వికీపీడియా:వికీప్రాజెక్టు/తెవికీ-ఐఐఐటి/నమూనా వ్యాసాలు/అవినాష్ చందర్

అవినాష్ చందర్
దస్త్రం:Avinash chander.jpg
పౌరసత్వంభారతీయ
ఉద్యోగంDRDO
పురస్కారాలుపద్మశ్రీ

అవినాష్ చందర్ ఒక భారతీయ శాస్త్రవేత్త, అతను రక్షణ మంత్రికి శాస్త్రీయ సలహాదారుగా వ్యవహరించాడు . రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో)కు డైరెక్టర్ ,రక్షణ పరిశోధన అభివృద్ధి శాఖ కార్యదర్శి వంటి పదవులను కూడా ఈయన నిర్వహిస్తున్నాడు. వి. కె. సరస్వత్ అనంతరం ఇతను ఈ పదవిలో నియమించబడ్డాడు.[1][2]

అగ్ని సిరీస్ బాలిస్టిక్ క్షిపణి వ్యవస్థల యొక్క ప్రధాన సూత్రధారిగా[3] అవినాష్ చందర్ సుపరిచుతుడు. శాస్త్ర సాంకేతిక రంగానికి ఈయన చేసిన విశిష్ట సేవలకు గాను భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది.[4]

విద్యాభ్యాసం

మార్చు

ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఢిల్లీ నుండి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌ పూర్తి చేసిన తరువాత అవినాష్ చందర్ డీఆర్డీవో లో చేరాడు. హైదరాబాద్ జవహర్‌లాల్ నెహ్రూ టెక్నాలజీ విశ్వవిద్యాలయం (జెఎన్‌టియు, హైదరాబాద్) నుండి స్పేషియల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఎమ్మెస్ పూర్తి చేసి డాక్టరేట్‌ కూడా పొందాడు.

డీఆర్డీవోకు స్వస్తి

మార్చు

డీఆర్డీవోకు 42 సంవత్సరాల విశిష్ట సేవలు అందించిన అనంతరం 14 జనవరి 2015 వ తేదీన ఇతని సర్వీసు ముగియనుండగా, డీఆర్డీవోకు చెందిన సిబ్బంది శిక్షణ విభాగం డీఆర్డీవోకు 31 జనవరి 2015 వరకు చీఫ్ గా కొనసాగాలని అవినాష్ చందర్ను సూచించింది.[5]

పురస్కారాలు

మార్చు

అవినాష్ చందర్ అనేక విశిష్ట పురస్కారాలు పొందారు వాటిలో కొన్ని క్రింద ఇవ్వడం జరింగింది

వరుస

సంఖ్య

పురస్కారం సంవత్సరం
1. ఐ.ఐ.టి.ఢిల్లీ అల్యూమిని అవార్డు
2. పద్మశ్రీ
3. డీఆర్డీవో సైంటిస్ట్ అఫ్ ది ఇయర్ 1989
4. ఆస్ట్రోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా అవార్డు 1997
5. అగ్ని సెల్ఫ్-రిలయన్స్ అవార్డు, 1999
6. డాక్టర్ బిరెన్ రాయ్ స్పేస్ సైన్స్ అవార్డు 2000
7. డీఆర్డీవో అవార్డు 2007
8. అత్యుత్తమ సాంకేతిక నిపుణత అవార్డు 2008
9. డీఆర్డీవో టెక్నాలజీ లీడర్‌షిప్ అవార్డు 2008
10. ఫెల్లో, ఇండియన్ నేషనల్ అకాడమీ ఆఫ్ ఇంజనీర్స్
11. ఫెల్లో, సిస్టమ్ సొసైటీ ఆఫ్ ఇండియా
12. ఫెల్లో, ఆంధ్రప్రదేశ్ అకాడమీ ఆఫ్ సైన్సెస్
13. వైస్ ప్రెసిడెంట్, ఆస్ట్రోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా
14. ఛైర్మన్ - సెన్సార్స్ రీసెర్చ్ సొసైటీ, ఇండియా
15. ఆర్యభట అవార్డు - ఆస్ట్రోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా.
16. ఆర్యభట అవార్డు - ఆస్ట్రోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా.
17. ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ (ఇండియా)చే ప్రఖ్యాత ఇంజనీర్ అవార్డు 2016

మూలాలు

మార్చు
  1. "Missile man Avinash Chander appointed new DRDO Chief". archive.indianexpress.com/. June 1, 2013. Retrieved 15 April 2021.{{cite web}}: CS1 maint: url-status (link)
  2. "Government terminated appointment of DRDO chief Avinash Chander". indiatoday.in/. January 29, 2015. Retrieved 15 April 2021.{{cite web}}: CS1 maint: url-status (link)
  3. "Agni 5 Launch 'Best Farewell Gift', Outgoing DRDO Chief Avinash Chander Tells NDTV". ndtv.com/. January 31, 2015. Retrieved 15 April 2021.{{cite web}}: CS1 maint: url-status (link)
  4. "Avinash Chander — the long distance missile man". thehindubusinessline.com/. November 21, 2017. Retrieved 15 April 2021.{{cite web}}: CS1 maint: url-status (link)
  5. "Govt sacks DRDO chief and architect of Agni missile Avinash". timesofindia.indiatimes.com/. Jan 13, 2015. Retrieved 15 ఏప్రిల్ 2021.{{cite web}}: CS1 maint: url-status (link)