వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/కొసైన్ సారూప్యత
- కింది వ్యాసాన్ని తొలగించే ప్రతిపాదనపై పూర్తయిపోయిన చర్చ ఇది; నిక్షిప్తం చెయ్యబడింది. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
చర్చా ఫలితం: తొలగించాలి.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 11:09, 18 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
ఈ వ్యాసం అనువాద పరికరం ఇచ్చిన దాన్ని తెచ్చ్చి ఇక్కడ పెట్టేసినట్టుంది. భాష కృతకంగా ఉంది. ఉదాహరణకు:
- ఇది రెండింటికి సాధారణీకరించబడిన అదే వెక్టర్స్ యొక్క అంతర్గత ఉత్పత్తికి సమానం. [అర్థం కావడం లేదు. పైగా "ఉత్పత్తి" అనే మాట ఇక్కడ సరైనది కాదు, ఇక్కడ "లబ్ధం" అనే మాట వాడాలి]
- పొడవు 1 కలిగి ఉంటుంది. [ఇది పై వాక్యంతో కలిసి ఉండాల్సిన వాక్యం. కానీ, విడిగా రాయడంతో అర్థం లేకుండా పోయింది.]
- సున్న డిగ్రీ యొక్క కొసైన్ 1,మరియు ఇది (0, π] రేడియన్లు విరామంలో మధ్య ఉన్న ఏ కొణానికైనా 1 కన్నా తక్కువ ఉంటుంది. ఇది ధోరణి యొక్క తీర్పు మరియు పరిమాణం కాదు [మొదటి వాక్యం కారణమైతే రెండో వాక్యం దాని ఫలితం. కాబట్టి రెండో వాక్యంలో "అందుచేత" అనో "కాబట్టి" అనో మొదలు కావాలి. అలా రాయనందువలన విషయం పట్టు కోల్పోయింది. ఇంకోటి ఈ రెండో వాక్యంలో "మరియు" ఉండడంతో వాక్యం అర్థం మారిపోయి,మూలం లోని అర్థానికి భిన్నమైన అర్థం స్ఫురిస్తోంది. తీర్పును సూచిస్తుంది తప్ప, పరిమాణాన్ని సూచించదు అనే అర్థం రావాల్సి ఉండగా ఇక్కడ రాసినది ఆ అర్థం సూచించడం లేదు.]
ఇలాంటి అనువాద దోషాలు ఇంకా ఉన్నాయి. ఇక "మరియు"లు సరేసరి. తొలగింపు ప్రతిపాదనను సమర్ధిస్తున్నాను. ఒక వారంలోగా సరిచేస్తే సరి, లేదంటే తొలగించాలి. అన్నువాద పరికరం చేసే అనువాదాన్ని తగు మాఅర్పులు చేస్తే తప్ప ప్రచురణకు అనుకూలంగా ఉండదన్న సంగతి ఈ వాడుకరికి తెలియజెప్పాలి. __చదువరి (చర్చ • రచనలు) 02:07, 3 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- ఈ రోజు వరకు విస్తరణపై వాడుకరి నుండి ఎటువంటి స్పందనలు లేనందున తొలగించాలి.--యర్రా రామారావు (చర్చ) 07:00, 17 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- జాగ్రత్త పరచిన సంవాదమే పై చర్చ. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.