వికీపీడియా:వికీ చిట్కాలు/మే 12
వికీపీడియాలోని సమాచారానికి కాపీహక్కులు ఉండవని చాలా మంది అనుకొంటారు. కాని ఇది నిజం కాదు. అసలు సంగతి ఏమంటే
- వికీపీడియా లోని విషయం (టెక్స్టు మాత్రం)GFDL లేదా GNU Free Documentation Licenseకు లోబడి ఉంది. అంటే, ఇందులోని విషయాన్ని ఇతరులు నిరభ్యంతరంగా కాపీ చేసుకోవచ్చును, మార్చుకోవచ్చును కానీ, ఈ విషయంపై చేసిన మార్పులను అదే నియమాలకు లోబడి పంచాలి. మరియు ఆ విషయం రచయితలను పేర్కొనాలి.
- వికీపీడియాలో ఉన్న బొమ్మలు అన్నింటికీ GFDL కాపీ హక్కు వర్తించదు. బొమ్మలను ఆయా బొమ్మలకు చెప్పిన కాపీహక్కులకు లోబడి వినియోగించుకోవాలి.