వికీపీడియా:వికీప్రాజెక్టు/తెలుగు గ్రంథాలయం/ప్రతిపాదన ముసాయిదా
ఈ ప్రాజెక్టు యొక్క పూర్తి సమాచారం వికీపీడియా:వికీప్రాజెక్టు/తెలుగు గ్రంధాలయం వద్ద లభించును
- వికీమీడియా వ్యక్తిగత గ్రాంటు ద్వారా ఆంధ్రప్రదేశ్ గ్రంధాలయాల పుస్తక జాబితాను రూపొందించుటకు వచ్చిన అలోచన వివరాలను ఇక్కడ ఇస్తున్నను. దీనిపై మీ యొక్క స్పందననుతెలియచేయాలని, దీనిలో ఉండవలసిన మార్పులు ఏవైనా ఉంటే తెలియచేయాలని మనవి - విశ్వనాధ్
పరిచయం
మార్చుభారతీయ గ్రంధాలయాల పని తీరు సాధారణంగా ఇలా ఊంటుంది.
- గ్రంధాలయాలు ప్రభుత్వం ద్వారా నడిచేవి, ప్రైవేటు సంస్థల వ్యక్తుల ద్వారా నడిచేవి ఉన్నాయి.
- గ్రంధాలయాలు పుస్తకాల కొరకు జాబితాలు తయారుచేస్తాయి. అవి రాయబడిన జాబితాలుగా ఉన్నాయ్
- పుస్తకాలు కావల్సిన వారు ఆ జాబితా ఆధారంగా పుస్తకం తీసుకొంటుంటుతారు.
- ఇప్పటి అంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ గ్రంధాలయాల ద్వారా జాబితాలు కంప్యూటరీకరిస్తున్నారు. అయితే చాలా తక్కువగా కొన్ని పెద్ద శాఖలలో మాత్రమే జరిగింది.
Introduction
మార్చు- The libraries are runed through government and private sectors.
- The books in the libraries are catalogued which are written ed.
- The books are given to the people as per catalogue.
- At present, in andhrapradesh libraries being computerised but it is less and only in some main branches
లోపాలు
మార్చు- ప్రభుత్వం ద్వారా కొన్ని ప్రభుత్వ గ్రంధాలయాలు, యూనివర్సిటీ స్థాయి గ్రంధాలయాల ద్వారా పుస్తకాల డిజిటైజేషన్ జరిగినా అన్ని గ్రంధాలయాల కేటలాగ్ డిజిటైజ్ చేయబడలేదు.
- ఉదాహరణకు, డిపార్ట్‌మెంట్ ఆఫ్ పబ్లిక్ లైబ్రరీస్(http://publiclibraries.ap.nic.in/basic_search.aspx) కు వెళ్ళి సెర్చ్ పేజీలో అశ్వలక్షణ సారము అనేదానిని గురించి వెదికితే దొరకదు, కాని అది ఆర్కివ్‌లో (https://archive.org) దొరుకుతుంది. అలాగే అరుణాచల ఖండము డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలో ఉండి కాని మిగిలిన రెండిటిలో దొరకదు. అలా కొన్నిటిలో ఉన్నవి కొన్నిటిలో లేవు.
- మరొక గ్రంధం ఆయుర్వేద చికిత్సా సంగ్రహము అనే దానిని గురించి వెదికితే ఎక్కడా దొరకదు. అలా దొరకని కొన్ని పుస్తకాలను మనం కొన్ని ఊళ్ళలో కల ప్రాచీన, ప్రముఖ ప్రైవేటు గ్రంధాలయాల ద్వారా అందరికీ అందుబాటులోకి తీసుకురావచ్చును.
- అంతర్జాలంలోని పుస్తకాన్ని పూర్తి స్థాయిలో చదవదం కూడా శ్రమతో కూడుకొన్నదే. అవే పుస్తకాలు అందుబాటులో ఉన్న గ్రంధాలయాలలో ఉన్నట్టు తెలిస్తే అక్కడకు వెళ్ళి చదవదం లేదా తెచ్చుకొని చదవడం చేయగలుగుతారు.
ప్రాజెక్టు ముఖ్యోద్దేశము
మార్చు- విద్యార్ధులు ప్రస్తుతం అంతర్జాలం ఎక్కువగా వాడుతున్నారు. కాలేజ్‌లో లేని పుస్తకం కొరకు అంతర్జాలంలో వెదుకుతున్నారు. డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలో, ఆర్కివ్‌లో వెదుకుతారు. అందులో దొరకని పుస్త్కాలు అనేకం ఉన్నాయి. అలాంటి పుస్తకాలు ప్రైవేటు బాగస్వామ్యంలో కల గ్రంధాలయాలలో ఉన్నాయి.
