వికీపీడియా:దుశ్చర్య
వికీపీడియా సమగ్రతను దెబ్బతీసే విధంగా పేజీల్లో అవాంఛనీయమైన మార్పులు, చేర్పులు, తొలగింపులు చేయడాన్ని దుశ్చర్య అంటారు. పేజీల్లో అసభ్యకరమైన రాతల్ని చేర్చడం, పేజీలో మొత్తం విషయాన్ని తీసివెయ్యడం (వెల్ల వెయ్యడం), ఏ మాత్రం సంబంధం లేని విషయాన్ని చేర్చడం వంటివి సాధారణంగా జరిగే దుశ్చర్యలు.
చేసిన మార్పులు చేర్పులు సరైనవి కాకున్నప్పటికీ, వికీపీడియాను మెరుగుపరచే సత్సంకల్పంతో చేసి ఉంటే అవి దుశ్చర్య కిందకు రావు.
దుశ్చర్యలకు పాల్పడటం వికీపీడియా విధానాలకు వ్యతిరేకం. దుశ్చర్యను గుర్తించాలి, ఎదుర్కొనాలి. మీరు ఎదుర్కొనలేకపోతే, ఇతరుల సహాయం తీసుకొనవచ్చు. ఏదేమైనా, దుశ్చర్యలు జరుగుతూనే ఉంటాయి. మీరేదైనా వ్యాసాన్ని సరిదిద్దబోయే ముందు దాని ఇటీవలి చరితాన్ని చూసి వ్యాసంలో దుశ్చర్యలు ఏమైనా జరిగాయేమో చూడండి. అన్ని దుశ్చర్యలూ స్పష్టంగా కనపడవు. అలాగే వివాదాస్పదమైన మార్పులన్నీ దుశ్చర్యలు కావు; సమాచారం సరైనదో, కాదో, అది దుశ్చర్యో, కాదో నిర్ధారించేందుకు నిశిత పరిశీలన అవసరం.
దుశ్చర్యను ఎదుర్కోవడం
మార్చుమీరు దుశ్చర్యను గమనిస్తే, వెంటనే దాన్ని వెనక్కు తీసుకు వెళ్ళండి. తరువాత పేజీ చరితాన్ని చూసి దుశ్చర్యను పూర్తిగా తొలగించారని నిర్ధారించుకోండి. అలాగే ఆ వ్యక్తికి చెందిన వాడుకరి రచనలు కూడా చూడండి - ఆ వాడుకరి చేసిన మరికొన్ని దుశ్చర్యలు మీకు కనపడవచ్చు.
ఆ తరువాత, సదరు వాడుకరి చర్చా పేజీలో కింది పద్ధతులను అనుసరించి, హెచ్చరికలు పెట్టండి.
హెచ్చరిక మూసలు
మార్చుకింది మూసలను సందర్భాన్ని బట్టి వాడాలి. అన్నీ ఒక వరుసలోనే వాడనవసరం లేదు. ప్రయోగం కాదు, ఉద్దేశ్యపూర్వక దుశ్చర్య అయితే ముందే ప్రయోగం2 లేదా ప్రయోగం3 ను వాడవచ్చు. మూస తరువాత ~~~~ తో సంతకం చెయ్యాలి.
- {{subst:ప్రయోగంIP|}} ~~~~ (ఐ.పి అడ్రసు తో ప్రయోగాలు చేసినపుడు)
[[:]] పేజీలో మీరు చేసిన విధంగా ప్రయోగాలు చెయ్యడం వికీపీడియాలో కొత్తవారికి అవసరం. అయితే దీనికోసం ఇక్కడ ప్రత్యేకమైన ఏర్పాట్లు ఉన్నాయి. మీ ప్రయోగాలు ఈ ప్రయోగశాల లో చేసుకోవచ్చు. మీరు ఎకౌంటు తెరిచి సభ్యులయ్యారనుకోండి, అప్పుడు మీకే ప్రత్యేకించిన ప్రయోగశాల ఉంటుంది. కావలసిన ప్రయోగాలు చేసుకోవచ్చు. వికీపీడియాలో సభ్యుడుగా చేరండి. స్వాగతం.
