వికీపీడియా:వికీ చిట్కాలు/ఫిబ్రవరి 4

వ్యాసాన్ని ఫలానా వర్గంలో ఎలా చేర్చాలి?

వికీపీడియాలో వర్గాలు అని పిలిచే సూచికా వ్యవస్థ ఉంది. దీని వలన వ్యాసాలలో చేర్చిన కొన్ని మూసల వలన లేక మీడియావికీ కోడ్ వలన (చిత్రాలకి) వర్గీకరించబడతాయి.

ఒక వ్యాసాన్ని ఫలానా వర్గంలో చేర్చటానికి, [[వర్గం:వర్గం పేరు]]ను వ్యాసంలో ఎక్కడో ఒక చోట చేర్చండి (సాధారణంగా వ్యాసం చివర చేరుస్తారు). అలా వ్యాసంలో వర్గం చేర్చేసిన తరువాత, వ్యాసంలో చేర్చిన వర్గాలన్నీ వ్యాసం అడుగు భాగాన కనపడతాయి, వాటికి అనుబంధంగా ఉన్న లింకును నొక్కితే అదే వర్గంలోకి చేర్చిన మిగితా అన్ని పేజీలనూ చూపించే వర్గపు పేజీకి తీసుకుని వెళ్తుంది.

విపులంగా చదవండి: వికీపీడియా:వర్గీకరణ

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా