వికీపీడియా:వికీ చిట్కాలు/సెప్టెంబరు 10
(వికీపీడియా:వికీ చిట్కాలు/సెప్టెంబర్ 10 నుండి దారిమార్పు చెందింది)
వికీపీడియాలో పని చేసేవారందరూ తమ విలువైన సమయాన్ని వెచ్చిస్తున్నారని మీకు తెలుసు. వారి సమయాన్ని వృధాగా ఖర్చుపెట్టేలా చేయడం తగదు. ఇతరుల సమయం సద్వినియోగం అయ్యేలా ఉండడానికి మీరు ఇలా సహకరించవచ్చును [1] --
- దిద్దుబాట్ల సారాంశం వ్రాయండి - మీరు ఏదైనా ఎడిట్ చేసినపుడు అది సేవ్ చేసేముందు దిద్దుబాటు సారాంశం బాక్స్‌లో "అక్షర దోషాల సవరణ", "బొమ్మ చేర్పు", "విర్ధారం లేని విషయం తొలగింపు", "అనువాదం" - ఇలా మీరు చేసిన పని సారాంశం వ్రాస్తే ఇతరులకు సులువుగా మీ మార్పు అర్ధమవుతుంది. అది కనుక్కోవడానికి వారు శ్రమించనక్కరలేదు.
- పట్టుదలలు, వివాదాలు తగ్గించండి. - మీరు ఏదైనా ప్రశ్న లేదా అభ్యంతరం లేవనెత్తినపుడు అందుకు సంబంధించిన ఆధారాలు, హేతువులు స్పష్టంగా (వ్యాసంలో గాని, చర్చాపేజీలో గాని) ఇవ్వండి. అంతే గాని మీరు లేవనెత్తిన సమస్యకు పరిష్కారం కోసం ఇతరులు శ్రమించలేరు.