వాలెంటీనా టెరిష్కోవా

రష్యకు చెందిన కాస్మోనాట్, పైలట్, అంతరిక్షంలో ప్రయాణించిన మొదటి మహిళ

వాలెంటీనా టెరిష్కోవా రష్యాకు, పూర్వపు సోవియట్ యూనియన్ కు చెందిన వ్యోమగామి. ఆమె 1937 మార్చి 6 న జన్మించింది. ఈమె అంతరిక్షంలోకి వెళ్ళిన మొదటి మహిళగా చరిత్రలో ప్రసిద్ధికెక్కింది. ఆమె 1963 జూన్ 16 న అంతరిక్షంలోకి వెళ్ళుటకు ప్రయోగించిన వోస్కోట్-6 అనే అంతరిక్ష నౌకకు పైలెట్ గా నాలుగు వందలమంది దరఖాస్తుదారులలో ఒకరిగా ఎంపికైనది. అంతరిక్ష సంస్థ లోకి అడుగు పెట్టిన టెరిష్కోవా సోవియట్ వాయుసేనా దళంలో మొదటి సారిగా గౌరవప్రథమైన హోదాలో ఉండెడిది. ఆమె అంతరిక్షంలోనికి వెళ్ళిన మొదటి మహిళా పైలట్ గా ప్రసిద్ధి చెందింది.[1] ఆమె మూడు రోజుల అంతరిక్ష యాత్రలో అనేక స్వీయ పరీక్షలను నిర్వహించుకొని ఆమె స్త్రీల శరీరంలో గల మార్పులకు సంబంధించిన సమాచారాన్ని సేకరించింది.

వాలెంటీనా టెరిష్కోవా
1969 లో వాలెంతినా తెరిష్కోవా
జననం (1937-03-06) 1937 మార్చి 6 (వయసు 87)
జాతీయతసోవియట్ యూనియన్
రష్యన్
ఇతర పేర్లువాలెంతినా వ్లాదిమిరోవ్నా తెరిష్కోవా
వృత్తివ్యోమగామి
పురస్కారాలుమూస:Hero of the Soviet Union
అంతరిక్ష జీవితం
సోవియట్ వ్యోమగామి
అంతరిక్షంలొ ప్రవేశించిన మొదటి మహిళ
ర్యాంకుమేజర్ జనరల్, సోవియట్ ఎయిర్‌ఫోర్స్
అంతరిక్షంలో గడిపిన కాలం
2 రోజులు, 23 గంటల and 12 నిమిషాలు
ఎంపికమహిళా దళం
అంతరిక్ష నౌకలువోస్తోక్ 6

టెరిష్కోవా అంతరిక్ష వ్యోమగామిగా నియామకం కాకముందు ఆమె జౌళి పరిశ్రమలో పనిచేసింది. అమె పారాచూట్ లపట్ల ఆసక్తి కనబరచేది. 1969 లో వ్యోమగాముల మొదటి సమూహం విడిపోయిన తర్వాత ఆమె కమ్యూనిటీ పార్టీ ఆఫ్ సోవియట్ యూనియన్ లో గౌరవ సభ్యులుగా ఎంపిక కాబడ్డారు. సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం తర్వాత ఆమె ప్రస్తుతం గల సోవియట్ రష్యాలో పూజ్యమైన స్త్రీగా గుర్తింపబడుతున్నారు.

