వికీపీడియా:నిర్వాహకుల నోటీసు బోర్డు

(వికీపీడియా:నిర్వాహకుల నోటీసుబోర్డు నుండి దారిమార్పు చెందింది)
తాజా వ్యాఖ్య: జాతీయ రహదారుల దారిమార్పులు టాపిక్‌లో 28 రోజుల క్రితం. రాసినది: యర్రా రామారావు


వికీపీడియా నిర్వహణకు సంబంధించిన వ్యవహారాలపై చర్చకు ఉద్దేశించినది ఈ నోటీసు బోర్డు. ముఖ్యంగా ఇది నిర్వాహకులకు ఉద్దేశించినదే ఐనా, సభ్యులందరూ ఇక్కడ చర్చలో పాల్గొనేందుకు ఆహ్వానితులే!

ముఖ్యమైన అంశాలు

నిర్వాహకులు చేయవలసినవి.
గమనిస్తూవుండవలసిన (వీక్షణాజాబితాలో చేర్చుకోవటంద్వారా) లింకులు

Global ban proposal for Musée Annam

Apologies for writing in English. Please help translate to your language There is an on-going discussion about a proposal that Musée Annam be globally banned from editing all Wikimedia projects. You are invited to participate at Requests for comment/Global ban for Musée Annam on Meta-Wiki. కృతజ్ఞతలు! NguoiDungKhongDinhDanh (చర్చ) 14:22, 27 డిసెంబరు 2021 (UTC)Reply

శ్రేణి నిరోధం ముగిసింది, దుశ్చర్యలు మళ్ళీ మొదలు

ఫిబ్రవరి 3/4 తేదీల్లో 2409:4070: .. పై శ్రేణి నిరోధం ముగిసింది. అప్పటి నుండి ఆ ఐపీల నుండి దుశ్చర్యలు మళ్ళీ మొదలయ్యాయి. తోటి నిర్వాహకులు పరిశీలనలో ఉంచుకోవాలని విజ్ఞప్తి. __చదువరి (చర్చరచనలు) 10:18, 7 ఫిబ్రవరి 2022 (UTC)Reply

తెలియజేసినందుకు ధన్యవాదాలు చదువరి గారూ, గమనిస్తూ ఉంటాను. - రవిచంద్ర (చర్చ) 10:36, 7 ఫిబ్రవరి 2022 (UTC)Reply
నేనుకూడా చూస్తాను.--ప్రణయ్‌రాజ్ వంగరి(చర్చ) 10:58, 7 ఫిబ్రవరి 2022 (UTC)Reply
చదువరి గారూ మళ్ళీ నిరోధం విధించే ఆలోచన మంచిదేమో. రోజూ ఏదో దుశ్చర్యలు జరుగుతూనే ఉన్నాయి. మనం ఎంతకాలం మార్పులు తిప్పికొడుతూ కూర్చుంటాం. ఆ సమయమేదో మంచి పనులకు వాడవచ్చు. - రవిచంద్ర (చర్చ) 17:02, 10 ఫిబ్రవరి 2022 (UTC)Reply
ఆ వరంగల్లు కంప్యూటరు ఇంజనీరింగు దుశ్చర్య చేసే అజ్ఞాతకు ఇదొక వ్యసనం. అప్పుడప్పుడూ వస్తూంటాడు, ఎప్పుడు రాసినా అదే రాస్తూంటాడు. అతడికి ఆ కీర్తి దాహం తీరనిది. :) బహుశా ఒక ఐపీని నిరోధిస్తే సరిపోవచ్చేమో, లేదా నిరోధం అవసరం లేదేమో కూడా చూడాలి.
పోతే.., 2409:4070 అనే శ్రేణి నుండి వచ్చే దుర్వ్యవహారి ఫిబ్రవరి 3 న అబయతికి వచ్చాడు. ఆ తరువాత అతడు చేసిన పనులను ఇక్కడ చూడవచ్చు. ఇది మాత్రం శ్రేణి నిరోధం చెయ్యాల్సిందే ఒక ఐపీని నిరోధిస్తే పనవదు. __ చదువరి (చర్చరచనలు) 00:06, 11 ఫిబ్రవరి 2022 (UTC)Reply
అవునండీ, ఒకవేళ వాళ్ళు రాసేది నిజమే అయితే కంప్యూటర్ కి సంబంధించి వరంగల్లు కాలేజీ వాళ్ళు ఎవరో ఆ విధంగా చేస్తున్నారు. అమాయకత్వం అనాలో, కావలనే చేస్తున్నారో తెలియదు. నేను పట్టు వదలకుండా ఆ మార్పులు తిప్పికొడుతూనే ఉన్నాను. :-) ఇక నిరోధం గురించి నేను చెప్పింది 2409:4090 విషయమే. కాకపోతే విచిత్రంగా వాళ్ళు చేసే మార్పుల్లో ఏవో కొన్ని మార్పులు మాత్రం కొద్దిగా పనికొచ్చేవి ఉన్నాయి. (ఉదాహరణకు దళపతి సినిమా వ్యాసంలో అది మహాభారతంలో కొన్ని పాత్రల ఆధారంగా రూపొందించిన సాంఘిక చిత్రం అన్నారు. అది ఉండదగ్గ వాక్యమే). అందుకనే నేను గుడ్డిగా ఆ సిరీస్ నుంచి వచ్చిన అన్ని మార్పులు తిరగ్గొట్టక్కుండా వాళ్ళు ఏ మాత్రం పనికొచ్చే మార్పు చేసినా దాన్ని వదిలేస్తున్నాను. లేదా కొద్దిగా మెరుగు పరుస్తున్నాను. మళ్ళీ తెవికీ నిర్వాహకులు ఒట్టి దురహంకారులు అనే మాట మన మీద రాకూడదు కదా!.- రవిచంద్ర (చర్చ) 05:58, 11 ఫిబ్రవరి 2022 (UTC)Reply
@రవిచంద్ర గారూ, దుశ్చర్యలు చేసేవారు కొందరి పద్ధతి ఇలాగే ఉంటుంది. దుశ్చర్యలు చేస్తూ మధ్యలో అక్కడక్కడా మంచి దిద్దుబాట్లు చేస్తూ ఉంటారు. ఇతరులను తికమక పెట్టడంలో ఇదొక పద్ధతి అనుకుంటాను. మళ్ళీ దుశ్చర్యలిఉ చెయ్యగా మళ్ళీ శ్రేణీ నిరోధం చేసాను. __ చదువరి (చర్చరచనలు) 06:53, 27 ఫిబ్రవరి 2022 (UTC)Reply

వీరపాండ్య కట్టబ్రహ్మన వ్యాసంలో రహ్మానుద్దీన్ గారు ఏకపక్షంగా తొలగించిన తొలగింపు మూస

అసలు ఈ వీరపాండ్య కట్టబ్రహ్మన వ్యాసానికి తొలగింపు మూస పెట్టటానికి కారణాలు.

  • ఈ వ్యాసం 2022 జనవరి 3న సృష్టించి , 1,762 బైట్లుతో విస్తరించబడింది.రెండులైన్లుతో వ్యాసం ఉంది.కనీసం మొలక స్థాయి అయినా దాటించలేదు.
  • సరేపోనీ నిర్మాణంలో ఉందనే మూస కూడా వ్యాసానికి తొడగలేదు.
  • సరే అదీ పోనీ దీనికి తగిన విషయసంగ్రహం అందుబాటులో లేక విస్తరించలేకపోయారనుకోవటానికి, ఆంగ్ల వికీపీడియాలో సుమారు 8,000 బైట్లుకు మించి ఈ వ్యాసం ఉంది.అన్ని బైట్లకు విస్తరించలేకపోయిననూ మొలక స్థాయిదాటించటానికి అవకాశం ఉంది.కానీ ఆ పని జరుగలేదు.
  • సరే అదీపోనీ ఇది చరిత్ర కల వ్యాసం.బ్రిటీష్‌వారిపై విరోచితంగా పోరాడి, ఉరిశిక్షకు అమలుజరిపేటప్పుడు “మరెందరో విప్లవవీరులు మాతృభూమి దాస్యశృంఖలాలు చేధిస్తారని” ఉద్వేగప్రసంగం చేసి, ఉరి త్రాటిని ముద్దాడి దాన్ని మెడకు తగిలించుకుని మరణం పొంది, స్వాతంత్య్ర సిద్ధికి సింబాలిక్‌గా నిలిచిన వీరుడు.అలాంటి వ్యాసాన్ని రెండు లైన్లుతో ఉండటం భావ్యమా? వ్యాసం లేకపోతే ఆసక్తి ఉన్న ఇంకొకరు వ్యాసం సృష్టించి అభివృద్ధి చేయటానికి అవకాశం ఉంది.
  • సరే అన్నిటికి రాజీ పడదాం.రాసిన రెండు లైన్లుకు ఒక్క మూలం ఇవ్వలేదు.
  • అలాగే ఒక్క వర్గం ఇవ్వలేదు.వర్గం లేదు అని ఎందుకంటానంటే, ఈ వ్యాసం నాకంటపడి తొలగింపు మూస పెట్టటానికి అదే కారణం.గత నాలుగు రోజుల నుండి ప్రత్వేక పేజీలు పరిశీలిస్తూ అందులో వర్గీకరించని పేజీలు లలో గమనించినందున తొలగింపుకు సరైన కారణాలు ఉన్నవనే దృష్టితో యాదృచ్చింకంగా తొలగింపు మూస చేర్చాను తప్ప వేరే ఉద్ధేశం ఏమీలేదు. ఈ వ్యాసమే కాదు, ఇలాంటిదే మరొక వ్యాసం విశ్వనాథనాయని స్థానాపతి అనే వ్యాసం కూడా ఉంది. ఒకసారి పరిశీలించగలరు.
  • సరే అదీ కూడా పోనీ ఏదో నేను తొందరపడో, దురుద్దేశంతో తొలగింపు మూస పెట్టాననుకోండి.ఎటువంటి చర్చ జరపకుండా ఏకపక్షంగా తొలగింపు మూస తొలగించిన రహ్మానుద్దీన్ గారు సాధారణ వాడుకరి కాదు. నిర్వాహకుడు అనే కిరీటంతో సముదాయం సత్కరించిన వ్యక్తి.అలా నన్నుకూడా సత్కరించందనుకోండి.అయితే ఇందులో తేడా ఉందనుకోండి. నాకు తెలిసినంతవరకు తొందరపడి తొలగింపు మూస ఎవ్వరూ తీస్తారంటే అంతగా తెలియని కొత్త వాడుకరులు, అజ్ఞాత వాడుకరులు తొలగిస్తారు. విజ్ఞత కలిగిన నిర్వాహకులు తొలగించకుండా చర్చలో పాల్గొంటారు.

చివరగా దీనిమీద నిర్వాహకులు సరైన అభిప్రాయంతో స్పందించగలరు.నా వైపు లోపాలు ఉంటే ఇక ముందు అలా జరగకుండా నేను జాగ్రత్త పడటానికి అవకాశం ఉంటుంది.నా చర్య సరైనదే అని భావిస్తే వికీపీడియా అభివృద్దికి దోహదపడిందని అనుకుంటాను.--యర్రా రామారావు (చర్చ) 15:39, 1 మార్చి 2022 (UTC)Reply

నేను గమనించినవివి:
  1. యర్రా రామారావు గారు తొలగింపు మూసను పెట్టినపుడు వ్యాసం పరిమాణం 1762 బైట్లతో మొలకగా ఉంది.
  2. ఆ మూసలో తొలగింపు ప్రతిపాదనకు కారణమేంటో రాయలేదు. తొలగింపు చర్చ పేజీని సృష్టించలేదు. కారణాన్ని దాని చర్చ పేజీ లోనూ రాయలేదు. అందుచేతనే వాడుకరి చర్చ పేజీలో పెట్టిన మూసలో కూడా తొలగింపు ప్రతిపాదనకు కారణం లేదు.
నా అభిప్రాయం: ప్రతిపాదనకు కారణం మొలక అయినట్లైతే (ఇక్కడ రాసిన వ్యాఖ్యలో కారణం అదేనని రామారావు గారు రాసారు) వికీ నియమానుసారం తొలగింపు ప్రతిపాదన సబబే. వ్యాసాన్ని సృష్టించిన నెల రోజుల లోపు విస్తరించకపోతే దాన్ని తొలగించవచ్చు అని ఆ విధానం చెబుతోంది. ఈ వ్యాసం సృష్టించి నెల రోజులు దాటిపోయింది కాబట్టి, దీన్ని తొలగించవచ్చు. ఆ విధానం ప్రకారం చర్చ అవసరం లేదు కూడా. అయితే, కారణం రాయకపోతే వాడుకరికి ఎందుకో తెలియదు కాబట్టి రామారావు గారు అది రాసి ఉండాల్సింది.
  1. వాడుకరి పేజీలో జరిగిన చర్చలో రహ్మానుద్దీన్ గారు "మీరు కొత్తవారినే కాక అందరినీ కరుస్తున్నారుగా!" అని రాసారు. రామారావు గారు దానికి ప్రతి వ్యాఖ్య రాసారు.
నాకీ వ్యాఖ్య కటువుగా అనిపించింది. "కొత్తవారినే కాక" అనే మాట సమర్థనీయం కాదు. రామారావు గారు కొత్తవారిని కరుస్తున్నారు అని నిర్ణయించారు. అది సబబుగా లేదు. ఇరువైపులా సభ్యులు స్వీకరించే పద్ధతిని బట్టి ఇలాంటి వ్యాఖ్యలు చెల్లుతాయి. అవతలి వ్యక్తి వాటికి అభ్యంతరాలు చెప్పినపుడు రాసినవారు వెనక్కి తీసుకుంటే ఏ గొడవా ఉండదు. కానీ రామారావు గారు ఆ మాటకు అభ్యంతర చెప్పినపుడు రహ్మానుద్దీన్ గారు వెనక్కి తీసుకోలేదు, వివరణ కూడా ఏమీ ఇవ్వలేదు.
  1. ఈ ప్రతిపాదన తరువాత రహ్మనుద్దీన్ గారు ప్రతిపాదన మూసను తీసేసి, వ్యాసాన్ని విస్తరించి 2 కెబి దాటించారు. సాంకేతికంగా ఇపుడది మొలక కాదు.
విస్తరించాక మూసను తొలగించడం నియమ విరుద్ధమేమీ కాదు. (వాడుకరి చర్చ పేజీలో పెట్టిన మూసలో కూడా విస్తరించకుండా మూసను తొలగించవద్దనే ఉంది.)
చివరిగా, ఒక విషయాన్ని గుర్తు చేస్తాను. మొలకల విషయంలో రహ్మనుద్దీన్ గారు గతంలో చాలా కటువుగా వ్యవహరించేవారు. అసలు మొలక పేజీని సృష్టించే వీలే లేకుండా గతంలో ఒక వడపోత సృష్టించి అడ్డుకట్ట వేసారు (ఆ తరువాత వచ్చిన అభ్యంతరాల వల్ల దాన్ని తీసేసారు). కాబట్టి ఈ అంశంలో అసలు విషయంపై వారిద్దరికీ భిన్నాభిప్రాయం లేదనీ నేను పైన చెప్పిన - 1) తొలగింపు ప్రతిపాదనకు కారణం చెప్పక పోవడం, 2) కరుస్తున్నారనే వ్యాఖ్య - ఈ రెంటి వల్లనే వచ్చిందనీ నేను భావిస్తున్నాను. అనుభవజ్ఞులు, నిర్వాహకులూ అయిన ఈ ఇద్దరూ ఈ వ్యవహారాన్ని సామరస్యంగా ముగిస్తారని భావిస్తున్నాను. __ చదువరి (చర్చరచనలు) 07:39, 4 మార్చి 2022 (UTC)Reply
వీరపాండ్య కట్టబ్రహ్మన వ్యాసంలో నేను తొలగింపు మూస వికీ సమయం ప్రకారం 11:53, 1 మార్చి 2022‎ పెట్టాను.తొలగింపు మూస పెట్టాను. వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/వీరపాండ్య కట్టబ్రహ్మన పేజీలో రాద్దామనే ఉద్దేశంతో మూసలోనే తొలగింపుకు కారణం రాయనిమాట వాస్తవం.అయితే రహ్మానుద్దీన్ గారు 12:10, 1 మార్చి 2022‎ కు దానిలో మూసను తోలగించారు.ఈ రెండు చర్యల మధ్య కేవలం 17 నిమిషాలు మాత్రమే.నేను కారణం రాయటానికి సమయం ఇవ్వలేదని గ్రహించాలి. 12:12, 1 మార్చి 2022‎ బయటి వ్యాసాలకు లింకులు కలిపి +187 బైట్లుకు విస్తరించి 1949 బైట్లుకు పెంచారు.15:40, 1 మార్చి 2022సమయంలో నేను ఈ విషయంపై నిర్వాహకుల నోటీసు బోర్డులో చర్చ ప్రవేశ పెట్టాను.‎నేను చర్చలో ఆ వ్యాసంలోని అభ్యంతరాలు రాసిన తరువాత 15:59, 1 మార్చి 2022‎, 15:59, 1 మార్చి 2022‎ సవరణలు ద్వారా ఆ వ్యాసంలో రెండు వర్గాలు చేర్చి 2,084 బైట్లుచేర్చి మొలక స్థాయిని దాటించారు.16:00, 1 మార్చి 2022 ఈ సవరణలో నిర్వహణ మూసలు పెట్టారు. ఈ సవరణలు అన్నీ నేను 15:40, 1 మార్చి 2022‎ నిర్వాహకుల నోటీసు బోర్డు చర్చలో 15:59, 1 మార్చి 2022‎ సూచించిన తరువాత 19 నిమిషాలకు సవరించి మొలక స్థాయి దాటించారు.ఇదేపనులు మూస తొలగింపుకు ముందు చేసి, నిర్వాహకుడు హోదాలో మూస తొలగించి ఉన్నట్లయితే నిర్వాహకుల నోటీసు బోర్డులో చర్చకు రావలసిన అవసరంలేదు.ఇందులో నా తప్పు, తొందరపాటు చర్యలు ఉన్నవనిఅనిపిస్తే నిర్వాహక నోటీసు బోర్డుకు క్షమాపణలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. యర్రా రామారావు (చర్చ) 06:47, 10 మార్చి 2022 (UTC)Reply

శ్రేణి నిరోధం ఎలా చేయాలి

అజ్ఞాతవాడుకరులు ప్రతిరోజూ తెలుగు వికీపీడియాలో ఎక్కువ అనుచిత మార్పులు చేయుచూ, ఒక ఆన్లైను ఆటగా ఉపయోగించుకుంటున్నారు.అజ్ఞాతవాడుకరులు చేసేవి అన్నీ బుద్దిపూర్వకంగా కావాలనే చేస్తున్నారు.అనుచిత మార్పులు చేయటం, వాళ్లే మరలా రివర్స్ చేయటం, వాళ్ల పేర్లు రాసుకోవటం, (BOYA MACHANURU VEERESH అనే అతను తనపేరును కొక్కరచేడు వ్యాసంలో పదేపదే రాసుకోవటం చరిత్రలో గమనించండి) వ్యాసంలోని విషయసంగ్రహం తుడిపివేయటం, వ్యాసానికి సంబంధంలేని విషయాలు రాయటం ఇలా ఎన్నో విధాలుగా ఉన్నాయి.వికీలో పరిశీలించేవాళ్లు తక్కువ మంది ఉన్న ఈ పరిస్థితిలో శ్రేణి నిరోధం విధించటంకన్నా ఉత్తమమైన మార్గంలేదు.అజ్ఞాతవాడుకరులు చేసే మంచి ఒక శాతం కూడా ఉండదు.99 శాతం చెడు ఉంటుంది.అజ్ఞాతవాడుకరులు సవరణలపై చదువరి గారు శ్రేణి నిరోధం విధించటం నేను సమర్థిస్తున్నాను. చదువరి గారే కాకుండా దీనిమీద నిర్వహకులు ఎవ్వరు గమనించితే వారు శ్రేణి నిరోధం విధించాలి.నావరకు నాకు శ్రేణి నిరోధం విధించటం తెలియదు.అందువలన శ్రేణి నిరోధం విధించటంపై పూర్తి వివరణ తెలియపర్చవలసిందిగా చదువరి గారు లేదా ఇెతర నిర్వాహకులు ఎవరైనా తెలియపర్చగలరు.--యర్రా రామారావు (చర్చ) 07:35, 19 మార్చి 2022 (UTC)Reply

