వికీపీడియా:వికీ చిట్కాలు/నవంబర్ 15, 2007
(వికీపీడియా:వికీ చిట్కాలు/నవంబర్ 15 నుండి దారిమార్పు చెందింది)
పేజీని ఒక వర్గానికి చేర్చాలంటే "[[వర్గం:వర్గం పేరు]]", అని రాస్తే ఆ పేజీ సదరు వర్గానికి చేరుతుందని అనకు తెలుసు. అలా పేజీని వర్గానికి చేర్చడం కాకుండా, కేవలం ఆ వర్గానికి లింకు ఇవ్వడం మాత్రమే చెయ్యాలంటే (వేరే పేజీకి లింకు ఇచ్చినట్లు), ఇలా రాయాలి: :"[[:వర్గం:వర్గం పేరు]]". (ట్యాగులో అన్నిటి కంటే ముందు రాసిన కోలన్ను (:) గమనించండి.)
ఉదాహరణకు:
ఫలానా వ్యాసాన్ని ఫలానా వర్గానికి చేర్చడం సబబుగా ఉంటుంది అని రాసే సందర్భంలో "ఈ వ్యాసాన్ని [[వర్గం:వికీ చిట్కాలు]] కు చేరిస్తే సబబుగా ఉంటుంది" అని రాస్తే, ఇలా కనిపిస్తుంది:
- "ఈ వ్యాసాన్ని కు చేరిస్తే సబబుగా ఉంటుంది". పేజీ "వికీ చిట్కాలు" వర్గంలోకి చేరుతుంది.
అలా కాక, "ఈ వ్యాసాన్ని [[:వర్గం:వికీ చిట్కాలు]] కు చేరిస్తే సబబుగా ఉంటుంది" అని రాస్తే, ఇలా కనిపిస్తుంది:
- "ఈ వ్యాసాన్ని వర్గం:వికీ చిట్కాలుకు చేరిస్తే సబబుగా ఉంటుంది"
మరిన్ని వివరాల కోసం వికీపీడియా:వర్గీకరణ చూడండి.