వికీపీడియా:వికీప్రాజెక్టు/ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ గ్రామాలు/గ్రామ, మండల వ్యాసాల చెక్‌లిస్టు

ఈ పేజీ అవసరమా అనే సందేహం రావచ్చు.ప్రతిదానికి చెక్ లిస్ట్ అనేది ఒక ప్రమాణిక పత్రంలాంటిది.ఏండ్ల తరబడి కొన్ని చేయాల్సిన సవరణలు గ్రామ, మండల వ్యాసాలలో అలాగే ఉంటున్నాయి.సరియైన పద్దతిలో తీర్చిదిద్దాలంటే ఇలాంటి చెక్ లిస్ట్ అవసరమేనని భావించి తయారుచేయటమైంది.ఇది ఒక రకంగా గ్రామ, మండల వ్యాసాలలో అంతగా అవగాహన లేని వాడుకరులు గ్రామ, మండల పుటలలో సవరణలు చేయటానికి, వాటిమీద వచ్చే సందేహాలు నివృత్తి చేయటానికి తోడ్పడిందని భావించటమైంది.

మండల, గ్రామ సమాచారపెట్టెల చెక్ లిస్ట్

మార్చు
  1. సమాచారపెట్టె ఉందా?
  2. సమాచారపెట్టె పేజీలో అన్నిటి కంటే పైన ఉండాలి. దానికి పైన ఎటువంటి బొమ్మలు చేర్చరాదు.
  3. సమాచారపెట్టెలో వివరాలు అన్నీ తెలుగులో ఉండాలి.
  4. మండల కేంద్రపు పేజీలో మండలానికి చెందిన సమాచారపెట్టె ఉంటే, దాన్ని తీసేసి, దాని స్థానంలో రెవెన్యూ గ్రామానికి చెందిన Infobox Settlement/sandbox సమాచారపెట్టెను చేర్చాలి. తగినవివరాలు, గ్రామ మ్యాప్ కూర్పు చేయాలి.
  5. సమాచారపెట్టెలో వివరాలు ఆ వ్యాసానికి చెందినవేనని నిర్థారించుకోవాలి.
  6. సమాచారపెట్టెలో కనీసం గ్రామం పేరు, జిల్లా, మండలం పేర్లు, జనాభా వివరాలు, మ్యాపు అక్షాంశ, రేఖాంశాలు చేర్చి ఉండాలి.
  7. సమాచారపెట్టెలో "name = " అన్న చోట గ్రామం పేరు రాయాలి. దీనికి వికీలింకు ఇవ్వరాదు.
  8. సమాచారపెట్టెలో గ్రామం పేరును మండలం పేరుతో క్వాలిపై చెయ్యనవసరంలేదు. అలా ఉంటే తొలగించాలి. అయితే ఇక్కడ ఇంకోటి గమనించాలి. ఒకే గ్రామం, లేదా మండలం పార్టులుగా ఉన్న సందర్భాలలో అక్షరాలు, అంకెలు, దిక్కులు, చిన్న, పెద్ద, ఖుర్ద్, కలాన్ అలాంటి పదాల రూపాలలో క్వాలిఫై చేసి ఉంటాయి. వాటిని యధాతథంగా ఉంచాలి లేదా రాయాలి.
  9. రెవెన్యూయేతర గ్రామాలకు సమాచారపెట్టె ఒకవేళ అంతకుముందే చేర్చి ఉంటే settlement_type = రెవిన్యూ గ్రామం బదులు రెవెన్యూయేతర గ్రామం అని మార్చాలి.వీటికి జనాభా వివరాలు ఇతరత్రా డేటా అందుబాటులో ఉండకపోవచ్చు.
  10. గ్రామ వ్యాసంలోని సమాచారపెట్టెలో image_skyline చేరిస్తే, imagesize = 250 అని ఉండాలి (AWB)
  11. సమాచారపెట్టెలో ఇమేజ్ స్కైలైన్ వద్ద ఆ గ్రామానికి చెందిన ప్రముఖ కట్టడం ఆలయమో, కొలనో, పర్యాటక ప్రదేశమో, ప్రధాన వీధో, ప్రభుత్వ కార్యాలయమో, బడో, ఏదోక దాన్ని ఫొటో దస్త్రం పేరును చేర్చాలి.
  12. జిల్లా పేరు, మండలం పేర్లను పైపు లింకు ద్వారా చేర్చాలి. (ఉదా: [[గుంటూరు జిల్లా|గుంటూరు]], [[చెరుకుపల్లి మండలం (గుంటూరు జిల్లా)|చెరుకుపల్లి]]) మామూలు వికీలింకు ఇస్తే సమాచార పెట్టె ఆకారం కోల్పోయే అవకాశం ఉంది
  13. గ్రామ పటం (మ్యాపు) చేర్చే పద్ధతి:
    1. ఆంధ్రప్రదేశ్ గ్రామాలకైతే "pushpin_map = ఆంధ్ర ప్రదేశ్ అని
    2. ఆంధ్రప్రదేశ్ గ్రామాలకైతే "pushpin_map = తెలంగాణ అనీ చేర్చాలి
    3. "pushpin_mapsize = 250 అని చేర్చాలి.(AWB)
    4. latd = అనేచోట అక్షాంశాన్ని
    5. longd = అనేచోట రేఖాంశాన్నీ చేర్చాలి
  14. సమాచారపెట్టెలలో |image_map = google అనిగానీ లేదా ఇతరత్రా పదాలు ఉండకూడదు. (AWB)
  15. ఆరు అంకెల పిన్‌కోడ్ మధ్యలో స్పేసుల్లేకుండా రాయాలి (ఉదా: 522347 అని రాయాలి, 522 347 అని రాయకూడదు) (AWB/Typos)

