వికీపీడియా:వికీప్రాజెక్టు/తెవికీ-ఐఐఐటి/నమూనా వ్యాసాలు/బుగట్టి చిరోన్ డబ్ల్యూ 16

బుగట్టి చిరోన్ డబ్ల్యూ 16
Manufacturerబుగట్టి
Body style(s)స్పోర్ట్స్
Transmission(s)ఆటోమేటిక్
Wheelbase2710 అంగుళాలు
Length4544.0 అంగుళాలు
Width2038
Height1212 అంగుళాలు
Curb weight1995 కిలోగ్రామ్స్

ఎట్టోర్ బుగట్టి ఆటోమొబైల్స్ ఫ్రెంచ్ దేశ కార్ల కంపెనీ. దీని వ్యవస్థాపకుడు ఎట్టోర్ బుగట్టి ( పారిశ్రామిక డిజైనర్) ఇటాలియాన్ సంతతికి చెందిన వాడు. ఎట్టోర్ బుగట్టి కంపెనీ కార్ల తయారీలో వాటి డిజైన్స్, కార్ల రేస్ లలో పాల్గొనే వాటిలో పేరుగాంచినవి. ఈ కంపెనీ నుంచి తయారు అయ్యే ప్రసిద్ధి గాంచిన తయారు అయ్యేకార్లలలో టైపు 35 గ్రాండ్ ఫిక్స్ కార్లు, టైపు 41 రాయల్ కార్లు, టైపు 57 అట్లాంటిక్, టైపు 55 స్పోర్ట్స్ కార్లు మొదలైనవి ఉన్నాయి. 1939 సంవత్సరములో ఎట్టోర్ బుగాట్టి కుమారుడు అయిన జీన్ బుగాట్టి మరణం, 1947 సంవత్సరములో ఎట్టోర్ బుగాట్టి మరణంతో, వారసుడు లేక, కంపెనీ నాయకత్వ బాధ్యతలకు ఎవరు లేక పోవడం, చివరకు కంపెనీ మూసివేసే దిశగా వెళ్ళింది. అప్పటి వరకు ఈ కంపెనీ ద్వారా 8000 కార్ల ఉత్పత్తి జరిగింది. 1987 సంవత్సరములో ఇటాలియన్ దేశస్థుడు కంపెనీని కొనుగోలు చేసి, మోడానా నగరం లో కొద్దిపాటి స్పోర్ట్స్ కార్లను ఉత్పత్తి చేశాడు. వోక్స్ వ్యాగన్ గ్రూప్ 1988 సంవత్సరములో కంపెనీ హక్కులను తీసుకొని, అల్సేస్ లోని మోల్స్ హీమ్ కేంద్రంగా తిరిగి ఒక అనుబంధ సంస్థను ఏర్పాటు చేసింది.

ఇంజన్-పెర్ఫార్మెన్స్

మార్చు

ఫ్యూయల్ బర్నింగ్ కొరకు ఈ కారు ఇంజన్ లో 16 సిలిండర్లు, మరింత సామర్థ్యం కోసం ప్రతి సిలిండర్‌కు 4 వాల్వ్ లు ఉన్నాయి. ఇంజన్‌లో సిలిండర్లు డబ్ల్యూ పద్దతిలో అమర్చారు. ఈ కారు ఇంజన్ 7993 సీసీ ఇంజన్ డిస్ప్లేస్మెంట్ తో డిజైన్ చేసారు. ఈ కారు నికర(net) హార్స్ పవర్(అశ్వ సామర్థ్యం) 6700 ఆర్.పీ.ఎం. ఇందులో ఇంజన్ టార్క్ సుమారుగా 2000-6000 ఆర్.పి.ఎం. ఉంది.

ఈ కారు మైలేజ్ సగటున ఈ క్రింద విధంగా ధృవీకరించబడినది:

  • ఏ.ఆర్.ఏ.ఐ(ARAI) ధృవీకరించిన మైలేజ్: 5.95 కే.ఎం.పి.ఎల్.

కారులో ఇంధనం తక్కువ ఉన్నప్పుడు లో ఫ్యూయల్ ఇండికేటర్ సక్రియం(activate) అవుతుంది. ఇది ఒక ఆటోమేటిక్[1] కార్. ఈ కారు మొత్తం ఏడు గేర్ల ఇంజన్ తో డిజైన్ చేయబడింది. కారు ఉద్గార ప్రమాణం(Emission Standard) బి ఎస్ 6 తో ఆమోదం పొందింది. కారు టైర్లు గాలి పీడనం తరచూ పర్యవేక్షించడానికి టైర్-ప్రెషర్ మానిటర్(టిపిఎం) అనుసంధానం అయి ఉంది. రోడ్డు పరిస్థితులకు అనుగుణంగా త్రొట్టెల్(Throttle) ఇన్ పుట్ , ఇంజన్ శక్తి, టార్క్ బదిలీ సరిపోనప్పుడు భద్రత కోసం ట్రాక్షన్ కంట్రోల్ సిస్టం సక్రియం(activate) అవుతుంది.

