వికీపీడియా:మెరుగైన వ్యాసాలు
మెరుగైన వ్యాసం అన్నది వికీపీడియా వ్యాస స్వరూపానికి సంబంధించిన కొన్ని కనీస నాణ్యతా ప్రమాణాలను అందుకున్న వ్యాసం. దీనికి మంచి వ్యాసానికి ఉన్నట్టుగా విస్తృత పరిధి అవసరం లేదు. ఉన్న కొద్ది సమాచారమైనా, కనీస నాణ్యతా ప్రమాణాలతో చదివినవారికి ఇబ్బందికరంగా లేకుండా ఉంటే మెరుగైన వ్యాసం రూపొందించినట్టే. మెరుగైన వ్యాసాల రూపకల్పనకు మూడు దశలు ఉన్నాయి:
కనీస స్థాయికి, మధ్యమ స్థాయికి, తృతీయ స్థాయికి ఏమేమి ఉండాలి, ఏయే అంశాలు పరిశీలించాలన్నది ఆయా స్థాయిల ఉప పేజీల్లో చెక్ లిస్టు రూపంలో ఉంటుంది. ఆ చెక్ లిస్టు ఉపయోగించి మెరుగుపరచదలుచుకున్న వ్యాసాలను పరిశీలిస్తూ మెరుగుచేయవచ్చు. మెరుగుచేశాకా చర్చ పేజీలో చెక్ లిస్టు వాడి వ్యాసం ఏ స్థాయిలో ఉందన్నది చూపాలి. తృతీయ స్థాయి దాటేవరకూ ఏ సమీక్ష అక్కరలేదు. |