వింజమూరి రాగసుధ

వింజమూరి రాగసుధ ప్రముఖ రచయిత్రి, నాట్యకారిణి. ఆమె వ్రాసిన పుస్తకాలు బ్రిటిష్ గడ్డమీద తెలుగువారి కీర్తి రెపరెపలాడించానాయి.[1] ఆమె పర్యాటకరంగం బోధకురాలిగా విదేశాల్లో పనిచేస్తున్నారు. ఖండాలు దాటినా తెలుగువారి ఘనతను వెలికితీసే ప్రయ్నతంలోనే నిమగ్నమయ్యారు. బ్రిటిష్‌ లైబ్రరీలో తెలుగుపుస్తకాల జాబితాను పెంచేందుకు నిరుపయోగంగా ఉన్న తాళపత్రగ్రంథాలను పుస్తకాలుగా మార్చేందుకు కృషి చేస్తున్నారు. కామన్‌వెల్త్‌ జర్నలిస్ట్‌గా సామాజిక అంశాలపై రచనలు చేస్తూ మహిళల విజయాలకు ఎల్లలు లేవని చాటుతున్నారు. త్యాగరాయగానసభ నుంచి బ్రిటన్‌ పార్లమెంట్‌ వరకు ఆమె నాట్యానికి వేదికలైనాయి.[2]

వింజమూరి రాగసుధ

జీవిత విశేషాలు

మార్చు

ఆమె వింజమూరి శేషాచార్య, రాఘవకుమారి దంపతులకు జన్మించారు. ఆమె తండ్రి ఖాదీభవన్‌లో అధికారిగా పనిచేశారు. అమ్మ రాఘవకుమారి గృహిణి.ఆమె తండ్రి మానవతావాది. కళలు, సాహిత్యం అంటే ఇష్టపడేవారు.[3] సంగీత, సాహిత్యవేత్తల వారసత్వం ఉండటంతో ఆమెకు నాట్యం నేర్పించాలని ఎనిమిదేళ్లు ఉన్నప్పుడే నాట్యగురువు ఉమారామారావు గారి వద్ద చేర్చారు. ఆయన శిష్యరికంలో నృత్యం ప్రారంభించారు. సంవత్సరాల తరబడి సాగిన సాధనలో ఎన్నో ప్రదర్శనలు ఇచ్చారు. త్యాగరాజ గానసభ, రవీంద్రభారతి, లలితకళానిలయం ఎన్నో మా నాట్యానికి వేదికలయ్యాయి. గురువుగారి ప్రోత్సాహంతో అనేక కొత్తకొత్త కంపోజిషన్స్‌ చేసే అవకాశం ఆమెకు వచ్చింది.

నిజాం కాలేజీలో డిగ్రీ పూర్తి అయిన తర్వాత జర్మనీలో ఉన్నత చదువులు పూర్తిచేశారు. తెలుగు విశ్వవిద్యాలయంలో పర్యాటకం విద్యార్థులకు రెండు సంవత్సరాల పాటు క్లాస్‌లు చెప్పారు. మరో రెండు కాలేజీల్లోనూ టూరిజం డిప్లామా విద్యార్థులకు క్లాస్‌లు తీసుకున్నారు. పర్యాటకం డెవలప్‌మెంట్‌తో ముడిపడి ఉన్న అభివృద్ధి గురించి తెలిస్తే మంచిది. అందుకే పర్యాటకం క్లాస్‌లు చెప్పడం ఆమెకు ఎంతో ఇష్టం. ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అసోసియేషన్‌ కన్సల్టెంట్‌గా అనేక దేశాలకు వెళ్ళారు.[4]

మహారాష్ట్రకు చెందిన సుశీల్‌తో పెళ్ళి కావడంతో ఆయనతో పాటు లండన్‌ వెళ్లారు. అక్కడకు వెళ్లిన తర్వాత డ్యాన్సర్స్‌గా ప్రదర్శనలు ఇస్తూ..లండన్‌లోని సుందర్లాండ్‌ విశ్వవిద్యాలయంలో పర్యాటకం ఫ్యాకల్టీగా పనిచేస్తున్నారు. వారి కుమార్తె కావ్యఝరి. అక్కడ స్థిరపడిన తెలుగు వారి పిల్లలకు భరతనాట్యం నేర్పించేందుకు 'సంస్కృతి' పేరుతో ఒక సంస్థను ప్రారంభించారు. లండన్‌లో తెలుగువారికోసం ‘సంస్కృతి సెంటర్ ఫర్ కల్చరల్’ సంస్థను స్థాపించి తన వంతు సాంస్కృతిక కళాసేవను అందరికీ అందిస్తున్నారు.[5]