భూతం ముత్యాలు అనే రచయిత తన పేరుతో రెండు ఖాతాలను సృష్టించుకొని తన పేజీతోపాటు తెలుగు రచయితల పేజీల్లో, వర్గాలలో తన వ్యక్తిగత సమాచారాన్ని చేర్చారు. ఆయా మార్పులను తిప్పికొట్టి ఆ ఖాతాలను నిరోధించగా... అనేకమార్లు ఐపి అడ్రసులతో ఆయా పేజీలలో వ్యక్తిగత సమాచారాన్ని చేర్చుతున్నారు. ఇలాగే చేసుకుంటూ పోతే ఎన్నని ఐపీలను నిరోధిస్తాం?. ఇలాంటి సందర్భంలో శ్రేణి నిరోధం అవసరమని నా అభిప్రాయం.--ప్రణయ్‌రాజ్ వంగరి(చర్చ) 08:10, 19 మార్చి 2022 (UTC)Reply
@యర్రా రామారావు,@Pranayraj1985 గార్లకు, శ్రేణి నిరోధాల వలన కొత్తగా చేరేవారికి సమస్య ఏర్పడుతుంది. ఇది గతసంవత్సర గణాంకాలలో కొత్తగా ఖాతా తెరిచేవారు తగ్గటం స్పష్టంగా కనబడింది.(2020-2021 కాలంలో New registered users పటంలో చివరి అర్ధ సంవత్సరంభాగం చూడండి) అందుకని అత్యవసరమైతే తప్ప చేయకూడదు. త్వరలో వికీపీడియా లో అనామక వ్యక్తుల రచనల గుర్తింపు కూడా మారబోతున్నది. నిర్వాహక నోటీసుబోర్డులో తెలిపారు కాబట్టి, ఇతర నిర్వాహకులు కూడా అప్రమత్తమై దుశ్చర్యలను ఎదుర్కొనటంలో సహాయ పడతారు. కాస్త ఓపిక పట్టండి. ధన్యవాదాలు. అర్జున (చర్చ) 00:49, 25 మార్చి 2022 (UTC)Reply
@Arjunaraoc గారూ, శ్రేణి నిరోధాల వలన ఏర్పడే సమస్యలు చెబుతున్నారు. శ్రేణి నిరోధం విధించాలని ఉత్సాహమేమీ లేదండి. తప్పనిసరి పరిస్థితిలోనే విధించాన్నేను. సరే, దాన్ని విధించడం మానేద్దాం.. ప్రత్యామ్నాయమేంటి? -చెప్పలేదు మీరు. "ఇతర నిర్వాహకులు కూడా అప్రమత్తమై దుశ్చర్యలను ఎదుర్కొనటంలో సహాయ పడతా"రని మాత్రం చెబుతున్నారు. ఇతర నిర్వాహకుల సంగతి సరే.., మీరు సహాయపడతారా? సహాయపడ్డారా?
నిరుడు అజ్ఞాతలు ఇక్కడ చురుగ్గా పనిచేస్తున్న వాడుకరులపై వరసబెట్టి నెలల తరబడి వ్యక్తిగత దాడులు చేస్తూండగా మీరు ఏమీ మాట్టాడలేదు. చర్చలో కనీసమాత్రపు జోక్యం కూడా చేసుకోలేదు. ఇతర నిర్వాహకులం అనేక విధాలుగా ఆ దాడులను ఎదుర్కొనే ప్రయత్నాలు చేసాం, రచ్చబండ లోనూ, ఈ బోర్డులోనూ చర్చించాం. అప్పుడు గానీ, ఆ తరువాత గానీ.. దుశ్చర్యలకు వ్యతిరేకంగా చర్యలు తీసుకోవడంలో మీరు జోక్యమే చేసుకోలేదు -వికీలో చురుగ్గా పనులు చేస్తూ కూడా. ఒక సలహా ఇవ్వలేదు, ఒక అభిప్రాయం చెప్పలేదు. కానీ, ఇప్పుడు మీరు సలహా ఇస్తున్న నిర్వాహకులిద్దరూ ఆ చర్చల్లో తమ అభిప్రాయాన్ని నిర్ద్వంద్వంగా చెప్పినవారే. నిర్ణయం తీసుకోవడంలో చురుకైన పాత్ర పోషించినవారే. అజ్ఞాతల దాడికి గురైనవారు కూడా!
  • ఇక్కడ చర్చల్లో పాల్గొనలేదు సరే.., ఆ సమస్య గురించి స్టీవార్డులకు నివేదించుదామనైనా అనుకున్నారా? అదీ లేదు. పోనీ, అక్కడ నేను ఇచ్చిన ఫిర్యాదుకు వాళ్ళిచ్చిన సమాధానాలను చదివారా? అవి చదివాక, వాళ్ళేమీ చెయ్యరని తేలిపోయాక కూడా, ఆ అజ్ఞాతలపై చర్యలు తీసుకునేందుకు మన దగ్గర ఇతర వికల్పాలంటూ ఏమైనా ఉన్నాయో లేదో పరిశీలించారా? ఇక్కడ చర్చించారా? లేదు.
  • పోనీ, తొలుత మూడు నెలల నిరోధం విధించినా అవే ఐపీ అడ్రసులు మళ్ళీ దాడులు చేసినప్పుడు ఏమైనా మాట్టాడారా? లేదు.
  • మళ్ళీ, పొడిగించిన మూడు నెలల నిరోధం ముగిసాక తిరిగి దుశ్చర్యలు మొదలుపెట్టినపుడు ఏమైనా మాట్టాడారా? ఈ పేజీలోనే పైన జరిగిన చర్చలో మీ సూచనలు ఏమైనా చేసారా? లేదు.
  • ఇతర వాడుకరులు విధించిన నిరోధాన్ని ఎత్తివెయ్యడమో మార్చడమో చేసే ముందు దాని గురించి చర్చించాలన్న కనీస మాత్రపు సంప్రదాయాన్నీ, మర్యాదనూ పాటించారా? లేదు.
ఐనప్పటికీ, మీరు సూచించే ప్రత్యామ్నాయ చర్యల కోసం ఎదురుచూస్తున్నాను. శ్రేణి నిరోధం విధించాల్సిందే అని నేను అనడం లేదు. దాన్ని మించిన ప్రత్యామ్నాయం ఏదైనా ఉంటే చెప్పండి. సంతోషంగా దాన్నే పాటిద్దాం. ఇతర నిర్వాహకులు దుశ్చర్యలను ఎదుర్కొనటంలో సహాయ పడతారని మాత్రం చెప్పకండి, ఆ పని మీరు చెయ్యలేదు. __ చదువరి (చర్చరచనలు) 03:33, 25 మార్చి 2022 (UTC)Reply
అర్జునరావు గారూ మీ సమాధానం నాకు సంతృప్తికకరంగా లేదు.అడిగినదానిని దాటవేసి ఏదేదో చెప్పారు.ఏ నిరోధం అయినా తప్పని పరిస్థితులలో విధించాలనేది కామన్ రూలు. ఇది అందరికి తెలిసిన విషయమే.అర్జునరావు గార్కి శ్రేణి నిరోధం గురించి తెలిసుంటే చెప్పి, ఆ తరువాత వారికి తోచిన సూచనలు ఇస్తే బాగుండేది.శ్రేణి నిరోధం గురించి మిగతా నిర్వాహకులుకు తెలియకూడదనే భావనతో ఉన్నట్లు తెలుస్తుంది. తెలియని విషయం తెలుసుకోవటం తప్పుకాదుకదా! ఇప్పటికైనా తెలిసిన వారు ఎవరైనా వివరించగలరు. పర్వేక్షణ కొరత అంతంత మాత్రం ఉన్న ఈ పరిస్థితులలో అజ్ఞాత వాడుకరుల సవరణలు పరంపర ఇలానే సాగితే వ్యాసాల నాణ్యత క్షీణించపోవటం ఖాయం అని నేను భావిస్తున్నాను.చదువరి గారి పైన వివరించిన అభిప్రాయాలతో నేనూ ఏకీభవిస్తున్నాను. యర్రా రామారావు (చర్చ) 04:54, 25 మార్చి 2022 (UTC)Reply

ఐఐఐటి వారి వ్యాసాలను ప్రచురించే పద్ధతి

ఐఐఐటీ వారు కొన్నేళ్ళుగా చేస్తున్న కృషి ఫలితాన్ని తెవికీ లోకి చేర్చే పని మొదలుపెట్టారు. మనందరం సంతోషించాల్సిన సమయమిది. ఈ పని సరిగ్గా జరిగితే తెవికీకి పెద్ద మేలు జరుగుతుంది. కానీ, సరిగ్గా జరక్కపోతే గతంలో గూగుల్ యంత్రికానువాదాల ప్రహసనం లాంటిది పునరావృతం కావచ్చు. అంచేత సముదాయం ముందే జాగ్రత్తపడి ఐఐఐటీ వారి ప్రతినిధితో కలిసి సమన్వయం చేసుకుంటూ ఈ వ్యాసాల ప్రచురణ సవ్యంగా జరిగేలా చూడాలి. నిర్వాహకులంతా ఈ విషయంలో తమతమ సూచనలిస్తూ ఒక చక్కటి పద్ధతిని రూపొందించాలి. ఈ విషయమై నేను రచ్చబండలో ఒక పద్ధతిని సూచించాను. అందుకనుగుణంగా ఒక చెక్‌లిస్టును తయారుచేసాను. వీటిని పరిశీలించి అవసరమైన మార్పుచేర్పులేమైనా చేసి, ఒక ఆచరణాత్మకమైన పద్ధతిని తయారుచెయ్యవలసినదిగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. __ చదువరి (చర్చరచనలు) 10:28, 5 ఏప్రిల్ 2022 (UTC)Reply

వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు పేజీలో పెండింగు పని

వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు పేజీలో కొన్ని చర్చలు నిర్ణయం కోసం వేచి ఉన్నాయి. ఆయా చర్చల్లో పాల్గొనని నిర్వాహకులు వాటిపై నిర్ణయాలను ప్రకటించి, తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. __ చదువరి (చర్చరచనలు) 08:57, 11 ఏప్రిల్ 2022 (UTC)Reply

వికీ నియమానుసారం తొలగింపు చర్చలలో పాల్గొనని నిర్వాహకులే ఫలితం ప్రకటించాలి. కానీ ప్రతీ చర్చలో ఇద్దరు లేదా ముగ్గురు మాత్రమే పాల్గొంటున్నారు. ఎన్ని నెలలైనా ఏ ఇతర నిర్వాహకులూ ఫలితం ప్రకటించకపోవడం వల్ల ఆ చర్చలలో పాల్గొన్నవారే ఫలితం ప్రకటించవలసి వస్తుంది. @రవిచంద్ర: వంటి క్రియాశీలక నిర్వహకులు ఒక్కసారి ఆ పేజీలు పరిశీలించి తగు ఫలితం ప్రకటించగలరు.➤ కె.వెంకటరమణచర్చ 13:38, 2 జూన్ 2022 (UTC)Reply
రేపు పరిశీలిస్తాను. - రవిచంద్ర (చర్చ) 17:09, 2 జూన్ 2022 (UTC)Reply

వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు పేజీలో పెండింగు పెండింగు పని

వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు పేజీలో కొన్ని చర్చలు నిర్ణయం కోసం వేచి ఉన్నాయి. ఆయా చర్చల్లో పాల్గొనని నిర్వాహకులు వాటిపై నిర్ణయాలను ప్రకటించి, తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. చదువరి (చర్చరచనలు) 02:44, 1 జూలై 2022 (UTC)Reply

పదేపదే దుశ్చర్యలు - శ్రేణి నిరోధాలా మరేదైనా చర్యా?

నిరోధం గడువు ముగియగానే దుశ్చర్యలు చెయ్యడం మొదలౌతోంది. మరీ ముఖ్యంగా కొన్ని ప్రత్యేకించిన ఐపీ అడ్రసుల నుంచి ఇది ఎక్కువగా జరుగుతోంది. 2409:4070: తో మొదలయ్యే ఐపీ అడ్రసుల నుండి వస్తున్న వాడుకరి చేసిన పనులను పరిశీలించండి. నేను గమనించినవివి:

  • నిరుడు నిర్వాహకులపై ఒక వాడుకరి, కొందరు అజ్ఞాతలు దాడి చేసిన సందర్భంలో పై ఐపీ అడ్రసులు ఇతోధికంగా దాడిలో పాల్గొన్నాయి.
  • ఒక ఐపీ అడ్రసును నిరోధిస్తే అదే శ్రేణి లోని మరొక ఐపీ అడ్రసు నుండి దాడి చేసారు. దాన్ని నిరోధిస్తే అదే శ్రేణి లోని మరొక దాన్నుండి.. ఇలా ఈ శ్రేణి నుండే దాడులు చేస్తూ పోయారు.
  • చివరికి శ్రేణి నిరోధం విధిస్తే ఆగింది. కానీ ఆ నిరోధం ముగియగానే మళ్ళీ మొదలయ్యాయి. మళ్ళీ శ్రేణి నిరోధం విధించాల్సి వచ్చింది.
  • అలా జరుగుతూండగా, ఒక శ్రేణి నిరోధం ఫిబ్రవరి 2 న ముగిసింది. ఆ వెంటనే మళ్ళీ దాడులు మొదలయ్యాయి. అయితే ఈ సారి కొన్నాళ్ళ పాటు శ్రేణి నిరోధం విధించకుండా ఓర్పు వహించాం. ఇక్కడ చర్చ కూడా చేసాం. తప్పనిసరై ఫిబ్రవరి 18 న 3 నెలల పాటు శ్రేణి నిరోధం విధించాం.
  • ఆ 3 నెలల పాటు ఈ శ్రేణి నుండి ఏ ఇబ్బందీ రాలేదు. మే 18 న ఆ నిరోధం ముగియగానే మళ్ళీ దుశ్చర్యలు మొదలయ్యాయి. ఆ తరువాత అనేక దుశ్చర్యలను తిప్పికొట్టాం, అనేక వివిక్త ఐపీలపై నిరోధం విధించాం గానీ, శ్రేణి నిరోధం మాత్రం ఈసారి ఇప్పటి దాకా విధించలేదు. దీనికి ప్రధాన కారణం, అర్జున గారు శ్రేణి నిరోధం విధించడం సరైన పని కాదని వారించారు. ఆ చర్చను ఇక్కడ చూడవచ్చు. ఆయన చూపిన కారణం సహేతుకమైనదే. శ్రేణి నిరోధం వలన మంచివాళ్ళకు కూడా కలిగే ఇబ్బంది ఎక్కువగా ఉంటుంది, నిజమే. కానీ నిర్వాహకులందరూ చురుగ్గా లేరే.. మరెలా? శ్రేణి నిరోధానికి ప్రత్యామ్నాయ చర్య - నిర్వాహకులపై వత్తిడీ పెట్టని చర్య - ఏమైనా ఉందా? ఉంటే ఏంటది? కింది విషయాలను చూడండి:
    • మే 18 నుండి నేటి (జూలై 10) వరకు పై శ్రేణి లోని ఐపీలను 5 సార్లు నిరోధించగా, వాటిలో 4 యర్రా రామారావు గారు, ఒకటి ప్రణయ్ గారు చేసారు.
    • 2022 లో ఇప్పటివరకూ చేసిన మొత్తం నిరోధాలు, ఎత్తివేతలు 69 పైబడి ఉండగా, వాటిపై పనిచేసిన నిర్వాహకులు ఆరుగురు.
    • నిరోధం విధించేముందు గానీ, లేదా అసలు నిరోధం విధించకుండానో గానీ ఆయా దుశ్చర్యలను తిరగ్గొట్టిన చర్యల్లో కూడా సింహభాగం ఈ ఆరుగురు నిర్వాహకులే తీసుకుని ఉంటారని అనుకోవచ్చు.
మరి, దుశ్చర్యలు ఇలా సాగుతూ ఉంటే, నిర్వాహకులు కొంతమంది మాత్రమే చురుగ్గా ఉంటూంటే, ఏం చెయ్యాలి? మనకున్న వికల్పాలేంటి? మీమీ ఆలోచనలు చెప్పండి. __చదువరి (చర్చరచనలు) 13:58, 10 జూలై 2022 (UTC)Reply

Files requiring renaming

Hello!

Sorry for writing in English. Can any admin please handle the files in వర్గం:Wikipedia files requiring renaming? Jonteemil (చర్చ) 15:26, 10 జూలై 2022 (UTC)Reply

మండవ సాయి కుమార్ పేజీ విషయంలో

90 అనే పేజీని వ్యక్తిగత ప్రచారం చేసుకుంటూ పదే పదే సృష్టించడం జరుగుతోంది. గతంలో 2 సార్లు తొలగించిన ఈ పేజీని మూడోసారి మళ్ళీ రెండ్రోజుల కిందట సృష్టించారు. వాడుకరి:MandavasaiKumar, వాడుకరి:Kumarooooo అనే ఇద్దరు వాడుకరులు ఈ పేజీని సృష్టించి, సమాచారం చేర్చారు. వాడుకరి:రవిచంద్ర ఈ పేజీలో తొలగింపు మూస పెట్టగా, ఏ చర్చా లేకుండా దాన్ని తీసేసారు. రవిచంద్ర గారు దాని చర్చ పేజీలో తొలగింపు హేతువు రాయగా దాన్ని చెరిపేసారు. కొంత చర్చ జరిగాక నేను "మండవ సాయి కుమార్" పేజీని తొలగించాను. (పొరపాటున రాసినదాన్ని కొట్టేసాను.) రవిచంద్ర గారు ఆ పేజీని తొలగించారు. ఆ రోజే ఈ రెండు వాడుకరి ఖాతాలను పరిశీలించమని స్టీవార్డులను కోరాను.

గత రాత్రి Kumarooooo మళ్ళీ ఈ పేజీని - 4 వ సారి - సృష్టించారు. నేను దాన్ని తొలగించి ఆ వాడుకరిని 1 రోజు పాక్షిక నిరోధంలో పెట్టాను. ఈలోగా స్టీవార్డులు, ఆ రెండు ఖాతాలూ ఒక్కరివే అని రిపోర్టు ఇచ్చారు. ఇక చర్య తీసుకోవడం మన వంతు. నేను కింది చర్యలను ప్రతిపాదిస్తున్నాను -

  1. ఈ రెండు ఖాతాలను శాశ్వతంగా నిరోధించాలి.
  2. "మండవ సాయి కుమార్" పేజీని ఆ పేరుతో గానీ మరో పేరుతో గానీ, విషయ ప్రాముఖ్యతను నిరూపించకుండా, సరైన మూలాలు లేకుండా సృష్టిస్తే, మూడు రోజులలో లోపాలను సవరించకపోతే ఆ పేజీని తొలగించాలి. ఆ వాడుకరిపై తగు చర్య తీసుకోవాలి.

పరిశీలించవలసినది. __ చదువరి (చర్చరచనలు) 01:37, 29 అక్టోబరు 2022 (UTC)Reply

పై చర్యలను తీసుకోవటానికి నేను అంగీకరిస్తున్నాను. యర్రా రామారావు (చర్చ) 03:42, 29 అక్టోబరు 2022 (UTC)Reply
మనం చేసిన హెచ్చరికలను పట్టించుకోలేదు, సమాధానం ఇవ్వలేదు కాబట్టి చర్యలు తీసుకోవడం సరైనదే. ఖాతాలను నిరోధించాలి. ఆ వ్యాసాలను సృష్టించకుండా అడ్డుకోవాలి. - రవిచంద్ర (చర్చ) 09:46, 29 అక్టోబరు 2022 (UTC)Reply

మేకా మన్మథ రావు అనుచిత మార్పులు

వాడుకరి:Meka manmadha rao అనే వాడుకరి అనేక వ్యాసాలలో అనుచిత మార్పులు చేస్తున్నారు. మొదట్లో చూడ్డానికి జెన్యూన్ మార్పులు అనిపించినా తీరా చూస్తే అన్నీ తప్పుడు మార్పులే. పైగా వాటికి మూలాలు కూడా లేవు. నేను రెండు మూడు రోజుల క్రిందట హెచ్చరించి మార్పులు ఆపమని చెప్పినా ఆ మార్పులు ఆగలేదు. అందుకని ఆ సభ్యునిపై నిరోధం విధించే విషయమై నిర్వాహకుల అభిప్రాయాన్ని కోరుతున్నాను. ఒక వారం రోజులు నిరోధం విధించడం సబబేనా? మీ అభిప్రాయాలు తెలుపగలరు. - రవిచంద్ర (చర్చ) 16:39, 13 నవంబరు 2022 (UTC)Reply

ఈ ఖాతాను ఒక వారం రోజుల పాటు నిరోధించాను. ఎందుకంటే ఈ రెండు రోజుల వ్యవధిలో కూడా వ్యాసాలలో తప్పుడు మార్పులు చేసారు. - రవిచంద్ర (చర్చ) 05:43, 15 నవంబరు 2022 (UTC)Reply
ఇచ్చే సమాధానాన్ని బట్టి తదుపరి చర్యలు తీసుకోవచ్చు యర్రా రామారావు (చర్చ) 06:04, 15 నవంబరు 2022 (UTC)Reply

ఐఐఐటీ హైదరాబాద్ వారి 10 లక్షల+ వ్యాసాలు, ఎంతమేరకు పనికివస్తాయో తెలుసుకునేందుకు ప్రయత్నం

తోటి నిర్వాహకులకు నమస్కారం,

ఐఐఐటీ హైదరాబాద్ వారి ఇండిక్ వికీ ప్రాజెక్టులో భాగంగా మొత్తానికి ఒక పదిలక్షల పైచిలుకు వ్యాసాలను తాము తమ వెబ్సైట్లో ప్రచురించామని, అవి పనికివస్తే తెలుగు వికీపీడియన్లు తీసుకోవచ్చనీ, ప్రస్తుతానికి నమూనా వ్యాసాలు చేర్చే పక్రియ వాయిదా వేసుకొన్నామనీ, ప్రస్తుతానికి ఏవో పరిశోధనలు జరుగుతున్నాయనీ, కార్యాచరణ తర్వాత ప్రకటిస్తామనీ చెప్పారు. స్థూలంగా చెప్పాలంటే, వారు ఒకచోట తెలుగు వికీపీడియాకు పనికివస్తాయని తాము భావిస్తున్న వ్యాసాలను పదిలక్షల పైచిలుకు పెట్టారు. ఇవి వివిధ స్థాయుల్లో ఉన్నాయనీ, వీటిపై ఏవో పనులు జరుగుతున్నాయని చెప్తున్నారు. మనం కావాలంటే వాడుకోవచ్చట.

