కాకి

పక్షుల జాతి
(వాయసం నుండి దారిమార్పు చెందింది)

కాకి (ఆంగ్లం: Crow) ఒక నల్లని పక్షి. దీనిని సంస్కృతంలో వాయసం అంటారు. ఇవి కార్విడే కుటుంబానికి చెందిన కూత పక్షులు. ఇవి కావ్ కావ్ అని కూస్తుంటాయి. వీటిని మామూలు పక్షుల వలె ఇళ్ళలో పెంపకానికి వాడుట జరుగదు.

ఆసియా ఖండంలో విస్తరించిన పొడుగైన ముక్కు కలిగిన కాకిని మాలకాకి (Jungle Crow) గా వ్యవహరిస్తారు. ప్రస్తుతం కాకులను పట్టి దాని మాంసమును తినడం వలన వీటి సంఖ్య కూడా గణనీయంగా తగ్గిపోతున్నది.

కాకులు
Common Raven (Corvus corax)
Scientific classification
Kingdom:
Phylum:
Class:
Order:
Family:
Genus:
కార్వస్

జాతులు

See text.

కాకి (ఆంగ్లం: Crow) ఒక నల్లని పక్షి. దీనిని సంస్కృతంలో వాయసం అంటారు. ఇవి కార్విడే కుటుంబానికి చెందిన కూత పక్షులు. ఇవి కావ్ కావ్ అని కూస్తుంటాయి. వీటిని మామూలు పక్షుల వలె ఇళ్ళలో పెంపకానికి వాడుట జరుగదు. ఆసియా ఖండంలో విస్తరించిన పొడుగైన ముక్కు కలిగిన కాకిని మాలకాకి (Jungle Crow) గా వ్యవహరిస్తారు. ప్రస్తుతం కాకులను పట్టి దాని మాంసమును తినడం వలన వీటి సంఖ్య కూడా గణనీయంగా తగ్గిపోతున్నది.

కాకి

భారతదేశపు కాకి

మార్చు
  • భారతీయ పురాణాలలో కాకులకు చాలా విషయమే ఉంది. పురాణాల ప్రకారం కాకి శని దేవుని యొక్క వాహనంగా ఉంది. ఈ కారణంగా దీనికి పూజలు చేయడం జరుగుతున్నది.
  • రావణుడికి భయపడి కాకి రూపాన్ని ధరించిన యముడు కాకులకు గొప్ప వరాలిచ్చాడు. తాను ప్రాణులన్నింటికీ రోగాలను కలిగించేవాడు కనుక, తానే స్వయంగా కాకి రూపాన్ని ధరించినందువల్ల ఆనాటి నుంచి కాకులకు సాధారణంగా రోగాలేవీ రావన్నాడు. అవి చిరాయువులై ఉంటాయని కాకులకు వరమిచ్చాడు యముడు. యమలోకంలో నరక బాధలను భరించేవారి బంధువులు అలా మరణించిన వారికి సమర్పించే పిండాలను కాకులు తిన్నప్పుడే నరక లోకంలోని వారికి తృప్తి కలుగుతుందన్నారు. యముడు స్వయంగా వాయుసాలకు (కాకులకు) ఈ వరాలిచ్చినందువల్లనే ఈ నాటికీ పితృకర్మల విషయంలో కాకులకు పిండాలు పెడుతున్నారు.

ఒకే కన్ను ఉన్నప్పటికిని రెండు వైపుల కూడా చూడగలదు.

హిందూ పురాణంలో

మార్చు
  • కాకి ని శని దేవుని వాహనంగా వర్ణించబడ్డది .

కాకులు తమ రెక్కలలో ఉన్న పురుగుల్ని పోగొట్టుకోడానికి తమ పైకి చీమల్ని ఎక్కించుకుంటాయి. ఇందుకుగాని కాకులు చీమల పుట్టల దగ్గర చేరుతాయి. ఈ పద్దతిని ఇంగ్లీషులో anting అంటారు.

 
కాకి

కాకుల నేస్తం. సుక్లా శ్రీను (35) 'కాకుల శ్రీను'గా ముద్రపడ్డాడు. విశాఖపట్నం జబ్బర్‌పేట వాసులు కాకుల శ్రీను అని పిలుస్తారు. కాకులను ఆదరిస్తూ వాటికి ఆహారం పెట్టేవాడు. కాకులకు ఆహారం వేశాక హార్బర్ గోడమీద నుంచి చేపలు పడుతూ సముద్రంలో పడి గల్లంతయ్యాడు. మత్స్యకార కుటుంబానికి చెందిన శ్రీనివాస్ హార్బర్‌లో చేపలను గ్రేడింగ్ చేసే పని చేస్తుంటాడు. రోజూ ఉదయం, సాయంత్రం కాకులకు ఆహారాన్ని, చిరుతిళ్లను కొని మరీ వేస్తుంటాడు, ఇతన్ని చూస్తే చాలు కాకులు తలపై, చేతులపై, కాళ్లపై వాలిపోతాయి. ఆయనకు భార్య మహాలక్ష్మి, ఓ కుమార్తె, కుమారుడు ఉన్నారు. శ్రీనుకు చేపలవేటే ఆధారం. ప్రతి రోజు ఉదయం 6 గంటలకు ఫిషింగ్ హార్బర్ పదో నెంబరు జట్టీ వద్దకు చేరుకోవడం ద్వారా అతని దినచర్య ఆరంభమవుతుంది. అతనిని చూసిన వెంటనే ఎక్కడెక్కడి కాకులు వచ్చేస్తాయి. వాటికి తన వెంట తెచ్చిన గింజలు, రొట్టెముక్కలు వేస్తుంటాడు. గత పదేళ్లుగా ఇది నిత్యకృత్యం. చుట్టుపక్కల చేప పిల్లలు ఉన్నా సరే పట్టించుకోకుండా కాకులన్నీ ఈయన వద్దకు చేరుకుని అతని పైకి ఎక్కి కూర్చొనేవి. వాటికి ఆహారం పెట్టిన తరువాత గాని గేలంతో చేపలు పట్టేవాడు కాదు. రూ.50 సంపాదిస్తే అందులో రూ. 30 వరకు కాకుల కోసమే వెచ్చించేవాడు, శ్రీనుకు గతంలో మూర్చవ్యాధి ఉండేదట. శ్రీను పడిపోతున్న సమయంలో అక్కడే ఉన్న కాకులు గుంపులు గుంపులుగా పరిసర ప్రాంతమంతా చక్కెర్లు కొట్టాయని ప్రత్యక్షసాక్షులు తెలిపారు. (ఈనాడు18.10.2009)

 
వికీవ్యాఖ్యలో ఈ విషయానికి సంబంధించిన వ్యాఖ్యలు చూడండి.
"https://te.wikipedia.org/w/index.php?title=కాకి&oldid=4360395" నుండి వెలికితీశారు