వికీపీడియా:కార్యశాల/హైదరాబాద్/AWB సాంకేతిక కార్యశాల

ఇంకా తేదీలు ఖరారు చేయలేదు ఆటోవికీబ్రౌజరు (AWB) గురించి వాడుకరులకు అవగాహన, శిక్షణ ఇచ్చేందుకు ఈ కార్యశాల నిర్వహించబడుతుంది. ఇందులో ఆటోవికీబ్రౌజరు అప్లికేషన్ సాఫ్ట్‌వేర్‌ను డౌన్‌లోడ్ చేసుకోవటంతో సహా, పలు అంశాలపై ప్రశ్నోత్తరాల కార్యక్రమం ఉంటుంది.

ఆటోవికీబ్రౌజరు

మార్చు

AutoWikiBrowser (AWB అని అంటూంటారు) సెమీ ఆటోమేటెడ్ మీడియావికీ ఎడిటరు. పదేపదే చేసే ఒకే తరహా పనులు తేలిగ్గా చేసేందుకు ఈ ఉపకరణాన్ని తయారు చేసారు. ఆటోవికీబ్రౌజర్ అనేది స్వయంచాలక బాట్ కాదు- ఈ సాఫ్ట్‌వేరును ఉపయోగించి చేసిన పనుల బాధ్యత దాన్ని నడిపిన ఎడిటరుదే. ఇదొక బ్రౌజరు అప్లికేషను. ఒక పేజీలో మార్పుచేర్పులు చేసి భద్రపరచగానే, ఆటోమాటిగ్గా తరువాతి పేజీని తెరిచి పెడుతుంది. ముందే సెట్ చేసి పెట్టిన మార్పుచేర్పులను చేసి, వాడుకరి వాటిని సమీక్షించేందుకు, ఆపై పేజీని భద్రపరచేందుకూ సిద్ధం చేసి పెడుతుంది. దీని ద్వారా ఏదైనా పేజీ లోని వికీలింకులు, టెక్స్టు ఫైలు, వాడుకరి వీక్షణ జాబితా, వాడుకరి రచనలు వగైరాల నుండి పేజీల జాబితా తయారు చేసే వీలుంది. ఈ సాధనం వికీమీడియా ప్రాజెక్టులన్నిటి లోనూ పనిచేస్తుంది, అనేక భాషలలోనూ పనిచేస్తుంది. అంతేకాకుండా, ఇది మీడియావికీ సాఫ్ట్‌వేరు ద్వారా నడిచే అన్ని వెబ్‌సైట్లలో పనిచేయగలదు. కాబట్టి దీని గురించి ప్రతి వికీపీడియన్ తెలుసుకోవటం ప్రయోజనకరం. భద్రతా కారణాల వల్ల, నమోదైన వినియోగదారులు మాత్రమే ఆటోవికీబ్రౌజరును వాడగలరు. నమోదైన వాడుకరులు కూడా తెవికీలో నిర్వాహకుల నుండి అనుమతి పొందాక మాత్రమే వాడగలరు. ఆటోవికీబ్రౌజరును మీ కంప్యూటరులో స్థాపించుకోవాలంటే విండోస్ 10 / విండోస్ 7 ఆపరేటింగు వ్యవస్థ ఉండాలి. ఈ అప్లికేషన్ను నడపాలంటే .NET ఫ్రేమ్‌వర్క్ 4.5 కూడా ఆవశ్యకం.

ప్రదేశం, సమయం

మార్చు

ప్రదేశం - ఆన్లైన్ ( గూగుల్ మీట్ ) ఉపకరణం ద్వారా
తేదీలు - ఆదివారం 25 అక్టోబర్ 2020 లేదా 1 నవంబరు 2020 ( ఖరారు చేయాలి )
సమయం - ఉదయం 10 నుండి మధ్యాహ్నం 12:30 వరకు - భారత కాలమానం

నిర్వహణ

మార్చు

రీసోర్స్ పర్సన్ : చదువరి
ప్రశ్నోత్తరాల సహకారం : వెంకటరమణ ,యర్రా రామారావు
సమన్వయం : కశ్యప్

పాల్గొనే సభ్యులు

మార్చు

కార్యశాల ఇప్పటికే వికీమీడియా ప్రాజెక్టుల్లో పనిచేసిన అనుభవం కలిగిన వారు పాల్గొనవచ్చు. దాదాపు 15 - 20 వికీమీడియన్లు కార్యశాలలో పాల్గొంటారని భావిస్తూన్నాము. పాల్గొనదలిచిన సభ్యులకు వేగమైన ఇంటర్నెట్ డెస్క్టాప్ లాప్ టాప్ కంప్యూటర్ లో ఆటోమేటిక్ వికీ బ్రౌజర్ సిస్టం స్థాపనకు విండోస్ 10 / విండోస్ 7 OS ఉండాలి . ప్రోగ్రామ్‌ను అమలు చేయడానికి .NET ఫ్రేమ్‌వర్క్ 4.5 , గూగుల్ మీట్ అనువర్తనం https://meet.google.com/ అవసరం మరిన్ని వివరాలకు AWB యూసర్ మాన్యువల్ ను ఇక్కడ చూడండి.

పాల్గొన్నవారు

మార్చు

దయచేసి పాల్గొనదలిచిన వికీపీడియన్లు ఈ కింద సంతకం చేయగలరు లేక పాల్గొన్నవారి పేరు చేర్చగలరు meet.google.com కోసం మీ జిమెయిల్ ఐడి కోసం ఇక్కడ మీ జిమెయిల్ వివరాలు ఇవ్వగలరు

కార్యక్రమ సరళి

మార్చు
  • ఆటోవికీబ్రౌజరు పరిచయం
  • స్థాపన
  • ప్రదర్శన
  • ప్రశ్నోత్తరాల కార్యక్రమం