- {{subst:ప్రయోగం1|}} ~~~~ (ప్రయోగాలు చేస్తున్న కొత్త సభ్యులకు)
[[:]] పేజీలో మీరు చేసిన విధంగా ప్రయోగాలు చెయ్యడం వికీపీడియాలో అవసరం. అయితే ఈ ప్రయోగాలను మీ ప్రయోగశాలలో చెయ్యండి. ఈ విషయంపై మీకు సహాయం కావలిస్తే నా చర్చాపేజీలో రాయండి.
- {{subst:ప్రయోగం2+|}} ~~~~ (వ్యాసంలో చెత్తను చేర్చినపుడు)
- ఈ సందేశం [[:]] పేజీకి సంబంధించింది. దయచేసి అటువంటి అర్థం పర్థం లేని రాతలు రాయవద్దు. అది దుశ్చర్య కిందకి వస్తుంది. మీరు ప్రయోగాలు చెయ్యదలిస్తే, ప్రయోగశాల వాడుకోండి.
- {{subst:ప్రయోగం2-|}} ~~~~ (వ్యాసంలోని విషయాన్ని తీసేసినపుడు)
- ఈ సందేశం [[:]] పేజీకి సంబంధించింది. పేజీలోని విషయాన్ని దయచేసి అలా తీసివెయ్యకండి. అది దుశ్చర్య కిందకి వస్తుంది. మీరు ప్రయోగాలు చెయ్యదలిస్తే, ప్రయోగశాల వాడుకోండి.
- {{subst:ప్రయోగం3|}} ~~~~ (దుశ్చర్యను ఎత్తిచూపుతూ హెచ్చరిక)
- [[:]] పేజీ కి సంబంధించి. దయచేసి ఇక ఆపండి. ఇంకా మీరిలాగే దుశ్చర్యకు పాల్పడితే, వికీపీడియాలో రచనలు చెయ్యకుండా మిమ్మల్ని నిరోధించవలసి ఉంటుంది.
- {{subst:ప్రయోగం4|}} ~~~~ (చివరి హెచ్చరిక)
- [[:]] పేజీకి సంబంధించి మీకిది చివరి హెచ్చరిక. ఈ సారి మీరిలా దుశ్చర్యకు పాల్పడితే మీకు నిరోధం తప్పదు.
ఏ పేజీలో అయితే ఈ ప్రయోగాలు జరిగాయో ఆ పేజీ పేరును మూసలోని "|" తరువాత రాయాలి. పై మూసల్లో subst అనేది చేర్చడం వలన ఒక ఉపయోగం ఉంది: ఈ విధంగా చెయ్యడం వలన మూస లోని విషయాన్ని మీరే స్వయంగా రాసినట్లు ఉంటుంది తప్ప, మూసను తెచ్చి అక్కడ పెట్టినట్లు - {{subst:ప్రయోగంIP}} - ఇలా ఉండదు. అలాగే, ఈ మూసలో కూడా ఎవరైనా దుశ్చర్యకు పాల్పడితే, దాని ప్రభావం అప్పటికే ఆ మూస చేరి ఉన్న పేజీలపై పడదు.
దుష్టుడు మళ్ళీ దాడి చేస్తే, నిర్వాహకుడి సహాయం కోరండి. నిర్వాహకుడు ఆ సభ్యుని నిరోధించి, కింది మూసను ఆ వాడుకరి చర్చా పేజీలో పెడతాడు.
