లింకులను సరి చూడండి

ఒకో మారు ఒక వ్యాసంలో ఇచ్చిన లింకులు అక్షర భేదాల కారణంగా ఎర్ర లింకులు గా కనిపిస్తాయి. అంటే ఆ వ్యాసం లేదనుకోవాలి. కానీ మరో విధమైన స్పెల్లింగుతో ఆ వ్యాసం ఉండే ఉండొచ్చు.

అక్కినేని నాగేశ్వరరావు గురించిన వ్యాసంలో "మనుషులు మమతలు" అనే సినిమా ప్రస్తావన రావచ్చును. మీరు మనుషులు-మమతలు, మనుషులూ మమతలూ, మనుషులు, మమతలు ఇలా చాలా విధాలుగా వ్రాస్తే అవి ఎరుపు రంగు లింకులుగా కనిపించి, ఆ వ్యాసం లేదనే అభిప్రాయం కలుగుతుంది. ఎందుకంటే ఇప్పటికే ఉన్న వ్యాసం పేరు మనుషులు మమతలు.

దారిమార్పు పేజీలతో ఈ సమస్య కొంత వరకు పరిష్కారం కావచ్చును. కానీ ఎన్నని తప్పు స్పెల్లింగులకు దారిమార్పులివ్వగలం? కాస్త శ్రమయినా విసుగుచెందకుండా సరైన లింకు కోసం వెతకండి. దయచేసి వీలయినంత వరకు లింకులు సవరించండి.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా