వికీపీడియా:విధానాలు, మార్గదర్శకాలు

వికీపీడియా ఒక సామూహికంగా చేపట్టిన ప్రాజెక్టు. దాని వ్యవస్థాపకులకూ, సమర్పకులకు ఉన్న ఒకే ఒక లక్ష్యం:

విశ్వసనీయమైన స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వాన్ని తయారు చెయ్యడమే— విస్తృతి లోను, లోతు లోను అత్యంత పెద్దదైన సర్వస్వం.

ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి వికీపీడియా కు కొన్ని విధానాలు, మార్గదర్శకాలు ఉన్నాయి. కొన్ని విధానాలు ఇంకా రూపు దిద్దుకొంటుండగా, కొన్ని ఇప్పటికే తయారయి నిర్వివాదంగా పని చేస్తున్నాయి.

విధానాలు ఒక పక్కన రూపు దిద్దుకొంటుండగా, అన్ని రకాల దుశ్చర్యలను అరికట్టడానికి ఈ నియమాలు సరిపోవని కొందరు వికీపీడియనులు భావిస్తున్నారు. ఉదాహరణకు, వికీపీడియా స్ఫూర్తికి విరుద్ధంగా ప్రవర్తించే వారిని - వారు నియమాలను అతిక్రమించక పోయినా - మందలించవచ్చు. సద్బుద్ధితో దిద్దుబాట్లు చేసే వారికి, మర్యాద గా ఉండేవారికి, ఏకాభిప్రాయం కొరకు ప్రయత్నించే వారికి, నిష్పాక్షికమైన సర్వస్వాన్ని తయారు చెయ్యడానికి ప్రయత్నించే వారికి, అనుకూల వాతావరణం ఉండాలి.

వికీ సమాజం లక్ష్యం, కీలక విధానాలు

వికీపీడియా లో రాయడానికి ముందు మీరు ప్రతీ విధానాన్నీ చదవ నవసరం లేదు! అయితే, కింద పేర్కొన్న విధానాలు మాత్రం కనీస అవసరాలు. ఎంత త్వరగా వీటిపై పట్టు సాధిస్తే మీ వికీపీడియా అనుభవం అంత బాగుంటుంది.

  1. వికీపీడియా ఒక విజ్ఞాన సర్వస్వం. ఇదే దాని లక్ష్యం, అంతకు మించి ఇంకేమీ లేదు. మరింత సమాచారం కొరకు ఏది వికీపీడియా కాదు చూడండి.
  2. పక్షపాతం వీడండి. విషయంపై సత్యాలను, వాస్తవాలను వెల్లడిస్తూ నిష్పాక్షిక దృష్టితో వ్యాసాలు రాయాలి.
  3. కాపీహక్కు లను ఉల్లంఘించ వద్దు. వికీపీడియా GNU ఫ్రీ డాక్యుమెంటేషన్‌ లైసెన్సు నిబంధనలకు లోబడి ఉన్న ఒక స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వం. కాపిహక్కులను అతిక్రమించే వ్యాసాలను సమర్పిస్తే, ఉచిత విజ్ఞాన సర్వస్వాన్ని తయారు చెయ్యాలనే మా సంకల్పానికే విరుద్ధం. పైగా అది చట్ట పరమైన వివాదాలకు దారి తీయవచ్చు. మరింత సమాచారానికై కాపీహక్కులు చూడండి.
  4. ఇతర సభ్యులను గౌరవించండి. వికీపీడియా సభ్యులు విభిన్న అభిప్రాయాలు కలిగిన వారు. ఇతరులను గౌరవించడం అనేది ఈ ప్రాజెక్టు విజయానికి కీలకమైనది. కొన్ని మార్గదర్శకాల కొరకు వికీపీడియా సాంప్రదాయం, వికీపీడియా:సంవాద నియమాలు, వికీపీడియా:మర్యాద, వివాద పరిష్కారం చూడండి.

వికీపీడియా రచనల్లో పాటించవలసిన మూడు ప్రాధమిక నియమాలు

పైన వ్రాసిన విధానాలు వికీ సమాజంలో పాటించవలసిన పద్ధతులు. ఇక పోతే వికీ పీడియాలో వ్రాసే విషయ సంగ్రహం మూడు మౌలిక సూత్రాలకు కట్టుబడి ఉండాలి. అంటే ఈ మూడు మౌలిక సూత్రాలూ సభ్యుల అంగీకారం ద్వారా కూడా మార్చడానికి వీలు లేదు. ఆ మూడు సూత్రాలూ ఏమంటే

