వికీపీడియా:ఆంధ్రప్రదేశ్ లింకు వ్యాసాల అభివృద్ధి/AP districts reorg - 2022/Initial implementation experiences on Bapatla district by Arjunaraoc

ప్రధాన విషయంలో చివరి సవరణ తేది: 2022-05-04T09:24:17(IST)
రచయిత: Arjunaraoc


ఆంధ్రప్రదేశ్ జిల్లాల పునర్వ్యవస్థీకరణ 2022 ఏప్రిల్ 4 న అమలులోకి వచ్చింది. దీనికి సంబంధించి జిల్లా పేజీల సవరణలు, సంబంధిత కొత్త జిల్లా పేజీల సృష్టి విస్తరణ లో భాగంగా బాపట్ల జిల్లా పై కృషి 2022 ఏప్రిల్ 24 కి చాలావరకు పూర్తయింది. ఈ కృషిలో సింహభాగం నేను చేశాను. ఈ సందర్భంలో కలిగిన అనుభవాలను పంచుకోవడమే ఈ వ్యాసం ఉద్దేశ్యం. మరిన్ని వివరాలకు వికీపీడియా:ఆంధ్రప్రదేశ్ లింకు వ్యాసాల అభివృద్ధి, ఆ వ్యాసం చర్చాపేజీ చూడండి.

 • జిల్లా వ్యాసాలలో 2022 ఏప్రిల్ 26 నాటికి కనీసం ఐదు మార్పులు చేసిన సభ్యులు తెవికీలో 6 కాగా, ఆంగ్ల వికీలో 27మంది వున్నారు.
 • కొత్తగా వ్యాసాలు చేర్చినపుడు దోషపూరిత సమాచారం అత్యల్ప స్థాయిలో వుంటుంది. అయితే జిల్లాల పునర్వ్యవస్థీకరణ జరిగినపుడు చాలా సమాచారం వెనువెంటనే దోషపూరితమవుతుంది. ఆంధ్రప్రదేశ్ విషయానికొస్తే 670 మండలాలలో 345 మండలాల జిల్లాలు మారినందున 50 శాతంపై సమాచారం దోషపూరితమైంది. కాని ఏ సమాచారం దోషపూరితమో గుర్తించనందున, దోషాలను సవరించేవరకు, మొత్త సమాచారం దోషపూరితంగానే భావించాలి.
 • ఇటువంటి పరిస్థితి ఆంగ్ల భాష కాని భాషలపై విపరీతమైన ప్రతికూల ప్రభావంచూపుతుంది. నేను ఇటీవల ఒక మధ్యవయస్కుడితో వికీపీడియా గురించి మాట్లాడుతుంటే, వికీపీడియా చూస్తున్నానని, అయితే వికీపీడియాలో అంతా దోషాలే వున్నాయని అన్నారు. అది కాస్త అతిశయోక్తి అనిపించినా, ఈ పరిస్థితులలో కొంతవరకు నిజమేనని ఒప్పకొనవలసిన పరిస్థితి.
 • ఈ పరిస్థితిని ఎదుర్కొనడానికి, ఆంగ్ల వికీపీడియాలో కూడా వికీపీడియా తొలినాళ్లలో ఉపయోగించిన వికీపీడియా ప్రాజెక్టు వ్యవస్థని వాడలేదు. తెలుగులో ప్రయత్నించిన ప్రత్యామ్నాయ విధానానికి సహకారం కొరవడింది.
 • మండలం వ్యాసాలు సులభంగా సరియైన స్థితికి మార్చడానికి, OSM లో మార్పులు, దాని ఆధారంగా, వికీడేటాలో మార్పులు, ఆ తదుపరి, వికీడేటా సమాచారంతో సమాచారపెట్టె మార్పులు కొంతవరకు సహాయంపడింది. బాపట్ల జిల్లా మండలాల వ్యాసాల పాఠ్యంలో కూడా అవసరమైన సవరణలు పూర్తవవగా, ఇతర మండలాల పాఠ్యంలో సవరణలు ఇంకా కొనసాగుతున్నాయి.
 • జిల్లాల పునర్వ్యవస్థీకరణ గురించిన సమగ్ర సమాచారం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం District Statistical Handbook ప్రచురించి, పత్రికల వార్తల ఛాయాచిత్రాలలో చూపించినా అది 2022 ఏప్రిల్ 26 నాటివరకు వెబ్సైట్ లో చేర్చలేదు. దీనిలోని కొన్ని భాగాలు రెండు మూడు కొత్త జిల్లాల వెబ్ సైట్ లో లభ్యమవుతున్నాయి. దీనిని సంపాదిద్దామని ఒక జర్నలిస్టు మిత్రుడు ద్వారా ప్రయత్నించాను. అతను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో పైస్థాయి అధికారితో సంప్రదించితే తెలిసిందేమంటే, ఇంకొక జిల్లా ఏర్పాటు చేసే సూచనలున్నందున, పుస్తకం విడుదల చేయలేదట.
