ఈ పాఠ్య ప్రణాళిక ఆన్‌లైన్‌లో వీడియో కాల్ ద్వారా నేర్పుతారు. దానికి ఉపయోగించే సాఫ్ట్ వేర్ అందరికీ వీలుగా ఉండేదే అయివుంటుంది, ముందుగా సభ్యులకు తెలియజేయడం జరుగుతుంది.
ప్రతీ గురువారం ఈ శిక్షణ కార్యక్రమం ఉంటుంది. ప్రత్యేకించి గృహిణులైన మహిళలు చేరడానికి వీలుగా ఉంటుందని వారం మధ్యలో ఆఫీసు వేళల్లో నిర్వహిస్తున్నాం.
ప్రతీ తరగతి గంటకు, గంటన్నర వ్యవధిలో సాగుతాయి.
తరగతికి, తరగతికి మధ్య వ్యవధిలో పాల్గొన్న సభ్యులు టాస్కులు చేయాల్సివుంటుంది.
వారి ఆసక్తులు ఏమిటన్నది ముందుగా చర్చించాం. శిక్షకుడు పవన్ సంతోష్ తాను ఎలా వికీపీడియాలో రాయడం ప్రారంభించాడో, తోటి వికీపీడియన్లు ఎలాంటి అంశాలు అభిరుచి మేరకు రాస్తున్నారో వివరించాడు. ఆపైన సభ్యులు తమ తమ ఆసక్తులు చెప్పి వాటిలో ఎటువంటి వ్యాసాలు రాయవచ్చో చర్చించారు.
వికీపీడియా వ్యాసాలకు, పత్రికా వ్యాసాలకు మధ్య భేదాన్ని చూపించి, చర్చించాం.
మొబైల్లో కొత్త వ్యాసాన్ని ఎలా సృష్టించవచ్చు, వాడుకరి పేజీ ఎలా సృష్టించుకోవచ్చు, లంకెలు ఎలా ఇవ్వవచ్చు, మూలాలు ఎలా ఇవ్వవచ్చు అన్నవి వాడుకరి:USHA RANI AKELLA ప్రశ్నించడంతో పవన్ సంతోష్ స్క్రీన్ షేర్ చేసి చూపించాడు.
వాడుకరి:లలిత పండ్రంగి ప్రశ్నించిన మీదట తెలుగు వికీపీడియాలో ఎందుకు వికీపీడియా:ఏకవచన ప్రయోగం జరుగుతుందో పవన్ సంతోష్ వివరించాడు. వాడుకరి:USHA RANI AKELLA తనకున్న జర్నలిజం అనుభవాన్ని బట్టి ఎలా పత్రికల్లో వివిధ వ్యక్తులకు వయస్సు, హోదా, స్థాయిలను బట్టి ఏకవచన, బహువచనాలు ప్రయోగిస్తారో చెప్పారు. వికీపీడియా:తటస్థ దృక్కోణం వల్ల ఆ పద్ధతి స్వీకరించలేమని పవన్ వివరించాడు. అందరు సభ్యులూ ఈ వివరణ నచ్చి స్వీకరించారు.