వికీపీడియా:వికీ చిట్కాలు/జూన్ 20
మీరు ఆంధ్ర ప్రదేశ్‌లో ఎక్కడ ఉన్నా గాని ప్రతిరోజూ సినిమా పోస్టర్లు చూస్తూ ఉండే అవకాశం ఉంది. చూసి ఊరుకోవద్దు. వాటిని ఫొటోలు తీసి ఆయా సినిమాలకు సంబంధించిన వ్యాసాలలో ఉంచండి. అయితే ఆ బొమ్మ సారాంశంలో {{సినిమా పోస్టరు}} అనే ట్యాగ్ తో పాటు {{Non-free use rationale poster}} వాడడం మరచి పోవద్దు.
మీరు ఇంకాస్త సృజనాత్మకంగా ఫొటోలు తీయవచ్చును. - సినిమా థియేటర్లలో ఆ సినిమా చూడడానికి కట్టిన క్యూలు, హీరో కటౌట్లకు పాలాభిషేకాలు, సిటీ బస్సులపై వేసిన పోస్టర్లు - అబ్బో మొదలెడితే చాలా ఐడియాలు వస్తాయి.