 • ఉమ్మడి జిల్లా వ్యాసంలో పూర్తి సవరణకు, District Statistical Handbook అవసరం కావున ప్రస్తుతానికి, ఉమ్మడి జిల్లా కు సంబంధించిన చరిత్ర, గణాంకాలు లాంటివాటికి ఉమ్మడి లేక విభజన పూర్వపు అనే విశేషణాన్ని చేర్చడం మెరుగు. సంవత్సరాంతంలోపు కొత్త జిల్లాకు సంబంధించి తాజా సమాచారంతో కూడిన పుస్తకం విడుదలవుతుంది కాబట్టి అప్పుడు ఆయా పేరాలు సవరించవచ్చు.
 • గ్రామ వ్యాసాల సవరణలలో ఒకటి రెండు వాక్యాలతో రెవిన్యూయేతర గ్రామాల పేజీలు చాలా గుంటూరు జిల్లా పరిధిలో సృష్టించి ఉండడం గమనించాను. వాటిని అలా వుంచి, వర్గాలు ఏర్పాటు చేయటంతో, వాటిని నిర్వహించే పని క్లిష్టమవుతుంది. వికీపీడియా సుస్థిర నాణ్యతకు ఆయా వివరాలను సంబంధిత మండల వ్యాసాలలో చేర్చటం మెరుగు అయితే ఇప్పటికే వేరు వ్యాసాలుగా వున్నవాటిని, వికీడేటాతో అనుసంధానమైనట్లైతే కొనసాగించడమే మంచిది.
 • వర్గాల పేరులలో "లోని" "సంబంధించిన" అనే పదాలు వాడడం గమనించాను. అవి వాడకపోయినా అర్ధం చెడదు కాబట్టి అవి తొలగించటమే మంచిది.
 • కొన్నిమండలాల పేర్లకు అయోమయ నివృత్తి కొరకు పేరు తరువాత జిల్లా పేరు వాడారు. అటువంటి వాటి పేర్లను కొత్త జిల్లా పేరుతో దారిమళ్లింపు చేయడం, పాత పేరు వాడుకలను, కొత్త పేరుతో సవరించడం చేయాలి. కొత్త పేరులో 'మండలం' తర్వాత జిల్లా పేరు బ్రాకెట్లలో చేర్చడం మెరుగు. పాత పేరులో మండలం అనే పదానికి ముందు జిల్లాపేరు బ్రాకెట్ లో చేర్చడం గమనించాను.
 • గ్రామ వ్యాసాలలో చాలావరకు వికీపీడియా వ్యాస నాణ్యతకు వ్యతిరేకమైనా డైరెక్టరీ లాంటి సమాచారం, వికీపీడీయా శైలిని పాటించని అంశాలు చాలా వున్నాయి. కొత్త వారిని వికీపీడియా వైపుకు ఆకర్షించడానికి గ్రామ వ్యాసాల చేర్చండి లేక సవరించండి అనే ప్రయోగం సత్ఫలితాలనివ్వకపోగా, ప్రాముఖ్యమున్న విషయాలలో కూడా నాణ్యతను భంగపరిచే అటువంటి సమాచారం చేరినట్లు గమనించాను.
 • గ్రామ వ్యాసాలలో మండలం సూచించే దానికి తొలిలో మండలాల వ్యాసాలు సృష్టించనందున, గ్రామం లింకులు చాలావున్నాయి. వాటిన గమనించి లింకులు సవరించాలి.
 • మొబైల్ వీక్షణలలో క్లుప్త వివరణ వికీడేటానుండి చూపబడుతుంది కాబట్టి, ప్రభావితమైన అంశాలకు సంబంధించి వికీడేటాలో సవరణలు చేయాలి.
 • చాలా పనులకు మూల సమాచారం, లేక మార్పులు జరగవలసిన అంశాలను వికీడేటా క్వెరీలతో పొందవచ్చు. వాటిని వాడుకోవడం ద్వారా సవరణపని వేగంగా చేయవచ్చు.