తొలి జీవితం

మార్చు

టెరిష్కోవా మధ్య రష్యాలోని టుటయెవ్‌స్కీ జిల్లా లోని "మాస్‌లెన్నికోవో" అనే గ్రామంలో జన్మించారు. ఆమె తల్లిదండ్రులు బెలారస్ అనే ప్రాంతంనుండి వలస వచ్చారు.[2] ఆమె తండ్రి ఒక ట్రాక్టర్ డ్రైవర్ గానూ, ఆమె తల్లి జౌళి పరిశ్రమలో ఉద్యోగినిగా పనిచేశేవారు. ఆమె 1945 లో తన 8 వయేట ప్రాఠాశాల విద్య ప్రారంభించారు కానీ 1953 లో పాఠశాలను వదిలి వేసి తర్వాత విద్యను కరెస్పాండెన్స్ ద్వారా పూర్తి చేశారు.[3] ఆమె యుక్త వయస్సు నుండి పరాచూట్ ల పట్ల ఆసక్తి కనబరచేవారు. అందువల్ల ఆమె స్కై డైవింగ్ లో స్థానిక ఏరో క్లబ్ లో శిక్షణ పొందారు. ఆమె తన 22 వ యేట అనగా 1959 మే 22 లో మొదటి సారి ఆకాశంలో డైవింగ్ చేశారు. ఆ కాలంలో ఆమె జౌళి పరిశ్రమలో ఒక ఉద్యోగినిగా పనిచేసే వారు. ఆమె ఆకాశమార్గంలో డైవింగ్ చేయు నైపుణ్యం ఆమెను ఒక వ్యోమగామిగా ఎంపిక కాబడుటకు తోడ్పడింది. 1961 లో ఆమె స్థానిక 'కొమ్‌సొమోల్" (యువ కమ్యూనిస్ట్ లీగ్) లో సెక్రటరీగా ఉన్నారు. తర్వాత ఆమె కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ది సోవియట్ యూనియన్ లో చేరారు.

సోవియట్ అంతరిక్ష కార్యక్రమంలో ఉద్యోగం

మార్చు
 
Cosmonauts Valentina Tereshkova and Valery Bykovsky among children

1961 లో యూరి గగారిన్ అంతరిక్ష యాత్ర తర్వాత సోవియట్ రాకెట్ ఇంజనీర్ అయిన "సెర్జీ కొరొల్‌యోవ్" ఒక మహిళను అంతరిక్షం లోకి పంపాలనే ఆలోచన చేశాడు. 1962 ఫిబ్రవరి 16 న వాలెంటీనా తెరిషోవాను మహిళా వ్యోమగాముల వర్గం లోకి ఎంపిక చేశాడు. అంతరిక్షం లోకి వెళ్ళుటకు దరఖాస్తుచేసిన 400 మందిలో ఐదు మంది మాత్రమే ఎంపిక కాబడ్డారు: టత్యాన కుజ్‌నెట్సోవా, ఇరినా సొలొవ్యోవ, ఝన్నా యొర్కినా, వాలెంటీనా పొనొమార్యొవా, తెలిస్కోవా. తెలిస్కోవా ఎంపిక కాబడడానికి యోగ్యత ఆమె 30 సంవత్సరాలుగా పారాఛూట్ లో డైవింగ్ లో అనుభవం కలిగి యుండటం, 170 సెం.మీ. (5 అడుగుల 7 అంగుళాలు) ఎత్తు కలిగి ఉండటం, 70 కి.గ్రా. ల బరువు కలిగి ఉండుట.

తెరెస్కోవా ఒక సామర్థం కలిగిన వ్యక్తిగా గుర్తింపు పొందుటకు ఆమె గతచరిత్రకూడా కారణం. ఆమె తండ్రి 'టాంక్ లీడర్ అయిన వ్లాదిమిర్ తెరెస్కోవా యుద్ధ హీరో. ఆయన ప్రపంచ యుద్ధం 2 లో ఫిన్నిష్ (శీతాకాల యుద్ధం) లో లెమ్మెట్టి ప్రాంతంనందు తెరెస్కోవా రెండేళ్ళ వయస్సు కలిగి యున్నపుడు మరిణించాడు. ఆమె అంతరిక్ష యాత్ర చేసిన తర్వాత సోవియట్ యూనియన్ యే విధంగా కృతజ్ఞతలు తెలుపాలో ఆమెను కోరినది. టెరిష్కోవా తన తండ్రి యే ప్రాంతంలొ మరణించారో ప్రచురించమని కోరారు. ఆమె చేసిన కృషికి కృతజ్ఞతగా సోవియట్ యూనియన్ ఆమె తండ్రి మరిణించిన ప్రాంతం అయిన "లెమెట్టీ"లో స్మారక స్తంభం నిర్మించింది. అది ప్రస్తుతం రష్యా సరిహద్దులో ఉంది. తెలిష్కోవా అనేక సార్లు ఫిన్‌లాండ్ ను సందర్శించారు.

