వికీపీడియా:నిరోధ విధానం

దుశ్చర్యలను, వ్యక్తిగత దాడులను, దుష్టబాట్లను, అసభ్యమైన వాడుకరిపేరులను ఎదుర్కొనేందుకు నిరోధం ను వాడతారు. నిషేధాలను అమలు చేసే సాంకేతిక విధానం కూడా నిరోధమే. నిరోధాలు మూడు రకాలు:

  • వాడుకరిపేరు - ఒక వ్యక్తికి సంబంధించినది.
  • ఐ.పి.అడ్రసులు - ఆ అడ్రసును వాడుకునే సభ్యులందరూ నిరోధానికి గురవుతారు.
  • ఐ.పి.శ్రేణులు: వందల, వేల మంది నిరోధానికి గురయ్యే అవకాశముంది.

పై నిరోధాలను ఎంతకాలానికైనా అమలుచేసే సాంకేతికత నిర్వాహకులకు అందుబాటులో ఉంది. కాని, ఆ నిరోధాలు నిరోధ విధానాన్ని అనుసరించి జరగాలి.

వాడుకరులు తమ నిరోధ అభ్యర్ధనలను వికీపీడియా:నిర్వాహకుల నోటీసు బోర్డు లేదా వికీపీడియా:దుశ్చర్యపై నిర్వాహకుడి జోక్యం లో సాక్ష్యాలు చూపుతూ నమోదు చెయ్యాలి. అంత మాత్రాన నిరోధించి తీరాల్సిన అవసరం నిర్వాహకులకు లేదు.

నిరోధాలను ఎప్పుడు వాడవచ్చు

మార్చు

దుశ్చర్యలను ఎదుర్కొనేటపుడు, నిషేధాలను అమలు జరిపేటపుడు నిరోధాలను వాడతారు. అరుదైన కొన్ని ఇతర సందర్భాలలో కూడా నిరోధాలను వాడవచ్చు. ఆ జాబితా కింద ఉంది. ప్రత్యేకించి ఇక్కడ చూపించినవి కాక మిగిలిన కేసుల్లో నిరోధం 24 గంటలు ఉండాలి.

దుశ్చర్య

మార్చు

ఐ.పి.అడ్రసులు అడ్డం పెట్టుకుని వికీపీడియాలో దుశ్చర్యలు చేసే సందర్భాలలో, నిర్వాహకులు తమ విచక్షణను అనుసరించి ఆ అడ్రసులను నిరోధించవచ్చు. డైనమిక్ ఐ.పి.అడ్రసులకు (ఎప్పటికప్పుడు మారేవి) వ్యవధి 24 గంటల వరకు ఉండవచ్చు. స్థిర ఐ.పి.అడ్రసులకు, తొలి వడ్డింపు 24 గంటలు ఉండవచ్చు. పదే పదే దుశ్చర్యలు చేసే వారిని గరిష్టంగా ఒక నెల వరకు నిరోధించవచ్చు; వ్యవధి ఎన్నాళ్ళుండాలనే విషయమై చాలా నియమాలున్నాయి గాని, ఇవేవీ అధీకృత విధానాలు కావు. మామూలుగా, సరదాగా దుశ్చర్యలు చేసేవారిని నిరోధించే ముందు ఒకసారి హెచ్చరించవచ్చు. కావాలని, వికీపీడియాను చెడగొట్టే ఉద్దేశ్యంతో దుశ్చర్యలు చేసేవారికి ఈ హెచ్చరికలు ఇవ్వరు.

దుశ్చర్యలు చెయ్యడమే పనిగా పెట్టుకుని, లాగిన్ అయి మరీ చేసే సభ్యులను కూడా ఈ వ్యవధికి నిరోధించవచ్చు. అయితే, దుశ్చర్యలు చేస్తూ, పనిలో పనిగా కొన్ని మంచి దిద్దుబాట్లు చేసే వాళ్ళను ఇలా నిరోధించరాదు.

ఏదో అక్కడక్కడా జరిగే చెదురుమొదురు సంఘటనల్లో నిరోధాలు వాడరాదు.