వీరి ప్రాజెక్టు ప్రారంభమై ఒక రెండేళ్ళో, మూడేళ్ళో అవుతోంది. వీరు మనకు సవ్యమైన నివేదికలు, వివరాలు అందించట్లేదు. మనం ఇచ్చిన చెక్ లిస్టు మీద కూడా ఏం చేశామో ఇప్పటికీ చెప్పట్లేదు. అయినప్పటికీ, బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇచ్చి, వీరి పది లక్షల వ్యాసాల నుంచి శాంపిల్ పద్ధతిలో పరిశీలన చేసి, ఏమైనా పనికివస్తే వినియోగించుకోవడమూ, లేదంటే ఒక నివేదిక రాసుకోవడమూ చేయడం మంచిదని నా అభిప్రాయం. ఈ సంగతి ఇప్పటికే నేను వారి చర్చా పేజీలోనూ, రచ్చబండలోనూ పెట్టాను. దయచేసి మీమీ అభిప్రాయాలను, మీరు ఈ విషయంలో పనిచేయడంలో ఆసక్తి ఉందా లేదా అన్నదీ నమూనా_వ్యాసాలపై_పురోగతి_లేమి_-_తదనంతర_చర్చ_ఫలితాలపై_నిర్ణయాలు అన్న దగ్గరే చెప్పగలరు. ఇది అందరి దృష్టికీ తీసుకురావడానికి ఇక్కడ ప్రకటించాను. కానీ దయచేసి మీ అభిప్రాయాలను ఒక యూనిఫార్మిటీ కోసం అక్కడకు వెళ్ళి తెలియజేయమని మనవి. పవన్ సంతోష్ (చర్చ) 15:35, 20 నవంబరు 2022 (UTC)Reply

ఐఐఐటి ప్రాజెక్టు వారి వ్యసాలను నేనుకొన్ని పరిశీలించి నా అభిప్రాయలను అక్కడ పెట్టాను. పరిశీలించవలసినది. __ చదువరి (చర్చరచనలు) 08:38, 22 నవంబరు 2022 (UTC)Reply

మూలాల్లో లోపాలు, సవరణ

వ్యాసాల్లో మనం చేరుస్తున్న మూలాల్లో అనేక రకాలైన లోపాలు దొర్లుతున్నాయి. వీటిలో కొన్ని, మూలాలను చేర్చినపుడే వస్తాయి, కొన్ని తదనంతర కాలంలో కూడా తలెత్తవచ్చు (లింకులు డెడ్ అవడం వంటివి). CS1 మూసలు వాడి చేర్చిన మూలాల్లో లోపాలను ఆ మూసలే కనిపెట్టి, లోపం రకాన్ని బట్టి ఆ పేజీలను వివిధ వర్గాల్లోకి చేరుస్తాయి. ఈ వర్గాలన్నీ వర్గం:CS1 errors అనే మాతృవర్గం కింద ఉన్నాయి. వీటిని ఎప్పటికప్పుడు సవరించుకుంటూ ఉంటే వికీ నాణ్యత మెరుగ్గా ఉంటుంది.

ఈ లోపాల్లో చాలా లోపాలు చిన్నపాటి సవరణలు చేస్తే సరైపోతాయి. ఉదాహరణకు తేదీ ఆకృతిలో లోపం, ఒకే పేరు ఇవ్వాల్సిన పరామితులకు ఒకటి కంటే ఎక్కువ విలువలు ఇవ్వడం (firstname, first, last, author, editor, వంటి పరామితులు), URL ఇవ్వకుండా access-date ఇవ్వడం, కాలం చెల్లిన పరామితులను వాడడం వంటివి. ఈ లోపాలను సవరించడం కోసం వికీపీడియా:వికీప్రాజెక్టు/మూలాల్లో లోపాల సవరణ అనే ప్రాజెక్టును మొదలుపెట్టాను. ఈ విషయంలో ఆసక్తి ఉన్నవారు ఈ ప్రాజెక్టులో చేరిగానీ, చేరకుండా గానీ కృషి చెయ్యవచ్చు. ఈ లోపాలను సరిచెయ్యడానికి వాడుకరులందరూ కృషి చెయ్యవచ్చు.. అయితే నిర్వాహకులు కొంత ఎక్కువ బాధ్యత తీసుకుంటే అందరికీ ప్రోత్సాహకరంగా ఉంటుందని నా అభిప్రాయం. సవరణల్లో కృషి చెయ్యడమే కాకుండా, అసలు ఈ లోపాలు రాకుండా నివారించేందుకు ఏం చెయ్యాలో కూడా నిర్వాహకులు ఆలోచించాలి. కాబట్టి అందరి దృష్టికి తెస్తున్నాను. __చదువరి (చర్చరచనలు) 07:01, 10 జనవరి 2023 (UTC)Reply

వైవెయెస్ రెడ్డి గారి వ్యవహారం

@YVSREDDY గారు మళ్ళీ రెండు సార్లు తోటి వాడుకరులపై దూషణలకు పాల్పడడంతో ఒకరోజు నిరోధం విధించాను. ఆ తరువాత ఎవరో కొత్తగా YVSRWIKI అనే ఖాతాను సృష్టించారు. గతంలో కూడా REDDY GARI VYASALU, రెడ్డి గారి వ్యాసాలు అనే రెండు ఖాతాలను కూడా ఎవరో సృష్టించారు. అప్పుడు జరిగిన చర్చలో ఆయనను పింగు చేసాం కాబట్టి, ఆయనకు ఆ చర్చ గురించి తెలిసే ఉంటుంది. అయినప్పటికీ ఆయన అక్కడ స్పందించలేదు. సాధారణంగా చర్చల్లో తోటి వాడుకరుల అభిప్రాయల పట్ల ఆయన స్పందించరు. అది చాలాసార్లు గమనించాం. ఇప్పుడు కూడా స్పందించక పోవచ్చు. ఎవరైనా వాడుకరి వికీలో అదనంగా ఖాతాలను సృష్టిస్తే, ఆ సంగతి బహిరంగంగా ప్రకటించాలి. మరీ ముఖ్యంగా పదేపదే నిరోధాలకు గురయ్యేవారు తప్పనిసరిగా చెయ్యాలి. లేదంటే వాళ్ళు దురుద్దేశం తోనే అలా చేసారని భావించాల్సి వస్తుంది. ఒకవేళ ఆ ఖాతాలు ఆయనవే అయితే ఆ ఖాతాలతో నిరవధికంగా నిరోధించడంతో పాటు ఆయన్ను కూడా నిరోధించాలని నా అభిప్రాయం. __చదువరి (చర్చరచనలు) 08:33, 11 ఫిబ్రవరి 2023 (UTC)Reply

చదువరి గారు మీరు మీ టీం కలిసి తెలుగు వికీపీడియాలో మీకు నచ్చిన వారు చేసిన గోరంత పనిని కొండతగాను, మీకు నచ్చని వారు చేసిన కొండంత పనిని గోరంత గాను లేదా కొండలను లోయలుగాను, లోయలను కొండలగాను చూపించగలరు. ప్రస్తుతం మీకు గల టీంతో తెలుగు వికీపీడియాలో వాడుకరులే లేకుండా చేయగల సామర్థ్యం వుంది. పైన మీరు చూపిన ఖాతాలు నావే. YVSREDDY (చర్చ) 03:11, 12 ఫిబ్రవరి 2023 (UTC)Reply
@YVSREDDY గారూ, ఆ ఖాతాలు మీవేనని ఒప్పుకున్నారు కాబట్టి, వాటిని నిరోధించాల్సిన అవసరం లేదు. పోతే మీరు కింది పనులు కూడా చెయ్యవలసినది:
  • మీరు ఇంకా ఏమైనా ఖాతాలను సృష్టించి ఉంటే వాటిని కూడా ఇక్కడ తెలపండి. భవిష్యత్తులో ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఎందుకంటే సాక్ పప్పెట్లు అనేదాన్ని వికీపీడియా తీవ్రంగా పరిగణిస్తుంది.
  • పై ఖాతాల వాడుకరి పేజీల్లో ఈ ఖాతా నాదే అని రాయండి లేదా మీ వాడుకరి పేజీలో ఆ ఖాతాలు నావే అని రాయండి. రెండు చోట్లా రాయవచ్చు కూడా.
ఇకపోతే మీరు చేసిన ఇతర ఆరోపణల గురించి.. నేను దానిపై చర్చించను. ఒక్కటి మాత్రం చెప్పగలను - మీపై చర్యలు తీసుకోవడానికి ముందు ఇతర వాడుకరులు మీకు అనేక అవకాశాలను ఇచ్చారు, నేను కూడా ఇచ్చాను. మీరు, నలుగురైదుగురు నిర్వాహకుల పేర్ల మొదటి అక్షరాలను కలిపి ఒక యాక్రోనిం పెట్టి పిలిచారు. మిమ్మల్ని నిరవధికంగా నిరోధించదగ్గ దుష్ప్రవర్తన అది. అయినా మీపై చర్య తీసుకోలేదు. ఎందుకో తెలుసా.. ఆ విషయమై చర్య తీసుకోరాదని మరెవరో చెప్పినందునే. మీరు అన్నీ మర్చిపోతారు. ఇలా విక్టిం కార్డు వాడతారు. సముదాయ సభ్యులకు మీ గురించి తెలవాలనే ఈ సంగతి రాసాను.
ఇప్పుడు కూడా చూడండి.. వేరేపేర్లతో ఖాతాలను సృష్టించి, వాటి గురించి వెల్లడించకుండా పొరపాటు చేసారు. ఇది మీరు కావాలని చేసిన తప్పు అని నేను భావించడం లేదు, తెలీక చేసిన పొరపాటనే భావిస్తున్నాను. కానీ పొరపాటు పొరపాటే కదా! నాది పొరపాటైంది అని ఒక్ఖముక్క చెప్పారా? లేదు, పైగా అవతలి వాళ్ళు ఒక టీం అనీ, పక్షపాతంతో వ్యవహరిస్తున్నాననీ నిరాధారంగా ఆరోపిస్తున్నారు. ఇది కూడా వ్యక్తిగత హననమే. నిన్నటి నిరోధం వలన బాధ కలిగి ఆ బాధలో మాట్లాడుతున్నారని భావిస్తూ పట్టించుకోవడం లేదు.
మీలాగే ఇతరులూ సద్బుద్ధితోనే ఉన్నారనే భావన ఇంకా మీలో కలగ లేదు. కనీసం ఇక ముందైనా మీరు మారతారని ఆశిస్తున్నాను. నమస్కారం. __ చదువరి (చర్చరచనలు) 05:17, 12 ఫిబ్రవరి 2023 (UTC)Reply
@Chaduvari గారూ..., @YVSREDDY తెవికీలోని వివిధ వ్యాసాల చర్చాపేజీలలో నిర్వాహకులను నిందిస్తూ వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇది ఇలానే కొనసాగిస్తే ఆయనపై శాశ్వత చర్యలు తీసుకోవడం అనివార్యం అనిపిస్తోంది.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 10:46, 12 ఫిబ్రవరి 2023 (UTC)Reply
వైవిఎస్ గారి ధోరణిలో ఏ మాత్రం ఇసుమంతా కూడా మార్పులేదు.కేవలం నిర్వాహకులు మీద అసభ్యపదజాలంతో నిందారోపణలు చేయటం మాత్రమే అతని ద్వేయం లాగా ఉంది.పై చర్చలలో "చదువరి గారు మీరు మీ టీం కలిసి తెలుగు వికీపీడియాలో మీకు నచ్చిన వారు చేసిన గోరంత పనిని కొండతగాను, మీకు నచ్చని వారు చేసిన కొండంత పనిని గోరంత గాను లేదా కొండలను లోయలుగాను, లోయలను కొండలగాను చూపించగలరు. ప్రస్తుతం మీకు గల టీంతో తెలుగు వికీపీడియాలో వాడుకరులే లేకుండా చేయగల సామర్థ్యం వుంది." అతను రాసిన ఈ వాక్యం ద్వారా అతని దోరణిని అర్ధం చేసుకోవచ్చు.
ఇంకా అతను నిరంతరం కావాలని చేసే, చేసిన లోపాలు
  1. వేరేపేర్లతో ఖాతాలను సృష్టించి, నిర్వాహకులు గమనించి అడిగేదాకా వాటి గురించి వెల్లడించకుండా ఉండటం.
  2. చర్చలలో నిర్వాహకులు, లేదా వాడుకరులు రాసినదానికి స్పందించకుండా బేఖాతరు చేయటం.నిజాయితీ చర్చ, పిప్పలి చర్చ దానికి ఉదాహరణలుగా ఈపేజీలలో చర్చను పరిశీలించవచ్చును
  3. అతను సృష్టించిన వ్యాసాలలో వికీనియమాలు, మార్గదర్శకాలకు అనుగుణంగా లేని (మూలాలు లేని వ్యాసాలు, మొలక వ్యాసాలు, అక్షరభేదాలతో రెండు ఉన్న వ్యాసాలు) తొలగించిన సందర్బంలో నిర్వహకులపై నిందలు వేయటం, వారికి అసభ్యపదాలతో పేర్లు పెట్టటం.
ఇంకా చాలా ఉన్నవి.ఇలాంటి పరిస్థితులలో శాశ్వత నిరోధం తప్పదనిపిస్తుంది. యర్రా రామారావు (చర్చ) 05:26, 13 ఫిబ్రవరి 2023 (UTC)Reply
  • వైజాసత్య వంటి ఉత్తమమైన అధికారులు, కొందరు నిర్వాహకులు చేస్తున్న పనులు చూడలేక అధికార పదవి నుంచి తప్పుకున్నారు. మామూలు వాడుకరులను తప్పించటం మీకో లెక్కా. YVSREDDY (చర్చ) 05:50, 13 ఫిబ్రవరి 2023 (UTC)Reply
    @YVSREDDY గారూ మీరు మామూలు వాడుకరి ఎలా అవుతారు సార్.. 2012/2013 నుండి ఇప్పటి వరకూ మీరు సృష్టించిన మొలకల విషయమై కనీసం పది మంది మీకు చెప్పారు, వాదోపవాదాలు జరిగినై. ఇతరులు మీ చర్చ పేజీలో రాసిన వాటిని తీసేసారు. వ్యాసాల చర్చల్లో రాసిన వాటిని తీసేసారు. ఏడెనిమిది సార్లకు పైగా వివిధ వాడుకరుల మీద మీరు వ్యక్తిగత నిందలు చేసారు. నలుగురు వాడుకరులను కలిపి యాక్రోనిమ్‌ పెట్టి హేళన చేసారు. అబద్ధాలు రాసారు. ఇన్ని చేసిన మీరే తిరిగి "మామూలు వాడుకరులను తప్పించటం మీకో లెక్కా" అంటూ ఇతరులను ఎత్తిపొడవగలుగుతున్నారంటే అమేయమైన మీ నేర్పు గురించి వేరే చెప్పాల్సిన పనిలేదు. మీరు మామూలు వాడుకరి ఎలా అవుతారు సార్? __ చదువరి (చర్చరచనలు) 06:15, 13 ఫిబ్రవరి 2023 (UTC)Reply

నిర్వాహకత్వ, అధికారి బాధ్యతల నుండి వైదొలగుతున్నాను

గత రెణ్ణెల్లుగా నేను వికీలో చురుగ్గా లేను. మరి కొన్నాళ్ళ పాటు ఇక్కడ పనిచేసే అవకాశం లేదు. ఈ కారణంగా నాకున్న నిర్వాహకుడు, అధికారి అనే రెండు బాధ్యతలను నిర్వర్తించలేని పరిస్థితిలో ఉన్నాను. అంచేత ఈ రెండు బాధ్యతల నుండి తప్పించమని స్టీవార్డులను అభ్యర్థించాను. ఒక రోజులో వాళ్ళు తమ పని చేస్తారు.

బాధ్యతలను నిర్వహించలేని పరిస్థితిలో ఉన్న నిర్వాహకుల పట్ల వికీపీడియా:నిర్వాహకత్వ హక్కుల ఉపసంహరణ మార్గదర్శకం ఉంది మనకు. ఆ విధానం ప్రకారం కొన్నాళ్ళ తరవాతైనా ఈ నిర్ణయం తీసుకోవాలి. కానీ మరి కొన్నాళ్ళ పాటు ఇక్కడ పని చేసే వీలు నాకు ఉండదని ఎలాగూ తెలుసు కాబట్టి అప్పటి వరకు ఆగదలచుకోలేదు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను.

తోటి నిర్వాహకులు, అధికారులూ.. అందరికీ నమస్కారాలు. ఉంటాను. __చదువరి (చర్చరచనలు) 13:31, 2 జూన్ 2023 (UTC)Reply

చదువరి గారూ, వికీపీడియా పట్ల మీ నిబద్ధత ఏమిటో నాకు తెలుసు. మీరు ఏ నిర్ణయం తీసుకున్నా ఆలోచించే తీసుకుంటారు. మీరు తొందరగా వ్యక్తిగతమైన బిజీ పనులను ముగించుకుని మరలా తొందరలో తిరిగి వస్తారని ఆశిస్తూ - రవిచంద్ర (చర్చ) 18:21, 2 జూన్ 2023 (UTC)Reply
మీరు గత రెండు మాసాలు నుండి వికీలో ఆక్టివ్ గా లేని లోటు బాగా కనిపిస్తుంది. ఇప్పుడు మీ నిర్ణయం ఇంకా వికీకి తీరని లోటు అని నా అభిప్రాయం.సాధ్యమైనంత త్వరలో శలవు నుండి మరలా మీరు వికీలో మీ సేవలు కొనసాగించాలని కోరుతూ, గతంలో మీరు వికీలో ఎవరూ ఊహించని స్థాయిలో అభివృధ్ధి చేసినందుకు, అవసరమైనవారికి తగిన సలహాలూ సూచనలూ అందించినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. యర్రా రామారావు (చర్చ) 02:07, 3 జూన్ 2023 (UTC)Reply
@Chaduvari గారూ, రామారావు గారు చెప్పినట్టు మీరు లేని వికీ నిర్వహణ కొంచెం కష్టమైనదే. మీకు కుదిరినపుడల్లా ఒక వాడుకరిగానైనా వికీలో మీ సేవలు కొనసాగించాలని కోరుకుంటున్నాను.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 08:00, 3 జూన్ 2023 (UTC)Reply

New special page to fight spam

Please help translate to your language

Hello, We are replacing most of the functionalities of MediaWiki:Spam-blacklist with a new special page called Special:BlockedExternalDomains. In this special page, admins can simply add a domain and notes on the block (usually reasoning and/or link to a discussion) and the added domain would automatically be blocked to be linked in Wikis anymore (including its subdomains). Content of this list is stored in MediaWiki:BlockedExternalDomains.json. You can see w:fa:Special:BlockedExternalDomains as an example. Check the phabricator ticket for more information.

This would make fighting spam easier and safer without needing to know regex or accidentally breaking wikis while also addressing the need to have some notes next to each domain on why it’s blocked. It would also make the list of blocked domains searchable and would make editing Wikis in general faster by optimizing matching links added against the blocked list in every edit (see phab:T337431#8936498 for some measurements).

If you want to migrate your entries in MediaWiki:Spam-blacklist, there is a python script in phab:P49299 that would produce contents of MediaWiki:Spam-blacklist and MediaWiki:BlockedExternalDomains.json for you automatically migrating off simple regex cases.

Note that this new feature doesn’t support regex (for complex cases) nor URL paths matching. Also it doesn’t support bypass by spam whitelist. For those, please either keep using MediaWiki:Spam-blacklist or switch to an abuse filter if possible. And adding a link to the list might take up to five minutes to be fully in effect (due to server-side caching, this is already the case with the old system) and admins and bots automatically bypass the blocked list.

Let me know if you have any questions or encounter any issues. Happy editing. Amir (talk) 09:41, 19 జూన్ 2023 (UTC)Reply

దిగుమతి చేయవలసినది

2023 క్రికెట్ ప్రపంచ కప్ పేజీ కోసం Module:Location map/data/India2 అనే మాడ్యూలును దిగుమతి చేయాల్సి ఉంది. నిర్వాహకులెవరైనా ఈ పని చెయ్యవలసినదిగా వినతి. __ చదువరి (చర్చరచనలు) 01:45, 5 జూలై 2023 (UTC)Reply

@Chaduvari గారూ... ఈ మాడ్యూలును దిగుమతి చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 15:24, 5 జూలై 2023 (UTC)Reply

దిగుమతుల అభ్యర్థన కోసం ఒక పేజీ

వాడుకరులు దిగుమతులను అభ్యర్థించేందుకు ఒక పేజీ అవసరమని నాకు నిర్వాహక, అధికారి బాధ్యతల నుండి వైదొలగినాక గాని తెలవలేదు. అందుకోసం వికీపీడియా:దిగుమతి అభ్యర్థనలు అనే పేజీ తయారు చేసాను. నిర్వాహకులు ఈ పేజీని అప్పుడప్పుడూ చూస్తూండవలసినదిగా కోరుతున్నాను. __ చదువరి (చర్చరచనలు) 15:01, 5 జూలై 2023 (UTC)Reply

అలాగేనండీ @Chaduvari గారు.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 15:27, 5 జూలై 2023 (UTC)Reply

వికీపీడియా:వ్యాససృష్టికి మార్గసూచీ/మూలాలు పేజీ తొలగింపు

వికీపీడియా:వ్యాససృష్టికి మార్గసూచీ/మూలాలు పేజీని తొలగించడం సరికాదు. అది కొత్తవారికి సాయపడే సహాయం పేజీ. దానిలో Naidu999 అనే వాడుకరి దుశ్చర్య చేసారు. వారు చేసిన దుశ్చర్య ఇది. బహుశా వాడుకరి:యర్రా రామారావు గారు ఇది గమనించలేదనుకుంటాను.. ఆ పేజీని తొలగించారు.

