వికీపీడియా:వికీప్రాజెక్టు/వర్గాల పేర్ల, లింకుల క్రమబద్ధీకరణ
వికీపీడియాలో వర్గాలనూ వర్గీకరణనూ నిర్వహించేందుకు ఏర్పాటు చేసిన ప్రాజెక్టు ఈ వర్గాల పేర్ల, లింకుల క్రమబద్ధీకరణ. వికీపీడియా విధానాలకు అనుగుణంగా వర్గాల పేర్లను సవరించడం, వర్గాల నుండి సంబంధిత ఎన్వికీ వర్గాలకు లింకులివ్వడం (వికీడేటా ద్వారా), కొత్త వర్గాలను సృష్టించడం ఈ ప్రాజెక్టు లక్ష్యం
మెరుగైన వర్గీకరణ కోసం
మార్చు- వర్గాల పేర్లను ప్రామాణికీకరించాలి. ఉదాహరణకు, ఆంధ్రప్రదేశ్, మధ్య ప్రదేశ్, ఉత్తర ప్రదేశ్ (మధ్యలో స్పేసు ఉండడం ఉండకపోవడం) కర్నాటక, కర్ణాటక, నృత్య కళాకారులు/నృత్యకళాకారులు/నాట్య కళాకారులు వగైరా పేర్లతో వచ్చే వర్గాలను చూడండి. ఈ పేర్ల కోసం ఒక ప్రామాణికమైన పద్ధతి ఎంచుకోవాలి.
- వర్గాలకు ఎన్వికీ లింకులివ్వాలి. తద్వారా ఆయా వర్గాల్లోని వ్యాసాలను అనువదించేటపుడు సంబంధిత వర్గాలు ఆటోమాటిగ్గా వచ్చి చేరతాయి.
- పేజీల్లో వర్గాలను చేర్చేటపుడు, ఇదే విధమైన పేజీలలో ఏయే వర్గాలున్నాయో పరిశీలించండి. తద్వారా సరైన వర్గాలను చేర్చడం సులభమౌతుంది.
- మీరు చేర్చదలచిన వర్గం ఉనికిలో లేనపుడు (ఎర్రలింకు వచ్చినపుడు) వేరేపేరుతో అలాంటి వర్గమే ఉందేమో చూదండి. లేనట్లైతే సముచితమైన పేరుతో కొత్త వర్గాన్ని సృష్టించండి. వ్యాసాల్లో ఎర్రవర్గం చేర్చవద్దు
పేర్ల ప్రామాణీకరణ
మార్చువర్గం పేర్లు ఎలా ఉండాలనే విషయమై కొన్ని ప్రామాణికాల కోసం వికీపీడియా:వర్గీకరణ పేజీ చూడవచ్చు. అయితే వాస్తవంలో పేర్ల విషయంలో అనేక సమస్యలున్నాయి
- భారత దేశం/భారతదేశం, తెలంగాణలోని/తెలంగాణ లోని, కేరళ లోని/కేరళకు చెందిన, భారత/భారతీయ, నియోజక వర్గం/నియోజకవర్గం... ఈసమస్యలను కొన్నిటిని చర్చల ద్వారా అధిగమించాం గానీ ఇలాంటి ఇంకా అనేకం ఉన్నాయి. కొన్ని ఉదాహరణలు -
- అమెరికన్లు, బ్రెజిలియన్లు, ఇటాలియన్లు.. ఇలాంటివి ప్రాచుర్యంలో ఉన్నమాట నిజమే గానీ తెలుగుకు స్వాభావికమైనవి కావు ("తమిళులు" అనేది మనకు స్వాభావికం గానీ తమిళియన్లు స్వాభావికం కాదు) అది ఇంగ్లీషు నుండి వచ్చిన వాడుక.
- అలాగే యునైటెడ్ కింగ్‌డం వాసులను ఏమనాలి - ఇంగ్లీషు వ్యక్తులు/బ్రిటిషు వ్యక్తులు/ఇంగ్లాండు వ్యక్తులు/బ్రిటను వ్యక్తులు/యుకె వ్యక్తులు?
- "ఇంగ్లీషు రచయితలు" అంటే ఇంగ్లీషులో రాసే రచయితలు అనా లేక ఇంగ్లాండుకు చెందిన రచయితలు అనా?
- "ఇంగ్లీషు పుస్తకాలు" అంటే ఇంగ్లీషులో రాసిన పుస్తకాలా లేక ఇంగ్లాండుకు చెందిన పుస్తకాలు అనా? ఇది మరింత స్పష్టంగా ఉండాలి
- నృత్య కళాకారులు/నృత్యకళాకారులు/నాట్య కళాకారులు - ఇలా వివిధ పేర్లతో వర్గాలున్నాయి. స్పేసు ఉండాలా లేదా అనే విచికిత్సతో పాటు "నృత్య", "నాట్య" అనే రెండు పేర్ల వాడుక కూడా తికమక కలిగిస్తోంది.