- {{subst:నిరోధించబడ్డారు}}
- దుశ్చర్య కారణంగా వికీపీడియాలో రచనలు చెయ్యకుండా మిమ్మల్ని తాత్కాలికంగా నిరోధించాం. మీరు ప్రయోజనకరమైన రచనలను చెయ్యదలిస్తే, నిరోధం తొలగిపోయిన తరువాత చెయ్యవచ్చు.
ఐ.పి. కూపీ
మార్చుఅలాగే ఐ.పి. ఎక్కడిదో కూపీ లాగండి.
- ARIN (ఉత్తర అమెరికా)
- RIPE (ఐరోపా, మధ్య ప్రాచ్యం, మధ్య ఆసియా)
- APNIC (ఆసియా పసిఫిక్)
- LACNIC (లాటిన్ అమెరికా, కరిబియన్)
- AfriNIC (ఆఫ్రికా)
పై లింకులు వాడి ఐ.పి. ఎవరిదో తెలుసుకోండి. ఆ పేరును దుశ్చర్యకు పాల్పడిన సదరు ఐ.పి. అడ్రసు చర్చా పేజీలో పెట్టండి.
దుశ్చర్యల్లో రకాలు
మార్చువికీపీడియాలో సర్వసాధారణంగా జరిగే దుశ్చర్యలు
- వెల్లవెయ్యడం
- పేజీలోని మొత్తం విషయాన్ని గాని, దాదాపుగా పూర్తిగా గాని తీసేసి, అసభ్యకరమైన వ్యాఖ్య రాయడమనేది ఎక్కువగా జరిగే దుశ్చర్య.
- స్పాము
- సంబంధంలేని బయటి లింకుల్ని వ్యాసాల్లో పెట్టి, వ్యాపార ప్రయోజనాలు పొందజూడటం.
- వాండల్‌బాట్ (దుష్టబాట్)
- వందలాది, వేలాది పేజీలలో సామూహికంగా దుశ్చర్యలకు పాల్పడే రోబోలు ఈ కోవలోకి వస్తాయి. ఇంకో రకం దుష్ట బాట్లు రకరకాల పేర్లతో లాగిన్ అయి ఒక వ్యాసంలో దుశ్చర్యలకు పాల్పడతాయి.
- పిల్ల చేష్టలు
- గ్రాఫిటీని చేర్చడం, పేజీలను ఖాళీ చెయ్యడం, ఈ కోవలోకి వస్తాయి.
- వెర్రి చేష్టలు
- కొంతమంది సభ్యులు వెర్రి మొర్రి జోకులతో వ్యాసాలు రాస్తారు, లేదా ఉన్న వ్యాసాలను తొలగించి ఇలాంటి చెత్తను పెడతారు, లేదా ఉన్న వ్యాసాలకు కుళ్ళు జోకులు చేరుస్తారు. ఇలాంటివన్నీ ఈ కోవలోకి వస్తాయి.
- చాటుమాటు దుశ్చర్య
- అంత తేలిగ్గా కనుక్కోగలిగేది కాదీ దుశ్చర్య. తప్పుడు సమాచారాన్ని చేర్చడం, తేదీలను మార్చడం వంటివి ఈ రకం కిందకు వస్తాయి.
- గుర్తింపు కోసం దుశ్చర్య
- బూతులు, తిట్లు రాయడం, వెక్కిరింపు ధోరణితో ఉన్న పేర్లు పెట్టుకోవడం, జోకులతో వ్యాసాలను మార్చెయ్యడం ఈ కోవలోకి వస్తాయి.
- సభ్యుడి పేజీలో దుశ్చర్య
- సభ్యుల పేజీలను తిట్లు, బూతులతో మార్చెయ్యడం.
- బొమ్మల దుశ్చర్య
- రెచ్చగొట్టే బొమ్మలు, రాజకీయ పరమైన నినాదాలు, GIF యానిమేషన్లు, మొదలైన వాటిని అప్‌లోడు చెయ్యడం. బొమ్మలకు కాపీహక్కుల సమాచారం లేకుండా అప్‌లోడు చెయ్యరాదని చెప్పిన తరువాత కూడా అటువంటి బొమ్మలని అప్‌లోడు చెయ్యడం కూడా దుశ్చర్య కిందకు వస్తుంది.