తటస్థ దృక్కోణం

అన్ని ప్రముఖ దృక్కోణాలను - ప్రధానమైనవి, అంతగా ప్రధానం కానివీ - వ్యాసాలు నిష్పాక్షికంగా ప్రతిబింబించాలి. తేలిగ్గా అపార్ధం చేసుకొనే అవకాశం గల అంశమిది. మన సినిమానటుల అభిమానుల వెబ్‌సైటులను చూస్తే తటస్థ దృక్కోణం కానిదేదో తేలికగా అర్ధం చేసుకోవచ్చును. వికీపీడియా వ్యాసాలు పక్షపాతరహితంగా ఉండేందుకు ఇక్కడి సభ్యులంతా కృషిచేస్తారు. నిష్పాక్షికంగా రాయడానికి సాధన అవసరం. ఎందుకంటే ప్రతి పరిశీలనా ఏదో ఒక కోణం నుండే ఉంటుంది. అటువంటప్పుడు ఒకటి కంటే ఎక్కువ భావాలను, వాదాలను పేర్కొనడం వల్ల తటస్థ దృక్కోణం కొంతవరకు సాధించవచ్చును.

మౌలిక పరిశోధనలు నిషిద్ధం

మీరు సాపేక్ష సిద్ధాంతం తప్పని కనుక్కున్నారా? క్రొత్త గ్రహాన్ని అన్వేషించారా? నన్నయకంటే ముందు భారతాన్ని తెలుగులోకి అనువదించిన కవి ఒకరున్నారని తెలుసుకున్నారా? అభినందనలు. కాని ఆ పరిశోధనా ఫలితాన్ని ప్రచురించడానికి వికీపీడియా తగిన వేదిక కాదు. ఆ శాస్త్రానికి సంబంధించిన జర్నల్‌లోనో, విద్యాలయం పత్రికలోనో, లేదా మీ స్వంత పుస్తకంగానో ప్రచురించండి.

వికీపీడియాలో మౌలిక పరిశోధనా వ్యాసాలకు చోటు లేదు. మీరు రాసేది పరిశోధనా వ్యాసం కాదు అని నిర్ధారించే ఏకైక విధానం - మీరు రాసిన విషయానికి సంబంధించిన విశ్వసనీయ మూలం/వనరు లను ఉదహరించడమే! గతంలో ఏ విశ్వసనీయ వనరులోనూ ప్రచురించబడని వ్యాసాన్ని వికీపీడియాలో మౌలిక పరిశోధనా వ్యాసం అంటారు. ఇంతకు ముందు ప్రచురితం కాని వాదనలు, చర్చలు, భావనలు, డేటా, ఆలోచనలు, ప్రకటనలు, సిద్ధాంతాలు, ఇప్పటికే ప్రచురితమైన విషయాలపై సాగిన కొత్త విషయాలతో కూడిన పరిశోధనాత్మక విశ్లేషణ ఈ కోవలోకి వస్తాయి.

నిర్ధారింప తగినది

వికీపీడియాలో వ్రాసిన విషయం నిజం కావడంతో సరిపోదు. అది నిజమని ఇతరులు నిర్ధారించుకొనేందుకు తగిన అవకాశాలుండాలి. ఆ విషయం మీ ఇంటిలో మీ తాతగారు వ్రాసిన వ్రాతప్రతిలో ఉంటే చాలదు. సాధారణంగా లభించే పత్రిక, పుస్తకం, వెబ్‌సైటు, ప్రభుత్వ బులెటిన్ వంటి ఏదో ఒక సార్వజనీన ఆధారం ఉండాలి.

ఈ మూడు సూత్రాలూ దేనికదే విడివిడిగా కాక, కలిపి ఒకదానికొకటి అనుబంధంగాను, సంయుక్తంగాను చూడాలి. ఈ మూడు విధానాలు కలిసి ఒక వ్యాసపు నాణ్యతను, వికీపీడియా ప్రమాణికతను నిర్ణయిస్తాయి. సభ్యులంతా వీటి గురించి బాగా తెలుసుకొని ఉండాలి. ఈ మూడు నియమాలనూ విచక్షణతో వినియోగించాలి.

ఇతర విధానాలు, మార్గదర్శకాలు

వివిధ విధానాలకు లింకులు కింది వర్గాల లో చూడవచ్చు:

పద్ధతులు

వీటిని పాటించి మరింత సమగ్రమైన, ప్రయోజనకరమైన విజ్ఞాన సర్వస్వాన్ని తయారు చెయ్యగలుగుతున్నాము:

పద్ధతులకు సంబంధిన ప్రశ్నలు

విధానాలను ఎలా నిర్ణయిస్తారు?

