వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2013 13వ వారం
పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ( 1610-1693) 17వ శతాబ్దములో కాలజ్ఞాన తత్వాలను భోధించిన యోగి,హేతువాది సంఘ సంస్కర్త. సాక్షాత్ దైవ స్వరూపులు..బ్రహ్మం గారు తన కాలజ్ఞానములో భవిష్యత్తు గురించి చెప్పిన చాలా విషయాలు నిజమయ్యాయి. తీర్థ యాత్రలు చేస్తున్నటువంటి విశ్వబ్రాహ్మణ పుణ్యదంపతులు పరిపూర్ణయాచార్యులు, ప్రకృతాంబల కు కాశీ పట్టణంలో జన్మించి, కర్ణాటక రాష్ట్రం, స్కందగిరి పర్వతసానువులో స్థితమైన పాపాగ్ని మఠ (ప్రస్తుతం ఇది చిక్‌బళ్లాపూర్ జిల్లాలోని కళవారహళ్లిలో ఉన్నది)అధిపతులు వీరభోజయాచార్య, వీరపాపమాంబలవద్ద పెరిగిన శ్రీవీరబ్రహ్మేంద్రస్వామివారు, వైఎస్ఆర్ కడప జిల్లా లోని కందిమల్లాయపల్లి లో చాలాకాలం నివసించి సజీవ సమాధి నిష్ఠనొందారు. వీరబ్రహ్మము గారి వలన ప్రసిధ్ది పొందుట చేత కందిమల్లాయపల్లె తర్వాతి కాలములో బ్రహ్మంగారిమఠంగా ప్రసిద్ధి చెందింది. ప్రపంచం లో ఏ వింత జరిగిన ఇది బ్రహ్మం గారు తన కాలజ్ఞానంలో ఆనాడే చెప్పారు అంటూ ప్రజలు గుర్తుకు తెచ్చుకుంటూ వుంటారు. కాలజ్ఞానం లో చెప్పినవన్నీ పొల్లు పోకుండా ఇప్పటివరకు జరిగాయి.జరుగుతున్నాయి.
(ఇంకా…)