- ఆంధ్ర, రాష్ట్ర పలు ప్రాంతాలలో అనేక పురాతన గ్రంధాలయాలు ఉన్నాయి వాటిలో ప్రముఖమైన, పురాతన పుస్తకాలు, విద్యార్ధులకు, పరిశోధకులకు, సాహిత్య ప్రియులకు, ఇతర రంగాల వారికి ఉపయోగపడు పుస్తకాలు కలవు.
- గ్రంథాలయాలలోని పుస్తకాల జాబితాలో ఉండే వివరాలు కాటలాగ్ సంఖ్య, పుస్తకం టైటిల్, రచయిత పేరు, పబ్లిషర్ పేరు, ఊరు, సంవత్సరం యొక్క వివరాలతో కేటలాగ్స్ తయారుచేయడం
ఏం చెయ్యాలి
మార్చు- ప్రముఖంగా ఉన్న పది గ్రంధాలయాలను ఎన్నుకోవడం (ఆంధ్రప్రదేశ్, తెలంగాణా జిల్లాలు)
- ఎన్నుకొన్న గ్రంధాలయాలలో గ్రంధాలయ పర్యవేక్షకుల ద్వారా రాయబడిన పుస్తకాల వివరాల జాబితాను స్కాన్ చేయడం లేదా జిరాక్ష్ కాఫీలను తీసుకోవడం చేయాలి
- గ్రంధాలయాల చారిత్ర వివరాలను సేకరించి జాబితాకు జత చేయాలి.
- రూపొందించిన జాబితాలను, గ్రంధాలయాల వివరాలను వాటి చరిత్ర వివరాలను ఎక్షెల్ ద్వారా కంప్యూటరీకరించడం.
- ఎక్షెల్ ద్వారా కంప్యూటరైజ్డ్ చేయబడిన వాటిని మార్కప్ ద్వారా వికీలోకి చేర్చడం
- వాటిని వికీపీడియా, వికీ సోర్స్, వికీ బుక్స్ ద్వారా వాటిని అందరికీ అందుబాటులోకి తేవడం.
- పట్టికల్లోని గడులలో ఉన్న వివరాలను లింకులుగామార్చి మూలాలను జతచేయడం
- గ్రంధాలయ సంధర్శన ద్వారా లభించిన గ్రంధాలయ చరిత్ర, గ్రంధాలయ భవన నిర్మాతలు, స్థల దాతల, ప్రముఖుల చరిత్ర, గ్రామ, పట్టణ చరిత్రా విశేషాలను వ్యాసాలుగా విస్తరించడం.
- వికీపీడియన్ల ను గ్రంధాలయాలకు తీసుకెళ్ళి డిజిటైజ్ చేయగలిగే వీలున్న గ్రంధాలను పరిచయం చేయడం, ప్రముఖ పుస్తకాల వ్యాసాలను అభివృద్ది చేయించడం
ఎన్నుకోబడే గ్రంధాలయాలలో కొన్ని
మార్చు- రాజమండ్రి గౌతమీ గ్రంధాలయం
- పిఠాపురం
- పోడూరు
- గీతా గ్రంధాలయం చీరాల
- బ్రౌన్ లైబ్రరీ కడప
- సారస్వత నికేతనం వేటపాలెం
- సామర్లకోట
- విజయనగరం కళాశాల గ్రంధాలయం
- విజయనగరం రాజావారి గ్రంధాలయం
- అన్నమయ్య గ్రంధాలయం గుంటూరు
ప్రాజెక్టు ప్రయోజనాలు
మార్చు- తెలుగు ప్రముఖ గ్రంధాలయాలలో కల అనేక అమూల్యమైన పుస్తకాలు కలవు. అయితే కాపీ హక్కుల పరిధిలో ఉండటం వలన వాటిని పూర్తి స్థాయిలో వికీలో చేర్చలేము. ప్రస్తుతం వాటి వివరాలు కూడా పూర్తి స్థాయిలో సేకరించబడలేదు. అలాంటి అనేక గ్రంధాల యొక్క పూర్తి వివరాలు, అనగా గ్రంధ రచయిత ఎవరు ?, ప్రచురణ సంస్థ పేరు, రచన సంవత్సరం, (ప్రక్క బొమ్మలో చూపిన విధంగా) లాంటి వివరాల ఉనికిని డిజిటైజ్ చేయడం ద్వారా అంతర్జాలం ద్వారా వెతికేవారికి వాటిని చేరువ చేయగలిగే వీలుంటుంది.
