వికీపీడియా:మంచివ్యాసం ప్రమాణాలు/ప్రమాణాలు
1 | చక్కగా రాసినదై ఉండాలి |
1అ | వ్యాసంలోని వచనంలో అక్షరదోషాలు, వ్యాకరణదోషాలు ఉండకూడదు. |
1ఆ | అది శైలి మార్గదర్శకాలకు అనుగుణంగా ఉండాలి. |
2 | మౌలిక పరిశోధన లేకుండా నిర్ధారించదగి ఉండాలి |
2అ | దానిలో అన్ని మూలాల జాబితా, వ్యాసం లేఅవుట్‌కి అనుగుణంగా ఉండాలి |
2ఆ | వ్యాసంలో వాక్యం పక్కనే ఇచ్చే మూలాలు వికీపీడియా:నమ్మదగ్గ మూలాల నుంచి ఉండాలి. నేరుగా ప్రస్తావిస్తున్న కొటేషన్లు, ప్రచురితమైన అభిప్రాయాలు, సహజ విరుద్ధమైన అంశాలు, వివాదాస్పదమైన వాక్యాలు వంటి ప్రశ్నించదగ్గ, సందేహించదగ్గ అంశాలు, జీవించి ఉన్న వ్యక్తులకు సంబంధించిన వివాదాస్పదమైన సమాచారం మరీ ముఖ్యంగా ఈ నమ్మదగ్గ మూలాలతో సమర్థించాలి. |
2ఇ | దానిలో మౌలిక పరిశోధనలు లేకుండా ఉండాలి |
2ఈ | కాపీహక్కుల ఉల్లంఘనలు గాని, గ్రంథచౌర్యం గానీ ఉండకూడదు. |
3 | విస్తృత పరిధి కలిగి ఉండాలి |
3అ | వ్యాస విషయానికి సంబంధించిన ముఖ్యమైన అంశాలను పరామర్శించాలి |
3ఆ | అనవసరమైన అంశాల జోలికి పోకుండా వ్యాస విషయంపైననే దృష్టిని నిలిపి ఉంచాలి (వికీపీడియా:సారాంశం శైలి చూడండి) |
4 | తటస్థం: నిష్పాక్షికంగా ఉంటూ, వివిధ దృక్కోణాలకు తగు విలువను ఇస్తూ చూపించాలి. |
5 | స్థిరత్వం: దిద్దుబాటు యుద్ధాల వలన గాని, పాఠ్య సంబంధ వివాదాల వలన గానీ వ్యాసంలో అనునిత్యం మార్పుచేర్పులు జరుగుతూ ఉండరాదు. |
6 | సచిత్రం: వీలైనంతవరకు బొమ్మలు, వీడియో , ఆడియో వంటివి వాడాలి. |
6అ | మీడియాకు వాటి కాపీహక్కుల స్థితికి సంబంధించిన వికీపీడియా:బొమ్మల కాపీహక్కు పట్టీల జాబితా ఉండాలి. అలాగే, స్వేచ్ఛగా అందుబాటులో లేని మీడియాకు సముచిత వినియోగపు హేతుబద్ధతను సూచించాలి. |
6ఆ | మీడియా, విషయానికి సంబంధించినవై ఉండాలి. వాటికి సముచితమైన వ్యాఖ్యలు ఉండాలి |
డాక్యుమెంటేషన్
Usage
Example:
{{వికీపీడియా:మంచివ్యాసం ప్రమాణాలు/ప్రమాణాలు|1అ}}
yields:
- వ్యాసంలోని వచనంలో అక్షరదోషాలు, వ్యాకరణదోషాలు ఉండకూడదు.