- ట్యాగుల దుర్వినియోగం
- దురాలోచనతో అవసరం లేకపోయినా త్వరగా తొలగించాలనే ట్యాగులు పెట్టడం, సంరక్షించబడిందనే ట్యాగులు పెట్టడం ఈ రకానికి చెందుతాయి.
- మూసల దుశ్చర్య
- పై దుశ్చర్యలను మూసల్లో చెయ్యడం.
- పేజీ తరలింపు దుశ్చర్య
- పేజీలను పిచ్చిపిచ్చి పేర్లకు తరలించడం.
- దారిమార్పు దుశ్చర్య
- వ్యాసాలను రెచ్చగొట్టే తరహాలో ఉన్న పేజీలకు లేదా బొమ్మలకు దారిమార్పు చెయ్యడం.
- లింకుల దుశ్చర్య
- లింకులను పైకి కనపడకుండా మార్చి, తప్పుడు గమ్యాలకు చూపెట్టడం.
- తప్పించుకోజూసే దుశ్చర్య
- తొలగింపు ట్యాగు పెట్టిన వ్యాసాల్లో నుండి ఆ ట్యాగును తొలగించి, తొలగింపు నుండి తప్పించుకోజూసే దుశ్చర్య ఇది.
- హెచ్చరికలను తొలగించడం
- చర్చా పేజీల్లో పెట్టిన దుశ్చర్యల హెచ్చరికలను తొలగించడం కూడా దుశ్చర్య కిందకే వస్తుంది.
- పిచ్చి రాతలు
- పేజీలో ఉన్న సమాచారాన్ని తీసేసి, "బైదనెజాహిక్సూలైమోఫకీవ్వం" వంటి పిచ్చి రాతలు చేర్చడం.
- సభ్యుల వ్యాఖ్యలను మార్చడం
- సభ్యులు సంతకం పెట్టి మరీ రాసిన వ్యాఖ్యలను విపరీతార్థాలు వచ్చే విధంగా మార్చడం. అయితే వ్యక్తిగతమైన ఆరోపణలతో చేసిన దాడిని తొలగించడం దుశ్చర్య కిందకు రాదు. సంతకం లేని వ్యాఖ్యను ఎత్తి చూపడం కూడా దుశ్చర్య కిందకు రాదు.
- వివాదం టాగుల తొలగింపు
- వివాదం టాగులు పెట్టడం వలన ఆ వ్యాసం వివాదాస్పదమైనదని ప్రజలకు తెలుస్తుంది. వివాదం పరిష్కారమైన తరువాతే దాన్ని తీసివెయ్యాలి. ఆ విషయం నిర్ధారించుకున్నాకే దాన్ని తీసివెయ్యండి.
- చర్చా పేజీ దుశ్చర్య
- వ్యాసాల చర్చా పేజీల్లో వాడుకరుల వ్యాఖ్యలను, మొత్తం విభాగాన్ని తొలగించడం ఈ కోవలోకి వస్తుంది. వ్యక్తిగత విమర్శలను తొలగించడం దుశ్చర్య కాదు. బాగా పెరిగిపోయిన చర్చా పేజీలో కొంత భాగాన్ని నిక్షేపితం చేసి, ఆ భాగాన్ని ప్రస్తుతపేజీ నుండి తొలగించడం దుశ్చర్య కిందకు రాదు. అయితే ఇది సభ్యుల చర్చా పేజీకి వర్తించదు. తమ చర్చా పేజీలలో ఉన్న వ్యాఖ్యలను తొలగించే అధికారం పూర్తిగా సదరు సభ్యులదే.
