వికీపీడియా:నిర్వాహకుల చురుకుదనపు సమీక్ష

ఆరు నెలల కాలంలో నిర్వాహకులు చేసిన పనులను పరిశీలించి, చురుగ్గా లేని వాడుకరుల తొలగింపును ప్రతిపాదించే పేజీ ఇది. వికీపీడియా:నిర్వాహకత్వ హక్కుల ఉపసంహరణ పేజీలో ఈ విషయమై తెలుగు వికీపీడియా విధానాన్ని నిర్దేశించారు. ఈ విధానం ప్రకారం వాడుకరులెవరైనా తొలగింపు ప్రతిపాదనలు చెయ్యవచ్చు. ఈ ప్రతిపాదనను ఏప్రిల్ మొదటి వారంలోను, అక్టోబరు మొదటి వారంలోనూ చెయ్యవచ్చు. ప్రతిపాదన తేదీకి ముందు ఆరు నెలల కాలంలో సదరు నిర్వాహకులు చేసిన పనులను సమీక్షించాలి. అంటే.. ఏప్రిల్ మొదటి వారంలో చేసే సమీక్ష కోసం అక్టోబరు 1 నుండి తరువాతి సంవత్సరం మార్చి 30 వరకూ ఉన్న కాలంలో చేసిన దిద్దుబాట్లను, అక్టోబరు మొదటి వారంలో చేసే సమీక్ష కోసం ఏప్రిల్ 1 నుండి సెప్టెంబరు 30 వరకూ ఉన్న కాలంలో చేసిన దిద్దుబాట్లనూ పరిగణన లోకి తీసుకోవాలి. అంతకు ముందున్న కాలంలోని పనితీరును పరిగణన లోకి తీసుకోరాదు.

చురుగ్గా లేని నిర్వాహకుల నుండి నిర్వాహకత్వ బాధ్యతలను ఉపసంహరించేందుకు మాత్రమే ఈ పేజీని ఉపయోగించాలి. నిర్వాహకులు స్వచ్ఛందంగా వైదొలగదలచుకుంటే, వారు ఆ విషయాన్ని వికీపీడియా:నిర్వాహకుల నోటీసు బోర్డు వద్ద సముదాయానికి తెలియజేసి, తరువాత స్టీవార్డులను అభ్యర్ధించాలి. దుష్ప్రవర్తన కారణంగా గాని, పనిలో లోపాల వలనగానీ, నిర్వాహకత్వ నిర్ణయాలు చెయ్యడంలో వివేచన లేమి వలన గానీ ఎవరైనా నిర్వాహకుని తొలగించదలచుకుంటే ఆ తొలగింపును వికీపీడియా:తొలగింపు కొరకు నిర్వాహకులు లో ప్రతిపాదించాలి.

ప్రతిపాదించే విధానం

మార్చు

ఏ నిర్వాహకుని చురుకుదనాన్ని సమీక్షించి తొలగింపును ప్రతిపాదించదలచుకున్నారో ఆ నిర్వాహకుని పేరుతో పేజీకి ఒక ఉపపేజీని తయారు చెయ్యాలి. ఉదాహరణకు, "ఫలానానిర్వాహకుడు" అనే నిర్వాహకుని చురుకుదనాన్ని సమీక్షించేందుకు [[వికీపీడియా:నిర్వాహకుల చురుకుదనపు సమీక్ష/ఫలానానిర్వాహకుడు]] అనే ఉపపేజీని తయారుచెయాలి. ఆ పేజీలో సదరు నిర్వాహకుని పనితీరును కింది విధంగా సమీక్షించాలి.