పోతే Naidu999 అనే వాడుకరి అనేక దుశ్చర్యలు చేసారు. మరీ ముఖ్యంగా ఈ సహాయం పేజీలపై పదేపదే దాడులు చేస్తున్నారు. వికీపీడియా:Article wizard/Referencing అనే ఒక్క పేజీ పైననే గత నాలుగైదు రోజుల్లో 11 సార్లు తప్పు దిద్దుబాట్లు చేసారు. అది ఉనికిలో లేని పేజీ కాబట్టి వదిలేసారో మరేంటో గానీ.. ఇంత జరిగినా వారిపై చర్య తీసుకోలేదు, హెచ్చరించనూ లేదు. ఇప్పుడు ఏకంగా సహాయం పేజీ పైననే చేసారు. అది చూసుకోకుండా ఆ దుశ్చర్యను సవరించాల్సింది పోయి, పేజీని తొలగించారు. ఇపుడు వికీపీడియా:వ్యాససృష్టికి మార్గసూచీ అనే సహాయ వ్యాసాల పరంపరలో "మూలాలు" అనేది ఎర్రలింకుగా మారిపోయింది. ఆ పేజీని తిరిగి సృష్టించవలసినదిగా (నా ఉద్దేశం - తొలగింపు రద్దు చేసి, ఆ పేజీని దుశ్చర్యకు ముందరి కూర్పుకు తీసుకువెళ్ళాలి అని) మనవి. __ చదువరి (చర్చరచనలు) 01:18, 7 జూలై 2023 (UTC)Reply

చదువరి గారూ నేను రాత్రి ప్రయాణంలో ఉంటూ ఎందుకో ఇటీవల మార్పులు చూసినప్పుడు ఇది గమనించాను.నాకు గుర్తు వస్తుంది.గతంలో కూడా ఇలానే చేసినట్లు గుర్తు.అతను తెలియక ఇలాచేసాడేమో అని నేను అప్పుడే అలోచించకుండా అతను చేసిన దారిమార్పు తొలగించి ఖాళీపేజి అనే దృష్టితో తొలగించాను.తరువాత నాకు మరలా వికీపీడియా:వ్యాససృష్టికి మార్గసూచీ/మూలాలు పేజీకి ఉపపేజీ కదా అని గుర్తువచ్చి,సరే ఉదయం సరిచేద్దామని అనుకుని ఇప్పుడు వికీపీడియాలో ఎంటర్ కాగనే ఈ చర్చను గమనించాను.నేను గమనించకుండా ఆ పేజీని తొలగించినందుకు క్షంతవ్యుడను. ఇది కొత్త వాడుకరులకు చాలా ముఖ్యమైన పేజీ.నిర్వహకులు కొత్తవారికి మార్గదర్శకం చేయటానికి చాలా ముఖ్యంగా ఉపయోగపడిందనుటలో ఎటువంటి సందేబం లేదు.నేను హడాహుడిగా ఆసమయంలో అలోచించుకండా తొలగించినందుకు క్షమించాలి. ఆ పేజీ పరిశీలించగా వెంకటరమణగారు సరిచేసారను కుంటున్నాను.తప్పను ఎత్తి చూపినందుకు ధన్యవాదాలు యర్రా రామారావు (చర్చ) 04:22, 7 జూలై 2023 (UTC)Reply
యర్రా రామారావు గారూ, వాడుకరి:Naidu999 వికీపీడియా:వ్యాససృష్టికి మార్గసూచీ/మూలాలు పేజీని తన దుశ్చర్యలతో "పి.జి.వి.ఆర్ నాయుడు" కు దారిమార్పు చేసాడు. ఇందులోని సమచారాన్నంతా తొలగించి పి.జి.వి.ఆర్ నాయుడు వ్యాసాన్ని చేర్చాడు. అతని దిద్దుబాట్లను త్రిప్పికొట్టి ఆ వ్యాసాన్ని తిరిగి వికీపీడియా:వ్యాససృష్టికి మార్గసూచీ/మూలాలు వ్యాసంగా తరలించాను. ఈ విషయం తెలియజేసిన చదువరి గారికి ధన్యవాదాలు.➤ కె.వెంకటరమణచర్చ 13:21, 7 జూలై 2023 (UTC)Reply
వెంకటరమణ గారూ సవరించినందుకు ధన్యవాదాలు. యర్రా రామారావు (చర్చ) 13:30, 7 జూలై 2023 (UTC)Reply
ధన్యవాదాలు @K.Venkataramana గారు. __ చదువరి (చర్చరచనలు) 23:09, 7 జూలై 2023 (UTC)Reply
@Chaduvari గారూ... Naidu999 అనే వాడుకరి కొద్దినెలల క్రితమే వికీలోకి వచ్చినా, గత వారం రోజుల నుండే వికీలో మార్పులు చేస్తున్నాను. కొన్ని వ్యాసాలను కూడా రాశారు. అయితే, వాటితోపాటు అనేక దుశ్చర్యలు కూడా చేసారు. వాటిని గమనించిన నిర్వాహకులు వెంటనే సరిచేశారుకానీ మీరన్నట్లు వారిపై చర్య తీసుకోలేదు, హెచ్చరించనూ లేదు. కారణమేమిటంటే వికీలోకి వచ్చిరాగానే ఏదో రాసేద్దామన్న ఉత్సుకతతో ఉంటారు కదా, అలాంటి వారిపై చర్యలు తీసుకోవడమో, హెచ్చరించడమో చేస్తే వికీలోకి వచ్చిన కొత్తవారిని నిర్వాహకులు భయపెడుతున్నారు, వాళ్ళు రాసినవి తొలగిస్తున్నారు అన్న మాటలను నిజం చేసినవాళ్ళం అవుతామేమోననిపించి, కొంతకాలం చూసిన తరువాత ఆ వాడుకరికి హెచ్చరికలు చేయవచ్చన్న ఉద్దేశ్యంతో సంయమనం పాటించాము. ఇకపై ఇలాంటివి జరగకుండా జాగ్రత్త వహిస్తాము.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 18:43, 7 జూలై 2023 (UTC)Reply
@Pranayraj1985 గారూ, ఆ వాడుకరికి తెలీక అలా చేస్తున్నారేమోనని మీలాగానే నాకూ అనిపించింది. __ చదువరి (చర్చరచనలు) 23:08, 7 జూలై 2023 (UTC)Reply

వికీ నియమాలు-ఉపదేశం

సభ్యులకు నమస్కారం,

త్రివిక్రమ్ అనే వాడుకరి ములుకనూర్ ప్రజా గ్రంథాలయం కథల పోటీలు - 2019 అనే వ్యాసంలో, ఆ వ్యాస విషయానికి సంబంధించిన వెబ్సైటులో ఉన్న పుస్తకం పిడిఎఫ్ లింకు ఇచ్చాడు. అందుకు నేను మూలాలు లేవు అనే మూస చేర్చాను. ఆ మూసను వాడుకరి తొలగించాడు. అలా మూసలు తొలగించకూడదని వాడుకరి చర్చాపేజీలో రాశాను. అందుకు ఆ వాడుకరి ములుకనూర్ ప్రజా గ్రంథాలయం కథల పోటీలు - 2019 చర్చాపేజీలో నన్ను ప్రస్తావిస్తూ 'నేను నేరుగా తొలగిస్తే "అట్లా చెయ్యకూడదు" అని మీరు మళ్ళా ఒక పేజీడు ఉపదేశం ఇస్తారనే ఉద్దేశంతో క్లారిఫై చెయ్యమని అడుగుతున్నాను'అని రాశారు. వికీ నియమాలను తెలియజేస్తే అది ఆ వాడుకరికి ఉపదేశంలా అనిపించింది.

మరో సందర్భంలో... ఒకచోట ప్రచురించబడిన రచయిత పరిచయంలో ఉన్న పాఠ్యాన్ని ఉన్నదున్నట్లుగా కాపీ పేస్ట్ చేసి శ్రీదేవీ శ్రీకాంత్ అనే వ్యాసాన్ని సృష్టించాడు. అయితే అలా చేయకూడదు అని వాడుకరి చర్చాపేజీలో రాశాను. అందుకు ఆ వాడుకరి "భలే ఉందండీ. అక్కడ ఉన్న సమాచారాన్నే ఇస్తే వికీకి విరుద్ధం అంటారు. ఒక్క పదం అదనంగా చేర్చినా "మౌలిక పరిశోధన", "ఆధారాల్లేవు", "సెల్ఫ్ డబ్బా" అని అభ్యంతరం చెప్తారు. ఇచ్చిన ఆధారాల్లో ఏముందో చూడకుండానే "చెల్లవు" అనేస్తారు. మొత్తంగా "ఊరుకున్నంత ఉత్తమం లేదు" అనిపిస్తారు." అని రాశారు.

మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే... కొత్తగా రాస్తున్న వారికి సహకారం ఇవ్వాలన్న ఉద్ధేశ్యంతో ఆ వాడుకరి సృష్టించిన ములుకనూర్ ప్రజా గ్రంథాలయం వ్యాసాన్ని నేను ఇతర సమాచారం, మూలాలతో అభివృద్ధి చేయడంతోపాటు ఇతర వ్యాసాలలోని మూలాలను నేను ఆర్కైవ్ చేసి మూలంలో చేర్చాను.

వికీ నిర్వాహకుడిగా నియమాలను చెబుతుంటేనేమో కొత్తవారిని వికీలో రాయనీయడం లేదు అంటున్నారు, పోనిలే అని ఊరుకుంటే వికీ నియమాలకు విరుద్దంగా వ్యాసాలు రాస్తున్నారు. ఇలాంటి పరిస్థితులలో ఏం చేయాలి..?-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 07:24, 5 ఆగస్టు 2023 (UTC)Reply

ముందుగా మీరే ఇక్కడ రిపోర్ట్ చెయ్యడం అభినందనీయం. కాకపోతే మీరు ముల్కనూరు ప్రజాగ్రంథాలయం సంబంధిత పేజీల్లో నేను చేర్చిన కంటెంటు విషయంలో తొందరపడ్డారని చెప్పగలను.
  1. మూస తొలగింపు గురించి: నేను ఆ వ్యాసంలో మూలాలు చేరుస్తూ, మీరు చేర్చిన మూలాల మూస ఇక అనవసరం అనే ఉద్దేశంతో తొలగించినాను. లక్ష్యం నెరవేర్చిన తర్వాత కూడా ప్రోటోకాల్ పాటించడం అంత ముఖ్యమని నేను భావించలేదు. ఇక మీదట పాటించడానికి నాకు అభ్యంతరమేమీ లేదు.
  2. శ్రీదేవీ శ్రీకాంత్ పేజీ గురించి మీరు చెప్పింది పాక్షిక సత్యం మాత్రమే. జరిగింది ఇదీ: నేను మూలాలతో సహా ఆ పేజీని సృష్టించిన అరగంట లోపే మీరు “విషయ ప్రాధాన్యత” అన్న కారణం చూపి తొలగించినారు. రెండు మూడు సినిమాల్లో నటించిన నటులక్కూడా పేజీలున్న వికీపీడియాలో వందల కథలు, కవితలు, గజల్స్ రాసి, సంగీత, నాట్య, చిత్ర కళా రంగాల్లో కృషి చేసిన వ్యక్తికి విషయ ప్రాధాన్యత లేదని, పేజీ ఉండకూడదని మీ అంతట మీరే ఎట్లా నిర్ణయిస్తారు? అదేదో దేశద్రోహం లేదా శాంతిభద్రతలకు విఘాతం కలిగించే అభ్యంతరకరమైన వ్యాఖ్యలున్నట్లు ఆ సమాచారాన్ని తొలగించడానికి అంత తొందరెందుకు? చేర్చిన మూలాల్లోని సమాచారాన్ని బేరీజు వేసిన తర్వాతే నిర్ణయం తీసుకోవచ్చు గదా? ఇది “ఎవరైనా రాయదగిన” వికీపీడియా లక్ష్యాలను నిరోధించే చర్య అని ఇప్పటికీ భావిస్తున్నాను.
  3. కాపీ-పేస్ట్, కాపీహక్కుల ఉల్లంఘన గురించి: సాధారణంగా మూలాన్ని పేర్కొంటూ ఒక్కసారే కోట్ చేసినప్పుడు 400 పదాల వరకూ వాడుకోవచ్చు. ఒకే మూలం నుంచి పలుసార్లు కోట్ చెయ్యాల్సివచ్చినప్పుడు ఒక్కొక్కసారికి 300 పదాలకు మించకుండా, మొత్తం 800 పదాలకు మించకుండా కోట్ చెయ్యొచ్చు. మీరన్నట్టు నేను చేసింది పూర్తిగా కాపీ పేస్ట్ కూడా కాదు. స్వల్ప మార్పులతోనే చేసినాను. అది కూడా దాదాపు 1600 పదాలున్న పేజీలో నుంచి 85 పదాలు మాత్రమే. మూలాన్ని పేర్కొంటున్నాం కాబట్టి కాపీ పేస్ట్ చేసినా అది కాపీహక్కుల ఉల్లంఘన కాదనే నా నమ్మకం. దీన్ని కూడా నిషేధించే వికీపీడియా నియమాలు ఏవో సూచించండి. - త్రివిక్రమ్ (చర్చ) 05:43, 9 ఆగస్టు 2023 (UTC)Reply
శ్రీదేవి శ్రీకాంత్ పేజీలో ప్రస్తుతమున్న మూలాలు మాత్రం విషయ ప్రాముఖ్యతకు సరిపోవన్నది వాస్తవం. కానీ విషయ ప్రాముఖ్యత ఇంకా నిర్ధారించలేని వ్యాసాన్ని ఎంత సమయం లోపు తొలగించాలి అనేది మన నిబంధనల్లో ఇంకా స్పష్టంగా లేదు అనుకుంటున్నా. మామూలుగా అయితే నేను వెంటనే గూగుల్ లో వెతుకుతాను. ప్రముఖ పత్రికల్లో, ఆ వ్యక్తి గురించి కథనాలు లేకపోతే విషయ ప్రాముఖ్యత లేకపోవచ్చని భావిస్తాను. అలా భావించి ప్రణయ్ రాజ్ గారు, వ్యాసాన్ని తరలించి ఉండవచ్చు. త్రివిక్రం గారూ, మీరు ఇన్నేళ్ళు వికీకి దూరంగా ఉన్నపుడు, ప్రణయ్, నేను, చదువరి గారు, వెంకటరమణ గారూ ఇంకా యాక్టివ్ గా ఉన్నవాళ్ళం ఇలాంటి ఎన్నో ప్రచార వ్యాసాలను తొలగించాము. ఇప్పటికీ కొనసాగిస్తున్నాము కూడా. అలా అని మేం ఎప్పుడూ పొరపాటు చేయలేదని చెప్పలేము. వికీని వ్యక్తిగత ప్రచారాలకు దూరంగా ఉంచడంలో కొంత దూకుడు ఉంటుంది. దాన్ని మీరు సహృదయంతో అర్థం చేసుకుని ఓపికగా ఉండవలసినదిగా కోరుతున్నాం. అలాగే మనం వ్యాసాలు తొలగించేటపుడు, ఒక రోజు దాకా ఎదురు చూసేట్టు నియమం ఏర్పాటు చేసుకుంటే బాగుంటుందేమో నని నా అభిప్రాయం. - రవిచంద్ర (చర్చ) 06:45, 9 ఆగస్టు 2023 (UTC)Reply
ప్రణయ్ రాజ్ గారూ, నేను అనుకున్న త్రివిక్రమ్ గారైతే చాలా ముందు నుంచి తెవికీలో ఉన్నారు. మధ్యలో కాస్త విరామం తీసుకున్నారు అని రాశారు. ఆయనకు వికీ నియమాలు తెలుసనే భావిస్తున్నాను. ఈ విషయాన్ని మనం చర్చల ద్వారా సామరస్యంగా పరిష్కరించుకోవచ్చు. - రవిచంద్ర (చర్చ) 06:33, 9 ఆగస్టు 2023 (UTC)Reply
ఇటువంటి విషయాలలో మనందరం తొందరపడకుండా సమన్వయం పాటిస్తే ఇలాంటి సమస్యలు తలెత్తకుండా ఉంటాయని నా అభిప్రాయం. యర్రా రామారావు (చర్చ) 07:09, 9 ఆగస్టు 2023 (UTC)Reply
మీ స్పందనకు ధన్యవాదాలు @రవిచంద్ర గారు, త్రివిక్రమ్ గారు చాలా ముందు నుంచి తెవికీలో ఉన్నారన్న విషయం ఇప్పుడే తెలిసింది.
@త్రివిక్రమ్ గారూ... 'ముల్కనూరు ప్రజాగ్రంథాలయం సంబంధిత పేజీల్లో నేను చేర్చిన కంటెంటు విషయంలో తొందరపడ్డారని చెప్పగలను' అని అన్నారు. ములుకనూర్ ప్రజా గ్రంథాలయం వ్యాసాన్ని నేను ఇతర సమాచారం, మూలాలతో అభివృద్ధి చేయడంతోపాటు దాని సంబంధిత వ్యాసాలలోని మూలాలను నేను ఆర్కైవ్ చేసి మూలంలో చేర్చాను. ఇకపోతే, మీరు రాసిన మొదటి 'డాక్టర్ శ్రీదేవి శ్రీకాంత్' పేజీగానీ, అందులోని సమాచారాన్నిగానీ తొలగించలేదు, ఆ వ్యాసాన్ని మీ వాడుకరి ఉపపేజీకి తరలించాను. మళ్ళీ మీరు రెండోసారి అదేపేరుతో అదే సమాచారంతో రెండోసారి సృష్టించిన వ్యాసాన్ని మాత్రమే తొలగించాను. ఆగస్టు 3న మీరు ములుకనూర్ ప్రజా గ్రంథాలయం, ములుకనూర్ ప్రజా గ్రంథాలయం కథల పోటీలు - 2019, ములుకనూర్ ప్రజా గ్రంథాలయం కథల పోటీలు - 2020 వ్యాసాలు రాశారు. వాటికి నిర్వాహణ మూసలు చేర్చాను. అయితే, మొదటి మూడు వ్యాసాలును పూర్తిచేయకుండా ఆగస్టు 5న మరోకొత్త వ్యాసం డాక్టర్ శ్రీదేవి శ్రీకాంత్ వ్యాసం సృష్టించారు. అప్పుడు నేను డాక్టర్ శ్రీదేవి శ్రీకాంత్ వివరాల గురించి గూగుల్ లో వెతికితే వార్తా కథనాలు కనపడలేదు, మొదటి మూడు వ్యాసాలను పూర్తిచేయకుండా మరో కొత్తవ్యాసం రాసేసరికి, దానిని వాడుకరి ఉపపేజీకి తరలించడం జరిగిందే తప్ప వేరే ఉద్ధేశ్యంతో కాదు. ధన్యవాదాలు.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 07:24, 9 ఆగస్టు 2023 (UTC)Reply

నిర్వాహకుల దృష్టికి ఒక సమస్య

ఇవ్వాళ నేను గ్లోబల్ టెక్ సమ్మిట్ పేజీని చూసాను. ఈ పేజీలో ఈ రోజున ఎన్వికీలో G20 లింకు ఇచ్చారు. నిజానికి G20 ఇంగ్లీషు పేజీకి జీ20 అనే తెవికీ పేజీ ఈసరికే లింకై ఉంది. ఒకే పేజీకి రెండు లింకులు ఇవ్వడానికి కుదరదు గదా అని పరిశీలిస్తే, దీనిలో భాషాంతర లింకును నేరుగా పాఠ్యంలో ఇచ్చేసారు. ఇది కావాలని చేసిన దుశ్చర్య. ఇది చేసిన వాడుకరి Great2030.

అ తరువాత ఆ పేజీని, దాని చరిత్రనూ చూస్తే, కొన్ని సందేహాలు వచ్చాయి. వాటిని నివృత్తి చేసుకునే క్రమంలో కింది విశేషాలను తెలుసుకున్నాను.

