వికీపీడియా:వికీ చిట్కాలు/నవంబర్ 10, 2007

కొత్త పేజీని సృష్టించడం ఎలా
  1. మీరు సృష్టించదలచిన వ్యాసం పేరును వెతుకు పెట్టెలో రాసి, వెళ్లు గానీ వెతుకు గానీ నొక్కండి. ఆ పేరుతో వ్యాసం లేకపోతే, ఫలితాల్లో పేజీ పేరుతో ఎర్ర లింకు కనిపిస్తుంది. ఆ లింకును నొక్కితే సదరు పేజీ యొక్క దిద్దుబాటు పేజీకి వెళ్తుంది. ఇక అక్కడ మీరు రాయదలచిన విషయం రాసేసి పేజీని భద్రపరచండి. మీరు సృష్టించదలచిన పేజీ సిద్ధం!
  2. మరో పద్ధతి.. బ్రౌజరు అడ్రసుపెట్టెలో మీరు సృష్టించదలచిన పేజీ URL ను రాసి ఎంటరు నొక్కండి: http://te.wikipedia.org/wiki/కొత్తపేజీపేరు. సదరు పేజీ యొక్క దిద్దుబాటు పేజీకి వెళ్తుంది. ఇక అక్కడ మీరు రాయదలచిన విషయం రాసేసి పేజీని భద్రపరచండి.
  3. ఇంకో పద్ధతి.. ఏదో ఒక పేజీ యొక్క మార్చు లింకును నొక్కండి. దిద్దుబాటు పెట్టెలో మీరు సృష్టించదలచిన పేజీ పేరును రాసి, వికీలింకు ఇవ్వండి. సరిచూడు లింకును నొక్కండి. దిద్దుబాటు పెట్టెకు పైన కనిపించే మునుజూపులో కొత్తపేజీ లింకు ఎర్రగా కనిపిస్తుంది. ఆ లింకును నొక్కి పేజీని సృష్టించండి.


మరిన్ని వివరాలకు వికీపీడియా:కొత్త పేజీని ఎలా ప్రారంభించాలి చూడండి.


నిన్నటి చిట్కా - రేపటి చిట్కా