- ఆధికారిక విధానంపై దుశ్చర్య
- తనకంగీకారం కాని వికీపీడియా విధానాన్ని ఏ చర్చా, ఏకాభిప్రాయమూ లేకుండా తొలగించడం ఈ దుశ్చర్య కిందకు వస్తుంది. విధానాన్ని మరింత అర్ధమయ్యేందుకు చేసే భాషాపరమైన మార్పులు దుశ్చర్య కాదు.
- కాపీహక్కుల దుశ్చర్య
- తెలిసి తెలిసీ కాపీహక్కులు లేని విషయాలను వ్యాసాలలో చేర్చడం ఈ కోవ లోకి వస్తుంది. కాపీహక్కులకు సంబంధించి వికీపీడియా విధానం తెలియక చేస్తే ఆ పని దుశ్చర్య కిందకు రాదు. అయితే మరోసారి అటువంటిది జరిగితే మాత్రం అది దుశ్చర్యగానే భావించబడుతుంది.
- కొత్త ఎకౌంట్ల దుశ్చర్య
- రెచ్చగొట్టే తరహాలో ఉన్న పేర్లతో కొత్త ఎకౌంట్లు సృష్టించడం దుశ్చర్యగా భావిస్తారు. ఆ ఎకౌంటు వాడకున్నా అది దుశ్చర్యే.
దుశ్చర్యలు కానివి
మార్చుఒక్కోసారి దుశ్చర్యగా భావించినప్పటికీ, కింది అంశాలు దుశ్చర్య పరిధిలోకి రావు. వీటితో వేరే విధంగా వ్యవహరించాలి:
- కొత్తవారి ప్రయోగాలు
- కొత్తవారు మార్చు లింకు గమనించి, తాము నిజంగా మార్చగలమా అనే ఉత్సుకతతో పేజిలో ఏదో ఒకటి రాసి, ప్రయోగం చేస్తారు. ఇది దుశ్చర్య కాదు. వీరిని మర్యాదగా ఆహ్వానించి, ప్రయోగశాల గురించి చెప్పి అక్కడ ప్రయోగాలు చేసుకోవచ్చని చెప్పాలి.
- వికీ మార్కప్ ను, శైలిని నేర్చుకోవడం
- వికీ మార్కప్‌ను, శైలిని నేర్చుకోవడానికి కొంత మందికి కాస్త సమయం పడుతుంది. వారు వివిధ ప్రయోగాలు చేస్తూ ఉంటారు. ఇది దుశ్చర్య కాదు. వారి అనుమానాలను తీర్చి, సంబంధిత సమాచారం అందించే పేజీలను చూపెట్టాలి.
- తటస్థ దృక్కోణం అతిక్రమణ
- ఈ తటస్థ దృక్కోణం అనేది మనకు తొందరగా అర్థమయ్యే విధానం కాదు. బాగా అనుభవశాలురు కూడా దీన్ని అతిక్రమిస్తూ ఉంటారు. ఇది తప్పైనప్పటికీ దుశ్చర్య కాదు.
- చొరవ చెయ్యడం
- వ్యాసాలను మెరుగుపరచే ఉద్దేశ్యంతో కొందరు సమూలంగా మార్పులు చేసేస్తూ ఉంటారు. వాళ్ళు చొరవ తీసుకుని మార్పులు చేస్తున్నారే తప్ప దురాలోచనతో కాదు. అంచేత ఇది దుశ్చర్య కాదు.
- పొరపాట్లు
- కొన్నిసార్లు తప్పు సమాచారాన్ని సరైనదిగా భావించి, రాయడం జరుగుతుంది. సమాచారం తప్పుదే అయినా, పని సదుద్దేశంతో చేసేదే గాబట్టి అది దుశ్చర్య కాదు. ఆ సమాచారం తప్పని మీరు నిర్ధారించుకుంటే, ఆ విషయాన్ని తెలియజేసి చర్చించండి.
