వారణాసి వేంకటేశ్వర కవి

వారణాసి వేంకటేశ్వర కవి
జననం1820
వృత్తిరచయిత
సుపరిచితుడు/
సుపరిచితురాలు
రామచంద్రోపాఖ్యానం
తల్లిదండ్రులు
  • కామయార్యుడు (తండ్రి)
  • లచ్చమాంబ (తల్లి)

కవికాలము

మార్చు

19వ శతాబ్దం మొదట్లో ప్రముఖ తెలుగు కవి వారణాసి వేంకటేశ్వర కవి. ఇతని తండ్రి పేరు కామయార్యుడు, తల్లి పేరు లచ్చమాంబ. ఇతని జననం 1820 ప్రాంతంలో ఉండవచ్చు. 1850 ప్రాంతములో వీరు రామచంద్రోపాఖ్యానము అనే గ్రంథాన్ని రచించారు. ఇది ఆరు ఆశ్వాసములు గల కావ్యము. ఇతనిది పిఠాపురం దగ్గరలోని కొత్త ఇసుకపల్లి అని తెలుస్తోంది.

రామచంద్రోపాఖ్యానము

మార్చు

రామాయణము మొత్తం కథను పరిశీలించి, సంక్షేపించి, ఆరు కాండములలో ఉన్న రామాయణ కావ్యాన్ని ఆరు ఆశ్వాసములకు కుదించి రామచంద్రోపాఖ్యానమని పేరు పెట్టారు. ఈ రచనలో కవి కొంత భాగం గద్యం(వచనం)లోనూ, కొంత భాగం పద్యం(కవిత)గానూ రాసారు. ఈ కావ్యము 1911 లో ముద్రితమయింది. ఈ ముద్రణకు పీఠిక పురాణపండ మల్లయ్యశాస్త్రి రాసారు. ఈ రచనను వేంకటేశ్వర కవి కుక్కుటేశ్వర స్వామికి అంకితమిచ్చారు.

తన సోదరుని సహాయము

మార్చు

కృత్యాది పద్యములో నీగ్రంథనిర్మాణమునకు దనసొదరులైన లక్ష్మీపతి, జోగన్న యనువారలు తోడైరని కలదు. ఆ పద్య మిది :

శా. ప్రీతింబుట్టితి మవ్వధూవరులకున్ శ్రీ వెంకటేశుండా నే
నేతద్ గ్రంథనిబంధనంబునకు నాకెంతోనియుం దోడుగా
జేతస్ఫూర్తి రచించి పొల్పసగు లక్ష్మీవత్సభిఖ్యుండు వి
ఖ్యాతప్రజ్ఞఉడు జోగనాహ్వయుడు నార్యశ్లాఘ్యసంశీలతన్.

కవితాపాకము

మార్చు

ఇతని కవిత్వము మొత్తముమీద ద్రాక్షాపాకము, నడుమ నడుమ నారికేళపాకముగ కవితసాగినది. మచ్చుకు ఈ పద్యము:

చ. ఒక పలుకాగి కాకి యమితోన్మద మొప్ప ధరాకుమారికం
జికమక నొందజేయ రఘుశేఖరు దారసిదాని కాత్మలో
నకసక నొంది క్రన్నన దృణం బొకటేయ మహాస్త్రమై కరం
బొకపరి బీరువోక సకలోర్వర ద్రిప్పిన గాకి భీరుతన్. (తృతీయాశ్వాసము)

మూలాలు

మార్చు
  • మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి రచించిన ఆంధ్ర రచయితలు (1940) లో 44-49 పేజీలు.