వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2013 11వ వారం
ఉస్మానియా విశ్వవిద్యాలయము
ఉస్మానియా విశ్వవిద్యాలయము ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజధాని హైదరాబాదు నగరములోని ప్రధాన విశ్వవిద్యాలయం. ఎందరో విద్యావేత్తలను, శాస్త్రవేత్తలను, మేధావులను రూపొందించిన ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగునాట ఏర్పాటుచేసిన ప్రప్రథమ విశ్వవిద్యాలయం ప్రస్తుత ఆబిడ్స్ ప్రాంతంలో ఒక అద్దె భవనంలో తరగతులు ప్రారంభించగా, 1939లో ప్రస్తుత ఆర్ట్స్ కళాశాల భవనం నిర్మించబడింది. 1919లో కేవలం ఇంటర్మీడియట్ తరగతులలో ప్రారంభమవగా, 1921 నాటికి డిగ్రీ, 1923 నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ తరగతులు ప్రారంభమయ్యాయి. ప్రారంభ సమయంలో ఉర్దూ బోధనా భాషగా ఉండగా, స్వాతంత్ర్యానంతరం 1948 నుంచి ఆంగ్లం బోధనా బాషగా మారింది.
(ఇంకా…)