శిక్షణలో తేలిక్ విమానాలు, నిర్జనత్వ పరీక్షలు, అపకేంద్రబల పరీక్షలు, రాకెట్ సిద్ధంతం, స్పేస్ కాప్ట్ ఇంజనీరింగ్, 120 పారాచూట్ నుండి దూకటం, పైలట్ శిక్షణ లను MiG-15UTI లో యివ్వబడ్డాయి. ఈ బృందం అనేక నెలల పాటు తీవ్రమైన శిక్షణ పొంది 1962 నవంబరులో పరీక్షలను హాజరయ్యారు. తర్వాత మిగిలిన నలుగురు సోవియట్ ఎయిర్ ఫోర్స్ లో సహాయకులుగా నియమించబడ్డారు. టెరిష్కోవా, సోలోవ్యోవా, పొనొమార్యోవాలు ముఖ్యమైన వ్యక్తులు, ఒక ఉమ్మడి కార్యక్రమం అభివృద్ధి చేసిరి. దాని ప్రకారం మార్చి లేదా 1963 ఏప్రిల్ లో ఇద్దరు మహిళలు సోలో వాస్కోక్ ప్లైట్ పై నుండి వరుస రోజులలో అంతరిక్షంలో అడుగు పెట్టాలని ప్రణాళిక తయారుచేశారు.

మొదట టెరిష్కోవా వాస్టోక్ 5 లో ప్రవేశించాలని, పొనొమర్యోవా ఆమెను అనుసరించి వాస్టోక్ 6 నుండి కక్ష్యలో ప్రవేశించాలని నిర్ణయించారు. కాని ఆ నిర్ణయం 1963 మార్చిలో మార్పు చెయబదినది. వాస్టోక్ 5 అనునది పురుష వ్యోమగామి వారెరీ బైకోస్కైతో ప్రయాణీంపబడేది. అది మహిళా వ్యోమగాములతో కూడిన వోస్టోక్ 6 తొ కలసి ఉమ్మడిగా 1963 జూన్ 6 లో వెళ్ళుటకు నిర్ణయింపబడింది. స్టేట్ స్పేస్ కమిషన్ మే 21 న సమావేశమై టెరిష్కోవాను వోస్కోవ్ 6 కు పైలట్ గా నియమించింది. ఇది నిఖిత ఖ్రుష్‌చెవ్ చే ధ్రువీకరింపబడింది. ఎంపికైన సమయంలో టెరిష్కోవా మెర్క్యురీ సెవెన్ అనే వ్యోమగామి కంటే పది సంవత్సరాలు వయసులో చిన్నది.