 • పైవికీపీడియాబాట్ ద్వారా regex వాడి జిల్లా పేరు మార్పులు చేసేటప్పుడు, కొన్ని ఊహించని మార్పులు జరిగే అవకాశముంది. వాటిని గమనించి సరిచేయడం లేక దోషంఎక్కువపేజీలలో జరిగితే మరల ఇంకొక regex వాడి దోషాలను సరిదిద్దడం చేయాలి.
ఉదాహరణ regex ప్రయోగం ::pwb.py replace -file:pagestofix.txt -summary:"update district" -regex "\[\[వర్గం:.+? జిల్లా" "[[వర్గం:బాపట్ల జిల్లా" "\{\{.+? జిల్లా" "{{బాపట్ల జిల్లా" "\[\[.+?\]\] జిల్లా\s?కు" "[[బాపట్ల జిల్లా]]కు" "\[\[.+?\]\] జిల్లా\s?లో" "[[బాపట్ల జిల్లా]]లో" "\[\[.+? జిల్లా\]\]" "[[బాపట్ల జిల్లా]]" "గుంటూరు జిల్లా\|గుంటూరు" "బాపట్ల జిల్లా|బాపట్ల" "ప్రకాశం జిల్లా\|ప్రకాశం" "బాపట్ల జిల్లా|బాపట్ల"
 • వర్గాలను మార్చటానికి pwb స్క్రిప్ట్ category ఉపయోగపడుతుంది.
 • నియోజకవర్గాల వ్యాసాలలో సంఖ్యతో కూడిన వివరాలు పాఠ్యంలో, మూసలో వున్నాయి. కొత్త జిల్లాలు చిన్నవైనందున సంఖ్యా వివరాలు పూర్తిగా క్రమంలో వుండవు కావున, ఆ సంఖ్యలను తొలగించాను.
 • పాత జిల్లా పేరు ఇంకా అలానే వున్నదేమో కనుక్కోడానికి శోధన యంత్రంలో deepcat వాడి వెతకండి ఉదాహరణ "గుంటూరు జిల్లా" deepcat:పల్నాడు_జిల్లా_గ్రామాలు. ఆ వెతుకపదాన్ని petscan లో వాడి ఆ పేజీలు పొంది regex వాడి మార్చండి.
 • జిల్లాగ్రామాల వర్గం వృక్షంలో రెవిన్యూయేతర గ్రామాలు స్థాయి అట్టడుగున, రెవిన్యూగ్రామాలు దానికంటె పై స్థాయిలో వున్నాయి. సరైన వర్గ వృక్షానికి ఆ రెండు ఒకే స్థాయిలో వుండేటట్లు చేయాలి.
 • అయోమయ నివృత్తి పేజీలలో జిల్లా పేరు మార్చటం, అంశం లేకపోతే చేర్చటం చేసేటప్పుడు గమనింపులు. petscan తో మొదలు జిల్లా సంబంధిత వ్యాసాలన్ని సేకరించాలి. ఆ తరువాత అయోమయ నివృత్తి మూసకు లింకు వున్నావ్యాసాలకు, ఈ వ్యాసాలు లింకైనవి కనుక్కోవాలి. ( ఉదాహరణ బాపట్ల జిల్లా జాబితా వివరాలకు లింకు) ఆ జాబితాలో నుండి ఒక్కోవ్యాసాన్ని గమనిస్తూ, దానికి గల లింకులలో జిల్లాకు సంబంధించిన అంశాలలో అయోమయ నివృత్తి వ్యాసానికి కాకుండా తగిన వ్యాసానికి లింకులు సరిచేయాలి. అయోమయ నివృత్తి పేజీలో చాలా అంశాలుంటే, ఆయా అయోమయ నివృత్తి వ్యాసం పేరు జిల్లా పేరు తో జిల్లావర్గం పేరు వర్గవృక్షంలో (deepcat:) వెతికితే, పరిశీలించవలసిన వ్యాసాల సంఖ్య తగ్గించుకోవచ్చు. గతంలో విపరీతమైన దోషపూరితమైన లింకులు అయోమయనివృత్తి వ్యాసాలకి వుండడంవలన, గ్రామాలవ్యాసాలలో దగ్గరి గ్రామాలకు కూడా దోషపూరిత అయోమయ నివృత్తి వ్యాసాలకు లింకులుండడం వలన, అయోమయనివృత్తి సవరణలు, మండల వ్యాసాలు, దానిలోని గ్రామ వ్యాసాల లింకులపై ప్రధానంగా ధ్యాస పెట్టాలి. ఆ తరువాత, మండల మూసలు, వ్యక్తుల వ్యాసాలు కాని మిగతా వ్యాసాలపై ధ్యాసపెట్టాలి.