గ్రామ పుటల చెక్ లిస్ట్

మార్చు
  1. గ్రామ వ్యాసానికి ప్రవేశిక మొదటి వాక్యంలో రాష్ట్రం, జిల్లా లింకులతోపాటు, మండల వ్యాసం లింకు కలపాలి.
  2. వ్యాసంలో అవసరమైన చోట్ల మూలాలను చేర్చాలి.
  3. మండల కేంద్రాల పేజీల్లో అన్నిటికన్నా పైన "ఇది మండల కేంద్రానికి సంబంధించిన పేజీ. మండల సమాచారం కోసం సంబంధిత మండలం పేజీ చూడండి" అని రాయాలి. దిగువ మాదిరి ఫార్మెట్ చూడండి.(AWB)
    ఇది వింజమూరు గ్రామ వ్యాసం. వింజమూరు మండల వ్యాసం కై ఇక్కడ చూడండి.
  4. మండల కేంద్రాల పేజీల్లో ఆ మండలంలోని గ్రామాల జాబితా, ఆ మండలానికి చెందిన ఇతర సమాచారం చేర్చరాదు
  5. పేజీలో కింద ఉండే గణాంకాలు విభాగంలో 2011 జనాభా వివరాలు ఉంటే వాటిని తొలగించాలి. ఈ వివరాలు ప్రవేశికలో ఉన్నాయని నిర్థారించుకుని ఆ తరువాత ఇక్కడ తీసివేయాలి
  6. ఆ విభాగంలో 2001 జనాభా వివరాలు ఉంటే వాటిని అలాగే ఉంచాలి
  7. రెవెన్యూ గ్రామం పేజీలో మండలం లోని గ్రామాలు అనే మూస ఒక్కటే ఉండాలి. జిల్లా లోని మండలాల మూస ఉండరాదు
  8. సమాచారంలో అయోమయనివృత్తి పుటలకు కలిపిన లింకులను సవరించి, సరియైన పేజీకి కలపాలి
  9. రెవెన్యూ గ్రామాలు కాని జనగణన పట్టణాలకు మండలంలోని గ్రామాలు మూసను చేర్చరాదు
  10. రెవెన్యూయేతర గ్రామాలు మండలంలోని రెవెన్యూయేతరగ్రామాలు వర్గంలోకి చేర్చాలి.
  11. రెవెన్యూయేతర గ్రామాల పేజీల్లో మండలంలోని గ్రామాల మూస ఉంటే తొలగించాలి
  12. రెవెన్యూయేతర గ్రామాలు మండలంలోని గ్రామాలు వర్గంలోకి చేరి ఉంటే, ఆ వర్గం నుండి తీసివేయాలి
  13. గ్రామాల పేజీల్లో సరిహద్దు/సమీప గ్రామాల వివరాలు ఉండవచ్చు. కానీ సరిహద్దు/సమీప మండలాల వివరాలు ఉండరాదు.