  • ఈ పేజీలో కనీసం 5 సార్లు (క్రాస్-వికీ స్పాము కారణంగా పెట్టారు. పెట్టినది ఎన్వికీ వాళ్ళు) స్పీడీ డిలీషన్ నోటీసులు పెడితే, చర్చ లేకుండానే ఆ మూసను తొలగించారు. (పదేపదే దుశ్చర్య)
  • వ్యాసంలో ప్రచారం పాలు ఎక్కువగా ఉంది.
  • గతంలో గేదెల శ్రీనుబాబు వ్యాసంలో ఎక్కువగా పనిచేసిన వాడుకరులే ఈ వ్యాసంలో కూడా ఎక్కువగా పనిచేసారు. ఈ వ్యాసంలో కూడా గేదెల శ్రీనుబాబు ప్రస్తావన ఎక్కువగా ఉంది
  • ఈ వ్యాసాన్ని హిందీలో రెండుసార్లు సృష్టిస్తే రెండుసార్లూ తొలగించారు. ఇతర వికీల సంగతి నేను చూళ్ళేదు.

ఈ వ్యాసంలో పనిచేసిన కొన్ని ఖాతాలు ఇవి: Pkraja1234, Surya923,jags1111, Sunrise600. ఈ ఖాతాలన్నీ సాక్ పపెట్లే అని ఎన్వికీలో నిర్థారించి, సార్వత్రికంగా నిరోధించారు. తెవికీలో కూడా ఈ ఖాతాలను నిరోధించాల్సిన అవసరం ఉంది. స్పీడీ డిలీషను నోటీసులను తీసేసినది ఈ ఖాతాల్లో వాళ్ళే.

  • Great2030 అనే ఖాతా ఇవ్వాళ చేసిన ఒక దుశ్చర్యను పైన రాసాను గదా.. ఇదే ఖాతా ఒక స్పీడీ డిలీషను నోటీసును కూడా తొలగించింది. ఎన్వికీలో ఈ ఖాతాకు కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంటరెస్ట్ ఉందని అనుమానించారు.

మొత్తమ్మీద..

  1. పై ఖాతాలన్నిటినీ వెంటనే శాశ్వతంగా నిరోధించాలి. కారణం: సాక్ పపెట్లు అని నిర్థారణ అయింది కాబట్టి
  2. "గ్లోబల్ టెక్ సమ్మిట్" పేజీని పరిశీలించి, ఉంచాలా, తొలగించాలా అనేది నిర్ణయించి తగు చర్యలు తీసుకోవాలి.
  3. గేదెల శ్రీనిబాబు వ్యాసాన్ని తాజాగా మళ్ళీ పరిశీలించాలి. దాని చరిత్ర, చర్చ పేజీలను కూడా చూడవలసినది.

నిర్వాహకులు ఈ అంశాన్ని పరిశీలించవలసినదిగా విజ్ఞప్తి. __ చదువరి (చర్చరచనలు) 14:04, 23 ఆగస్టు 2023 (UTC)Reply

ఆ సాక్ పప్పెట్లపై ఎన్వికీలో చేసిన దర్యాప్తు లింకు ఇవ్వడం మరచాను. ఆ వ్యవహారం ఇక్కడ చూడొచ్చు. __చదువరి (చర్చరచనలు) 14:57, 23 ఆగస్టు 2023 (UTC)Reply
పైన చెప్పిన రెండు పేజీలతో పాటు, పల్సస్ గ్రూప్ కూడా చూడండి. ఈ పేజీలను సృష్టించినది పెంచి పెద్దచేసినదీ చాలావరకూ ఈ సాక్ పపెట్లే. అది దృష్టిలో పెట్టుకుని ఈ పేజీలను పరిశీలించాలి. గేదెల శ్రీనుబాబు అనే వ్యక్తికి, వారి కంపెనీలకూ చేస్తున్న ప్రచారం లాగా అనిపిస్తోంది. వీటిపై చర్చ అవసరమని నా అభిప్రాయం. __ చదువరి (చర్చరచనలు) 23:30, 23 ఆగస్టు 2023 (UTC)Reply
చదువరి గారూ నిశితంగా పరిశీలించి తెలిపినందుకు ధన్యవాదాలు. యర్రా రామారావు (చర్చ) 14:11, 23 ఆగస్టు 2023 (UTC)Reply
ధన్యవాదాలు చదువరి గారు. గ్లోబల్ టెక్ సమ్మిట్ వ్యాసం విషయంలో meta:Talk:Wikiproject:Antispam#Global Tech Summit + related pages చర్చ జరిగింది. అందులో చూస్తే ఒక్క తెలుగులో తప్ప, దాదాపు 30కి పైగా భాషలలో పేజీని తొలగించారు. వైజాగ్ వారియర్స్, పల్సస్ గ్రూప్, గేదెల శ్రీనుబాబు పేజీల గురించి కూడా చర్చలు జరిగాయి.--ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 06:52, 24 ఆగస్టు 2023 (UTC)Reply
ఇక వేరే చర్చ అవసరంలేదు.నేరుగా ఆఖాతాలను శాశ్వతంగా నిరోధించి, వైజాగ్ వారియర్స్, పల్సస్ గ్రూప్, గేదెల శ్రీనుబాబు పేజీలను వెంటనే తొలగించవచ్చు అని నా అభిప్రాయం. యర్రా రామారావు (చర్చ) 07:10, 24 ఆగస్టు 2023 (UTC)Reply
@Pranayraj1985 గారూ, మంచి సమాచారం. @యర్రా రామారావు గారూ, ఏ నిర్ణయమైనా మిగతా నిర్వాహకులు ఏమంటారో చూసాకే తీసుకుంటే బాగుంటుంది. __ చదువరి (చర్చరచనలు) 03:26, 25 ఆగస్టు 2023 (UTC)Reply
ఆయా ఖాతాలను నిరవధికంగా నిరోధించండి. ఆయా వ్యాసాలలోని సమాచారానికి నిర్ధారించదగిన మూలాలు ఉన్నంత వరకు కుదించవచ్చును. Rajasekhar1961 (చర్చ) 07:46, 25 ఆగస్టు 2023 (UTC)Reply
పైన ప్రస్తావించిన Pkraja1234, Surya923,jags1111, Sunrise600 ఖాతాలను పరిశీలించి, సాక్ పపెట్లుగా నిర్థారించినందున ఆ ఖాతాలపై శాశ్వత నిరోధం విధించాను.--ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 06:07, 11 సెప్టెంబరు 2023 (UTC)Reply
ధన్యవాదాలు ప్రణయ్ రాజ్ యర్రా రామారావు (చర్చ) 08:38, 11 సెప్టెంబరు 2023 (UTC)Reply

అనువాద పరికరం ద్వారా "మరియు"

అనువాద పరికరం ద్వారా "మరియు" రాకుండా మనం ఒక వడపోతను సృష్టించుకున్నాం. అయితే ఇందులో "విభాగపు అనువాదం" అనే దాన్ని చేర్చలేదు. దాని ఫలితం ఇవ్వాళ పాల్ హేమాన్‎, రోమన్ రింగ్స్‎‎ అనే వ్యాసాల ద్వారా తెలిసింది. వడపోతలో ఇది కూడా చేర్చితే బాగుంటుందని నా అభిప్రాయం. నిర్వాహకులు పరిశీలించవలసినది. __ చదువరి (చర్చరచనలు) 13:20, 27 ఆగస్టు 2023 (UTC)Reply

అలాగేనండీ @Chaduvari గారు.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 05:42, 11 సెప్టెంబరు 2023 (UTC)Reply

కొత్త వ్యాసాల సృష్టి వడపోత

సభ్యులకు నమస్కారం, వికీలో రాశి కంటే వాసిని ఎక్కువగా పాటిస్తుంటాం. అయితే, కొందరు ఎక్కువ వ్యాసాలు రాయాలి అన్న ఉద్దేశ్యంతో నాణ్యత లేని వ్యాసాలను సృష్టించుకుంటూ పోతున్నారు. ఈ విషయంలో ఇతర సభ్యులు సూచనలు చేసినా వారి పద్దతి మారడంలేదు. (ఉదా: వాడుకరి చర్చ:ఉదయ్ కిరణ్). ఇలాంటి సందర్భంలో కొత్త వ్యాసాలను సృష్టించకుండా నిరోధించేలా ఎదైనా వడపోత ఉందా..?, ఒకవేళ అలాంటిది లేకుంటే తెవికీలో దానిని పెడితే ఎలా ఉంటుంది. ఈ అంశంపై సభ్యులు తమ అభిప్రాయాలు తెలుపగలరు.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 05:48, 11 సెప్టెంబరు 2023 (UTC)Reply

@ప్రణయ రాజ్ గారూ మీ అభిప్రాయల ప్రకారం వికీపీడియా:రచ్చబండ (పాలసీలు) కు ఒక ఉప పేజీ తయారుచేసి దానిని రచ్చబండలో దానిపై అభిప్రాయాలు కోరుచూ చర్చ ప్రారంభిస్తే సభ్యులు అభిప్రాయాలు తెలుపగలరు. యర్రా రామారావు (చర్చ) 03:52, 16 సెప్టెంబరు 2023 (UTC)Reply

రచ్చబండలో చట్టపరమైన చర్యలు తీసుకుంటానని బెదిరింపు

వాడుకరి:YVSREDDY గారు రచ్చబండలో, "నా వ్యాసాలను ఎందుకు తొలగిస్తున్నారో కరపత్రములు పంచి ప్రజల మధ్యనే అడుగుతాను. న్యాయస్థానమునకు ఫిర్యాదు చేస్తాను" అని రాసారు. చట్టపరమైన చర్యలు తీసుకుంటానని బెదిరించడం లాంటివి వికీపీడియాలో చేయకూడదు. అలా చేసిన వాడుకరిని నిరోధించాలి. నిర్వాహకులు దీన్ని గమనించి తెవికీ విధానం ప్రకారం ఆ వాడుకరిపై తగు చర్య తీసుకోవలసినదిగా కోరుతున్నాను. __ చదువరి (చర్చరచనలు) 14:40, 30 సెప్టెంబరు 2023 (UTC)Reply

నా వ్యాసాలను ఎందుకు తొలగిస్తున్నారో కరపత్రములు పంచి ప్రజల మధ్యనే అడుగుతాను. న్యాయస్థానమునకు ఫిర్యాదు చేస్తాను" అని వ్రాసినందుకే నన్ను నిరోధిస్తే అన్యాయంగా, అక్రమంగా, దుర్మార్గంగా నేను వ్రాసిన మంచి మంచి వ్యాసాలను తొలగించి, క్రమం తప్పకుండా ప్రతిరోజు వ్యాసాలు వ్రాస్తున్న నన్ను ఎటువంటి తప్పు లేకపోయినా పరమ దుర్మార్గంగా నీచాతి నీచంగా దిగజారి నన్ను నిరోధించిన వారిని ఇంకేమి చేయాలి. నేను కావాలనుకుంటే మా ఊరి వారి సహాకారంతో నేను నిర్వాహకుడిని కాగలను. దిగజారి నీచంగా ప్రవర్తిస్తున్న నిర్వాహకులపై చర్యలు తీసుకోగలను. YVSREDDY (చర్చ) 20:55, 30 సెప్టెంబరు 2023 (UTC)Reply
వాడుకరి:YVSREDDY గారు నిర్వాహకులపై చేసిన చట్టపరమైన బెదిరింపు వ్యాఖ్యలను ఉపసంహరించుకోక పోగా, "నీచాతి నీచంగా దిగజారి నన్ను నిరోధించిన వారిని" అనే వ్యాఖ్యను చేసి నిర్వాహకులను దూషించడం జరిగింది. ఒక వ్యాసం తొలగించాలంటే జరిగే చర్చలో అతను పాల్గొనకుండా, ఆ వ్యాసాన్ని సరైన రీతిలో విస్తరణ చెయకుండా, తొలగించినంతవరకు వేచి చూసి, తొలగించిన తరువాత దానికి మరల సృష్టిస్తున్నారు. వ్యాసం తొలగించిన నిర్వాహకులను బెదిరిస్తున్నారు, దూషిస్తున్నారు. తెవికీ విధానం ప్రకారం అతనిపై చర్యలు తీసుకోవాలి. నిర్వాహకులు స్పందిచగలరు.➤ కె.వెంకటరమణచర్చ 01:48, 1 అక్టోబరు 2023 (UTC)Reply
ఇంకో రాజకీయ పార్టీ వ్యాస తొలగింపు చర్చ సందర్బంలో YVSREDDY (చర్చ) చేసిన మరికొన్ని వ్యాఖ్యలు.
  • తప్పును తప్పు అని చెప్పగల నిర్వాహకులను వెల్లగొట్టారు. మీరు ఎన్ని తప్పులు చేస్తున్నా చూస్తూ ఉండేలా మిగతా నిర్వాహకులను భయపెడుతున్నారు.
  • ఇలాంటి విధానాల వలన ఇప్పటికే తెలుగు వికీపీడియా సర్వనాశనం అయ్యింది. నేను సృష్టించిన ప్రతి వ్యాసం ఎవరు తొలగించినా దుర్మార్గమే తప్ప మరొకటి కాదు.
ఇలాంటి వ్యాఖ్యల వల్ల వికీలో నిర్వాహకుడుగా పనిచేయాలంటే చాలా చిరాకుగా ఉంది.ఆధారాల ఉన్న అరోపణలు ఉంటే నిర్వాహకులు క్షమాపణలు చెప్పి, సవరించుకోవటానికి ఎప్పుడూ ముందు ఉంటారు.ఇవి అన్నీ ఆధారాలు లేని ఆరోపణలు.ఇది నిర్వాహకులపై దాడిమాత్రమే. ఇలాంటి అరోపణలు ఎవరు చేసినా, నేను చేసినా, YVSREDDY చేసినా, ఇంకొకరు చేసినా వారిపై చర్యలు వెంటనే తీసుకోవాలిసిందే!
ఇంకో విషయం నిర్వాహాకులుకు ఇంకో సమస్య, తప్పును ఏ సందర్బలో నైనా ప్రశ్నంచినప్పుడు, లేదా వివరణ కోరినప్పుడు వివరణ ఇవ్వకపోగా "తెలుగు వికీపీడియా సర్వనాశనం అయింది, తప్పును తప్పు అని చెప్పగల నిర్వాహకులను వెల్లగొట్టారు" అనే వ్యాఖ్యలు తరుచూ చేస్తున్నారు.ఇది చాలా త్రీవమైన విషయం.ఎవరు ఎవరిని వెళ్లగొట్టారు, వికీపీడియా ఎలా సర్వనాశనం అయింది.దానిని తగిన ఆధారాలతో వివరిస్తే సవరించుకోవచ్చు.ఒక వ్యాఖ్య మాత్రం వాడతారు.ఈమధ్య ఇది ఒక ప్యాషన్ అయింది. ఇలాంటి వ్యాఖ్యలు వాడటం మానుకోవాలి.
ఇక అన్నిటికంటే చాలా త్రీవమైన విషయం.ఇది నిర్వాహకులందరికి సంబంధించిన విషయం.నిర్వాహాకులు అందరూ దయచేసి అలోచించమని నేను చేతులెత్తి నమస్కరించి కోరుచున్నాను. నిర్వాహకుల నోటీసుబోర్డులో వచ్చిన ఇలాంటి త్రీవమైన చర్చలుకు ఎందుకు స్పందించలేకపోవుచున్నారో నాకు అర్థం అగుటలేదు.ఇది మనకు సంబందించిన విషయంకాదని స్పందించటం లేదా, లేక అవతలి వారి దృష్టిలో మీరు మంచివారు, సౌమ్యుడు అనే అభిప్రాయం కలగాలనే ఉద్ధేశ్యంతోనా, లేక మనకెందుకలే అనే నిర్లిప్తతతోనా అర్థం కావటంలేదు.
ఇంకో విషయం "తెలుగు వికీపీడియా సర్వనాశనం అయింది, తప్పును తప్పు అని చెప్పగల నిర్వాహకులను వెల్లగొట్టారు" అనే వ్యాఖ్యలకు స్పందించకుండా ఉన్నారంటే మీరూ ఆ వ్యాఖ్యలకు ఒప్పుకుంటున్నారా అనే సందేహం తలెత్తుంది.
చివరగా నేను పైన చేసిన వ్యాఖ్యలు ఎవరికైనా కష్టం కలిగిస్తే క్షమించగలరు. యర్రా రామారావు (చర్చ) 04:39, 1 అక్టోబరు 2023 (UTC)Reply
@Chaduvari @K.Venkataramana @యర్రా రామారావు గార్లకు, ఈ వాడుకరి ఇదే విధమైన ఆరోపణలకు తోడు ఇంకా తీవ్రంగా "ఎవరైతే నన్ను అన్యాయంగా నిరోధిస్తారో వారి ఇంటికే స్వయంగా వెళ్ళి అక్కడే తేల్చుకుంటాను." అంటూ భౌతిక దాడుల బెదిరింపులకు కూడా దిగడంతో పాటుగా ఈ వాడుకరి ఇంతకుముందు 2013లో మొదలై 2023 వరకూ కనీసం ఆరుసార్లు ఇలాంటి కారణాల వల్ల ముగ్గురు వేర్వేరు నిర్వాహకుల చేతిలో ఒక రోజు నుంచి వారం రోజుల వరకూ వివిధ కాలావధుల్లో నిరోధానికి గురై ఉండడం వల్ల ఆరునెలల పాటు నిరోధించాను. దీనితో పాటుగా ఆయన స్వయంగా ప్రకటించుకున్న మరో మూడు సాక్ పప్పెట్లను కూడా ఆర్నెల్లు నిరోధించాను. ఇది ఆఖరి అవకాశంగా పరిగణించి ఆరునెలల తర్వాత ఒక్కసారి దూషణకు పాల్పడినా శాశ్వత నిరోధం విధించాలని భావిస్తున్నాను. మిగిలిన వివరాల కోసం వాడుకరి చర్చా పేజీలో నిరోధం వివరాలు, వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/రాజకీయ పార్టీలో అందుకు కారణమైన చర్చ పరిశీలించగలరు. ధన్యవాదాలు. పవన్ సంతోష్ (చర్చ) 14:54, 7 అక్టోబరు 2023 (UTC)Reply

రచ్చబండలో ట్యాబ్ బార్

రచ్చబండలో పైనున్న లింకుల బార్ స్థానంలో ఒక మూస:రచ్చబండ1 పేరుతో ఒక ట్యాబ్ బార్ తయారు చేసాను. దీన్ని మూస:రచ్చబండ కు తరలిస్తే రచ్చబండలోను, దాని సంబంధిత పేజీల్లోనూ కనిపిస్తుంది. పరిశీలించవలసినది.__ చదువరి (చర్చరచనలు) 15:02, 10 అక్టోబరు 2023 (UTC)Reply

ఈ ట్యాబ్ బార్ బాగుంది. {{రచ్చబండ}} కు తరలిస్తే బాగుంటుంది.➤ కె.వెంకటరమణచర్చ 15:40, 10 అక్టోబరు 2023 (UTC)Reply
ఈ మూస బాగుంది. {{రచ్చబండ}} కు తరలించటానికి అభ్యంతరం లేదు.అలాగే అవకాశముంటే ప్రాజెక్టుల విభాగం ఒకటి అదనంగా చేర్చితే బాగుంటుదని నా అభిప్రాయం. సాంకేతికము విభాగం సాంకేతికం అని మార్చవచ్చు. యర్రా రామారావు (చర్చ) 02:45, 11 అక్టోబరు 2023 (UTC)Reply
ఇక్కడ ఎందుకు రాసానంటే దాన్ని తరలించే హక్కు నిర్వాహకులకే ఉంది -గమ్యంలో ఒక పేజీ ఈసరికే ఉంది కాబట్టి, ఈ తరలింపు చెయ్యాలంటే ఆ పేజీని తొలగించాల్సి ఉంటుంది. నేను ఆ గమ్యం పేజీని వేరే చోటికి ({{రచ్చబండ2}}) తరలించి పెట్టాను కాబట్టి, ఈ తరలింపు చేసేందుకు ఇక ఇబ్బందేమీ ఉండదు.__ చదువరి (చర్చరచనలు) 03:21, 11 అక్టోబరు 2023 (UTC)Reply
మూస:రచ్చబండ1 ను మూస:రచ్చబండ కు తరలించాను.➤ కె.వెంకటరమణచర్చ 04:39, 11 అక్టోబరు 2023 (UTC)Reply

కొత్త వాడుకరులు

"యావత్ వ్యాస స్వయం రక్షక్", "Yavath Vyasa Swayam Rakshak‎" అనే రెండు కొత్త ఖాతాలు వచ్చినై.

  1. పేర్ల లోని పదాల మొదటి అక్షరాలు చూడండి.
  2. అవి చేసిన తొలి పని చూడండి.
  3. గతంలో మనం చర్యలు తీసుకున్న ఖాతాలైన రెడ్డి గారి వ్యాసాలు, REDDY GARI VYASALU వగైరా ఖాతాల పేర్లలో పోలికలు చూడండి

ఈ రెండూ వైవియెస్ రెడ్డి గారు సృష్టించినవని నా అనుమానం. వాటినీ, ఈమధ్య సృష్టించిన ఇతర ఖాతాలనూ పరిశీలించి, తగు చర్యలు తీసుకోవలసినదిగా నిర్వాహకులను కోరుతున్నాను.