  • నిర్వాహకుని పేరు: [[వాడుకరి:ఫలానానిర్వాహకుడు]]
  • సమీక్షా కాలం: 2019 ఏప్రిల్ 1 నుండి 2019 సెప్టెంబరు 30
  • 2017 అక్టోబరు 1 - 2019 సెప్టెంబరు 30 మధ్య కాలంలో ఈ నిర్వాహకుడు చేసిన రచనలు: 0 కంటే ఎక్కువ. (సున్నా అయితే ఈ సమీక్ష ఇంతటితో ముగిసినట్లే, ఇక ముందుకు పోరాదు. సదరు నిర్వాహకుని నుండి నిర్వాహకత్వ బాధ్యతలను ఉపసంహరించవచ్చు.)
  • 2019 ఏప్రిల్ 1 నుండి 2019 సమీక్షా కాలంలో ఈ నిర్వాహకుడు చేసిన మొత్తం దిద్దుబాట్లు: 0 కంటే ఎక్కువ. (సున్నా అయితే ఈ సమీక్ష ఇంతటితో ముగిసినట్లే, ఇక ముందుకు పోరాదు. సదరు నిర్వాహకుని నుండి నిర్వాహకత్వ బాధ్యతలను ప్రస్తుతానికి ఉపసంహరించరాదు.)
సమీక్షా కాలంలో వీరి గణాంకాలు
  • ఎక్స్‌టూల్స్‌లో వీరి నిర్వాహకత్వ గణాంకాలు:
  • రచ్చబండను మినహాయించి, "వికీపీడియా:" పేరుబరిలో వీరు చేసిన దిద్దుబాట్లు:
  • మూస పేరుబరిలో చేసిన మార్పుచేర్పులు:
  • మొదటిపేజీ నిర్వహణ గణాంకాలు:

పై గణాంకాలు వికీపీడియా:నిర్వాహకత్వ హక్కుల ఉపసంహరణ పేజీలో సూచించిన స్థాయిలో లేనందున, ఆ పేజీలోని నిబంధనలకు లోబడి వీరి నిర్వాహకత్వాన్ని ఉపసంహరించాలని నేను ప్రతిపాదిస్తున్నాను. __~~~~

పై విధంగా పేజీని తయారు చేసి ప్రచురించాలి. ఆ తరువాత కింది పనులు చెయ్యాలి

  1. కింది "ప్రస్తుత ప్రతిపాదనలు" విభాగంలో పై పేజీని ట్రాన్స్‌క్లూడు చెయ్యాలి.
  2. రచ్చబండలో ఈ ప్రతిపాదనను తెలియజెయ్యాలి. (ప్రతిపాదనలో నిర్వాహకుని వాడుకరి పేజీకి లింకు ఇచ్చారు కాబట్టి వారికి తెలియజేసినట్లే)

ఈ ప్రతిపాదనపై వారం పాటు చర్చ జరిగాక, నిర్వాహకులెవరైనా నిర్ణయాన్ని ప్రకటించి, దాన్ని స్టీవార్డులకు తెలియజెయ్యాలి.

నిర్ణయాన్ని ప్రకటించడం

మార్చు

ప్రతిపాదనపై చర్చించేందుకు సముదాయానికి వారం గడువు ఇవ్వాలి. గడువు తర్వాత నిర్వాహకులెవరైనా ఫలితాన్ని ప్రకటించవచ్చు. వోట్ల సంఖ్యను మాత్రమే కాకుండా వాడుకరుల అభిప్రాయాలను కూడా పరిగణన లోకి తీసుకోవాలి. తన నిర్ణయాన్ని తెలుగు ఇంగ్లీషు రెండు భాషల్లోనూ ప్రకటించాలి. పరభాషా స్టీవార్డులు నిర్ణయాన్ని చదూకోడానికి వీలుగా ఉంటుంది.

  • చర్చకు పై భాగాన {{నితొలపైన}} అనే మూసను ఉంచాలి. అడుగున {{నితొలకింద}} అనే మూసను ఉంచాలి.
  • పై మూసలో, చర్చా ఫలితం అనే చోట, నిర్ణయాన్ని రెండు భాషల్లోనూ ప్రకటించాలి. నిర్ణయం పక్కన సంతకం పెట్టాలి.


ప్రస్తుత ప్రతిపాదనలు

మార్చు

ప్రతిపాదన చేసిన వెంటనే ఆ ప్రతిపాదన పేజీని ఇక్కడ కింది విధంగా ట్రాన్స్‌క్లూడు చెయ్యాలి.

ముగిసిన ప్రతిపాదన చర్చలు

మార్చు

చర్చ ముగిసి, నిర్ణయం ప్రకటించిన ప్రతిపాదనలను [[వికీపీడియా:నిర్వాహకుల చురుకుదనపు సమీక్ష/పాతవి]] పేజీలో ట్రాన్స్‌క్లూడు చెయ్యాలి.

ఇవి కూడా చూడండి

మార్చు