జూన్ 14 న వోస్టోక్ 5 అనే అంతరిక్ష నౌక దిగిన తర్వాత టెరిష్కోవా తన స్వంత ప్లైట్ కొరకు చివరి ప్రయత్నాలు ప్రారంభించింది. అపుడు ఆమె వయస్సు 26 సంవత్సరాలు. 1963 జూన్ 16 న ఉదయం, టెరిష్కోవా, ఆమె అనుచరులు సోలోవ్యొవాలు అంతరిక్ష దుస్తులు (space suits) ధరించారు. అంతరిక్ష నౌక బయలుదేరే స్థలం వద్దకు బస్ పై వెళ్ళారు.తన ప్రయాణ సమాచారము పూర్తయిన తర్వాత, ప్రాణ రక్షణ కొరకు ప్రయత్నాలు సరిచూసుకొన్న తర్వాత ఆమె వోస్టోక్ అనే అంతరిక్ష నౌక లోనికి వెళ్ళినది. అపుడు ఆ నౌక సీల్ చేయబడింది. కౌంట్ డౌన్ ప్రారంభించబడింది. వోస్టోక్ 6 లోప రహితంగా చేరినది. తెలిష్కోవా అంతరిక్షం లోకి వెళ్ళిన మొదటి మహిళగా చరిత్రలో నిలిచింది. ఆమెకు ఈ అంతరిక్ష నౌకలో పిలుచుకొను గుర్తుగా "చైకా"గా నిర్ణయింపబడింది. అంతరిక్ష యాత్ర నిర్విఘ్నంగా పూర్తయిన తదుపరి ఆమె విజయానికి గుర్తుగా ఒక ఉల్కకు ఆమె సజ్ఞానామం అయిన చైకా అని పేరు పెట్టారు.ఆ ఉల్క పేరు 1671 Chaika.

 
From right to left: Nikita Khrushchev, Valentina Tereshkova, Pavel Popovich and Yury Gagarin at the Lenin Mausoleum, during a celebration honoring the Soviet cosmonauts, 1963

కానీ టెరిష్కోవా అంతరిక్షనౌకలో భౌతికంగా అసౌకర్యంగా అనుభూతిపొందినది.[4] ఆమె భూమి యొక్క కక్ష్యలో 48 సార్లు తిరిగి మొత్తం మూడు రోజులు అంతరిక్షంలొ గడిపింది. ఆమె తన విమానంలో గడిపిన సమయం యిదివరకు అమెరికా వ్యోమగాములు గడిపిన సమయం కంటే ఎక్కువ. టెరిష్కోవా ప్లైట్ లో తన అనుభవాలను నమోదు చేయుతకు ఒక లాగ్ బుక్ నిర్వహించింది.ఆమె ఖగోళ విషయాలను ఫోటోలు కూడా తీసినది. ఆ చిత్రాలు తర్వాతి కాలంలో వాతావరణం లోని పొరలను కనుగొనుటలో ఉపయోగపడినవి.

టెరిష్కోవా ప్రయాణించిన వోస్టోవ్ 6 అనునది చివరి వోస్టోక్. ఇది వాలెరీ బైకోవ్‌స్కై అనే వ్యోమగామి ప్రయాణించిన వోస్టోక్ 5 బయలుదేరిన రెండు రోజుల తర్వాత బయలుదేరినది. ఇది వోస్టో 5 ప్రయాణించిన కక్ష్యలోనికే వెళ్ళినది. వోస్టోక్ 5 కక్ష్యలో ఐదు రోజులు అనగా టెరిష్కోవా వోస్టోక్ 6 నుండి దిగిన మూడు గంటల వరకు ఉంది. ఈ రెండు వ్యోమ నౌకలు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. అందులో గల టెరిష్కోవా వైకోవ్‌స్కైతో సంభాషించింది. వీరిద్దరూ రేడియో ద్వారా ఖ్రుష్‌చెవ్ తో కూడా సంభాషించారు.

ఆ తర్వాత అంతరిక్షంలోకి రెండవ మహిళను పంపే పథకం 19 సంవత్సరాల తర్వాత నెరవేరినది. టెరిష్కోవా తర్వాత స్వెత్లానా సవిక్షయ అనే మహిళ అంతరిక్షంలోకి అడుగు పెట్టినది. ఆ తర్వాత టెరిష్కోవా బృందం లోని ఎవరూ అంతరిక్షంలోకి వెళ్ళలేదు. 1969 అక్టోబరులో ఆ మహిళా బృందము నకు విరమణ కలిగినది.