చర్యకు హేతువు: ఒక వాడుకరి (అనగా నేను) బహిరంగంగా తన అనుమానం ప్రకటించాడు. మీక్కూడా అనుమానం వస్తేనే చర్యలు మొదలుపెట్టండి. ఆ అనుమానం మీకు సహేతుకంగా తోచకపోయినట్లైతే చర్య తీసుకోనక్కర్లేదు. కానీ ఎందుకు అనుమాన పడనక్కర్లేదో వివరించవలసినదిగా అభ్యర్థన. __ చదువరి (చర్చరచనలు) 01:49, 15 అక్టోబరు 2023 (UTC)Reply

సందేహం లేదు. తరుచూ నిరోధానికి గురైతున్న , ప్రస్తుతం నిరోధంలో ఉన్న వైవియెస్ రెడ్డి గారు సృష్టించిననివేనని, నేను గట్టిగా నమ్ముతున్నాను. ఆ రెండు ఖాతాలు కూడా సాక్ ప్పెపెట్స్ గా భావించి శ్వాశ్వత నిరోధం విధించాలి. యర్రా రామారావు (చర్చ) 03:36, 15 అక్టోబరు 2023 (UTC)Reply
పైన ప్రస్తావించిన రెండు ఖాతాలు వికీ సభ్యుడు వైవియెస్ రెడ్డి గారు సృష్టించిననివేనని నేను కూడా నమ్ముతున్నాను. కాబట్టి, ఆ రెండు ఖాతాలపై శ్వాశ్వత నిరోధాన్ని విధించాలని నా అభిప్రాయం.--ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 06:50, 19 అక్టోబరు 2023 (UTC)Reply
@Pranayraj1985 గారూ, సాక్ పప్పెట్ దర్యాప్తు చేయించడం ఎలాగన్నది అనుభవజ్ఞులైన @Chaduvari గారిని అడిగి ఆ ప్రకారం చేయిద్దాం. సందేహం ఆధారంగా నిరోధం విధించడం సరికాదు. అలాగని, దర్యాప్తు చేయించకుండా ఊరుకోవడమూ సరికాదు. చదువరి గారూ, ఎలా చెయ్యాలో ఇక్కడ చెప్పండి సార్. అనుసరిస్తాము. పవన్ సంతోష్ (చర్చ) 15:02, 22 అక్టోబరు 2023 (UTC)Reply
దర్యాప్తు ఎందుకు చేయించాలో హేతువును, ఇక్కడ జరిగిన చర్చనూ ఉదహరిస్తూ, ఫలానా ఖాతా(లు) ఫలానా ఖాతా(ల)కు సంబంధించిన సాక్‌పపెట్లేమో దర్యాప్తు చెయ్యమని స్టీవార్డులను అడగాలి. సంబంధిత ఖాతాలన్నిటినీ తెలపాలి. తద్వారా అవి ఒకదానికొకటి సంబంధం ఉందా అనే విషయమై దర్యాప్తు చేస్తారు. తెవికీలో స్టీవార్డులు లేరు కాబట్టి మెటాలో అడగాలి. దర్యాప్తు చెయ్యమని అడిగే లింకు ఇది - m:Steward requests/Checkuser. __ చదువరి (చర్చరచనలు) 22:20, 22 అక్టోబరు 2023 (UTC)Reply
"చర్యలు" అనడంలో నా అభిప్రాయం - ఈ కొత్త ఖాతాలపై సాక్ పపెట్ దర్యాప్తు చేయించాలని. పరిశీలించవలసినది. __ చదువరి (చర్చరచనలు) 12:20, 19 అక్టోబరు 2023 (UTC)Reply
పవన్ సంతోష్, చదువరి గార్లకు ధన్యవాదాలు. పవన్ గారూ, దర్యాప్తు కొరకు స్టీవార్డులకు మీరు అభ్యర్థన చేయగలరా..?--ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 04:50, 27 అక్టోబరు 2023 (UTC)Reply

పివిఆర్ రాజా పేజీ, దానికి సంబంధించిన కొన్ని విశేషాలు

పివిఆర్ రాజా పేజి చరిత్రను గమనించండి. అలాగే కింది వాడుకరులను గమనించండి:

  1. Induvadhone
  2. AgniPuthra
  3. Agni Puthra 26

ఈ ఖాతాలన్నీ పివిఆర్ రాజా పేజీలో గానీ సంబంధిత పేజీల్లో గానీ పనిచేసాయి. "పివిఆర్ రాజా" పేజీని తెలుగులోనే కాక, అనేక ఇతర భాషల్లో - అస్సామీ, తమిళ, మలయాళ, హిందీ, కన్నడ, సంస్కృతం, నేపాలీ, భోజ్‌పురి, సింహళం, బెంగాలీ వగైరాలు, చెబువానో, స్పానిష్, ఒరోమో, ఇండోనేషియన్, డోటేలీ, ఐస్‌లాండిక్.. వగైరా అనేక భాషల్లో కూడా ఈ పేజీ రాయడంలో ఈ ఖాతాలకు గణనీయమైన పాత్ర ఉంది.

  1. Msnlalithprem
  2. PenVenR

- ఈ రెండూ కూడా పైవాటికి సంబంధించిన ఖాతాలే అని నాకు అనుమానం. ఇంకా ఏమైనా ఖాతాలకు వీటితో అనుబంధం ఉందేమో తెలీదు - ఉండే ఉండవచ్చు కూడా. ఒకే వ్యక్తి వివిధ ఖాతాలతో పనిచెయ్యడం - అందునా ఒకే పేజీలో పనిచెయ్యడం - సబబు కాదు. ఖాతాలు డబ్బు కోసం వికీపీడియాలో దిద్దుబాట్లు చేయడం సబబు కాదు. ఈ రెండు సందర్భాల్లోనూ ఆ సంగతిని వెల్లడించడం అవసరం ఉంది అని నా అభిప్రాయం. ఈ ఖాతాలను, వాటికి సంబంధించిన ఇతర ఖాతాలను, అవి చేసే దిద్దుబాట్లనూ నిశితంగా పరిశీలించవలసినదిగా, అవసరమైన చర్యలు తీసుకోవలసినదిగా నిర్వాహకులకు విజ్ఞప్తి.__ చదువరి (చర్చరచనలు) 00:36, 19 అక్టోబరు 2023 (UTC)Reply

పరిశీలించగా పై ఖాతాలు సాక్ పపెట్లు అని అనుమానం వస్తుంది.ఈ ఖాతాలపై తగుచర్యలు అనగా దర్యాప్తు కొరకు స్టీవార్డులకు నివేదించటానికి నేను అంగీకరిస్తున్నాను. యర్రా రామారావు (చర్చ) 13:35, 8 నవంబరు 2023 (UTC)Reply

కొన్ని మీడియావికీ అనువాదాలు

కింది మీడియావికీ పేజీల్లో అనువాదాలు చెయ్యాల్సి ఉంది.

  • మీడియావికీ:Autosumm-replace
  • మీడియావికీ:Autosumm-new
  • మీడియావికీ:Autosumm-blank
  • మీడియావికీ:Autosumm-shortnew

అధికారులు, నిర్వాహకులు గమనించవలసినదిగా అభ్యర్థన. __ చదువరి (చర్చరచనలు) 06:49, 22 అక్టోబరు 2023 (UTC)Reply

అలాగేనండీ @Chaduvari గారు.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 04:51, 27 అక్టోబరు 2023 (UTC)Reply

క్యాస్కేడింగు రక్షణ

కింది పేజీలు క్యాస్కేడింగు రక్షణలో ఉన్నాయి. దీనివలన, ఈ పేజీల్లో ట్రాన్స్‌క్లూడు చేసిన పేజీలు కూడా రక్షణ లోకి పోయాయి. వీటిని పరిశీలించి అవసరం లేనివాటికి క్యాస్కేడింగు తీసెయ్యవలసినదిగా నిర్వాహకులను అభ్యర్థిస్తున్నాను.

__ చదువరి (చర్చరచనలు) 13:22, 29 అక్టోబరు 2023 (UTC)Reply

అజ్ఞాతవాడుకరులు చేసే ఇటీవల దుశ్చర్యలు, దాడులుపై స్పందించండి

నిర్వాహకులకు, వికీ చురుకైన వాడుకరులకు అందరికి నమస్కారం.గత వారం రోజుల నుండి తెలుగు వికీపీడియాలో కొంతమంది నిర్వాహకులు, చురుకైన వాడుకరులపై మాటలలో చెప్పలేని పదాలతో విరివిగా వ్యక్తిగతదాడులు, అలాగే వారి వాడుకరులు పేజీలలో సమాచారం తుడిచివేత చేయటం జరుగుతుంది.గత వారం రోజుల నుండి వారు చేస్తున్న వ్యక్తిగత దాడులు, దుశ్చర్యల లింకులు నిర్వహకులు, వాడుకరులు గమనించారో లేదోనని ఈ చర్చను ప్రవేశపెట్టి, ఆలింకులు మీ దృష్టికి తీసుకువస్తున్నాను.

  1. వాడుకరి:యర్రా రామారావు పేజి - త్రీవమైన అస్యభ్యపదజాలంతో దూషించుట, పేజీలో సమాచారం తొలగించుట
  2. వాడుకరి చర్చ:Pranayraj1985 పేజీ - త్రీవమైన అస్యభ్యపదజాలంతో దూషించుట, పేజీలో సమాచారం తొలగించుట
  3. వాడుకరి చర్చ:Batthini Vinay Kumar Goud పేజీ - త్రీవమైన అస్యభ్యపదజాలంతో దూషించుట, పలుమార్లు పేజీలో సమాచారం తొలగించుట
  4. ఏకంగా రచ్చబండలో చచ్చిపోయిన తెలుగు వికీపీడియా - త్రీవమైన అస్యభ్యపదజాలంతో కొంతమందిని దూషించుట
  5. మరోసారి రచ్చబండలో - అదే త్రీపపదజాలంతో దూషించుట
  6. వికీపీడియా:సహాయకేంద్రం - అదే త్రీపపదజాలంతో మరోసారి దూషించుట

కొంతమంది వాడుకరుల పేజీలలో పలుమార్లు పూర్తిసమాచారంతొలగించిన సందర్బాలు చాలా ఉన్నాయి.నేను, ప్రణయ రాజ్ గారు పలుమార్లు అజ్ఞాతవాడుకరులపై నిరోధాలు విధించుట జరిగినది. మేము వీటిని పరిశీలించటానికి ఎక్కువ సమయం కేటాయించవలసిన అవసరం వస్తుంది.

భవిష్యత్తులో వీరు మమ్మల్ని దూషించినట్లు ఇంకొకరిని తిట్టకుండా లేదా దూషించకుండా వీరి ఆగడాలకు అడ్డుకట్టవేయటానికి తగుచర్యలు తీసుకోవటానికి, దీనిమీద త్రీవంగా అందరూ స్పందించి వారిమీద ఎటువంటి చర్యలు తీసుకోవాలో నిర్ణయించటానికి చర్చను ప్రవేశపెట్టాను. కావున అందరూ దయఉంచి @ వీవన్ , రాజశేఖర్ విశ్వనాథ్, రవిచంద్ర, అర్జునరావు, సుజాత, వెంకటరమణ, రహ్మానుద్దీన్, పవన్ సంతోష్, ప్రణయరాజ్, అలాగే చురుకైన వాడుకరులు @ సుశీల, సాయికిరణ్, దివ్య, భవ్య, అభిలాష్, కశ్యప్, మోతీరామ్, మురళీకృష్ణ, రామేశం, ప్రభాకరగౌడ్, స్వరలాసిక, వినయ్ కుమార్ గౌడ్, గార్లను మరోసారి గుర్తుచేస్తూ, భవిష్యత్తులో వీరు మమ్మల్ని దూషించినట్లు ఇంకొకరిని తిట్టకుండా లేదా దూషించకుండా వీరి ఆగడాలకు అడ్డుకట్టవేయటానికి, తగుచర్యలు తీసుకోవటానికి, దీనిమీద కాస్త సమయం వెచ్చించి త్రీవంగా అందరూ స్పందించవలసినదిగాను, వారిమీద ఎటువంటి చర్యలు తీసుకోవాలో నిర్ణయించవలసినదిగా మిమ్మల్ని కోరుచున్నాను. మీ స్పందనలకు ఎదురుచూస్తూ ధన్యవాదాలతో యర్రా రామారావు (చర్చ) 12:16, 10 నవంబరు 2023 (UTC)Reply

@యర్రా రామారావు గారికీ, ఇతర నిర్వాహకులకు, వాడుకరులకు,
ఈ ఐపీ శ్రేణిని వాడి పేజీలు ఖాళీ చేయడం, ఇతర దుశ్చర్యలకు పాల్పడడం కొనసాగుతున్నందున 3 నెలల పాటు ఈ ఐపీ శ్రేణిని నిరోధించాను. పవన్ సంతోష్ (చర్చ) 07:17, 16 నవంబరు 2023 (UTC)Reply
తగిన చర్యలు చేపట్టినందుకు ధన్యవాదాలు. యర్రా రామారావు (చర్చ) 07:35, 16 నవంబరు 2023 (UTC)Reply

గమనిక:పొరపాటున పింగ్ చేయని ఇతర వాడుకరులు కూడా ఈ విషయంలో స్పందించగోరుచున్నాను.ఇది నిర్వాహకుల నోటీసుబోర్డు అయినా వాడుకరులు స్పందించటానికి అభ్యంతరం లేదు.

రామారావు గారూ, ఇలాంటి దూషణలు గమనించనే లేదు. అందరి దృష్టికి తీసుకు వచ్చినందుకు మీకు ధన్యవాదాలు. ఇక మీదట కొద్ది రోజులు పాటు ఇలాంటి మార్పులపై ప్రత్యేక శృద్ధ పెడతాను. - రవిచంద్ర (చర్చ) 13:34, 10 నవంబరు 2023 (UTC)Reply
ఈ చర్చను తీసుకొచ్చినందుకు యర్రా రామారావు గారికి ధన్యవాదాలు. ఈ విషయమై గతనెల 20 తేదీన ఉదయ్ కిరణ్ గారు మొదట నా చర్చాపేజీలో రాశారు. నా సూచనతో రచ్చబండలో కూడా రాసి, నిర్వాహకులు సభ్యులు స్పందించాలని కోరాడు. అప్పుడు నేను ఆ రెండు ఐపీ అడ్రస్ లపై శాశ్వత నిరోధం విధించాను. అయితే, ఆ అజ్ఞాత వాడుకరి కొన్నిరోజుల వరకు పనిగట్టుకొని కొందరి వాడుకరి పేజీలు, వాడుకరి చర్చాపేజీలు, వ్యాసాలలో సమాచారాన్ని తీసివేశాడు. గత రెండుమూడు రోజుల నుండి చురుకైన వాడుకరులపై మాటలలో చెప్పలేని పదాలతో విరివిగా వ్యక్తిగతదాడులు చేస్తున్నాడు. ఇలాంటిది మళ్ళీ జరగకుండా చర్యలు తీసుకునేందుకు స్పందించవలసినదిగా సహ సభ్యులను కోరుతున్నాను.--ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 14:12, 10 నవంబరు 2023 (UTC)Reply
ఉదయ కిరణ్ గారిని కూడా దూషించాడు.దీనిమీద ఉదయ కిరణ్ గారు కూడా స్పందించగోరుచున్నాం. యర్రా రామారావు (చర్చ) 14:18, 10 నవంబరు 2023 (UTC)Reply
@యర్రా రామారావు గారూ, ఇది చాలా దురదృష్టకరమైన సంగతి. బాధాకరమైన విషయం. దీన్ని మనం గట్టిగా ఎదుర్కోవాలి, తప్పకుండా ఎదుర్కొందాం. దీనిపై ప్రస్తుతానికి నా అభిప్రాయాలు ఇవి:
  • అజ్ఞాత వాడుకరులు ఒక్కొక్కరినీ బ్లాక్ చేసుకుంటూ వెళ్ళడం సాధ్యమయ్యే పనికాదు. ఎన్ని చేసినా మళ్ళీ పుట్టుకువస్తూనే ఉంటాయి కొత్త ఐడీలు. కాబట్టి, శ్రేణీ నిరోధం చేయగలిగే అవకాశం ఉందేమో పరిశీలించాలి.
  • గతంలో ఇలాంటి ప్రవర్తన కారణంగా బ్లాక్ అయిన ఖాతాలతో ఈ అజ్ఞాతల ప్రవర్తనను బేరీజు వేసి సందేహం ఉన్నచోట్ల చెక్ యూజర్లకు చెప్పి ఇవి వాళ్ళ ఐడీలేనా అన్నది నిర్ధారించుకోవాలి.
ఇంకా ఆలోచించి చెప్తాను. పవన్ సంతోష్ (చర్చ) 15:37, 10 నవంబరు 2023 (UTC)Reply

ఈ రాత శైలి చూస్తుంటే ఎవరో కావాలని కొత్త వాళ్ళ ద్వారా రాయిస్తున్నారు అనిపిస్తోంది ఇలాంటి సంఘటనలు చాలా దురదృష్టకరం. ఇలాంటి వారి మీద స్పందిస్తున్న కొద్దీ వాళ్ళ లక్ష్యం నెరవేరినట్టే : Kasyap (చర్చ) 17:07, 10 నవంబరు 2023 (UTC)Reply

  1. స్పందించాలి. తీవ్రంగా స్పందించాలి. స్పందిస్తేనే ఇలాంటి వాళ్ళు ఆగుతారు. స్పందించకుండా వాళ్ళు రాసిన చెత్తను అలాగే ఉంచుకుంటే వాళ్ళ లక్ష్యం నెరవేరినట్టే.
  2. తక్షణమే శ్రేణి నిరోధం విధించాలి. ఆ తరువాత కూడా జరిగితే మరో శ్రేణి నిరోధం, మళ్ళీ జరిగితే మరో శ్రేణి.. అప్పుడు పూర్తిగా ఆగిపోతుంది. గతంలో ఇలాగే ఆగింది. ఈ శ్రేణి నిరోధాలు నిరవధికంగా ఉండకూడదు, ఆర్నెల్ల లోపు మాత్రమే ఉండాలి.
  3. మనకు చెక్‌యూజర్లు కావాలి. ఆ మధ్య ఈ విషయమ్మీద ఒక ప్రతిపాదన చేసాను గానీ పెద్దగా స్పందనల్లేవు. ఒకసారి దానిపై స్పందించండి.
  4. కొందరు నిర్వాహకులు తెవికీలో చురుగ్గా ఉండడం లేదు. వాళ్ళ అనుభవం, తెలివితేటలు, తెవికీ నియమాల పట్ల ఉండే అవగాహన వంటివి తెవికీకి ఉపయోగపడడం లేదు. వారు కనీసం ఇలాంటి సందర్భాల్లోనైనా స్పందించడం అవసరం. నిర్వాహక బాధ్యతలున్నవాళ్ళే స్పందించకపోతే ఇక సాధారణ వాడుకరుల పరిస్థితి ఏంటి?
__చదువరి (చర్చరచనలు) 00:06, 11 నవంబరు 2023 (UTC)Reply

చర్చను లేవదీసినందుకు @యర్రా రామారావు గారికి ధన్యవాదాలు. వికీపీడియాలో అజ్ఞాతవాడికరి బూతులు మాట్లాడుతూ పలు వాడుకరుల చర్చ పేజీలలో సందేశాలు పెట్టాడు. రచ్చబండలో కూడా అసభ్య పదజాలంతో పలువురు వికీపీడియాన్ లను దూషించాడు. కావాలనే ఇదంతా దీనిపై చర్య తీసుకోండి. ఉదయ్ కిరణ్ (చర్చ) 03:27, 11 నవంబరు 2023 (UTC)Reply

సైబర్ క్రైమ్‌ పోలీస్ స్టేషన్‌లో కంప్లయింట్ చేస్తే ఏమైనా ఉపయోగం ఉంటుందా? --స్వరలాసిక (చర్చ) 07:00, 11 నవంబరు 2023 (UTC)Reply

ఈ చర్చను తీసుకొచ్చినందుకు యర్రా రామారావు గారికి ధన్యవాదాలు. ఇవి చాల దురదృష్టకరమైన సంఘటనలు. కొంత ఉత్సాహం కూడకట్టుకుని, తమ సమయాన్ని వెచ్చించి తెవికీ లో పనిచేసే వారందరికీ మనస్థాపం కలుగుతుంది, ముఖ్యంగా మాలాంటి కొత్తవారికి నిరుత్సాహంగా ఉంటుంది. నిర్వాహకులు సముచితమైన నిర్ణయం తీసుకుని ఈ రకమైన దురదృష్టకరమైన సంఘటనలు పునరావృతం కాకుండా, తెవికీ వేదికను ఆరోగ్యవంతంగా, ఉత్సాహకరంగా కొనసాగించాలని కోరుకుంటున్నాను. --VJS (చర్చ) 09:59, 11 నవంబరు 2023 (UTC)Reply

ఇదివరకూ తమిళ వికీపీడియాలో, నిత్యమూ ఆంగ్ల వికీపీడియాలో, నేను పని చేసే రోజుల్లో సీఐఎస్(మెటా) పేజీల్లో ఇలాంటి ఆకతాయిలు నిత్యం దూషణలకు వచ్చే వాళ్ళు. ఆ వ్యక్తి దూషించిన విధానాన్ని బట్టి మనందరి గురించిన వ్యక్తిగత విషయాలు అతనికి/ఆమెకు తెలిసి ఉన్నట్టు తెలుస్తోంది. ఆయా ఐపి అడ్రస్సులను సాక్‌పప్పెట్ విచారణకు పరిశీలించినట్టు పరిశీలించి ఆయా ఐపి అడ్రస్సులపై శాశ్వత నిరోధచర్య తీసుకోవాలని నా అభిమతం. దీనిపై చర్చించి ఒక నిర్ణయం తీసుకుందాం. ఆరోగ్యవంతంగా వికీ ఉన్నన్ని రోజులే మనం చక్కగా పని చేయగలం. ఇలాంటి దూషణలు కచ్చితంగా తెవికీలో రాకూడదు. --రహ్మానుద్దీన్ (చర్చ) 06:46, 12 నవంబరు 2023 (UTC)Reply
ఇప్పుడే చూసా.. చాలా ఘొరంగా ఉన్నాయి రాతలు. ఇలాంటి వారిపై ఖచ్చితంగా చర్యలు తీసుకొవాలి..--B.K.Viswanadh (చర్చ) 16:54, 15 నవంబరు 2023 (UTC)Reply

చర్చ మొదలుపెట్టి 10 రోజులై పోయింది. స్పందన అంతంత మాత్రం గానే ఉంది. కొందరు నిర్వాహకులు అసలు స్పందించనే లేదు, దుర్దృష్టం.

