వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2016 31వ వారం

మదురై

మదురై దక్షిణ తమిళనాడులోని ప్రముఖ నగరము. అదే పేరుగల జిల్లాకు కేంద్రము. మదురై ప్రముఖ హిందూ ఆధ్యాత్మిక కేంద్రము. ఇది వైగై నదీ తీరాన ఉంది. తమిళనాడులో మదురై పెద్దనగరాలలో మూడవ శ్రేణిలో ఉంది. 2001 జనాభా గణాంకాలను ప్రకారం మదురై నగర జనాభా 12,00,000. మదురై ప్రపంచంలోని పురాతనకాల నివాస నగరాలలో ఒకటి. మదురై నగరం మదురై జిల్లా కేంద్రంలో పాండ్యులు ముందుగా కొర్కైని రాజధానిగా చేసుకుని పాలించారు. తరువాత పాండ్యులు నెడుంజళియన్ కాలంలో కూడల్ నగరానికి వారి రాజధానిని మార్చుకున్నారు. ఆ నగరమే ప్రస్తుత రాజధాని. మదుర నాయక మహారాజు చేత నిర్మించబడిన మీనాక్షీ కోవెలకు మదురై ప్రసిద్ధి చెంది ఉంది. ద్రవిడ సంప్రదాయాన్ని ప్రతిబింబిస్తున్న మదురై మీనాక్షీ ఆలయం భారతీయుల ప్రముఖ పుణ్యక్షేత్రాలలో ఒకటి. మదురకు కూడలి నగరం, మల్లెల నగరం, ఆలయనగరం, నిద్రించని నగరం మరియు నాలుగు కూడలుల నగరంగా ప్రసిద్ధి కలిగి ఉంది. భారతదేశంలో పర్యటించిన గ్రీకు దూత మెగస్తనీస్ 3వ శతాబ్దంలో మదురై నగరాన్ని గురించి ప్రస్తావించాడు. మౌర్య చక్రవర్తి ప్రధాన మంత్రి కౌటిల్యుడు ఈ నగర ప్రస్తావన చేసాడు. క్రీ. శ 14వ శతాబ్దం ఆరంభంలో తమిళనాడు మరియు కేరళలోని కొన్ని ప్రాంతాలను పాలించిన పాండ్యరాజుల ఆదర్శపాలన మరియు సాంస్కృతిక కేంద్రంగా మదురై విలసిల్లింది. 1311లో పాండ్య సింహాసనం ఢిల్లీ నవాబుల చేతిలో పతనం చేయబడింది. బాబర్ రాజ్యంలోకి చేరిన ఈ నగరం తరువాత బాబర్ సమ్రాజ్యం పతనావస్థకు చేరిన తరువాత 14వ శతాబ్దంలో స్వతంత్రం పొంది విజయనగర సామ్రాజ్యంలో భాగం అయింది.

(ఇంకా…)