విద్య

మార్చు
 
Tereshkova, skiing, 1964

అంతరిక్ష ప్రయాణం చేసిన తదుపరి టెరిష్కోవా జుకోవ్‌స్కై ఎయిర్ ఫోర్స్ అకాడమీలో చదువుకొని అత్యధిక మార్కులతో అంతరిక్ష ఇంజనీరింగ్ లో పట్టభద్రురాలైనది. 1977 లో ఆమె ఇంజనీరింగ్ లో డాక్టరేట్ పొందినది.

సోవియట్ రాజకీయాలలో ప్రాధాన్యత

మార్చు

ఆమెకు వ్యోమగామిగా వచ్చిన ఔన్నత్యంతో అనేక రాకకీయ పార్టీలలో అనేక పదవులు లభించాయి. 1966 నుండి 1974 వరకు ఆమె "సుప్రీం సోవియట్ ఆఫ్ ద సోవియట్ యూనియన్"లో సభ్యురాలిగా ఉన్నారు. 1974 నుండి 1989 వరకు "ప్రెసిడియం ఆఫ్ ద సుప్రీం సోవియట్"కు సభ్యులైనారు. 1969 నుండి 1991 వరకు ఆమె "సెంట్రల్ కమిటీ ఆఫ్ ద కమ్యూనిస్ట్ పార్టీ"లో ఉన్నారు. 1977 లో ఆమె రష్యా ఎయిర్ ఫోర్స్ లో పదవీ విరమణ పొందారు. రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు వ్యోమగామిగా కూడా పదవీవిరమణ చేశారు.

సోవియట్ యూనియన్ లో రాజకీయ విభాగంలో ఆమెకు గల గుర్తింపుతో ఆమె సోవియట్ నుండి విదేశ ప్రతినిధిగా గుర్తింపుపొందారు. ఆమె ప్రపంచ శాంతి కౌన్సిల్ కు మెంబర్ గా 1966 లో నియమింపబడ్డారు. 1967 లో ఆమె యారోస్లావ్ల్ సోవియట్ కు సభ్యులుగా ఉన్నారు.1966–1970, 1970–1974 లలో ఆమె సుప్రీం ఆఫ్ ద సోవియట్ యూనియన్ కు మెంబరుగా ఉన్నారు. ఆమె ప్రెసిడియం ఆఫ్ ద సుప్రీం సోవియట్ కు 1974 లో ఎన్నికైనారు.1975 లో మెక్సికో నగరంలో ఐక్యరాజ్యసమితి తరపున జరిగిన "అంతర్జాతీయ మహిళా సంవత్సరం "కు సోవియట్ తరపున ప్రతినిధిగా పాల్గొన్నారు.

ఆమె ప్రపంచ మహిళా సమావేశాలకు సోవియట్ యూనియన్ తరపున కోపెన్ హగ్ నగరంలో ముఖ్య భూమిక పోషించి శాతికోసం గ్లోబల్ అజెండాకు రూపకల్పన చేశారు. ఆమె సుప్రీం సోవియట్ లో డిప్యూటీ రాంకును పొందారు.కమ్యూనిస్ట్ పార్టీ, సోవియట్ యూనియన్ కేంద్రకమిటీలో సభ్యత్వాన్ని తీసుకున్నారు. అమె అంతర్జాతీయ మహిళా ప్రజాస్వామ్య ఫెడరేషానికి ఉపాధ్యక్షులుగా, సాఒవియట్-అల్జీరియన్ మైత్రీ సంఘానికి అధ్యకులుగా కూడా ఉన్నారు. ఆమె USSR లోని అత్యున్నత అవార్డు అయిన హీరో ఆఫ్ ద సోవియట్ యూనియన్ పతకాన్ని పొందినది. ఆమె ఆర్డర్ ఆఫ్ లెనిన్, ఆర్డర్ ఆఫ్ ద అక్టోబరు రివొల్యూషన్, అనేక విశేష పతకాలు, విదేశ పతకాలు ముఖంగా కార్ల్ మార్క్స్ ఆర్డర్ ను, యునైటెడ్ నేషన్స్ "గోల్డ్ మెడల్ ఆఫ్ పీస్"ను, సింబా అంతర్జాతీయ మహిళా ఉద్యం అవార్డును పొందారు. ఆమె హీరో ఆఫ్ సోషలిస్ట్ లేబర్ ఆఫ్ చెకోస్లేవేకియా, హీరో ఆఫ్ వియత్నాం, హీరో ఆఫ్ మంగోలియా అనే అవార్డులు సంపాదించింది. 1990 లో ఆమె యూనివర్సిటీ ఆఫ్ ఏడిన్‌బర్గ్ నుండి గౌరవ డాక్టరేట్ ను పొందినది. చంద్రుని వెనుక భాగమునకు ఆమె పేరు మీద "టెరిష్కోవా క్రేటర్" అని నామకరణం చేశరు. వాలెంటినా టెరిష్కోవా సోవియట్, రష్యా సైనిక విభాగంలో మొదటి, ఏకైన మహిళా జనరల్ అధికారిగా ఉన్నారు.