రహ్మానుద్దీన్ గారూ, B.K.Viswanadh గారూ, నిర్వాహకులైన మీరిద్దరూ స్పందించడం సంతోషం కలిగిస్తోంది. వెంకటరమణ గారు, రవిచంద్ర గారలు ఇప్పటి దాకా మొదటి పేజీలో ఈ వారం వ్యాసం శీర్షికను నిరంతరాయంగా నడిపిస్తూ వస్తున్నారు. ప్రస్తుతం వాళ్ళిద్దరూ బిజీగా ఉన్నారేమో.. దాని నిర్వహణ కొంచెం నెమ్మదించింది. మీరిద్దరూ ఆ పనికి పూనుకోవలసినదిగా కోరుతున్నాను. నమస్కారం.

ఈ చర్చలో ఉదహరించిన లింకుల్లో అజ్ఞాతల రాతలు చాలా అసభ్యంగా ఉన్నాయి. వాటిని ఈసరికే పేజీ నుండి తొలగించారు. కానీ పేజీ చరిత్రలో కూడా కనబడకుండా తొలగించాలని నిర్వాహకులను కోరుతున్నాను. ఈ చర్చ ఎలాగూ ఇకపై కొనసాగేట్లు కనబడ్డం లేదు కాబట్టి వాటిని చరిత్రలో కనబడకుండా చేస్తే ఇబ్బందేమీ ఉండదని నా అభిప్రాయం. పరిశీలించవలసినది. __చదువరి (చర్చరచనలు) 08:50, 19 నవంబరు 2023 (UTC)Reply

చదువరి గారు సూచించిన ప్రకారం పైన ఉదహరించిన లింకుల్లో అజ్ఞాతల అసభ్య రాతలు పూర్తిగా రూపుమాపాలి.ఈ పనిపై పవన్ సంతోష్ గారు తగిన చర్యలు చేపట్టగలందులకు కోరుచున్నాను. యర్రా రామారావు (చర్చ) 12:04, 20 నవంబరు 2023 (UTC)Reply
@Chaduvari గారూ, నాకు పేజీ చరిత్రలో కనిపించకుండా తొలగించడం ఎలాగన్నది తెలియదండీ. ఇంతకుముందు ఎప్పుడూ చెయ్యలేదు. మీరు నేర్పితే నేర్చుకుని చేస్తాను. పవన్ సంతోష్ (చర్చ) 05:23, 21 నవంబరు 2023 (UTC)Reply
@Chaduvari గారూ, నేనిప్పుడు రివిజన్ ఎవరు డిలీట్ చేయగలరని పరిశీలించి చూశాను. ప్రత్యేక:గుంపుహక్కులజాబితాలో చూస్తే deleterevision అన్నది సప్రెసర్లు చేయాలని ఉంది, తెలుగు వికీపీడియాలో ఆ గుంపు జాబితాలో ఎవ్వరూ లేరు. మెటాలో దీనికి సంబంధించిన పాలసీ (Oversight policy) చూస్తే "oversighters, stewards and users in the staff global user group"లకు మాత్రమే ఈ వీలు ఉంటుందని రాసి ఉంది. ఈ లెక్కన మనం దీర్ఘకాలికంగా చూస్తే ఒకరిద్దరిని ఈ సప్రెసర్లుగా నియమించడం, ప్రస్తుతానికి తక్షణం ఇక్కడ ఏయే రివిజన్లను తొలగించాలో ఒక జాబితా వేసుకుని వాటిని తొలగించడానికి చర్చ జరిపి స్టీవార్డులను ఆ పనిచేయమని కోరడం చేయకతప్పదు. పవన్ సంతోష్ (చర్చ) 09:49, 21 నవంబరు 2023 (UTC)Reply
Pavan santhosh.s గారూ, నేను ఖచ్చితంగా చెప్పగలను నిర్వాహకులకు/అధికారులకు ఆ అనుమతి ఉంది. నేను నిర్వాహకుడిగా/అధికారిగా ఉండగా ఈ పని ఒకసారి చేసాను. మళ్ళీ ఒకసారి చూడండి. ఈ అనుమతుల్లో ఒకేలా ఉండేవి, లక్షణాల్లో కొద్దిగా తేడాగా ఉండేవి, ఒకటి రెండు ఉంటాయి. ఉదాహరణకు సప్రెస్, సప్రెస్ రివిజన్, డిలీట్ రివిజన్.. ఇలాంటివి. మీ హోదాకు ఇలాంటివి ఏమి ఉన్నాయో చూడండి.
నేను ఇప్పుడు నిర్వాహకుణ్ణి కాను కాబట్టి ఆ లింకులు నాకు కనబడవు, గతంలో ఎక్కడ ఉన్నాయో గుర్తు లేదు. అంచేత ఖచ్చితంగా చెప్పలేను గానీ.. ఇలా ప్రయత్నించండి:
  • పేజీ చరిత్రకు వెళ్ళండి.
  • ఏ కూర్పును చూపకూడదో దాన్ని ఎంచుకోండి - రేడియో బటన్ను కాదు, చతురస్రపు పెట్టెను.
  • పేజీకి పైన "ఎంచుకున్న కూర్పులను చూపు/దాచు" లాంటి బొత్తాం ఉండవచ్చు చూడండి. ఉంటే దాన్ని నొక్కండి.
ప్రయత్నించండి.__చదువరి (చర్చరచనలు) 10:25, 21 నవంబరు 2023 (UTC)Reply
ప్రస్తుతం ఉన్న వారి నుండి చురుగ్గా ఉన్న ఒక వాడుకరిని అధికారిగా నియమించడం చేస్తే బావుంటుంది. --B.K.Viswanadh (చర్చ) 02:42, 24 నవంబరు 2023 (UTC)Reply
@B.K.Viswanadh గారూ, చురుకైన వాడుకరులు ఇద్దరిని అధికారులుగా ఇటీవలే నియమించాం. అలా నియమితులైన @Pranayraj1985 గారూ, @రవిచంద్ర గారూ ఎప్పటికప్పుడు చురుగ్గానే చర్యలు తీసుకుంటున్నారు. నిజానికి, అధికారుల సంఖ్య పెరగడం దీనికి పరిష్కారం కాదు. ఎందుకంటే - ఈ సమస్యపై నిర్వాహకులు ఏమేం చర్యలు తీసుకోగలరో, అధికారులూ అవే తీసుకోగలరు. నాకు తెలిసినంతవరకూ ఇద్దరూ ఈ విషయంలో సమానమే.
సమస్య ఎక్కడ వస్తోందంటే -
ఒకటి: ఇలాంటి దాడులు తిప్పటికొట్టడానికి ఎక్కువమంది నిర్వాహకులు చురుగ్గా పనిచేయాలి. మన దగ్గర చురుగ్గా ఉన్న కొద్దిమందీ తంటాలు పడాల్సివస్తోంది.
రెండు: ఇప్పుడు చురుగ్గా పనిచేస్తున్న అధికారులూ నిర్వాహకులకు ఇంకా మెరుగ్గా పనిచేయడంపై శిక్షణ అవసరం. అలా మెరుగ్గా పనిచేయడంపై శిక్షణ పొందాల్సిన జాబితాలో నేనూ ఉన్నాను.
శిక్షణ అవసరం అని తెలిసింది కాబట్టి దాన్ని ఇప్పించడానికి తెలుగు వికీమీడియన్స్ యూజర్ గ్రూప్ తరఫున ఏదో ఒక పనిచేయొచ్చు. ఆన్లైన్ శిక్షణా తరగతులు ఏర్పాటుచేయవచ్చు. గట్టిగా మాట్లాడితే - మెటాలో వెతికి చదువుకుంటే దొరకని విషయమంటూ ఉండదు. ఎలాగోలా పరిష్కరించుకోవచ్చు. కానీ, కష్టమైన, బాగా ప్రయోజనకరమైన పని ఏమిటంటే ఎక్కువమంది నిర్వాహకులు చురుగ్గా పనిచేసే స్థితిని సాధించడం. పవన్ సంతోష్ (చర్చ) 07:52, 24 నవంబరు 2023 (UTC)Reply
@పవన్ సంతోష్ గారి అభిప్రాయాలతో నేనూ ఏకీభవిస్తున్నాను. నిర్వాహకత్వం హోదా ఉన్నవారు నాతో కలిపి ప్రస్తుతం 11 మంది ఉన్నారు. వారిలో బహు కొద్ది మంది (ముగ్గురు లేదా నలుగురు మాత్రమే కంటిన్యూగా చురుకుగా ఉండి అజ్ఞాత వాడుకరుల చేసే దుశ్చర్యలు పరిశీలించి, త్రిప్పి కొట్టడం, పదే పదే అదే పనులుచేసే ఐడిలపై నిరోధం విధించటం జరుగుతుంది. వారితోటే గాదు సమస్య, రిజిష్టరైన వాడుకరులు కూడా కొందరు తెలిసో తెలియకో కొన్ని దుశ్చర్యలు చేస్తుంటే వారికి హెచ్చరికలు చేయటం, వాటిమీద తగిన చర్యలు తీసుకోవటం జరుగుతుంది.ఎవరికైనా మనస్సులో ఇలా అనిపించవచ్చు. "మీకే మీరు పదవీ విరమణ చేసి ఖాళీగా ఉన్నారు.మాకు ఇదే పనికాదుగదా". నిజమే వికీపీడియా వృత్తిగాదు. ప్రవృత్తి మాత్రమే. దానికి నేనే గాదు ఎవ్వరైనా ఒప్పుకోవాలి. ఇది నిర్వాహకత్వం దృష్టిలో పెట్టుకుని చెపుతున్నాను. నిజమే అందరూ అన్నీ చేయలేరు. కానీ నిర్వాహకత్వం పదవీలో ఉండి, నిర్వాహకుల నోటీసుబోర్డులో ప్రవేశపెట్టిన చర్చలలో పాల్గొనకపోవటం ఎంతవరకు సబబు అనేది నాప్రశ్న.చర్చలలో ఇద్దరు లేదా ముగ్గురు మాత్రమే పాల్గొనటం జరుగుతుంది.అలాగే ఒక్కోసారి రచ్చబండలో కీలకమైన చర్చలు ఉన్నప్పుడు కూడా ఇదే పరిస్థితి ఉంది. దీనికి ఉదాహరణగా ఇటీవల జరిగిన కీలకమైన చర్చ లింకు చూడండి. చూసి ఆలోచించగలరు. మరో ముఖ్యమైన విషయం చదువరి గారు తను నిర్వాహకత్వానికి న్యాయం చేసే అవకాశం లేనందున స్వచ్చంధంగా తప్పుకున్న సంగతి మనందరికి తెలుసు.ప్రతి నిర్వాహకత్వ పనులలో నిత్యం చురుకుగా ఉండే వారు తప్పుకోవటం కూడా వికీకి తీరని నష్టం.అలాగే చురుకైన వాడుకరులు స్వచ్చంధంగా నిర్వాహాకత్వానికి ముందుకు వస్తే వార్కి ఆరు నెలలు నిర్వాహకత్వపదవి అప్పగించి, వారు సక్రమంగా ఆపనిని నిర్వహిస్తే ఆతరువాత వారిని సముదాయం రెగ్యులర్ నిర్వాహకులుగా నియమిస్తే బాగుంటుందని నాసూచన.ధన్యవాదాలు యర్రా రామారావు (చర్చ) 09:39, 24 నవంబరు 2023 (UTC)Reply
ముందు ఆ బూతులను కనబడకుండా చేసేందుకు నిర్వాహకులు ఎవరైనా ప్రయత్నం చేస్తే బాగుంటుంది. అవసరమైతే నేను సాయం చేస్తాను.__ చదువరి (చర్చరచనలు) 03:42, 25 నవంబరు 2023 (UTC)Reply
నాకు అంతపరిజ్ఞానం లేనందున @పవన్ సంతోష్ , @రవిచంద్ర , @ప్రణయ్ రాజ్, @విశ్వనాథ్ ఈ నిర్వాహకులలో ఎవరో ఒకరు ఈ పనిలో సహకరించగలందులకు కోరుచున్నాను. యర్రా రామారావు (చర్చ) 04:07, 25 నవంబరు 2023 (UTC)Reply
@Chaduvari గారూ, నా చర్చాపేజీలో ఒక దిద్దుబాటును తొలిగించాను. దానిని ఒకసారి పరిశీలించి మీరు చెప్పినది ఇదేనా అనేది తెలియజేయగలరు.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 04:12, 25 నవంబరు 2023 (UTC)Reply
@Pranayraj1985 గారూ, అయిందండి. నేను ఆ తేడా లింకుకు వెళ్ళి చూసాను. కింది సందేశం చూపించింది:
"మీరు ఈ తేడాను చూడలేరు. ఎందుకంటే ఒక కూర్పు తొలగించబడింది. తొలగింపు చిట్టాలో వివరాలు చూడవచ్చు."
అయితే మీరు అధికారి. అధికారికే కాకుండా, నిర్వాహకులకు కూడా ఈ అనుమతి ఉందని నా అభిప్రాయం. నిర్వాహకులు కూడా ఎవరైనా ఈ పని చేసి చూస్తే బాగుంటుంది. విషయం స్పష్టమౌతుంది.__ చదువరి (చర్చరచనలు) 04:24, 25 నవంబరు 2023 (UTC)Reply
ధన్యవాదాలు @Chaduvari గారు... ఈ చర్చ ప్రారంభంలో రామారావు గారు ప్రస్తావించిన ఆరు లింకులలోని పై నాలుగు లింకులలో దిద్దుబాట్లను తొలిగించాను. నిర్వాహకులకు కూడా ఈ తొలగింపు అనుమతి ఉందో లేదో ప్రయత్నించడానికి కింది రెండు లింకులలో దిద్దుబాట్లను అలానే ఉంచాను. వాటిని ఇతర నిర్వాహకులు ప్రయత్నాంచాలని కోరుతున్నాను.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 04:36, 25 నవంబరు 2023 (UTC)Reply
నిర్వాహకులకు కూడా ఈ తొలగింపు అనుమతి ఉంది.@ప్రణయ్ రాజ్ గారు నిర్వాహకుల ట్రైల్ కోసం ఉంచిన లింకుకూర్పు నేను పూర్తిగా తొలగించాను.నిర్వాహకులు గమనించగలరు. ఈ విషయంలో సహకరించిన చదువరి గార్కి, అలాగే ముందుకువచ్చి తగిన చర్యలు చేపట్టినందుకు ప్రణయ్ రాజ్ గార్కి ధన్యవాదాలు. , (చర్చ) 05:29, 25 నవంబరు 2023 (UTC)Reply
ధన్యవాదాలు @యర్రా రామారావు గారు.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 10:20, 25 నవంబరు 2023 (UTC)Reply
@యర్రా రామారావు గారూ, @Pranayraj1985 గారూ, ధన్యవాదాలు. @Chaduvari గారూ, మీరు చెప్పినా కూడా ఎందుకో నాకు ఎలా చేయాలో అర్థం కాలేదు. మీ ముగ్గురిలో ఎవరో ఒకరి నుంచి ఇది త్వరలోనే నేర్చుకుంటాను. మన్నించాలి. పవన్ సంతోష్ (చర్చ) 08:36, 26 నవంబరు 2023 (UTC)Reply
సహ వికీ మిత్రులు క్షమించాలి. వేరే పనిలో సమయాభావం వలన త్వరగా స్పందించలేకపొయాను. ఈ చర్చలొ పాల్గొని మళ్ళీ వచ్చే సరికి ప్రణయ్ రాజ్, యర్రా రామారావు గార్లు స్పందించి వాటిని తొలగించారు. వారికి ధన్యవాదాలు..--B.K.Viswanadh (చర్చ) 13:33, 4 డిసెంబరు 2023 (UTC)Reply

నా వాడుకరి ఖాతాలోకి లాగినయ్యేందుకు ప్రయత్నాలు

గంట క్రితం నా వాడుకరి ఖాతాలోకి లాగినయ్యేందుకు మూడు విఫలయత్నాలు జరిగాయని మెయిల్ వచ్చింది. దుశ్చర్యల మీద క్రియాశీలంగా స్పందిస్తూ, ఆ అసభ్య రాతను, దాడులను అడ్డుకుంటున్న సందర్భంలోనే ఇవన్నీ జరగడం చూస్తే రెంటికీ సంబంధం ఉందేమోనన్న సందేహం కలుగుతోంది. ఇలాంటి మెయిల్ పనిచేస్తున్న నిర్వాహకులకు, ఈ అంశంలో క్రియాశీలంగా ఉన్న వాడుకరులకు ఇంకెవరికైనా వచ్చిందా? పవన్ సంతోష్ (చర్చ) 05:16, 21 నవంబరు 2023 (UTC)Reply

పవన్ సంతోష్ గారూ నాకైతే రాలేదండీ. యర్రా రామారావు (చర్చ) 05:35, 21 నవంబరు 2023 (UTC)Reply
@యర్రా రామారావు గారూ, స్పందించినందుకు ధన్యవాదాలండీ. జరగకపోతే మంచిదే కదా. అయితే, మన జాగ్రత్తల్లో మనం ఉందాం. పవన్ సంతోష్ (చర్చ) 06:17, 21 నవంబరు 2023 (UTC)Reply
పవన్ సంతోష్ గారూ, సందేహమేమీ లేదు, అదే. దుష్టశిక్షణ సమయంలో ఆరిపోయే దీపాలు చేసే చివరి చర్యలివి. గతంలో నాకూ ఇలాగే జరిగింది. అవసరమనుకుంటే సంకేతపదం మార్చిపెట్టుకోండి. __చదువరి (చర్చరచనలు) 10:35, 21 నవంబరు 2023 (UTC)Reply
ఇది చాలా త్రీవమైన విషయంగా పరిగణించాలి.చురుకుగా ఉండే వాడుకరులును, నిర్వాహకులను టార్గెట్ చేస్తున్నట్లుగా ఉంది.దీనిమీద మరింత అవసరమైన చర్యలు తీసుకోవలసిన అవసరం ఉంది.ఇంకా ఎవరికైనా ఇలాంటి సందర్బాలు ఉంటే తెలియపర్చగలరు. యర్రా రామారావు (చర్చ) 11:27, 21 నవంబరు 2023 (UTC)Reply
ఇలాంటి రెండు మూడు సంఘటనలు, ఫోనులో బెదిరింపులను ఎదుర్కొన్నాను. వీటిని తీవ్రంగా పరిగణించి, సదరు వాడుకరులపై తీవ్రమైన చర్య తీసుకోవలసి వున్నది.--Rajasekhar1961 (చర్చ) 10:14, 26 నవంబరు 2023 (UTC)Reply
@రాజశేఖర్ గారూ ఇవి తాజాగా జరిగాయా లేక మీకు ఎప్పుడో గతంలో జరిగినవాటి గురించి చెపుతున్నారా వివరించగలరు. యర్రా రామారావు (చర్చ) 10:39, 26 నవంబరు 2023 (UTC)Reply

గేదెల శ్రీనుబాబు పేజీ

గేదెల శ్రీనుబాబు పేజీని గతంలో తొలగించారు. దానిపై ఈ పేజీ లోనే జరిగిన చర్చను ఇక్కడ చూడవచ్చు. అలాగే ఆ పేజీ చర్చలో కూడా చూడవచ్చు.

వాడుకరి:Teluguapts108 అనే కొత్త వాడుకరి ఆ పేజీని మళ్ళీ అదే పాఠ్యంతో తిరిగి సృష్టించారు. ఆ వాడుకరి చేసిన ఒకే ఒక్క దిద్దుబాటు ఆ పేజీ సృష్టి.

పై రెండు చర్చలనూ పరిశీలించి ఈ పేజీ పైన, ఈ వాడుకరి పైనా తగు చర్య తీసుకోవలసినదిగా నిర్వాహకులకు అభ్యర్థన. __ చదువరి (చర్చరచనలు) 05:41, 1 డిసెంబరు 2023 (UTC)Reply

ఆ పేజీని నేను నిన్ననే చూసాను.ముందు ఆపేజీని తొలగించి, ఈ వాడుకరి:Teluguapts108 సాక్ పప్పట్ అనే నా అనుమానం.దీనిమీద స్టీవార్డ్ కు వెంటనే రాసి నిర్థారించిన తరువాత నిరోధం విధించాలి. నేను ఈ లింకులో వేరే వారి సందర్బంలో స్టీవార్డ్ కు గత నెల 7న రాసాను.అది నేను మొదటిసారి రాయటం.సరిగా రాసానో లేదో తెలియదు.ఆ లింకును @చదువరి గారు ఒకసారి పరిశీలించగలరు.గేదెల శ్రీనుబాబు పేజీని గుర్తించి నిర్వాహకుల నోటీసు బోర్డుకు తెలిపినందుకు ధన్యవాదాలు. యర్రా రామారావు (చర్చ) 06:18, 1 డిసెంబరు 2023 (UTC)Reply

కొత్త వాడుకరి గుంపులు

మనకు patroller అనే వాడుకరి గుంపు అవసరమని నాకు అనిపిస్తోంది.