కార్ డిజైన్

మార్చు

బుగట్టి చిరోన్ డబ్ల్యూ 16[2] అనే కారు స్పోర్ట్స్ బాడీ స్టైల్ తో రూపొందించారు. దీనికి మొత్తం 2 డోర్లు ఉంటాయి. ఈ కారులో ఇద్దరు ప్రయాణించవచ్చు. ఈ కారుకి మొత్తం ఏడు గేర్లు ఉన్నాయి. ఇందులో పిజిఎం- ఎఫ్ఐ ఇంధన వ్యవస్థ వాడారు. ఈ కారులో ఉపయోగించే ఇంధనం పెట్రోల్. ట్యాంక్‌లోని ఇంధన స్థాయిని డ్రైవర్ కి సూచించడానికి డిజిటల్ ఫ్యూయల్ గేజ్ ఉంది. ఈ కారు RWD (రియర్ వీల్ డ్రైవ్) డ్రైవ్ ట్రైన్ తో రూపొందించారు. ఈ కారులో వెంటిలేటెడ్ డిస్క్ రకపు ఫ్రంట్ బ్రేకులు, రియర్ బ్రేకులు ఉపయోగించారు. ఈ కారు చక్రాలు అత్యవసర బ్రేకింగ్ పరిస్థితులలో లాక్ కాకుండా యాంటీ బ్రేకింగ్ సిస్టమ్ ఉపయోగించారు. స్థిరమైన గాలి ప్రవాహం కోసం ఈ కారులో ఫుల్లీ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్ ఉపయోగించారు. ఆగి ఉన్నప్పుడు వాహనాన్ని కదలకుండా ఉంచడానికి ఈ కారులో ఆటోమేటిక్ హ్యాండ్ బ్రేక్ సౌకర్యం ఉంది.

కారు బాహ్య కొలతలు

మార్చు
డైమెన్షన్ వేల్యూ
వీల్ బేస్ 2710 మిల్లీమీటర్లు
పొడవు 4544.0 మిల్లీమీటర్లు
ఎత్తు 1212 మిల్లీమీటర్లు
వెడల్పు(అద్దాలు లేకుండా) 2038 మిల్లీమీటర్లు

ఇతర ఫీచర్స్

మార్చు

కారు ఎంత దూరం ప్రయాణించిందో తెలుసుకోవడానికి డిజిటల్ ఓడోమీటర్, ఎంత వేగంగా ప్రయాణిస్తుంది అని తెలుసుకోవడానికి డిజిటల్ స్పీడోమీటర్ ఉన్నవి. వర్షం వచ్చినప్పుడు స్వయంగా అద్దాలు శుభ్రపరచడానికి రెయిన్ సెన్సింగ్ వైపర్స్ (Rain Sensing Wipers) ఉన్నాయి. కారు(మాన్యువల్ లేదా ఆటోమేటిక్) ఏ గేర్‌లో ఉందో చూపించడానికి ఇందులో డిజిటల్ టాకోమీటర్ ఉపయోగించారు. డ్రైవర్లు దూరం నుంచి కారు డోర్లను తెరవడానికి లేదా స్టార్ట్ చేయడానికి రిమోట్, స్మార్ట్ కీ లెస్ ఎంట్రీ సిస్టం ఉంది. హై స్పీడ్ అలెర్ట్ సిస్టం అనేది డ్రైవర్ డిస్ప్లే వేగ పరిమితిని చూపిస్తుంది, డ్రైవర్ స్పీడ్ లిమిట్ మించి డ్రైవింగ్ చేస్తుంటే వార్నింగ్ (అలారమ్) ఇస్తుంది. డ్రైవర్ కారు నుండి దూరం గా వెళ్ళగానే కార్ లాక్ అవ్వడానికి ఇందులో వాక్-అవే ఆటో కార్ లాకింగ్ సిస్టం ఉంది. డ్రైవింగ్ పరిస్థితులలో డ్రైవర్ హెడ్‌లైట్స్ మాన్యువల్‌గా ఆన్ లేదా ఆఫ్ చేయవలసిన అవసరం లేకుండా ఆటోమేటిక్ హెడ్‌లైట్స్ సిస్టం ఈ కారుకి అనుసంధానించారు.


ఈ కారులో గల ఫీచర్స్ వివరాలు కింద ఇవ్వబడ్డాయి:

పవర్ విండోస్ ఆల్ విండోస్
పవర్ స్టీరింగ్ ఎలక్ట్రిక్ పవర్
ఆడియో సిస్టమ్ సిడి ప్లేయర్ విత్ యుఎస్బి & ఆక్స్-ఇన్
బ్లూటూత్ కలదు
ఫ్యూయల్ లిడ్ ఓపెనర్ రిమోట్ , పుష్ టూ ఓపెన్ , ఇంటర్నల్
సీట్స్ మెటీరియల్ లెదర్
చైల్డ్ సేఫ్టీ లాక్స్ కలదు
డోర్ పాకెట్స్ ఫ్రంట్
వాయిస్ రెకగ్నిషన్ కలదు
యుఎస్బి కంపాటిబిలిటీ కలదు
నావిగేషన్ సిస్టమ్ కలదు
టర్బో చార్జర్ కలదు
కప్ హోల్డర్స్ ఫ్రంట్

సంబంధిత మోడల్స్

మార్చు

మూలాలు

మార్చు