఆఫ్‌ ఇండియన్‌ సినిమా’గా పేరు గడించింది.[10]

అవార్డులు, నామినేషన్లు మార్చు

Year Award Category Nominated Work Result
2014 పిటిసి పంజాబీ ఫిల్మ్ అవార్డ్స్ ఉత్తమ సహాయ నటి తు మేరా 22 మెయిన్ తేరా 22 నామినేటెడ్
2014 లైఫ్ ఓకే స్క్రీన్ అవార్డ్స్ ఉత్తమ సమిష్టి తారాగణం సిక్స్‌టీన్ నామినేటెడ్
2015 పిటిసి పంజాబీ ఫిల్మ్ అవార్డ్స్ ఉత్తమ నటి ఇష్క్ బ్రాందీ నామినేటెడ్
2017 మలేషియా ఎడిసన్ అవార్డ్స్ బెస్ట్ డెబ్యూ యాక్ట్రెస్ మలై నారతు మయక్కం నామినేటెడ్
ఫిలింఫేర్ అవార్డ్స్ సౌత్ నామినేటెడ్
సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ నామినేటెడ్
2018 ఫ్లవర్స్ ఇండియన్ ఫిల్మ్ అవార్డ్స్ బెస్ట్ డెబ్యూ యాక్ట్రెస్ గోధా విజేత

మూలాలు మార్చు

  1. "Chennai Express". The Tribune. 18 October 2019. Retrieved 5 November 2019.
  2. "Wamiqa Gabbi: This is the First Time I will be Celebrating My Birthday Alone". News18 (in ఇంగ్లీష్). 29 September 2021. Retrieved 22 February 2022.
  3. Nanda, Karan (16 April 2019). "You Won't Believe These 5 Punjabi Actresses Looked Like This Before!!!". PTC Punjabi. Retrieved 22 February 2022.
  4. "BFFs Wamiqa Gabbi and Mandy Takhar step in for each other". The Times of India (in ఇంగ్లీష్). 31 October 2020. Retrieved 22 February 2022.
  5. "All about perceptions: Wamiqa Gabbi". The Hindu (in Indian English). 18 October 2016. Retrieved 22 February 2022.
  6. "Wamiqa Gabbi is Geethanjali Selvaraghavan's heroine". The Indian Express. 23 March 2015. Retrieved 20 July 2015.
  7. Jayaram, Deepika (9 June 2017). "Wamiqa Gabbi fondly shares her first picture with Tovino". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 19 September 2020.
  8. "SJ Suryah-Sshivada-Wamiqa join 'Maya' director now". Top 10 Cinema (in అమెరికన్ ఇంగ్లీష్). 30 March 2017. Archived from the original on 19 ఆగస్టు 2017. Retrieved 31 March 2017.
  9. "9-Nine | 9-Nine Cast and Crew, Release Date and more". Pycker (in ఇంగ్లీష్). Archived from the original on 25 సెప్టెంబరు 2020. Retrieved 19 September 2020.
  10. "Netflix Web Series Mai Actress Wamiqa Gabbi Biography, Filmography In Telugu - Sakshi". web.archive.org. 2022-07-12. Archived from the original on 2022-07-12. Retrieved 2022-07-12.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)