వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2013 12వ వారం
ఆంధ్ర క్షత్రియులు
క్షత్రియులు ఆంధ్రప్రదేశ్‌లోనే కాక భారతదేశంలో అన్ని ప్రాంతాలలోనూ వున్నారు. ఆంధ్రప్రదేశ్ లోన్న క్షత్రియుల్ని ఆంధ్ర క్షత్రియులు (లేక ) క్షత్రియ రాజులు (లేక) రాజులు (లేక) క్షత్రియులు అని అంటారు. వీరి భాష ప్రధానంగా తెలుగు. వీరి పేరుల్లో చివర 'రాజు' లేక 'వర్మ' అని ఉంటుంది. ఇతర కులాల వారి పేర్ల చివర 'రాజు' అని వున్నా వారు జన్మతరహా క్షత్రియ జాతికి చెందినవారు కారు. సూర్యవంశానికి మరియు చంద్రవంశానికి చెందిన వీరు ఆంధ్ర ఇక్ష్వాకులు, తూర్పు చాళుక్య, చాళుక్య-చోళ, విష్ణుకుండిన, గజపతి, చాగి, పరిచెద, కాకతీయ, హోయసాల మరియూ ధరణి కోట రాజుల వంశస్తులు. ఆంద్ర క్షత్రియులలో కొన్ని రాజస్థాన్ రాజ్ పుట్ తెగలు కూడా కలిసి ఉన్నాయి. ఆంధ్ర ప్రదేశ్ లో కుల విభజన ప్రకారం వీరు ఓ.సి కి చెందుతారు
(ఇంకా…)