వికీపీడియా:కొత్త పేజీని ఎలా ప్రారంభించాలి

ఈ వ్యాసం సహాయం పేజీలలో భాగం.

పేజీ సృష్టించుటసవరించు

పేజీకీ, కొత్త పేజీకి తేడా ఒకటే - పేజీకి పేజీ చరిత్ర ఉంటుంది, కొత్తపేజీకి ఉండదు. కొత్తపేజీ ప్రారంభించడం అంటే మరేమీ కాదు, ఓ ఖాళీపేజీలో మొదటి వాక్యాలు రాయడమే! ఒక్కోసారి కొత్తపేజీ ఖాళీగా కాక, ముందే నిర్ధారించిన కొన్ని వాక్యాలు ఉండవచ్చు. మీతో సహా ఎవరైనా, వికీపీడియాలో రాయవచ్చు! కింద ఉన్న పెట్టెలో ఏదో ఒక పేరు రాసి, "వ్యాసాన్ని సృష్టించు" ను నొక్కండి. ఇక్కడ ఏమి రాస్తారో అదే ఆ పేజీపేరు అవుతుంది. పేరు పెట్టే పద్ధతుల గురించి వికీపీడియా:నామకరణ పద్ధతులు చూడండి.URL ద్వారా పేజీ ని ప్రారంభించడం: ఇప్పటికే ఉన్న పేజీ URL ను నొక్కినపుడు పేజీ ఎలా వస్తుందో, లేని పేజీ కూడా అలాగే వస్తుంది. బ్రౌజరు అడ్రసుపెట్టెలో మీరు సృష్టించదలచిన పేజీ URL ను రాయండి. ఉదాహరణకు, http://te.wikipedia.org/wiki/కొత్తపేజీపేరు. ఎంటరు నొక్కినపుడు, సదరు పేజీ యొక్క దిద్దుబాటు పేజీకి వెళ్తుంది. ఇక అక్కడ మీరు రాయదలచిన విషయం రాసేసి పేజీని భద్రపరచండి. URLను సృష్టించే సులభమైన విధానం - ఒక పేజీ URL లోని చివరి భాగాన్ని మార్చి కొత్త URL తయారు చెయ్యడమే.


వెతుకుపెట్టె నుండి: మీరు సృష్టించదలచిన వ్యాసం పేరును వెతుకు పెట్టెలో రాసి, "వెళ్లు" గానీ "వెతుకు" గానీ నొక్కండి. ఆ పేరుతో వ్యాసం లేకపోతే, ఫలితాల్లో పేజీ పేరుతో ఎర్ర లింకు కనిపిస్తుంది. ఆ లింకును నొక్కితే సదరు పేజీ యొక్క దిద్దుబాటు పేజీకి వెళ్తుంది. ఇక అక్కడ మీరు రాయదలచిన విషయం రాసేసి పేజీని భద్రపరచండి. మీరు సృష్టించదలచిన పేజీ సిద్ధం!


వేరే పేజీ నుండి వికీలింకు ద్వారా: ఏదో ఒక పేజీ మార్చు లింకును నొక్కండి. దిద్దుబాటు పెట్టెలో మీరు సృష్టించదలచిన పేజీ పేరును రాసి, వికీలింకు ఇవ్వండి. సరిచూడు మీటను నొక్కండి. "పేజీ భద్రపరచు" మీటను నొక్కరాదు. దిద్దుబాటు పెట్టెకు పైన కనిపించే మునుజూపులో కొత్తపేజీ లింకు ఎర్రగా కనిపిస్తుంది. ఆ లింకును నొక్కి పేజీని సృష్టించండి.