మితిమీరిన రివర్టులు

మార్చు

మూడు రివర్టుల నియమాన్ని ఉల్లంఘించే వారిని నిరోధించవచ్చు. ఎంతమంది ఉల్లంఘిస్తే అంతమందినీ నిరోధించాలి. అన్ని పక్షాలనూ సమానంగా చూడాలి. నిరోధం సంగతిని తెలియజేస్తూ, నిబంధనను ఉల్లంఘించిన తేడాలకు లింకులిస్తూ సభ్యుడి చర్చా పేజీలో పెడితే ఉపయోగకరంగా ఉంటుంది. ఈ నియమం ప్రకారం నిరోధించబడిన నిర్వాహకులు తమను తాము విడుదల చేసుకోరాదు.

నిషేధాలు

మార్చు

నిషేధించబడ్డ సభ్యులు వికీపీడియాలో రచనలు చెయ్యలేరు. నిషేధాలు కింది కారణాల వలన జరగవచ్చు:

ఏదైనా వాడుకరిపేరు, ఇప్పటికే నిషేధించబడిన వాడుకరి మరో అవతారమని స్పష్టంగా తేలిపోతే దాన్ని కూడా అలాగే నిషేధించవచ్చు. ఈ విషయంపై చర్చ కొరకు ఇంగ్లీషు వికీపీడియా చూడండి. కొత్త అవతారాల పై విధించిన నిషేధాలెపుడు వివాదాస్పద మవుతూ ఉంటాయి.

అజ్ఞాత, బహిరంగ ప్రాక్సీలు

మార్చు

అజ్ఞాత ప్రాక్సీల ఐ.పీ లను చూసిన వెంటనే నిరోధించమని నిర్వాహకులను ప్రోత్సహిస్తున్నాం. కింది లింకులను చూడండి:


అడ్డంకులు

మార్చు

వికీపీడియాను మామూలుగా పనిచేయనీకుండా అడ్డంకులు సృష్టించే వారి ఐ.పి.అడ్రసులను, వాడుకరిపేరులను నిర్వాహకులు తమ విచక్షణను ఉపయోగించి నిరోధించవచ్చు. ఇతర సభ్యులు సంతకంతో సహా చేసిన వ్యాఖ్యలను మార్చడం, తప్పుదారి పట్టించే రచనలు ఉడ్డేశపూర్వకంగా చెయ్యడం, వేధించడం, మితిమీరిన వ్యక్తిగతదాడులు ఈ అడ్డంకుల కోవలోకి వస్తాయి. నిరోధం విధించే ముందు సభ్యుని హెచ్చరించాలి. డైనమిక్ ఐపీ లకు ఈ నిరోధాలు 24 గంటల వ్యవధి ఉండాలి. స్థిర ఐపీలు, వాడుకరిపేర్లకు ముందుగా 24 గంటలతో మొదలుపెట్టి, ఆపై చేసే అతిక్రమణలకు వ్యవధిని పెంచుకుంటూ పోవాలి. ఒక సంవత్సరం కంటే ఎక్కువ కాలం నిరోధించడానికి, మధ్యవర్తిత్వ సంఘ నిర్ణయం అవసరం.

మరీ ఎక్కువగా అడ్డంకులు సృష్టించే కొత్త ఎకౌంట్లను నిర్వాహకులు అమ విచక్షణను ఉపయోగించి, ఎంత వ్యవధికైనా, నిరవధికంగానైనా సరే నిరోధించవచ్చు. వికీపీడియా విధానాలను అతిక్రమించే ఉద్దేశంతో సృష్టించబడిన సాక్‌పపెట్లను నిరవధికంగా నిరోధించాలి. అయితే, మంచి రచనలు చేస్తూ ఉండే సభ్యులను, చెదురుమదురుగా చేసే అడ్డంకుల కారణంగా నిరోధించరాదు.

నిరోధించబడిన సభ్యుల కొత్త అవతారాలు కూడా అలాగే అడ్డంకులు సృష్టిస్తూ ఉంటే, లేదా వారి రచనల ధోరణి అడ్డంకులు సృష్టించే సూచనలను అందిస్తూ ఉంటే కూడా సదరు ఖాతాలను కూడా నిరోధించవచ్చు. దీని కింద విధించిన నిరోధాలు వివాదాస్పదం కావచ్చు.