- మహిళా క్రీడాకారులు/క్రీడాకారిణులు రెండు పేర్ల తోటీ వర్గాలున్నాయి. ఏది ఉంచాలి? ఇలాంటి "మహిళా" వర్గాలు ఇంకా ఉండొచ్చు.. ఉదాహరణకు మహిళా రచయితలు/రచయిత్రులు
ఇలాంటి విషయాలపై ఈ ప్రాజెక్టు ద్వారా స్పష్టత ఇవ్వడమే కాదు, ప్రామాణికాలను కూడా రూపొందిస్తే ముందుముందు ఇలాంటి సమస్యలను నివారించవచ్చు ఇలాంటి సందిగ్ధంగా ఉండే పేర్ల జాబితా తయారు చేసి వికీపీడియా:చర్చ కొరకు వర్గాలు పేజీలో పెట్టి నిర్ణయం తీసుకోవాలి.
ఎన్వికీ లింకులు ఇవ్వడం
మార్చువర్గాల పేజీలకు సంబంధిత ఎన్వికీ లింకులివ్వడం వలన ఎంత ఉపయోగమో పైన చెప్పాం. అలా లింకులు లేని వర్గాల జాబితాలు తయారు చేసి ఉంచాం. ఆ జాబితాల్లోని వర్గాలకు సరిసమానమైన ఎన్వికీ వర్గాలన్ము చూసి వాటికి వికీడేటాలో సైటు లింకు చేర్చాలి. ఈ జాబితాల్లో ఉన్న మొత్తం వర్గాల సంఖ్య: 8,445. నిర్వహణ వర్గాలను, ట్రాకింగు వర్గాలను, ఇంగ్లీషు వికీలో ఖచ్చితంగా ఉండని వర్గాలనూ (అన్నీ కలిపి దాదాపు 4 వేలు) ఈ జాబితా లోంచి తీసేసాం. ఆ జాబితాల జాబితా ఇది:
- మహిళల వర్గాలు - 556 వర్గాలు
- క్రీడల వర్గాలు - 181 వర్గాలు
- వ్యక్తుల వర్గాలు - 314 వర్గాలు
- మండల, జిల్లా వర్గాలు - 383 వర్గాలు
- ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వర్గాలు - 575 వర్గాలు
- నియోజకవర్గాలు - 127 వర్గాలు
- ఇతరవర్గాలు-1 - అ - ఆ అక్షరాలతో మొదలయ్యే ఇతర వర్గాల జాబితా - 404 వర్గాలు
- ఇతరవర్గాలు-2 - ఇ - ఔ అక్షరాలతో మొదలయ్యే ఇతర వర్గాల జాబితా - 305 వర్గాలు
- ఇతరవర్గాలు-3 - క - ఘ అక్షరాలతో మొదలయ్యే ఇతర వర్గాల జాబితా - 497 వర్గాలు
- ఇతరవర్గాలు-4 - చ - ఢ అక్షరాలతో మొదలయ్యే ఇతర వర్గాల జాబితా - 291 వర్గాలు
- ఇతరవర్గాలు-5 - త - న అక్షరాలతో మొదలయ్యే ఇతర వర్గాల జాబితా - 530 వర్గాలు
- ఇతరవర్గాలు-6 - ప - ఫ అక్షరాలతో మొదలయ్యే ఇతర వర్గాల జాబితా - 385 వర్గాలు
- |ఇతరవర్గాలు-7 - బ - భ అక్షరాలతో మొదలయ్యే ఇతర వర్గాల జాబితా - 617 వర్గాలు
- ఇతరవర్గాలు-8 - మ అక్షరంతో మొదలయ్యే ఇతర వర్గాల జాబితా - 335 వర్గాలు
- ఇతరవర్గాలు-9 - య - వ అక్షరాలతో మొదలయ్యే ఇతర వర్గాల జాబితా - 492 వర్గాలు
- ఇతరవర్గాలు-10 - శ - అక్షరాలతో మొదలయ్యే ఇతర వర్గాల జాబితా - 451 వర్గాలు
ఇవన్నీ కలిపి 6,443 వర్గాలు. వీటికి తోడు కింది వర్గాలు కూడా ఉన్నాయి.
- ఇంగ్లీషు పేర్ల వర్గాలు - 189 వర్గాలు. వీటిని పట్టించుకోనక్కర్లేదు. దాదాపుగా అన్నీ నిర్వహణ వర్గాలే. ఉంటాయి. అలా కానివాటిని తేరువాత చూడవచ్చు.
- వివిధ జిల్లాల్లోని వివిధ వృత్తులకు చెందిన వ్యక్తుల వర్గాలతో కూడిన జాబితా మరొకటి ఉంది. ఇందులో 1812 పేజీలున్నాయి. పెద్ద పరిమాణం కారణంగా దీనికి పేజీ తయారు చెయ్యలేదు. పైగా ఈ వర్గాలకు ఎన్వికీ లింకులు ఉండే అవకాశం తక్కువ.