వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2022 31వ వారం

ఆర్టికల్ 370 రద్దు

భారత రాజ్యాంగంలోని 370 అధికరణం ప్రకారం జమ్మూ కాశ్మీర్‌కు మంజూరు చేసిన ప్రత్యేక హోదా లేదా పరిమిత స్వయంప్రతిపత్తిని భారత ప్రభుత్వం, 2019 ఆగస్టు 5 న రద్దు చేసింది. దాంతో పాటు, జమ్మూ కాశ్మీరు రాష్ట్ర హోదాను కూడా రద్దు చేసింది. రాష్ట్రాన్ని జమ్మూ కాశ్మీరు, లడఖ్ అనే రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించింది. జమ్మూ కాశ్మీరును శాసనసభ కలిగి ఉండే కేంద్రపాలిత ప్రాంతం గాను (డిల్లీ లాగా), లడఖ్ ను సభ లేని కేంద్రపాలిత ప్రాంతం గానూ ఏర్పాటు చేసింది. ఈ నిర్ణయాన్ని ప్రకటిస్తూనే, భారత ప్రభుత్వం కాశ్మీర్ లోయలో కమ్యూనికేషన్ మార్గాలను కత్తిరించింది. మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీతో సహా పలువురు ప్రముఖ కాశ్మీరీ రాజకీయ నాయకులను అదుపులోకి తీసుకున్నారు. భారతదేశం లోని రాజకీయ పార్టీలలో, అధికార భారతీయ జనతా పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ, ఎఐఎడిఎంకె, తెలుగు దేశం, శివసేనలు ఉపసంహరణకు మద్దతు ఇచ్చాయి. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్, జమ్మూ కాశ్మీర్ పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్, జనతాదళ్ (యునైటెడ్), డిఎంకెలు వ్యతిరేకించాయి. లడఖ్‌ లోని కార్గిల్ ప్రాంతంలోని షియా ముస్లిం ప్రజలు దీని పట్ల నిరసన వ్యక్తం చేశారు; లడఖ్‌ బౌద్ధ సమాజం ఈ నిర్ణయానికి మద్దతు ఇచ్చింది.
(ఇంకా…)