వాయుసేనా పతకం, భారత వైమానిక దళంలో శాంతి సమయంలో చేసిన పనికి గుర్తింపుగా ప్రదానం చేస్తారు. సంఘర్షణల సమయంలో శత్రు ముఖంలో చేసిన శౌర్యప్రదర్శనకు కూడా దీన్ని ప్రదానం చేసారు. అయితే వీర చక్ర ప్రదానాల సంఖ్యతో పోలిస్తే ఇది తక్కువ.

Vayu Sena Medal
దస్త్రం:Vayusena Medal.jpg

Medal and its ribbon
TypeMedal
Awarded forAwarded for such individual acts of exceptional devotion to duty or courage as have special significance for the Air Force.[1]
దేశంIndia
అందజేసినవారుIndian Air Force
EligibilityAll ranks of the Air Force[1]
మొదటి బహుమతి1960
Total recipientsMore than 1000
Order of Wear[2]
Next (higher) Yudh Seva Medal
Equivalent Sena Medal (Army)
Nau Sena Medal (Navy)
Next (lower) Vishisht Seva Medal
వాయుసేనా పతకం
దస్త్రం:Vayusena Medal.jpg

పతకం, దాని రిబ్బను
Typeపతకం
Awarded forవాయుసేనలో వ్యక్తిగత శౌర్య ప్రతాపాలకు, విధి పట్ల నిబద్ధతకూ ప్రదానం చేస్తారు.[1]
దేశంభారతదేశం
అందజేసినవారుIndian Air Force
Eligibilityవాయుసేన లోని అన్ని శ్రేణులు[1]
మొదటి బహుమతి1960
Total recipients1000 కి పైగా
Order of Wear[3]
Next (higher) యుద్ధ సేవా పతకం
Equivalent సేనా పతకం (సైన్యం)
నవసేనా పతకం (నేవీ)
Next (lower) విశిష్ట సేవా పతకం

మరణానంతరం కూడా ఈ పతకం ఇవ్వవచ్చు. ఒకటి కంటే ఎక్కువ వాయుసేనా పతకాలు ఇచ్చినపుడు, తదుపరి పతకాల కోసం ఒక పట్టీని జత చేస్తారు.

వాయుసేనా పతకాన్ని 1960 జూన్ 17 న స్థాపించారు. 1961 నుండి ఈ పతకాలను ప్రదానం చేస్తున్నారు. సుమారు గత దశాబ్దం కాలంలో ఇచ్చిన పురస్కారాలను రెండు వర్గాలుగా చేసారు - ఒకటి వాయుసేనా పతకం (శౌర్యం), మరొకటి వాయుసేనా పతకం (విధి పట్ల భక్తి).

చరిత్ర

మార్చు

వాయుసేనా పతకాన్ని భారత ప్రభుత్వం 1960 జనవరి 26 న నెలకొల్పింది. అదే రోజున విశిష్ట సేవా పతక శ్రేణి (క్లాస్ I, క్లాస్ II, క్లాస్ III) సైన్య సేవా పతకం, విదేశ్ సేవా పతకం, సేన మెడల్, నవసేనా పతకం అనే మరో ఐదు పతకాలను కూడా నెలకొల్పారు. [4]

వివరణ

మార్చు

ముందు వైపు: నాలుగు భుజాలు గల వెండి నక్షత్రంలో, మధ్యలో జాతీయ చిహ్నం. నిటారైన పట్టీకి వేలాడుతూ ఉంటుంది. పేరు, తేదీలు అంచున ముద్రించి ఉంటాయి.

వెనకవైపు: రెక్కలు చాచి ఉన్న హిమాలయ డేగ, చుట్టూ దండ, పైన, క్రిందా, హిందీలో "వాయు సేన మెడల్" అని రాసి ఉంటుంది.

రిబ్బన్: 30 మి.మీ., ఏకాంతర 2 మి.మీ. ఐమూలగా (దిగువ ఎడమ నుండి కుడి ఎగువకు) బూడిద, నారింజ-కుంకుమపువ్వు చారలు. రిబ్బన్ మొత్తం "నేసినట్లుగా" ఉంటుంది.

గ్రహీతల ఉదాహరణలు

మార్చు

ఈ పతకం ఉద్దేశాన్ని బాగా అర్థం చేసుకోవడానికి, భారత వైమానిక దళానికి చెందిన స్క్వాడ్రన్ లీడర్ హర్‌చంద్ సింగ్ గిల్‌కు ఇచ్చిన రెండవ-పతకాన్ని చూడవచ్చు:

1953 అక్టోబరులో అస్సాం రైఫిల్స్, సివిల్ అడ్మినిస్ట్రేటివ్ పార్టీల మిశ్రమ కాలమ్‌పై సాయుధ టాగిన్లు దాడి చేసి, కొంతమంది అధికారులను, సైనికులనూ చంపారు. Sqn-Ldr. H. S. గిల్ డకోటా దళాల ఎయిర్‌ల్యాండింగ్ డిటాచ్‌మెంట్‌కు నాయకత్వం వహించాడు. అందుబాటులో ఉన్న రెండు చిన్న విమానాశ్రయాలలో ఎయిర్‌ల్యాండింగ్ సిబ్బంది, సామాగ్రి పని కష్టంగా ఉంది. ఇబ్బందులు ఉన్నప్పటికీ Sqn.-Ldr. గిల్ ఉత్సాహంతో, అపరిమితమైన శక్తితో, ధైర్యంతో వ్యక్తిగతంగా డోపోరిజో వద్ద ల్యాండింగ్‌లలో ఎక్కువ భాగాన్ని నిర్వహించాడు. అవిశ్రాంతంగా పని చేసి, అసాధ్యంగా కనిపించిన ఎయిర్‌లిఫ్ట్‌ను చేసి చూపించాడు. అతను తన విధి పట్ల అత్యున్నత స్థాయి ధైర్యాన్ని, భక్తినీ ప్రదర్శించాడు.

Sqn-Ldr. HS గిల్ పంజాబ్‌లోని ముల్లన్‌పూర్‌లో 1925 మార్చి 25న జన్మించాడు.

ఇవి కూడా చూడండి

మార్చు

సూచనలు

మార్చు
  1. 1.0 1.1 1.2 1.3 "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-03-04. Retrieved 2024-09-24.
  2. "Precedence Of Medals". indianarmy.nic.in/. Indian Army. Retrieved 15 September 2014.
  3. "Precedence Of Medals". indianarmy.nic.in/. Indian Army. Retrieved 15 September 2014.
  4. "Designs of New Service Medal and Their Ribbons" (PDF). archive.pib.gov.in. 29 July 1960. Retrieved 10 January 2022.