వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/అక్టోబర్ 12
- 1911: భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు విజయ్ మర్చంట్ జననం (మ.1987).
- 1929: సంఘసేవకుడు, దాత, కళాపోషకుడు, విద్యావేత్త రామినేని అయ్యన్న చౌదరి జననం (మ.2000).(చిత్రంలో)
- 1932: జపాన్ కు చెందిన పర్వతారోహకుడు యుషిరో మియురా జననం.
- 1946: భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు అశోక్ మన్కడ్ జననం (మ.2008).
- 1948: ఒక భారతీయ మోడల్, ఒడిస్సీ సాంప్రదాయ భారతీయ నృత్య కళాకారిణి ప్రొతిమా బేడి జననం (మ.1998).
- 1949: తెలుగు కథకుడు పంతుల జోగారావు జననం.
- 1963: భారతీయ అమెరికన్ ఆర్థికవేత్త నారాయణ కొచ్చెర్లకోట జననం.
- 1967: ప్రముఖ సోషలిస్టు నాయకుడు, సిద్ధాంతకర్త రామమనోహర్ లోహియా మరణం (జ.1910).
- 1986: తెలుగు సినిమా నిర్మాత, రచయిత, దర్శకులు పి.ఎస్. రామకృష్ణారావు మరణం (జ.1918).