సేనా పతకం భారత సైన్యంలోని అన్ని శ్రేణులకూ, "సైన్యం కోసం అసాధారణమైన భక్తితో కూడిన ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉన్న వ్యక్తిగత విధి లేదా ధైర్యప్రదర్శనలకు" ప్రదానం చేస్తారు. అవార్డులు మరణానంతరం కూడా ఇవ్వవచ్చు. ఒకటి కంటే ఎక్కువ సేనా పతకాలను ఇచ్చినపుడు తదుపరి పురస్కారాలలో ఒక పయ్ట్టీ ఇస్తారు.

సేనా పతకం


సేనా పతకం, దాని రిబ్బను
Typeపతకం
Awarded forసైన్యంలో విధి పట్ల అత్యుత్తమ వ్యక్తిగత అంకితభావ ప్రదర్శనకూ, ధైర్య ప్రదర్శనకూ ఇచ్చే పురస్కారం
దేశంభారతదేశం
అందజేసినవారుIndia India
EligibilityAll ranks of the army[1]
Post-nominalsSM
Campaign(s)Currently awarded
Established17 June 1960
Order of Wear[2]
Next (higher) Yudh Seva Medal
Equivalent Nau Sena Medal (Navy)
Vayu Sena Medal (Air Force)
Next (lower) Vishisht Seva Medal

ఈ పతకాన్ని శౌర్యప్రదర్శనకు ఇస్తారు. శత్రు ముఖంలో కాకుండా చేసే విశిష్ట సేవ కోసం కూడా ఇస్తారు. కాబట్టి, సేనా పతకం భారత సైన్యానికి ఒక విధమైన సాధారణ ప్రశంసా పతకంగా కూడా ఉపయోగపడుతుంది. 1999 ఫిబ్రవరి 1 నుండి అవార్డు గ్రహీతలకు కేంద్ర ప్రభుత్వం నెలవారీ రూ. 250 ఇస్తోంది. ఆ తర్వాత దానిని రూ. 2000 కు పెంచింది. దీనికి పైన వీర చక్ర, శౌర్య చక్ర & యుద్ధ సేవా పతకం ఉన్నాయి.

చరిత్ర

మార్చు

సేనా పతకాన్ని భారత ప్రభుత్వం 1960 జనవరి 26 న స్థాపించింది. అదే రోజున విశిష్ట సేవా పతకం సిరీస్ (క్లాస్ I, క్లాస్ II, క్లాస్ III), [3] సైన్య సేవా పతకం, విదేశ్ సేవా పతకం, నవసేనా పతకం, వాయుసేనా పతకం అనే మరో ఐదు పతకాలను కూడా నెలకొల్పారు.[3]

ఈ వృత్తాకార వెండి పతకానికి ముందు వైపున పైకి చూస్తున్న బయోనెట్‌ ఉంటుంది. వెనుకవైపున పైన హిందీలో "సేనా మెడల్"లో లెజెండ్‌తో నిలబడి ఉన్న సైనికుడు ఉంటాడు. పతకం నిలువు పట్టీకి వేలాడుతూ ఉంటుంది. అంచున పేరు ఉంటుంది. అంచున తేదీ కూడా ముద్రించడం కద్దు. రిబ్బన్ 32 మి.మీ. పొడవున ఎరుపు రంగులో, మధ్యలో తెల్లటి గీతతో ఉంటుంది.[4]

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. http://www.indianarmy.gov.in/Site/FormTemplete/frmTempSimple.aspx?MnId=+XFsYvbMVazIZKDD0Hpa9Q==&ParentID=ls2jF2p0N9pszPf1/q9f8g== [dead link]
  2. "Precedence Of Medals". indianarmy.nic.in/. Indian Army. Retrieved 15 September 2014.
  3. "DESIGNS OF NEW SERVICE MEDAL AND THEIR DESIGNS" (PDF). archive.pib.gov.in. 29 July 1960. Retrieved 10 January 2022.
  4. "The Official Home Page of the Indian Army". www.indianarmy.nic.in.
"https://te.wikipedia.org/w/index.php?title=సేనా_పతకం&oldid=4320383" నుండి వెలికితీశారు