వికీపీడియా:వికీ చిట్కాలు/ఆగస్టు 17

అయోమయ నివృత్తి పేజీలు

తులసి అనే పేరుతో ఒక మొక్క ఉంది. ఒక వూరుంది. ఒక సినిమా ఉంది. ఒక నవల ఉంది. ఇలాంటి పేర్ల సమస్యను పరిష్కరించడానికి "అయోమయ నివృత్తి" పేజీలను వాడుతారు. ఉదాహరణకు తులసి (అయోమయ నివృత్తి) పేజీ చూడండి. ఇలాంటి పేజీలలో పాటించవలసిన కొన్ని మార్గదర్శకాలు.

  • ఇలాంటి పేజీలలో {{అయోమయ నివృత్తి}} అనే మూస ఉంచాలి.
  • ఈ పేజీనుండి లింకులున్న (అదే విధమైన పేరున్న) వ్యాసాల "ఆరంభంలో" {{అయోమయం|తులసి}} అని వ్రాయాలి. అది ఆటొమాటిక్‌గా "తులసి (అయోమయ నివృత్తి)" పేజీకి లింకును సూచిస్తుంది.
  • పేరు పెట్టే విధం గమనించండి. "తులసి" తరువాత, బ్రాకెట్టుకు ముందు, ఒక ఖాళీ ఉంది. "అయోమయ", "నివృత్తి" అనేవి రెండు పదాలుగా వాడబడ్డాయి.
  • అయోమయ నివృత్తి పేజీలు అంటే దిక్సూచి పేజీలు (Navigation pages or exploration pages) కావు. కనుక నేరుగా ఆ పేరు లేని వ్యాసాలకు లింకులు అయోమయ నివృత్తి పేజీలలో ఇవ్వవద్దు.
  • అయోమయ నివృత్తి పేజీలలో పైపు మార్కులు " | " వాడ వద్దు. ఎందుకంటే వ్యాసం పేరు ఉన్నది ఉన్నట్లుగా ఇక్కడ కనిపించాలి.

మరిన్ని వివరాలున్న ఆంగ్ల వికీ వ్యాసం Wikipedia:Manual of Style చూడ గలరు.


నిన్నటి చిట్కా - రేపటి చిట్కా