వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2012 15వ వారం

దస్త్రం:Anna Hazare.jpg

అన్నా హజారే గా సుప్రసిద్ధుడయిన కిసాన్ బాబూరావ్ హజారే , ఒక భారతీయ సామాజిక కార్యకర్త, భారతదేశం లోని మహారాష్ట్రలో ఉన్న అహ్మద్‌నగర్‌ జిల్లాలో రాలెగాన్ సిద్ధి గ్రామ అభివృద్ధికి చేసిన తోడ్పాటుకు ఈయన ప్రత్యేక గుర్తింపు పొందారు, దీన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దటానికి తను చేసిన ప్రయత్నాలకు గుర్తుగా 1990 లొ పద్మశ్రీ అవార్డు తోనూ మరియు 1992లో భారత ప్రభుత్వం ఆయనను పద్మ భూషణ్ అవార్డుతో సత్కరించింది. ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతిపై పోరాడేందుకోసం తను చేపట్టిన కృషిలో భాగంగా అన్నా, భారత్‌లో సమాచార హక్కు లక్ష్యం కోసం పాటుపడిన ప్రముఖ వ్యక్తులలో ఒకరిగా నిలిచారు.

5 ఏప్రిల్ 2011 న జనలోక్పాల్ బిల్లుకు పోలినట్లు లోక్పాల్ అవినీతి నిరోధక బిల్లు తేవాలని ప్రభుత్వాన్ని కోరుతూ నిరవధిక నిరాహరదీక్ష చేపట్టాడు. దేశమంతా దీనికి మద్దతులభించింది. 9 ఏప్రిల్ 2011 న ప్రభుత్వము అంగీకరించినతరువాత నిరాహారదీక్ష విరమించాడు. ప్రభుత్వం ఒక పౌరసమాజం ప్రతినిధులు మరియు ప్రభుత్వ ప్రతినిధులతో సంయక్త కమిటీ ఏర్పాటుచేసింది. 2011 సంవత్సరానికి విదేశవిధానాల పత్రిక ప్రపంచంలో 100 మేధావేత్తలలో ఒకరిగా నిర్ణయించింది.అదే సంవత్సరంలో ముంబైలో అత్యంత ప్రభావశీలిగా డిఎన్ఎ పత్రిక గుర్తించింది. అతని న్యాయ నిర్ణయంలో నియంతృత్వ ధోరణులు (ఉదా అవినీతి ఉద్యోగస్తులను వురితీయాలనడం, కుటుంబ సంక్షేమానికి బలవంతపు గర్భనిరోధకఆపరేషన్ల అమలుపరచాలనటం) విమర్శలకు లోనయ్యాయి.(ఇంకా…)