వికీపీడియా:వికీ చిట్కాలు/మే 13
ఏదైనా వ్యాసంలో మూడు కంటే ఎక్కువ విభాగాలు ఉంటే విషయసూచిక దానంతట అదే వచ్చేస్తుంది. ఇది మామూలుగా మొదటి విభాగానికి ముందుంటుంది. దీనికి ముందు మామూలుగా వ్యాసానికి పరిచయ వాక్యాలు రాస్తారు. ఇది రెండు పేరాలకు మించకుండా ఉంటే మంచిది.
విషయ సూచిక ముందే కాకుండా ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకోవాలంటే కావల్సిన స్థానంలో __TOC__ అని చేర్చేయడమే. అసలు విషయ సూచికే కనపడ కూడదంటే __NOTOC__ అని వ్యాసంలో ఎదో ఒక చోట చేర్చేయండి. లేదా మీరు చూసే వ్యాసాలలో మాత్రం విషయ సూచిక కనపడకూడదంటే మీ అభిరుచులలో మార్చుకోవచ్చు.