మండల పుటలకు చెక్ లిస్ట్

మార్చు
  1. మండల వ్యాసానికి ప్రవేశిక మొదటి వాక్యంలో శీర్షిక మొత్తం రావాలి ("తణుకు మండలం" అని పూర్తిగా రాయాలి, "మండలం" లేకుండా"తణుకు" అని మాత్రమే రాయకూడదు)
  2. మండల వ్యాసానికి కనీసం ఒక మూలం చేర్చాలి.
  3. మండల పుటలో మండలంలోని గ్రామాలు ప్రధాన శీర్షికగా ఉండి, రెవెన్యూ గ్రామాలు అనే ఉప విభాగంలో రెవెన్యూ గ్రామాల జాబితా చేర్చాలి.
  4. దాని తరువాత, రెవెన్యూయేతర గ్రామాలు అనే ఉప విభాగంలో రెవెన్యూయేతర గ్రామాల జాబితా చేర్చాలి.
  5. మండలంలో రెవెన్యూ గ్రామాలు కాని జనగణన పట్టణాలు, మండలంలోని రెవెన్యూ గ్రామాలు విభాగం నుండి విడగాట్టి మండలంలోని పట్టణాలు విభాగంలో చూపించాలి.
  6. కొన్ని జనగణన పట్టణాలు రెవెన్యూ గ్రామాలుగా ఉండటానికి అవకాశం ఉంది. వాటిని రెవెన్యూ గ్రామంగా పరిగణించి రెవెన్యూ గ్రామాలు విభాగంలో ఉంచాలి.
  7. మండలంలోని కొన్ని గ్రామాలకు వేరే మండలం లోని గ్రామాలకు లేదా అయోమయనివృత్తి పేజీలకూ లింకు కలిపి ఉండే అవకాశం ఉంది. అందుచేత లింకులన్నిటినీ పరిశీలించి అవసరమైన చోట్ల సవరణలు చెయ్యాలి. లింకుపైన కర్సరు పెట్టినపుడు ఆ లింకు గమ్యం పేజిని చూపిస్తుంది. ఆ విధంగా సరియైన పేజీకే లింకు వెళ్తోందో లేదో తెలుసుకోవచ్చు.
  8. పేజీలో అడుగున జిల్లా లోని మండలాలు అనే మూసను చేర్చాలి.
  9. పేజీలో మండలంలోని గ్రామాలు మూస ఉంచరాదు.
  10. కొన్ని మండలాలలో ఉండవలసిన రెవెన్యూ గ్రామాలు కన్నా తక్కువ సంఖ్య చూపుతుంటాయి. అంటే కొన్ని గ్రామ వ్యాసాలకు పేజీలు సృష్ఠించలేదు. వాటిని గుర్తించి మండలంలోని గ్రామాలు విభాగంలో, మూసలో ఎర్రలింకుతో కూర్పు చేయాలి.
  11. వ్యాసంలో ఆ మండలానికి చెందని సమాచారం ఉంటే తొలగించాలి.
  12. మండలంలోని కొన్నిగ్రామాలకు వ్యాసం ఉంటుంది. కానీ మండలంలోని గ్రామాల విభాగంలో, మూసలో ఎర్రలింకులు ఉంటాయి. వాటి లింకులను సవరించాలి.
  13. రెవెన్యూ గ్రామాలు కొన్నిటికి పేజీలు సృష్టించి ఉండకపోవచ్చు. అలాంటివి మండలంలోని గ్రామాలు విభాగంలో, మూసలో ఎర్రలింకులుగా ఉండవచ్చు. వాటిని అలానే ఉంచాలి.
  14. మండలంలోని గ్రామాలు విభాగంలో ఉన్న గ్రామాలకు ఎర్రలింకులు ఉండవచ్చు. ఆదే గ్రామావికి మూసలో బ్లూ లింకుఉండవచ్చు. వీటిని విర్థారించుకుని సవరించాలి.
  15. పేజీలో అన్నిటికంటే అడుగున సరిహద్దు మండలాల మూసను చేర్చాలి.