కొత్తపేజీల తనిఖీ/పర్యవేక్షణ అనేది అందరం (నిర్వాహకులు మాత్రమే కాదు) చెయ్యాల్సిన పని. నిరంతరం జరుగుతూ ఉండాల్సిన పని. వాడుకరుల్లో కొందరు ఈ పని చేస్తూ ఉన్నప్పటికీ, దానిపై ఉండాల్సినంత ఫోకస్ మనం పెట్టడం లేదని అనిపిస్తూ ఉంది. ఈ పని కోసమే ప్రత్యేకించిన వాడుకరి గుంపు (patroller) మనకు లేదు. ఈ గుంపును చేర్చి, అందులో ఆసక్తి ఉన్నవారిని చేర్చాలి. తద్వారా ఆ గుంపు సభ్యులకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు వచ్చి, మరింత ఉత్సాహంతో పనిచేందుకు దోహదపడుతుంది అని నా అభిప్రాయం. నిర్వాహకులు దీనిపై కింది చర్యలు తీసుకోవలసినదిగా కోరుతున్నాను

  • గుంపు ఆవశ్యకతను వివరిస్తూ, ఒక ప్రతిపాదనను సముదాయ పరిశీలనకు పెట్టడం
  • అక్కడి స్పందనను బట్టి, ఈ గుంపు ఏర్పాటుకు తదుపరి చర్యలు తీసుకోవడం
  • ఈ గుంపు పనిచేసే విధానాలు, పద్ధతులతో ఒక మార్గదర్శక పేజీ రూపొందించడం
  • ఆసక్తి ఉన్న సభ్యులను ఈ గుంపులో చేర్చడం

పరిశీలించవలసినది.__ చదువరి (చర్చరచనలు) 06:22, 1 డిసెంబరు 2023 (UTC)Reply

@చదువరి గారూ ఇది మంచి ఆలోచన. దీని సంబందించిన ఆంగ్ల వికీపీడియా లింకు Wikipedia:Patrollers చూసాను.ముందుగా దీనిని తెలుగులోకి అనువదించి, పేజీ లింకుతో ప్రతిపాదన ప్రవేశపెడితే బాగుంటుందని నా అభిప్రాయం యర్రా రామారావు (చర్చ) 07:07, 1 డిసెంబరు 2023 (UTC)Reply

గేదెల శ్రీనుబాబు పేజీ

గేదెల శ్రీనుబాబు పేజీని పదే పదే సృష్టిస్తున్నారు. దాన్ని సంరక్షించాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు కొద్దిమార్పు పేర్లను - "గేదెల శ్రీను బాబు", "శ్రీనుబాబు గేదెల", "శ్రీను బాబు గేదెల" లాంటి శీర్షికలను - కూడా నిరోధించాలి. నిర్వాహకులు పరిశీలించవలసినది. __ చదువరి (చర్చరచనలు) 08:27, 7 జనవరి 2024 (UTC)Reply

మీరు చెప్పినది నిజమే @Chaduvari గారు. చివరిసారిగా నిన్న ఆ పేజీ తొలిగించినపుడు, నాకు ఇదే ఆలోచన వచ్చింది. పైన మీరు ఉదహరించిన శీర్షికలను నిరోధించాలని నా అభిప్రాయం.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 08:36, 7 జనవరి 2024 (UTC)Reply
ఆ శీర్షికలను నిరోధించాను @Chaduvari గారు.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 09:17, 7 జనవరి 2024 (UTC)Reply
మంచిపని చేసారు. యర్రా రామారావు (చర్చ) 12:30, 7 జనవరి 2024 (UTC)Reply

కొత్త వాడుకరి గుంపులు అవసరం

తెవికీలో కొన్ని కొత్త వాడుకరి గుంపుల అవసరం ఉందని భావిస్తున్నాను. నిర్వాహకులకు ఉండే అనుమతులలో కొన్నిటిని ఈ కొత్త గుంపులకు ఇస్తే వాటిని వాడుకరులకు ఇచ్చే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు, ఏదైనా మూసను లేదా ఇతర పేజీలను ఇతర వికీల నుండి దిగుమతి చేసుకునేందుకు ప్రస్తుతం నిర్వాహకులను అభ్యర్థించాల్సి వస్తోంది. అదే "దిగుమతిదారులు" అనే గుంపు ఉంటే అందులో సభ్యులకు ఈ అనుమతి ఉంటుంది. నిర్వాహకులే చెయ్యాల్సిన ఆవశ్యకత ఉండదు. తద్వారా నిర్వాహకులపై ఒత్తిడి తగ్గుతుంది. (ప్రస్తుతం మనకు "దిగుమతిదారులు" గుంపు ఉంది. ఈ గుంపులో ప్రస్తుతం సభ్యులు ఎవరూ లేరు లెండి. ఈ బాధ్యతపై ఆసక్తి ఉన్నవారిని ఈ గుంపు లోకి చేర్చవచ్చు). ఇలాంటివే మరికొన్ని గుంపులు ఉన్నాయి. అవి:

  • New page reviewers (patroller): చాలా ముఖ్యమైన గుంపు ఇది. నిర్వాహకత్వం పొందగోరే అభ్యర్థులు ఈ పనులు చెయ్యాలని మనం చెబుతున్నాం. ఈ గుంపు లోని వారు చేసే పని అదే.
  • Rollbackers: మరొక ముఖ్యమైన గుంపు. దుశ్చర్యలను రద్దు చెయ్యడంలో పనికొచ్చే ముఖ్యమైన అనుమతి.
  • Page movers: మామూలు తరలింపులకు ఉండని పేజీ తొలగింపు అనుమతి వీరికి ఉంటుంది. కొన్ని ఇతర అనుమతులూ ఉన్నాయి
  • File movers: దస్త్రాలను తరలించడం. ఇది అంతగా జరగనప్పటికీ తరలించాల్సిన అవసరం ఉన్నవి ఉండొచ్చు.

ఈ గుంపులేవీ ప్రస్తుతం తెవికీలో లేవు. వీటి వలన నిర్వాహకులపై ఒత్తిడి తగ్గడమే కాకుండా ఈ సభ్యులు నిర్వాహకులు అయ్యేందుకు తగు అర్హతలు సాధించడంలో పనికొస్తుంది. వీటితో పాటు -

  • Autopatrolled అనే గుంపు కూడా ఉంటే బాగుంటుంది. దీనిద్వారా ప్రత్యేకమైన అనుమతులు ఏమీ సంక్రమించవు గానీ, వీరు సృష్టించే పేజీలను తనిఖీ చెయ్యాల్సిన అవసరం లేదు అని అర్థం. తద్వారా పై patroller గుంపు లోని సభ్యులు చెయ్యాల్సిన పని తగ్గిపోతుంది.


నిర్వాహకులు దీన్ని పరిశీళించి, ఈ గుంపులను తెవికీలో చేర్చేందుకు తగు చర్యలు తీసుకోవలసినదిగా మనవి. __ చదువరి (చర్చరచనలు) 06:10, 30 మార్చి 2024 (UTC)Reply

పెద్దలు దీన్ని చూసినట్టు లేరు__ చదువరి (చర్చరచనలు) 01:45, 4 ఏప్రిల్ 2024 (UTC)Reply
నేను చూసాను. తరవాత స్పందిదాం అనుకున్నాను. మర్చి పోయాను. స్పందించని నిర్వాహకులు తక్కువగా ఉన్న ఈ సమయములో ఇవి అవసరం. నాకు సమ్మతమే. యర్రా రామారావు (చర్చ) 02:34, 4 ఏప్రిల్ 2024 (UTC)Reply
చదువరి గారు సూచించిన కొత్త వాడుకరి గుంపులు అవసరమని భావిస్తూ, నేను సమ్మతిస్తున్నాను.--ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 03:34, 4 ఏప్రిల్ 2024 (UTC)Reply
కొత్త వాడుకరి గుంపులు అవసరమని భావిస్తూ, నేను సమ్మతిస్తున్నాను➤ కె.వెంకటరమణచర్చ 12:28, 4 ఏప్రిల్ 2024 (UTC)Reply

దిగుమతులు చేసినపుడు..

ఎన్వికీ నుండి మూసలను, మాడ్యూళ్ళను "మళ్ళీ" దిగుమతి చేసినపుడు, చాలా సందర్భాల్లో వాటిలో మనం గతంలో చేసుకున్న మార్పులు పోతాయి. అందువల్ల వాటిని వాడిన పేజీల్లో మార్పులు చోటు చేసుకుంటాయి. దిగుమతుల ద్వారా కొత్త కూర్పులు తెచ్చుకోవడమనేది తప్పనిసరి. అయితే దిగుమతి చేసినవారు వాటిని గమనించి మనం చేసిన మార్పులను మళ్ళీ కొత్త కూర్పులో చేయాలి. గమనించవలసినది.

ఈ మధ్య మనం మాడ్యూల్:Age అనే మూసను దిగుమతి చేసుకున్నాం. ఆ మాడ్యూల్లో గతంలో తేదీ ఆకృతి మార్చుకున్నాం, అనువాదాలు చేసుకున్నాం. వాటిలో కొన్ని ఈ కొత్త కూర్పుతో పోయాయి. దాంతో సమాచార పెట్టెల్లో తేదీ ఆకృతి మారిపోయింది. "వయసు" అని ఉండాల్సిన చోట age అని aged అనీ వస్తోంది. ఉదాహరణకు మారియా లూయిసా రాస్ లాండా పేజీలో సమాచారపెట్టెను చూడవచ్చు. అలాగే రోజులు నెలలు సంవత్సరాలు వగైరా అనువాదాలు వెనక్కి పోయాయి.

పై మాడ్యూలులో గతంలో చేసిన మార్పులను మళ్ళీ చెయ్యాలి. మనం చేసుకున్న మార్పులు ఏమేం పోయాయో ఈ కూర్పులో చూదవచ్చు. ఆ మార్పులను ఈ కొత్త కూర్పులో మళ్ళీ చెయ్యాలని నిర్వాహకులకు విజ్ఞప్తి. __ చదువరి (చర్చరచనలు) 09:00, 8 ఏప్రిల్ 2024 (UTC)Reply

@చదువరి గారూ గమనించి తెలిపినందుకు ధన్యవాదాలు.నేను నాకు తెలిసినంతవరకు సవరించాను.మారియా లూయిసా రాస్ లాండా లో పరిశీలిస్తే మరణం దగ్గర y అని చూపిస్తుంది. లోపం ఉన్నట్లు తెలుస్తుంది. యర్రా రామారావు (చర్చ) 10:19, 8 ఏప్రిల్ 2024 (UTC)Reply
@యర్రా రామారావు గారూ, పైన నేను చూపిన తేడాలో గతంలో ఎలా ఉండేదో పాత కూర్పులో చూడవచ్చు. అది ఎలా ఉందో అలానే చేస్తే సరిపోతుంది. ఒకసారి అది చూడండి. '%-Y %B %-d' అని మార్చాలనుకుంటాను. పరిశీలించండి.__ చదువరి (చర్చరచనలు) 13:00, 8 ఏప్రిల్ 2024 (UTC)Reply
సరిచేసాను. యర్రా రామారావు (చర్చ) 13:42, 8 ఏప్రిల్ 2024 (UTC)Reply
లోపాన్ని గుర్తించిన చదువరి గారికి, దానిని సరిచేసిన యర్రా రామారావు గారికి ధన్యవాదాలు.--ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 14:09, 8 ఏప్రిల్ 2024 (UTC)Reply
@ప్రణయ్ రాజ్ గారూ దానిని మీరు అంతకుముందు నిర్వాహకులు మాత్రమే సవరించేటట్లుగా సంరక్షణలో పెట్టారు.దానిని నేను తొందరపడి తొలగించాను.దానిని మీరు అవసరమనుకుంటే కొనసాగించగలరు.ధన్యవాదాలు. యర్రా రామారావు (చర్చ) 14:13, 8 ఏప్రిల్ 2024 (UTC)Reply

నిర్ధారణ కోసం వేచి ఉన్నది

వికీపీడియా:నిర్వాహకత్వ హక్కుల ఉపసంహరణ విధానం ప్రకారం, విశ్వనాధ్ గారు చురుగ్గా లేనందున ఆయన్ని నిర్వాహకత్వం నుండి తప్పించాలని నేను ప్రతిపాదించాను. ఆ సంగతి ఆయనకు తెలియపరచాను. పై విధానం ప్రకారం ఈ ప్రతిపాదనపై వచ్చే అభిప్రాయాల్లో 80% మంది దీన్ని వ్యతిరేకిస్తే ప్రతిపాదన వీగిపోతుంది. లేదంటే ప్రతిపాదన నెగ్గుతుంది, ఆ తరువాత నిర్వాహకత్వాన్ని తీసివేసేందుకు స్టీవార్డులకు నివేదించాలి. ఈ ప్రతిపాదన పెట్టి 20 రోజులు దాటిపోయింది. వ్యత్రిరేకంగా అభిప్రాయాలేమీ రాలేదు. అక్కడ అభిప్రాయాలు తెలపని నిర్వాహకులు ఈ వ్యవహారాన్ని పరిశీలించి ఫలితాన్ని తెలపాలని కోరుతున్నాను.__ చదువరి (చర్చరచనలు) 04:36, 27 ఏప్రిల్ 2024 (UTC)Reply

రవిచంద్ర, ప్రణయ్‌రాజ్, రాజశేఖర్ గార్లకు - స్పందించవలసినది. __ చదువరి (చర్చరచనలు) 09:31, 1 మే 2024 (UTC)Reply
చదువరి గారూ, నేను అక్కడ స్పందించాను. తదుపరి నిర్ణయం కోసం స్టీవార్డులకు నివేదించవచ్చని దాని సారాంశం. - రవిచంద్ర (చర్చ) 11:36, 1 మే 2024 (UTC)Reply
@రవిచంద్ర గారూ, ధన్యవాదాలు. మీ నిర్ణయానికి ఇంగ్లీషు అనువాదం కూడా రాస్తే స్టీవార్డులకు అర్థమౌతుంది., చదువరి (చర్చరచనలు) 11:40, 1 మే 2024 (UTC)Reply
అలాగేనండీ ఇంగ్లీషులో కూడా రాస్తాను. - రవిచంద్ర (చర్చ) 11:50, 1 మే 2024 (UTC)Reply
స్టీవార్డులకు రాయగా వాళ్ళు ఈ నిర్ణయాన్ని అమలు చేసారు.__ చదువరి (చర్చరచనలు) 12:22, 1 మే 2024 (UTC)Reply

అనువాదం

మాడ్యూల్:Infobox road/locations లో అనువాదాలు/తెలుగీకరణలు చెయ్యవలసినదిగా నిర్వాహకులకు వినతి. __ చదువరి (చర్చరచనలు) 12:07, 24 జూన్ 2024 (UTC)Reply

వెంకటరమణ గారూ పైచర్చలో @Chaduvari గారు మాడ్యూల్:Infobox road/locations లో అనువాదాలు/తెలుగీకరణలు చెయ్యవలసినదిగా కోరియున్నారు. నేను ప్రయత్నించాగానీ నాకు అహగాహన కాలేదు.అది మీరు సంరక్షణలో పెట్టారు. నిర్వహాకులు మాత్రమే చెయవలసి ఉంది. మీకు అవకాశం ఉంటే దానిని అవసరమైన చోట తెలుగీకరణలు చేయగలరు.ఒకవేళ మీకు చేయటానికి వీలుకుదరకపోతే దానిమీద సంరక్షణ తొలగిస్తే చదువరి గారినే ఆ తెలుగీకరణలు చేయమని కోరదాం.ధన్యవాదాలు. యర్రా రామారావు (చర్చ) 03:57, 25 జూన్ 2024 (UTC)Reply
యర్రా రామారావు గారూ, సంరక్షణ తొలగించాను. చదువరి గారు దీనిలో అనువాదాలు/తెలుగీకరణలు స్వయంగా చేసుకోవచ్చు.➤ కె.వెంకటరమణచర్చ 06:00, 25 జూన్ 2024 (UTC)Reply
@K.Venkataramana గారూ వెంటనే స్పందించినందుకు ధన్యవాదాలు.@Chaduvari గారూ మీరు దీనిని గమనించగలరు యర్రా రామారావు (చర్చ) 06:04, 25 జూన్ 2024 (UTC)Reply
సంబంధిత మాడ్యూల్స్ లో అనువాదాలు చేసాను.➤ కె.వెంకటరమణచర్చ 12:42, 25 జూన్ 2024 (UTC)Reply

జాతీయ రహదారుల దారిమార్పులు

2015 లో జాతీయ రహదారులను పునర్వ్యవస్థీకరించారు. పాత రహదారులను అమరికలను సవరించారు, కొత్త రహదారులను ఉన్నతీకరించారు, పేర్లు మార్చారు, ఆ సందర్భంగా మనం కూడా పాత రహదారుల పేజీలను దారిమార్పు చేసాం. అయితే, పాతపేర్లతో కూడా కొత్త రహదారులున్నందున, ఆ పేజీల్లో అదే పేరుతో ఏర్పడిన కొత్త రహదారి సమాచారం వస్తుంది కాబట్టి, వాటిని దారిమార్పు చెయ్యడం సరికాదు. అలాంటి దారిమార్పుల జాబితా కింద ఉంది. ఒకటో రెండో అయితే ఓవర్ రైటు చేసెయ్యవచ్చు, కానీ పాతిక పేజీల దాకా ఉన్నాయి. అంచేత వీటిని తొలగించాలని నా అభిప్రాయం. నిర్వాహకులు గమనించవలసినది.

  • జాతీయ_రహదారి_1
  • జాతీయ_రహదారి_18
  • జాతీయ_రహదారి_1_(భారతదేశం)
  • జాతీయ_రహదారి_205
  • జాతీయ_రహదారి_214
  • జాతీయ_రహదారి_214_(భారతదేశం)
  • జాతీయ_రహదారి_221
  • జాతీయ_రహదారి_4
  • జాతీయ_రహదారి_43
  • జాతీయ_రహదారి_5
  • జాతీయ_రహదారి_5_(భారతదేశం)(పాత_సంఖ్య)
  • జాతీయ_రహదారి_63
  • జాతీయ_రహదారి_7
  • జాతీయ_రహదారి_7_(భారతదేశం)
  • జాతీయ_రహదారి_9
  • జాతీయ_రహదారి_9_(భారతదేశం)


__ చదువరి (చర్చరచనలు) 23:38, 27 జూన్ 2024 (UTC)Reply

ఈ తికమక పరిస్థితిని గమనించి ఏమిచేయాలో పాలుపోక వదిలేశాను. మీ పద్ధతి సరైనదిగా అనిపిస్తున్నది. కొంతకాలం బ్రాకెట్లో పాత సంఖ్య లేదా కొత్త సంఖ్య చేర్చారు. అలా కొంత సమాచారాన్ని సంరక్షించి, తదుపరి దారిమార్పు చేయవచ్చును, లేదా తొలగించవచ్చును. ఇంకా కొన్ని పాత బోర్డులు కూడా ఉన్నాయి. సంస్కరణలు చేస్తున్నందుకు ధన్యవాదాలు.Rajasekhar1961 (చర్చ) 06:13, 28 జూన్ 2024 (UTC)Reply
సమస్యేంటంటే Rajasekhar1961 గారూ.. ఈ దారిమార్పుల పేరిట వేరే సమాచారంతో పేజీలుండాలి. వాటి లక్ష్యం పేజీలో ఉండే సమాచారం ఇదీ ఒకటి కాదు. అంచేత ఇవి దారిమార్పుగా ఉండతగవు. ఇవి ఇలాగే ఉంటే వాటిలో కొత్త సమాచారం చేర్చేదాకా, మనం తప్పు సమాచారం ఇస్తున్నట్టే అవుతుంది. అంచేత వెంటనే తొలగించాలి. __ చదువరి (చర్చరచనలు) 08:51, 28 జూన్ 2024 (UTC)Reply
@Chaduvari గారూ తొలగించాను. ఏమైనా తప్పు జరిగిందేమో పరిశీలించగలరు యర్రా రామారావు (చర్చ) 11:14, 29 జూన్ 2024 (UTC)Reply
ధన్యవాదాలు సార్. జాతీయ రహదారి 1 (పాత సంఖ్య) అనే పేజీని పొరపాటున తొలగించారు. దాన్ని పునస్థాపించండి. జాతీయ_రహదారి_1_(భారతదేశం), జాతీయ_రహదారి_1 - ఈ రెంటినీ తొలగించండి. __ చదువరి (చర్చరచనలు) 11:33, 29 జూన్ 2024 (UTC)Reply
చేసాను యర్రా రామారావు (చర్చ) 12:07, 29 జూన్ 2024 (UTC)Reply