వాడుకరిపేర్లు

మార్చు

Main article: వికీపీడియా:వాడుకరి పేరు

మా వాడుకరిపేరు విధానం ప్రకారం, రెచ్చగొట్టే విధంగా ఉండేవి, కావాలని తికమకపెట్టేవి, ఇతరత్రా అనుచితమైనవీ అయిన వాడుకరిపేర్లకు అనుమతి లేదు. కొన్ని పరిస్థితులలో అలాంటి వాడుకరిపేర్లు కలిగిన ఖాతాలను నిరోధించవచ్చు.

ఇతర వాడుకరిపేర్లను పోలి ఉండేవిధంగా (ఇంపర్సనేటర్) ఉండే వాడుకరిపేర్లను వెంటనే, నిరవధిక కాలానికి నిరోధించవచ్చు. సదరు సభ్యుల ఐపీఅడ్రసులను ఆటోబ్లాకులో ఉంచాలి. ఇతర సభ్యుల పేర్లను తమ సంతకంలో వాడే ఖాతాలు, ఐపీ అడ్రసులను ముందు హెచ్చరించి, ఆ తరువాత నిరోధించాలి.

నిరోధించేముందు ఆ ఖాతా చెడు తలంపులు కలిగిన ఇంపర్సనేటరని నిర్ధారించుకోండి; కొందరు చెడుతలంపేమీ లేకుండానే ఇతర వాడుకరిపేర్లను పోలి ఉండేవిధంగా తమ వాడుకరిపేరును పెట్టుకోవచ్చు. వాళ్ళ రచనల్లో అలాంటి చెడు తలంపు కనిపించకపోతే, వాడుకరిపేర్ల సారూప్యత వలన కలిగే తికమక గురించి చెప్పి, దాన్ని మార్చుకునేలా వాళ్ళకు నచ్చచెప్పాలి.

నిరోధం తొలగింపు అభ్యర్థన

మార్చు

నిరోధం తొలగింపు అభ్యర్థనలో భాగంగా, నిరోధంలో భాగం కాని వాడుకరులు ఆ నిరోధం గురించి చర్చించవచ్చు, నిరోధం విధించిన నిర్వాహకుణ్ణి తిరిగి పరిశీలించమని కానీ, నిరోధాన్ని తొలగించమని కానీ, లేదా మరికొంత సమాచారాన్ని ఇవ్వమని గానీ అడగవచ్చు. నిరోధం తొలగింపు ఉద్దేశమే మూడవ పక్షం సమీక్ష కాబట్టి నిరోధించిన నిర్వాహకులు వారు నిరోధించిన వాడుకరుల నుంచి నిరోధం తొలగింపు అభ్యర్థనలను అడ్డుకోరాదు. అలానే సంప్రదాయానుసారం నిర్వాహకులు ఒకే నిరోధం గురించి ఒకటికి మించిన అభ్యర్థనలను పరిశీలించరు.

సందేహానికి తావులేని పొరపాట్లు, నిరోధానికి కారణమైన పరిస్థితుల్లో తీవ్రమైన మార్పులు వంటి పరిస్థితుల్లో తప్ప నిర్వాహకులు ఆ వాడుకరిని నిరోధించిన నిర్వాహకునితో చర్చించకుండా నిరోధం తొలగించరాదు. నిరోధించిన నిర్వాహకుడు అందుబాటులో లేకపోవడం కానీ, ఉన్నా నిర్వాహకులు అంగీకారానికి రాకపోవడం కానీ జరిగినట్టైతే నిర్వాహకుల నోటీసుబోర్డులో చర్చించడం మంచిది.

వాడుకరులు నిర్మాణాత్మకమైన కృషిచేస్తామని చెప్పుకుంటున్నా వారి గత చరిత్ర దృష్ట్యా దానిపై అనుమానాలు ఉన్నట్టైతే, రెండవ అవకాశం మూసను ఉపయోగించి వారు ఎలా విజ్ఞాన సర్వస్వానికి కృషిచేస్తారన్నది ప్రదర్శించేందుకు వీలిచ్చే, వారి అన్‌బ్లాక్ రిక్వెస్టును అంగీకరించాలా లేదా అని పరిశీలించవచ్చు.

నిరోధం తొలగింపు అభ్యర్థనపై ఏ వాడుకరి అయినా వ్యాఖ్యానించవచ్చు, కానీ నిర్వాహకులు మాత్రమే అభ్యర్థనను పరిష్కరించాల్సివుంటుంది (తోసిపుచ్చడం కానీ అంగీకరించడం కానీ)