- మొండితనం, మూర్ఖత్వం
- కొంతమంది, ఇతరులు చెప్పేదాన్ని అంత తొందరగా ఒప్పుకోరు. ప్రపంచం మొత్తాన్ని ఎదిరించి మరీ దిద్దుబాట్లు చేస్తూంటారు. ఇది సరైన పద్ధతి కానప్పటికీ దుశ్చర్య కాదు. వివాద పరిష్కార విధానాల ద్వారా దీన్ని పరిష్కరించుకోవాలి.
- వేధింపు లేదా వ్యక్తిగతమైన దాడి
- ఇతర సభ్యులను వేధించరాదనే నిబంధన వికీపీడియాలో ఉంది. సభ్యుని పేజీని చెడగొట్టడం వంటివి దుశ్చర్యలే. కాని ప్రతి వేధింపూ దుశ్చర్య కాదు.
- ప్రహసనాలు
- వికీపీడియా ఎలా పనిచేస్తుందో చూసేందుకు ప్రహసనాలతో దాన్ని చెడగొట్టకండి. వికీపీడియా ఎంత పకడ్బందీగా పనిచేస్తుందో చూడాలంటే ఇప్పటికే ఉన్న తప్పుల్ని గమనించి వాటిని సవరించడానికి ఎంత కాలం పట్టిందో పరిశీలించండి. (వీలైతే మీరే సరిదిద్దండి)
దుశ్చర్యను గుర్తించడం ఎలా?
మార్చుఇటీవలి మార్పులను గమనిస్తూ ఉండటం ఉత్తమమైన పద్ధతి. దుశ్చర్యను గమనించగానే వెంటనే ఆ పేజీని పూర్వపు కూర్పుకు తీసుకువెళ్ళండి.
నేను వ్యాసాన్ని చెడగొట్టినట్లు తెలిపారు, కాని నేను అలా చేయలేదు! ఇప్పుడుఏమి చేయాలి?
మార్చుమీరు వ్యాసాన్ని చెడగొట్టినట్లు సందేశం వచ్చి వుంటే, కాని మీరు అలా చేయకపోతే మీరు చేసిన మార్పు దుశ్చర్య కానప్పటికీ వికీపీడియా విధానాలకి సరిపోలనిదయ్యుండవచ్చు. ఇప్పుడుఏమి చేయాలి. ప్రత్యేకంగా తటస్థ దృక్కోణం విధానంపై ధ్యాస పెట్టండి.
మీరు వాడుతున్న ఐపి చిరునామా వికీపీడియాలో దుశ్చర్యలను చేస్తున్నట్లుగా కనుగొని వుండవచ్చు. సందేహమొచ్చినప్పుడు, మీకు సందేశమిచ్చిన వ్యక్తిని సంప్రదించండి. మీరు ఎఒఎల్(AOL) వాడుకరి ఐతే, వికీపీడియా సాధారణ వాడుకరిని, దుశ్చర్యలకు పాల్పడే వాడుకరిని వేరుచేయలేదు. మీరు ఖాతా తెరిచి మార్పులు చేస్తే మీకు ఇబ్బంది వుండదు.
సంబంధిత పేజీలు
మార్చు
ఇంకా చూడండి
మార్చు- వికీపీడియా:దుశ్చర్య కొనసాగుతోంది - రిపోర్టు చెయ్యండి
- వికీపీడియా:దుశ్చర్యకు వ్యతిరేకంగా నిర్వాహకుని జోక్యం - స్పష్టంగా తెలిసిపోయే కేసుల్లో త్వరిత చర్యకొరకు
- వికీపీడియా:ప్రయోగ మూసలు - ఈ మూసలను సభ్యుల చర్చా పేజీల్లో వాడవచ్చు
- వికీపీడియా:దుశ్చర్య వ్యతిరేక జట్టు
- వికీపీడియా:త్వరిత తొలగింపులు
- వికీపీడియా:దిద్దుబాటు యుద్ధం