వికీపీడియా విధానం చాలావరకు ఇంగ్లీషు వికీ ప్రాజెక్టు ప్రారంభ దశలోనే - 2002 లో - తయారయింది. మార్పులు చేర్పులు - కాస్త కష్టమయినా - విస్తృత అంగీకార పద్ధతి లోనే జరిగాయి.

కింది వర్గాల్లో ప్రతిపాదించిన, తిరస్కరించిన విధానాలు ఉన్నాయి:

వికీపీడియా:విధానాన్ని ఎలా తయారుచెయ్యాలి చూడండి.

విధానాలను ఎలా అమలు పరుస్తారు?

మీరు ఒక వికీపీడియా రచయిత. రోజూ జరిగే వివిధ సమర్పణలు, ఇతర పనులను పర్యవేక్షించడానికి సంపాదకుడు కానీ, ఒక అధికారిక యంత్రాంగం కాని వికీపీడియాలో లేవు. దాని బదులు, సమర్పణలకూ ఆకృతికీ సంబంధించిన సమస్యలు ఏమైనా గమనిస్తే చురుగ్గా ఉండే సభ్యులు అవసరమైన మార్పులు చేస్తారు. కాబట్టి సభ్యులే రచయితలు, వారే సంపాదకులూను.

కాబట్టి సభ్యులే తమలో తాము చర్చించుకుంటూ విధానాలను అమలు చేస్తారు. కొన్ని విధానాలను నిర్వాహకులు తాత్కాలిక నిరోధాల ద్వారా (ముఖ్యంగా దుశ్చర్యలతో వ్యవహరించడం) అమలు చేస్తారు. మరీ తీవ్రమైన కేసుల్లో మధ్యవర్తిత్వ సంఘం జోక్యం చేసుకుని వివాద పరిష్కారం పద్ధతికి అనుగుణంగా ఉత్తర్వులు ఇవ్వవచ్చు.

నియంత్రిత అంశాలు

పేజీల తొలగింపు, పేజీలను సంరక్షించడం వంటి దురుపయోగం కాగల కొన్ని అంశాలు కేవలం నిర్వాహకులకే అందుబాటు లో ఉంటాయి. నిర్వాహకులకు మాత్రమే సంబంధించిన విధానాలు ఇవి:

మార్గదర్శకాల రకాలు

పైన చూపిన విధానలతో పాటు, కింది మార్గదర్శకాలను కూడా వివిధ సభ్యులు సూచించారు:

సాధారణ మార్గదర్శకాలు

మరిన్ని చిట్కాల కొరకు సాధారణ పొరపాట్లను నివారించడం చూడండి.

ప్రవర్తనా నియమావళి

రచనా పాఠానికి సంబంధించిన మార్గదర్శకాలు

శైలి మార్గదర్శకాలు

వ్యాసాలను సమూహం చేసే యుక్తి పై మార్గదర్శకాలు

వికీమీడియా ఫౌండేషన్:సార్వత్రిక ప్రవర్తనా నియమావళి (UCoC)

దయచేసి గమనించండి

  • ఈ విధానాన్ని వికీమీడియా ఫౌండేషన్ ధర్మకర్తల మండలి ఆమోదించారు.
  • సార్వత్రిక ప్రవర్తనా నియమావళి (UCoC) అన్ని వికీమీడియా ప్రాజెక్టులు, ప్రదేశాలకు ఇంకా ఫౌండేషన్ కార్యకలాపాలకు వర్తిస్తుంది.
  • ఈ కంటెంట్ అసలు ఆంగ్ల సంస్కరణ, అనువాదం మధ్య అర్థం లేదా వ్యాఖ్యానంలో ఏవైనా తేడాలు సంభవించినప్పుడు, అసలు ఇంగ్లీష్ సంస్కరణ ప్రామాణికతను సంతరించుకుంటుంది.

సార్వత్రిక ప్రవర్తనా నియమావళి/విధానం

  • ఆంగ్లం: Wikimedia Foundation:Universal Code of Conduct(UCoC):/Policy
    Link https://w.wiki/6tW3
  • తెలుగు అనువాదం: వికీమీడియా ఫౌండేషన్-సార్వత్రిక ప్రవర్తనా నియమావళి/విధానం
    LINK https://w.wiki/9gbo

వికీమీడియా ఫౌండేషన్ విధానం/మార్గదర్శకాల అమలు

  • ఆంగ్లం: Wikimedia Foundation: Universal Code of Conduct(UCoC Policy)/Enforcement guidelines
    Link https://w.wiki/937j
  • తెలుగు అనువాదం - వికీమీడియా_ఫౌండేషన్-సార్వత్రిక ప్రవర్తనా నియమావళి/మార్గదర్శకాల అమలు.
    Link https://w.wiki/9gat