మండల, గ్రామ పుటలకు కామన్ చెక్ లిస్ట్

మార్చు
  1. గ్రామ, మండల పుటలలో ఏదైనా అత్యంత ముఖ్యమైన సమాచారం పేజీలో అడుగున ఎక్కడో ఉన్నదని గమనిస్తే, దానిని అవకాశం ఉన్నంతవరకు పైకి జరపాలి
  2. వ్యాసంలో ఖాళీ విభాగాలు ఉంటే తొలగించాలి.
  3. పేజీ పేరు తప్పు ఉంటే సవరించదలిస్తే సరైన పేరుకు పేజీని తరలించాలి.
    1. శీర్షిక క్యాలిఫై చేసేటప్పుడు శీర్షిక తరువాత స్పేస్ ఇచ్చి బ్రాకెట్లో మండలం పేరుతో క్వాలిఫై చెయ్యాలి. మండలం పేరులో "మండలం" అని రాయకూడదు. ఉదా: కృష్ణాపురం మండలంలోని రామాపురం గ్రామం పేరును రామాపురం (కృష్ణాపురం) అని రాయాలి.
    2. కొన్ని గ్రామాల పేర్లకు స్పేస్ ఇచ్చి కామా పెట్టి మండలం పేరుతో క్యాలిఫై చేసాం. అలాంటివాటిని పై విధంగా సవరించాలి.
  4. కొన్ని గ్రామాలకు అక్షరభేదాలతో రెండు పేజీలు ఉంటాయి. వాటిలో సరియైన పేజీకి, అవసరమైతే దారిమార్పు ఇవ్వటం లేదా తొలగించి, ఆ తేడాలను మూసలో సవరించాలి.
  5. తెగిపోయిన ఫైల్ లింకులును పరిశీలించి సవరించాలి. అవకాశంలేకపోతే తొలగించాలి.

గ్రామాల, మండలాల మూసలు

మార్చు

గ్రామాల పేజీల్లో ఈ మండలంలోని గ్రామాలు అనే మూస, మండలాల పేజీల్లో ఈ జిల్లా లోని మండలాలు అనే మూస ఉంటాయి. ఈ మూసలకు సంబంధించిన చెక్‌లిస్టు ఇది.

  1. ఎర్ర లింకులు లేకుండా చూడాలి. ఎర్రలింకులున్నాయంటే దానర్థం -
    1. గ్రామం పేజీ లింకు తప్పు పడి ఉండవచ్చు -ఎర్ర లింకు సరిచెయ్యాలి
    2. గ్రామం పేజీ అసలు లేకపోయి ఉండవచ్చు లేదా గతంలో ఉన్న పేజీని తొలగించి ఉండవచ్చు - ఎర్ర లింకు పూర్తిగా తీసెయ్యండి.
  2. మూసలో ఉన్న గ్రామాల/మండలాల పేజీల సంఖ్య, సంబంధిత వర్గంలోని పేజీల సంఖ్య సరిగ్గా సరిపోవాలి. సరిపోకపోతే సరిచెయ్యండి.

ఏకసూత్రం

మార్చు
  1. కాగా పోగా ప్రధాన దృక్పథం మూలాలు ప్రకారం మండలంలోని గ్రామాల విభాగంలో, మండలంలోని గ్రామాలు మూసలో, అలాగే మండలంలోని గ్రామాలు వర్గంలో మూడింటిలో ఒకే సంఖ్య ప్రకారం గ్రామాలు ఉండటం ప్రధాన ఉద్దేశ్యం.అలా ఉన్నప్పడే ఒక కొలిక్కి వచ్చినట్లు లెక్క అని భావించాలి.