వికీపీడియా:వికీ చిట్కాలు/ఏప్రిల్ 12
నాకు వికీపీడియాలో పని చేయడానికి ఎక్కువ సమయం దొరకడం లేదు కనుక పెద్ద వ్యాసాలు వ్రాయలేకపోతున్నాను.--
వ్యాసం పొడవును బట్టి వికీ నాణ్యత గాని, మీ విలువ గాని పెరగవు. వికీలో ఎంత చిన్న దిద్దుబాటైనా స్వాగతించబడుతుంది. ఉదాహరణకు అక్షర దోషాల సవరణ. "భాగవతం" బదులు "బాగవతం" అని మీకు ఎక్కడైనా కనిపించిందనుకోండి. వెంటనే దిద్దెయ్యండి. కాలిలో చిన్న ముల్లు ఉంటే ఉపేక్షిస్తామా?