- ఈ పాజెక్టు ద్వారా విద్యార్ధులకు, పుస్తక పరిశోధకులకు, మరియు తెలుగు పాఠకులకు, వికీ వాడుకరులకు, సాహిత్య ప్రియులకు, వివిధ రంగాల వార్కి కావలసిన పుస్తాకాలు ఎక్కడ దొరుకుతాయో తెలియడం జరుగుతుంది.
- పుస్తకం కావలసిన వారు నేరుగా లైబ్రరీకి వెళ్ళి ఎవరి సహాయం లేకుండా కావలసిన పుస్తకాని తీసుకొనే వీలు కలుగుతుంది.
- ఇప్పటికే ఉన్న ఆర్కీవ్, డీటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా లాంటి వాటి ద్వారా అన్ని తెలుగు గ్రంధాల సమాచారం లేదు. ఇప్పుడు చేస్తున్న దాని ద్వారా కేవలం కాపీ హక్కులు కలిగి ఉన్నవి మాత్రమే కాక అన్ని తెలుగు పుస్తకాల సమాచారం అందుబాటులోకి వస్తుంది.
ప్రాజెక్టుజాబితా ద్వారా తెవికీలో అభివృద్ధి
మార్చు- గ్రంధాలయాల సందర్శనతో కొన్ని ప్రముఖ గ్రంధాలయాల చరిత్ర లభిస్తుంది. తద్వారా వాటి వ్యాసాలు రాయగలం (పోడూరు అనే ఊరి చరిత్ర, ప్రముఖుల వివరాలు గ్రంధాలయ సర్వస్వం అనే గ్రంధం ద్వారానే నాకు లభించాయి)
- గ్రంధలయాల పోషకులు, గంధాలయ భవన దాతలు, స్థల దాతల వివరాల ద్వారా మరిన్ని వివరాలు లభ్యం కాగలవు. వాటి ద్వారా మరిన్ని వ్యాసాలను సృష్టించడం
- తెలుగు వికీపీడియాలో ఎన్నో పుస్తకాలను గురించిన సమాచారం సేకరించబడుతుంది. కనుక ఇప్పటికే ఆయా పుస్తకాల గురించిన వ్యాస మొలకలు ఉంటే వాటిని అభివృద్ది చేయవచ్చు.
- జాబితా అందుబాటులోకి తెచ్చుకుంటున్నాం కనుక గ్రంధాలయాలలోని వివరాల లభ్యత వలన అది కాపీ హక్కులలోనిది కాకపొతే తదనంతర కాలంలో కొన్ని గ్రంధాలను పూర్తిగా స్కాన్ చేసి డిజిటైజ్ చేయవచ్చు
- ఇప్పటికే ఉన్న వ్యాసాలకు వీటిలోని వివరాలను జతపరచడం ద్వారా వ్యాసాల విస్తరణ చేయడం చేయవచ్చు
- జాబితాలోని వివరాల ద్వారా తెలుగు వికీపీడియా, విక్ష్నరీ, వికీకోట్స్ మొదలైన ప్రాజెక్టుల్లో వ్యాసాలు రాయచ్చు, ఇప్పటికే ఉన్న వ్యాసాలు అభివృద్ధి చేసి ప్రాజెక్టుకు తోడ్పడవచ్చు.
- వికీ సభ్యులు కేటలాగ్ చేయబడిన గ్రంధాలయాలు సమీపంలో ఉంటే వాటి ద్వారా పుస్తకాలు చదవగలుగుతూ, మరిన్ని వ్యాసాలకు రిఫరెన్‌సులు ఇస్తూ వ్యాస విస్తరణ చేగలుగుతారు.
మెటాలో పేజి
మార్చు- మెటాలోదయచేసి Endorsements వద్ద మీ మద్దతు తెలుపగలరు
వికీసోర్స్ రచ్చబండ వద్ద ప్రకటన
మార్చుప్రాజెక్టు [[1]]
విక్షనరీ వద్ద ప్రకట
మార్చుప్రాజెక్టు [[2]]
ప్రాజెక్టు మొదలు తేదీ, వివరాలు
మార్చు- ఈ ప్రాజెక్టు 06-12-2014 న వికీమీడియా పౌండేషన్ సభ్యుల అంగీకారం పొందింనది. దీనిని వారి బ్లాగ్ https://blog.wikimedia.org/2014/12/05/ieg-selects-exciting-new-batch-of-experimental-projects-to-improve-wikipedia-wikisource-and-commons/ లో అదే రోజు ప్రచురించారు.
- ప్రాజెక్టు 01 జనవరి 2015 నుండి మొదలు కానుంది.