జర్నలిస్టుగా

మార్చు

పర్యాటకం పాఠాల బోధన, నాట్యసాధనతో పాటు జర్నలిజం కూడా ఆమెకు ఎంతో ఇష్టమైనది. కామన్‌వెల్త్‌ జర్నలిస్ట్‌గా ఆమె పనిచేస్తున్నారు. కామనెవెల్త్‌ జర్నలిస్ట్‌ అసోషియేషన్‌లో సభ్యురాలిగా ఉన్నారు. లండన్‌లో ప్రచురితమయ్యే 'ఏషియన్‌ లైట్స్‌లో కల్చరల్‌ వింగ్‌' ఎడిటర్‌గా ఐదు సంవత్సరాల నుంచి ఉన్నారు. మరో రెండు పత్రికలకు ఫ్రీలాన్స్‌గా రాస్తుంటారామె. 1830 సంవత్సరంలోనే బ్రిటన్‌లో తెలుగుభాష ఉందన్న విషయం తెలిసి.. దానిపై సంవత్సరానికి పైగా పరిశోధన చేసి రాసిన వ్యాసం మారిషస్‌ పత్రికలో ప్రచురితమైంది. దాన్నే ప్రపంచ తెలుగు మహాసభల ప్రత్యేక సంచిక 2012లో ' తెల్లదొరలు - తొలి తెలుగు చిగురులు' పేరుతో తెలుగులో ప్రచురించారు. 160దేశాల్లో అనేక అంశాలపై నేను రిపోర్ట్‌ చేస్తుంటారామె.

బ్రిటిష్ పార్లమెంటులో రామానుజాచార్యుల శతకం

మార్చు

జగద్గురువు రామానుజాచార్యుల జీవిత చరిత్రను ఇల్లందుల రామానుజాచార్య మూడువందల సం.ల క్రితం తాళపత్రాలపై రాసి బ్రిటిష్ లైబ్రరీలో పొందుపరిచి వుంచారు. వాటిని యధావిధిగా పుస్తక రూపంలోనికి ఆమె తీసుకొని వచ్చారు. ఈ పుస్తకంలో ప్రతి పద్యం ‘నమో నమో యతిరాజా..’ అంటూ పూర్తవుతుంది. ఇందులో మొత్తం వంద పద్యాలుంటాయి. రామానుజాచార్యులు 999వ జయంతి సందర్భంగా మే 10న బ్రిటిష్ పార్లమెంటులో ఈ పుస్తకాన్ని ఆవిష్కరించనున్నారు. 2017 సం. జగద్గురువు రామానుజాచార్యుల స్వామి సహస్ర జయంతిని ఘనంగా నిర్వహించనున్నారు.[6] 1942 నుంచి బ్రిటిష్‌ లైబ్రరీలో భద్రంగా ఉన్న ఈ సాహిత్యాన్ని ఈ శుభ సందర్భంగా శతక పద్యగ్రంధంగా రూపొందించిన రాగసుధ సంస్కృతి సెంటర్‌ ఫర్‌ కల్చరల్‌ ఎక్సలెన్స్‌ వ్యవస్థాపకురాలు.[7]

పురస్కారాలు

మార్చు

అప్పటి మన రాష్ట్ర రెవెన్యూ మంత్రి ధర్మానప్రసాదరావు చేతులమీదుగా ఈ పురస్కారం అందుకోవడం తనకు చాలా ఆనందాన్నిచ్చిందంటారు ఆమె. ఇండో-శ్రీలంక కల్చరల్‌ కౌన్సిల్‌ వారిచే ‘అవుట్‌ స్టాండింగ్‌ యంగ్‌ పెర్ఫార్మెర్‌’గా పురస్కారం పొందారు. అలాగే భారతీయ కళాసమితి వారిచే అభినయ ప్రవీణ పురస్కారం అందుకున్నారు. ఆమె 2021లో నృత్యంలో విశేష కృషి చేసినందుకుగాను బ్రిటన్ ప్రభుత్వం బ్రిటిష్ సిటిజన్ అవార్డు(బీసీఏ)తో సత్కరించింది.[8][9]

మూలాలు

మార్చు
  1. బ్రిటిష్ గడ్డమీద తెలుగువారి కీర్తి రెపరెపలాడించానా వింజమూరి రాగసుధ పుస్తకాలు[permanent dead link]
  2. నాట్య వార‌ధి
  3. వికసిత రాగసుధా భరితం September 2, 2011[permanent dead link]
  4. నాట్య వార‌ధి - నవ తెలంగానలో
  5. "బ్రిటిష్ పార్లమెంటులో రామానుజాచార్యుల శతకం Published Saturday, 13 February 2016". Archived from the original on 14 ఫిబ్రవరి 2013. Retrieved 8 మార్చి 2016.
  6. "తెలుగు తాళపత్ర గ్రంథాలకు కొత్త రూపు...త్వరలో బ్రిటన్‌లో ఆవిష్కరణ 14-02-2016 11:54:45". Archived from the original on 2016-02-15. Retrieved 2016-03-08.
  7. "బ్రిటీష్‌ పార్లమెంటులో రామానుజ జయంతి". Archived from the original on 2016-02-14. Retrieved 2016-03-08.
  8. Andrajyothy (3 October 2021). "తెలుగు నృత్య కళాకారిణికి బ్రిటన్‌లో అపూర్వ పురస్కారం..!". Archived from the original on 3 అక్టోబరు 2021. Retrieved 3 October 2021.
  9. Andrajyothy (3 October 2021). "తెలుగు నృత్యకళాకారిణికి ప్రతిష్ఠాత్మక British Citizen Award". Archived from the original on 3 అక్టోబరు 2021. Retrieved 3 October 2021.

ఇతర లింకులు

మార్చు