 
Tereshkova in 1970

సోవియట్ విచ్ఛిన్నం తర్వాత టెరిష్కోవా తన రాజకీయ జీవితాన్ని కోల్పోయింది. కాని ఈ రోజు ఆమె సోవియట్ స్పేస్ చరిత్రలో యూరీ గగారిన్, అలెక్సీ లియొనోవ్ సరసన అసమన గుర్తింపు పొందింది. ఆమె రాజకీయ జీవితం నుండి పదవీ విరమణ చెందిన తర్వాత అంతరిక్ష కార్యక్రమాలలో తరచుగా కనబడేది.

టెరిష్కోవా యొక్క జీవితం, అంతరిక్ష యాత్ర మొదట 1975 మిట్చెల్ ఆర్.షార్పె వ్రాసిన పుస్తకం అయిన It Is I, Sea Gull; Valentina Tereshkova, the first woman in space ద్వారా పరీక్షింపబడింది,[5] ఆమె జీవిత విశేషాలను 2007 లో "కోలిన్ బుర్జెస్స్", "ఫ్రాన్సిస్ ప్రెంచ్" వ్రాసిన Into That Silent Seaలో ఉంది. ఈ పుస్తకంలో టెరిష్కోవా, ఆమె బృంద సభ్యుల ఇంటర్వ్యూలు కూడా ఉన్నాయి.

ఆమె తన 70 సంవత్సరాల పుట్టిన రోజు సందర్భంగా రష్యా ప్రధానమంత్రి నివాసానికి ఆహ్వానం పంపారు. ఆ కార్యక్రమఖ్లో ఆమె మార్స్ పైకి ఒన్ వే ట్రిప్ వెళ్ళాలనుకుంటున్నట్లు చెప్పారు.[6]

ఏప్రిల్ 5, 2008 న ఆమె సెయింత్ పీటర్స్ బర్గ్, రష్యాలో జరిగిన 2008 సమ్మర్ ఒలెంపిక్స్ కు టార్చ్ బేరర్ అయ్యారు.[7]

ఆమె జర్మన్ "ఎడుయార్డ్ రెయిన్ పౌండేషన్" నుండి 2007 లో "ఎడుయార్డ్ రెయిన్ రింగ్ ఆఫ్ ఆనర్" అనే అవార్డును అందుకున్నారు.[8][9]

వ్యక్తిగత జీవితం

మార్చు

"వోస్టోక్ 6"లో అంతరిక్ష యాత్ర తరువాత ఆమె ఒక వ్యోమగామి "ఆండ్రియన్ నికొలాయెవ్" (1929–2004) తో వివాహం కానున్నట్లు పుకార్లు వ్యాపించాయి. అదే విధంగా 1963 నవంబరు 3 న మాస్కో వెడ్డింగ్ పాలస్ లో వారు వివాహం చేసుకున్నారు. "ఆండ్రియన్ నికొలాయెవ్" ప్రభుత్వంలోని ఉన్నతాధికారులకు, అంతరిక్ష కార్యక్రమాల అధికార్లకు వివాహానికి ఆహ్వానించి సత్కరించాడు.

సామాజిక కార్యాచరణ

మార్చు

2011 లో, ఆమె యారోస్లావల్ ప్రాంతీయ జాబితాలో యునైటెడ్ రష్యా పార్టీ నుండి స్టేట్ డూమా ఆఫ్ రష్యాకు ఎన్నికైంది. తెరేష్కోవా, ఎలెనా మిజులినా, ఇరినా యారోవయా, ఆండ్రీ స్కోచ్ [10][11]తో కలిసి, క్రైస్తవ విలువల పరిరక్షణ కోసం ఒక ఇంటర్-ఫ్యాక్షనల్ డిప్యూటీ గ్రూప్‌లో సభ్యుడు; ఈ సామర్థ్యంలో, ఆమె రష్యన్ రాజ్యాంగానికి సవరణలను ప్రవేశపెట్టడానికి మద్దతు ఇచ్చింది, దీని ప్రకారం, "సనాతన ధర్మం రష్యా యొక్క జాతీయ , సాంస్కృతిక గుర్తింపుకు ఆధారం." 2011 డిసెంబరు 21 నుండి ఫెడరల్ స్ట్రక్చర్, స్థానిక స్వపరిపాలనపై స్టేట్ డూమా కమిటీ డిప్యూటీ ఛైర్మన్.

1964 జూన్ 8 న వారికి "ఎలెనా ఆండ్రియనోవా-టెరిష్కోవా" అనే కుమార్తె కలిగినది.[12]. (ప్రస్తుతం ఆమె ఒక డాక్టర్, తల్లి దండ్రులు వ్యోమగాములైన మొదటి వ్యక్తి). ఆమె నికొలయెవ్ కు 1982 లో విడాకులిచ్చింది. ఆమె ఆర్థోపెడిస్ట్ అయిన యులీ జి.షాపొష్నికోవ్ ను వివాహమాడింది. ఆయన 1999 లో మరణించాడు.
 
The wedding ceremony of pilot-cosmonauts Valentina Tereshkova and Andrian Nikolaev, 3 November 1963.

గౌరవాలు, సత్కారాలు

మార్చు
 
Tereshkova at the Heureka science centre, in Finland, 2002
 
Tereshkova visiting the Lvov confectionary, 1967
 
Valentina Tereshkova and Neil Armstrong, 1970
 
Valentina Tereshkova among delegates of the 24th CPSU congress, 1971
 
Valentina Tereshkova and NASA astronaut Catherine Coleman at the Gagarin Cosmonaut Training Center in December 2010.
 
Tereshkova receives the Order of Friendship from Russian President Dmitry Medvedev on 12 April 2011 at the Moscow Kremlin.
రష్యన్
  • Order of Merit for the Fatherland;
    • 2nd class (6 March 2007) – for outstanding contribution to the development of domestic space
    • 3rd class (6 March 1997) – for services to the state and the great personal contribution to the development of domestic space
  • Order of Honour (10 June 2003) – for outstanding contribution to the development and strengthening of international scientific, cultural and social ties
  • Order of Friendship (April 12, 2011) – for outstanding contribution to the development of national manned space flight and long-term fruitful public activity
  • Russian Federation State Prize for outstanding achievements in the field of humanitarian action in 2008 (4 June 2009)
  • Certificates of appreciation from the Government of the Russian Federation;
    • 16 June 2008, – for long-term fruitful state and public activities, considerable personal contribution to the development of manned space flight and in connection with the 45th anniversary of spaceflight
    • 12 June 2003, – for large contribution to the development of manned space flight
    • 3 March 1997) – for the contribution to the development of space, the strengthening of international scientific and cultural ties and years of diligent work
సోవియట్
యితర అవార్డులు – వార్సా పాక్ట్
యితర అవార్డులు
వైజ్ఞానిక, సాంఘిక, ఆధ్యాత్మిక సంస్థలు
  • Gold Medal, Tsiolkovsky Academy of Sciences of the USSR
  • Gold Medal of the British Society for interplanetary communications "For achievements in space exploration" (February 1964)
  • Gold Medal of the "Cosmos" (FAI)
  • Award Galambera Astronautics
  • Gold Medal of Peace Joliot-Curie (France, 1964)
  • Order "Wind Rose" International Committee of the National Aeronautics and Space Missions
  • "Golden mimosa" of the Italian Union of Women (1963)
  • Sign of the Komsomol "For active in the League" (1963)
  • Gold Medal Exhibition of Economic Achievements (28 June 1963)
  • Honour of DOSAAF (1 July 1963)
  • Order of St. Euphrosyne, Grand Duchess of Moscow, 2nd class (2008)
గౌరవ పౌరసత్వాలు

Kaluga, Yaroslavl (Russia), Karaganda, Baikonur (Leninsk, Kazakhstan, 1977), Gyumri (Leninakan, Armenia, 1965), Vitebsk (Belarus, 1975), Montreux (Switzerland), Drancy (France), Montgomery (UK), Polizzi Generosa ( Italy), Darkhan (Mongolia, 1965), Sofia, Burgas, Petrich, Stara Zagora, Pleven, Varna (Bulgaria, 1963), Bratislava (Slovakia, 1963)

గుర్తింపు

Various locations and monuments have been named after Valentina Tereshkova:

యివి కూడా చూడండి

మార్చు

సూచికలు

మార్చు
  1. "Valentina Vladimirovna TERESHKOVA". Archived from the original on 2011-04-23. Retrieved 2013-04-12.
  2. Першая жанчына‑касманаўт ў дзяцінстве гаварыла па‑беларуску Archived 2013-10-21 at the Wayback Machine. Nn.by (2009-04-24). Retrieved on 2013-03-04.
  3. Valentina Tereshkova. Starchild.gsfc.nasa.gov. Retrieved on 2013-03-04.
  4. "Valentina Tereshkova: the Woman who Conquered the Space" (in Russian)
  5. Mitchell R Sharpe (1975). "It is I, Sea gull;": Valentina Tereshkova, first woman in space. Crowell. ISBN 978-0-690-00646-9.
  6. "First woman in space dreams of flying to Mars". 6 March 2007. Retrieved 2008-05-26.
  7. // Олимпийский огонь понесут Друзь, Фрейндлих и Плющенко. Kp.ru (2012-10-16). Retrieved on 2013-03-04.
  8. "The Eduard Rhein Ring of Honor Recipients". Eduard Rhein Foundation. Archived from the original on 2011-07-18. Retrieved ఫిబ్రవరి 5, 2011.|website= |archive-url= |archive-date=2011-07-18 |url-status=dead }}
  9. "Ring of Honor 2007 – Dr. techn. Dr.h.c.mult. Valentina V. Tereschkova". Eduard Rhein Foundation. Archived from the original on 2011-07-18. Retrieved ఫిబ్రవరి 5, 2011.|website= |archive-url= |archive-date=2011-07-18 |url-status=dead }}
  10. Благотворительные проекты депутата и бизнесмена Андрея Скоча (ktotakoj.ru)
  11. Андрей Владимирович Скоч: биография (lenta.ru)
  12. Feldman, Heather. Valentina Tereshkova: The First Woman in Space. The Rosen Publishing Group, 2003. ISBN 0-8239-6246-6

బయటి లంకెలు

మార్చు


బయటి లంకెలు

మార్చు